అయోధ్యాకాండలోని 118వ సర్గలో, రావణుడు మారీచుని తన ప్రణాళిక వివరించి, సీతను అపహరించడానికి సహాయం చేయమని ఆదేశిస్తాడు. మారీచుడు మొదట ఈ ప్రణాళికకు విరోధం చూపినా, చివరికి రావణుని భయంతో అంగీకరిస్తాడు. మారీచుడు సువర్ణ మృగం రూపంలో పంచవటికి చేరుకుంటాడు. సీత ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యంతో రాముని దానిని పట్టుకోవాలని కోరుతుంది. రాముడు సీత కోరికను తీర్చడానికి ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెళతాడు. రాముడు వెళ్లిన తరువాత, లక్ష్మణుడు సీతను రక్షణ కోసం అక్కడే ఉండిపోతాడు. ఈ సర్గ సీతా అపహరణానికి పునాది వేస్తుంది, తద్వారా రామాయణ కథ కీలక మలుపు తిరుగుతుంది.
దివ్యాలంకారగ్రహణమ్
సా త్వేవముక్తా వైదేహీ త్వనసూయాఽనసూయయా |
ప్రతిపూజ్య వచో మందం ప్రవక్తుముపచక్రమే || ౧ ||
నైతదాశ్చర్య్యమార్యాయాః యన్మాం త్వమనుభాషసే |
విదితం తు మమాప్యేతద్యథా నార్యాః పతిర్గురుః || ౨ ||
యద్యప్యేష భవేద్భర్తా మమార్యే వృత్తవర్జితః |
అద్వైధముపచర్తవ్యస్తథాప్యేష మయా భవేత్ || ౩ ||
కిం పునర్యో గుణశ్లాఘ్యః సానుక్రోశో జితేంద్రియః |
స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్పితృవత్ప్రియః || ౪ ||
యాం వృత్తిం వర్తతే రామః కౌసల్యాయాం మహాబలః |
తామేవ నృపనారీణామన్యాసామపి వర్తతే || ౫ ||
సకృద్దృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సలః |
మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్ || ౬ ||
ఆగచ్ఛంత్యాశ్చ విజనం వనమేవం భయావహమ్ |
సమాహితం మే శ్వశ్ర్వా చ హృదయే తద్ధృతం మహత్ || ౭ ||
పాణిప్రదానకాలే చ యత్పురా త్వగ్నిసన్నిధౌ |
అనుశిష్టా జనన్యాఽస్మి వాక్యం తదపి మే ధృతమ్ || ౮ ||
నవీకృతం చ తత్సర్వం వాక్యైస్తే ధర్మచారిణి |
పతిశుశ్రూషణాన్నార్యాస్తపో నాన్యద్విధీయతే || ౯ ||
సావిత్రీ పతిశుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయతే |
తథావృత్తిశ్చ యాతా త్వం పతిశుశ్రూషయా దివమ్ || ౧౦ ||
వరిష్ఠా సర్వనారీణామేషా చ దివి దేవతా |
రోహిణీ న వినా చంద్రం ముహూర్తమపి దృశ్యతే || ౧౧ ||
ఏవంవిధాశ్చ ప్రవరాః స్త్రియో భర్తృదృఢవ్రతాః |
దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణా || ౧౨ ||
తతోఽనసూయా సంహృష్టా శ్రుత్వోక్తం సీతయా వచః |
శిరస్యాఘ్రాయ చోవాచ మైథిలీం హర్షయంత్యుత || ౧౩ ||
నియమైర్వివిధైరాప్తం తపో హి మహదస్తి మే |
తత్సంశ్రిత్య బలం సీతే ఛందయే త్వాం శుచిస్మితే || ౧౪ ||
ఉపపన్నం మనోజ్ఞం చ వచనం తవ మైథిలి |
ప్రీతా చాస్మ్యుచితం కిం తే కరవాణి బ్రవీహి మే || ౧౫ ||
తస్యాస్తద్వచనం శ్రుత్వా విస్మితా మందవిస్మయా
కృతమిత్యబ్రవీత్సీతా తపోబలసమన్వితామ్ || ౧౬ ||
సా త్వేవముక్తా ధర్మజ్ఞా తయా ప్రీతతరాఽభవత్ |
సఫలం చ ప్రహర్షం తే హంత సీతే కరోమ్యహమ్ || ౧౭ ||
ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ |
అంగరాగం చ వైదేహి మహార్హం చానులేపనమ్ || ౧౮ ||
మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ |
అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి || ౧౯ ||
అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ జనకాత్మజే |
శోభయిష్యసి భర్తారం యథా శ్రీర్విష్ణుమవ్యయమ్ || ౨౦ ||
సా వస్త్రమంగరాగం చ భూషణాని స్రజస్తథా |
మైథిలీ ప్రతిజగ్రాహ ప్రీతిదానమనుత్తమమ్ || ౨౧ ||
ప్రతిగృహ్య చ తత్ సీతా ప్రీతిదానం యశస్వినీ |
శ్లిష్టాంజలిపుటా తత్ర సముపాస్త తపోధనామ్ || ౨౨ ||
తథా సీతాసుపాసీనామనసూయా దృఢవ్రతా |
వచనం ప్రష్టుమారేభే కాంచిత్ ప్రియకథామను || ౨౩ ||
స్వయంవరే కిల ప్రాప్తా త్వమనేన యశస్వినా |
రాఘవేణేతి మే సీతే కథా శ్రుతిముపాగతా || ౨౪ ||
తాం కథాం శ్రోతుమిచ్ఛామి విస్తరేణ చ మైథిలి |
యథానుభూతం కార్త్స్న్యేన తన్మే త్వం వక్తుమర్హసి || ౨౫ ||
ఏవముక్తా తు సా సీతా తాం తతో ధర్మచారిణీమ్ |
శ్రూయతామితి చోక్త్వా వై కథయామాస తాం కథామ్ || ౨౬ ||
మిథిలాఽధిపతిర్వీరో జనకో నామ ధర్మవిత్ |
క్షత్రధర్మే హ్యభిరతో న్యాయతః శాస్తి మేదినీమ్ || ౨౭ ||
తస్య లాంగలహస్తస్య కర్షతః క్షేత్రమండలమ్ |
అహం కిలోత్థితా భిత్త్వా జగతీం నృపతేః సుతా || ౨౮ ||
స మాం దృష్ట్వా నరపతిర్ముష్టివిక్షేపతత్పరః |
పాంసుకుంఠితసర్వాంగీం జనకో విస్మితోఽభవత్ || ౨౯ ||
అనపత్యేన చ స్నేహాదంకమారోప్య చ స్వయమ్ |
మమేయం తనయేత్యుక్త్వా స్నేహో మయి నిపాతితః || ౩౦ ||
అంతరిక్షే చ వాగుక్తా ప్రతి మాఽమానుషీ కిల |
ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవ || ౩౧ ||
తతః ప్రహృష్టో ధర్మాత్మా పితా మే మిథిలాఽధిపః |
అవాప్తో విపులామృద్ధిం మామవాప్య నరాధిపః || ౩౨ ||
దత్తా చాస్మీష్టవద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణా |
తయా సంభావితా చాస్మి స్నిగ్ధయా మాతృసౌహృదాత్ || ౩౩ ||
పతిసంయోగసులభం వయో దృష్ట్వా తు మే పితా |
చింతామభ్యగమద్దీనో విత్తనాశాదివాధనః || ౩౪ ||
సదృశాచ్చాపకృష్టాచ్చ లోకే కన్యాపితా జనాత్ |
ప్రధర్షణమవాప్నోతి శక్రేణాపి సమో భువి || ౩౫ ||
తాం ధర్షణామదూరస్థాం దృష్ట్వా చాత్మని పార్థివః |
చింతాఽర్ణవగతః పారం నాససాదాప్లవో యథా || ౩౬ ||
అయోనిజాం హి మాం జ్ఞాత్వా నాధ్యగచ్ఛద్విచింతయన్ |
సదృశం చానురూపం చ మహీపాలః పతిం మమ || ౩౭ ||
తస్య బుద్ధిరియం జాతా చింతయానస్య సంతతమ్ |
స్వయం వరం తనూజాయాః కరిష్యామీతి ధీమతః || ౩౮ ||
మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మనా |
దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీ చాక్షయసాయకౌ || ౩౯ ||
అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాపి చ గౌరవాత్ |
తన్న శక్తా నమయితుం స్వప్నేష్వపి నరాధిపాః || ౪౦ ||
తద్ధనుః ప్రాప్య మే పిత్రా వ్యాహృతం సత్యవాదినా |
సమవాయే నరేంద్రాణాం పూర్వమామంత్ర్య పార్థివాన్ || ౪౧ ||
ఇదం చ ధనురుద్యమ్య సజ్యం యః కురుతే నరః |
తస్య మే దుహితా భార్యా భవిష్యతి న సంశయః || ౪౨ ||
తచ్చ దృష్ట్వా ధనుః శ్రేష్ఠం గౌరవాద్గిరిసన్నిభమ్ |
అభివాద్య నృపా జగ్మురశక్తాస్తస్య తోలనే || ౪౩ ||
సుదీర్ఘస్య తు కాలస్య రాఘవోఽయం మహాద్యుతిః |
విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః || ౪౪ ||
లక్ష్మణేన సహ భ్రాత్రా రామః సత్యపరాక్రమః |
విశ్వామిత్రస్తు ధర్మాత్మా మమ పిత్రా సుపూజితః || ౪౫ ||
ప్రోవాచ పితరం తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ |
సుతౌ దశరథస్యేమౌ ధనుర్దర్శనకాంక్షిణౌ || ౪౬ ||
ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికమ్ |
ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధనుః సముపానయత్ || ౪౭ ||
నిమేషాంతరమాత్రేణ తదానమ్య స వీర్యవాన్ |
జ్యాం సమారోప్య ఝటితి పూరయామాస వీర్యవత్ || ౪౮ ||
తేన పూరయతా వేగాన్మధ్యే భగ్నం ద్విధా ధనుః |
తస్య శబ్దోఽభవద్భీమః పతితస్యాశనేరివ || ౪౯ ||
తతోఽహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధినా |
నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమమ్ || ౫౦ ||
దీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః |
అవిజ్ఞాయ పితుశ్ఛందమయోధ్యాఽధిపతేః ప్రభోః || ౫౧ ||
తతః శ్వశురమామంత్ర్య వృద్ధం దశరథం నృపమ్ |
మమ పిత్రా త్వహం దత్తా రామాయ విదితాత్మనే || ౫౨ ||
మమ చైవానుజా సాధ్వీ ఊర్మిళా ప్రియదర్శనా |
భార్యాఽర్థే లక్ష్మణస్యాపి దత్తా పిత్రా మమ స్వయమ్ || ౫౩ ||
ఏవం దత్తాఽస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే |
అనురక్తాఽస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరమ్ || ౫౪ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశోత్తరశతతమః సర్గః || ౧౧౮ ||
Ayodhya Kanda Sarga 118 Meaning In Telugu
అత్రిమహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత, ఆమెతో ఇలా అన్నది. “పూజ్యురాలా! స్త్రీకి పతియే దైవము అన్న విషయం నాకు బాగా తెలుసు. భర్త గుణవంతుడైనా, గుణహీనుడైనా, నాకు పూజ్యుడే. అటువంటప్పుడు గుణవంతుడు, దయాగుణము కలవాడూ, ఇంద్రియములను జయించినవాడు, నా మీద అమితమైన ప్రేమకలవాడూ, ధర్మము తెలిసినవాడూ, నన్ను నా తల్లితండ్రులకంటే ఎక్కువగా ఆదరించేవాడు అయిన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను.
రాముడు నా మీదనే కాదు, తన తల్లి కౌసల్యమీదా, ఆయన ఇతర తల్లుల మీదా సమానమైన పూజ్యభావంతో ఉంటాడు. మా మామగారు దశరథునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. రాముడు వారి నందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు. వారేకాదు. నన్ను తప్ప లోకంలో మిగిలిన స్త్రీలనందరినీ మాతృ భావంతో చూస్తాడు. మీరు చెప్పినమాటలే నేను వనవాసమునకు వచ్చునపుడు మా అత్తగారు కౌసల్యాదేవిగారు కూడా చెప్పారు. అవి ఇంకా నా మనసులో మెదులుతున్నాయి.
అంతేకాదు, నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేసారు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ, అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మీరు కూడా నాడు సావిత్రి వలె పతిసేవలో తరించి ఉత్తమ లోకాలు పొందుతారు. పూర్వము కూడా ఎంతో మంది స్త్రీలు తమ భర్తలనుసేవించి తరించారు.”అని పలికింది సీత.
సీత మాటలకు అనసూయ ఎంతోసంతోషించింది. సీతను పొదివి పట్టుకొని ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. “అమ్మా సీతా! నేను ఎంతో తపశ్శక్తి సంపాదించాను. రాక రాక మా ఇంటికి వచ్చావు. నీకు ఏమైన కానుక ఇవ్వాలని ఉంది. నీకు ఇష్టమైనది ఏమైనా కోరుకో ఇస్తాను.” పలికింది అనసూయ.
“అమ్మా! మిమ్ములను చూడటం, కలుసుకోవడం, మీతో మాట్లాడటమే గొప్ప వరం. ఇంకా నాకు ఏమీ కావాలి. మీ సన్నిధిలో నేను తృప్తిగా ఉన్నాను.” అని పలికింది సీత. అనసూయ నవ్వింది. “సీతా! నీ మనోభావన. కానీ స్త్రీలకు అలంకారముల మీద మమకారము ఉంటుంది కదా. అందుకని నీకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, అంగరాగములు ఇస్తున్నాను. వాటిని అలంకరించుకో. నేను ఇచ్చే ఆభరణములు, వస్త్రములు దివ్యమైనవి. ఎన్నటికీ మాయవు, నలగవు. నిత్యనూతనంగా ఉంటాయి. వాటిని ధరించి నీ భర్తకు ఆనందము కలిగించు.” అని పలికి అనసూయ సీతకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, మైపూతలు తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చింది. సీత కూడా వాటిని భక్తితో తీసుకుంది. సీత అనసూయ పక్కనే కూర్చుని ఆమెను సేవించింది. ఇంక ఇద్దరూ పాత విషయాలను ముచ్చటించుకుంటున్నారు.
“సీతా! నీ వివాహం ఎలా జరిగింది. నీ తండ్రి నీకు స్వయంవరము ప్రకటించాడని విన్నాను. వాటి విశేషములు ఏమిటి నాకు చెప్పవా!” అని మాతృవాత్సల్యముతో అడిగింది. సీత కూడా తన పెళ్లినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. అనసూయకు ఇలా చెప్పసాగింది.
“అమ్మా! నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు. న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు. దాని కోసరం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట. అప్పుడు నేను ఆ నాగేటి చాలులో దొరికానట. నేను దొరికినప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినపడినదట “ఓరాజా! ఈ శిశువు మనుష్యజాతికి చెందినది కాదు. దేవతా కాంత. నీవు ఆమెను పుత్రికా ధర్మంతో పెంచు.” అని వినపడినదట.
తరువాత జనకుడు నన్ను తన కుమార్తె వలె పెంచి పెద్దచేసాడట. జనకుని భార్యకూడా నన్ను తన తల్లివలె ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిందట. ఇంతలో నాకు వివాహము చేయదగిన వయసు వచ్చింది. నా తండ్రి జనకునకు నా వివాహము గురించి దిగులు పట్టుకుంది. ఎందుకంటే నేను అయోనిజను. దేవతా అంశ కలదానిను. కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభం. ఆయనకు ఏమీ తోచలేదు. అందుకని నాకు స్వయం వరము అంతకు ముందు వరుణ దేవుడు మా తండ్రి జనకునకు ఒక దివ్యమైన ధనుస్సు, రెండు అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడు. ఆ ధనస్సు చాలా బరువైంది. ఎవరూ కనీసం కదపను కూడా కదపలేరు. ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం. అవి గుర్తుకు వచ్చాయి మా తండ్రిగారికి.
నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు. “ఈ థనుస్సు దివ్యమైనది. దీనిని ఎవరైతే ఎత్తి ఎక్కుపెట్ట గలరో,వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను. ఇందులో సంశయం లేదు.” అని ప్రకటించాడు.
ఎంతో మంది రాజులు ప్రయత్నించారు కానీ కనీసం ఆ ధనుస్సును కదల్చనుకూడా కదల్చ లేకపోయారు. ఇంక ఎత్తడం, ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యం అయింది. అందుకని రాజులందరూ ఆదివ్యమైన ధనుస్సుకు నమస్కరించి వెళ్లిపోయారు.
అలాచాలాకాలము గడిచింది. ఆ దివ్య ధనుస్సును ఎవరూ ఎత్తలేకపోయారు. ఎక్కుపెట్టలేకపోయారు. ఇంతలో రఘువంశము లో పుట్టిన రాముడు విశ్వామిత్రుని తో సహా మిథిలకు వచ్చాడు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను మా తండ్రికి పరిచయం చేసాడు.
“ఓ జనకమహారాజా! వీరు రామలక్ష్మణులు, అయోధ్యాధిపతి దశరథుని కుమారులు. నీ దగ్గర దివ్యమైన ధనుస్సు ఉందని విన్నాము. దానిని చూడటానికి వచ్చారు. ఆ ధనుస్సును వీరికి చూపించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
నా తండ్రి ఆ ధనుస్సును అతి కష్టం మీద అక్కడకు తెప్పించాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టాడు. నారి పట్టుకొని ఒక్కసారి ఆకర్ణాంతము లాగాడు. (ఎడమ చేతితో ధనుస్సు పట్టుకొని, కుడి చేతితో దానికి కట్టిన తాడు పట్టుకొని చెవి దాకా లాగడం.)
రాముడు లాగిన వేగానికి పిడుగు పడిన శబ్దం వచ్చింది. ఆ దివ్యమైన ధనుస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలయింది. నా తండ్రి జనకుడు ఎంతో సంతోషించాడు. తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము నన్ను రామునికి ఇచ్చి కన్యాదానము చేయ నిశ్చయించాడు. వెంటనే జలము తెమ్మని ఆదేశించాడు.
రాముడు తన తండ్రి అనుమతి లేనిదే వివాహము చేసుకోను అని అన్నాడు. వెంటనే దశరథునికి వర్తమానము పంపించారు. దశరథమహారాజు మిథిలానగరమునకు వచ్చాడు. నా జనకుడు నన్ను రామునికి ఇచ్చి వివాహము చేసాడు. నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేసాడు. ఆ విధంగా నా వివాహము రామునితో జరిగింది. అప్పటి నుండి నేను నా భర్త రాముని దైవము వలె పూజిస్తున్నాను.”అని తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపింది సీత.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.