Aranya Kanda Sarga 44 In Telugu – అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గం రామాయణంలోని ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో రావణుడు సీతను అపహరించి తన రథంపై లంకకు తీసుకువెళతాడు. సీత రావణుడి చెరలో ఉండి రాముడిని ఆలోచిస్తూ దుఃఖిస్తుంది. మార్గమధ్యంలో, జటాయువు రావణుడిని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ రావణుడు అతనిని గాయపరుస్తాడు.

మారీచవంచనా

తథా తు తం సమాదిశ్య భ్రాతరం రఘునందనః |
బబంధాసిం మహాతేజా జాంబూనదమయత్సరుమ్ ||

1

తతస్త్ర్యవనతం చాపమాదాయాత్మవిభూషణమ్ |
ఆబధ్య చ కలాపౌ ద్వౌ జగామోదగ్రవిక్రమః ||

2

తం వంచయానో రాజేంద్రమాపతంతం నిరీక్ష్య వై |
బభూవాంతర్హితస్త్రాసాత్ పునః సందర్శనేఽభవత్ ||

3

బద్ధాసిర్ధనురాదాయ ప్రదుద్రావ యతో మృగః |
తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమానమివాగ్రతః ||

4

అవేక్ష్యావేక్ష్య ధావంతం ధనుష్పాణిం మహావనే |
అతివృత్తమిషోః పాతాల్లోభయానం కదాచన ||

5

శంకితం తు సముద్భ్రాంతముత్పతంతమివాంబరే |
దృశ్యమానమదృశ్యం చ వనోద్దేశేషు కేషుచిత్ ||

6

చిన్నాభ్రైరివ సంవీతం శారదం చంద్రమండలమ్ |
ముహూర్తాదేవ దదృశే ముహుర్దూరాత్ప్రకాశతే ||

7

దర్శనాదర్శనాదేవం సోఽపాకర్షత రాఘవమ్ |
సుదూరమాశ్రమస్యాస్య మారిచో మృగతాం గతః ||

8

ఆసీత్ క్రుద్ధస్తు కాకుత్స్థో వివశస్తేన మోహితః |
అథావతస్థే సంభ్రాంతశ్ఛాయామాశ్రిత్య శాద్వలే ||

9

స తమున్మాదయామాస మృగరూపో నిశాచరః |
మృగైః పరివృతో వన్యైరదూరాత్ ప్రత్యదృశ్యత ||

10

గ్రహీతుకామం దృష్ట్వైనం పునరేవాభ్యధావత |
తత్‍క్షణాదేవ సంత్రాసాత్ పునరంతర్హితోఽభవత్ ||

11

పునరేవ తతో దూరాద్వృక్షషండాద్వినిఃసృతమ్ |
దృష్ట్వా రామో మహాతేజాస్తం హంతుం కృతనిశ్చయః ||

12

భూయస్తు శరముద్ధృత్య కుపితస్తత్ర రాఘవః |
సూర్యరశ్మిప్రతీకాశం జ్వలంతమరిమర్దనః ||

13

సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బలీ |
తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పన్నగమ్ ||

14

ముమోచ జ్వలితం దీప్తమస్త్రం బ్రహ్మవినిర్మితమ్ |
శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః ||

15

మారీచస్యైవ హృదయం విభేదాశనిసన్నిభః |
తాలమాత్రమథోత్ప్లుత్య న్యపతత్స శరాతురః ||

16

వినదన్భైరవం నాదం ధరణ్యామల్పజీవితః |
మ్రియమాణస్తు మారీచో జహౌ తాం కృత్రిమాం తనుమ్ ||

17

స్మృత్వా తద్వచనం రక్షో దధ్యౌ కేన తు లక్ష్మణమ్ |
ఇహ ప్రస్థాపయేత్ సీతా శూన్యే తాం రావణో హరేత్ ||

18

స ప్రాప్తకాలమాజ్ఞాయ చకార చ తతః స్వరమ్ |
సదృశం రాఘవస్యైవ హా సీతే లక్ష్మణేతి చ ||

19

తేన మర్మణి నిర్విద్ధః శరేణానుపమేన చ |
మృగరూపం తు తత్త్యక్త్వా రాక్షసం రూపమాత్మనః ||

20

చక్రే స సుమహాకాయో మారీచో జీవితం త్యజన్ |
తతో విచిత్రకేయూరః సర్వాభరణభూషితః ||

21

హేమమాలీ మహాదంష్ట్రో రాక్షసోఽభూచ్ఛరాహతః |
తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనమ్ ||

22

రామో రుధిరసిక్తాంగం వేష్టమానం మహీతలే |
జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచః స్మరన్ ||

23

మారీచస్యైవ మాయైషా పూర్వోక్తం లక్ష్మణేన తు |
తత్తథా హ్యభవచ్చాద్య మారీచోఽయం మయా హతః ||

24

హా సీతే లక్ష్మణేత్యేవమాక్రుశ్య చ మహాస్వనమ్ |
మమార రాక్షసః సోఽయం శ్రుత్వా సీతా కథం భవేత్ ||

25

లక్ష్మణశ్చ మహాబాహుః కామవస్థాం గమిష్యతి |
ఇతి సంచింత్య ధర్మాత్మా రామో హృష్టతనూరుహః ||

26

తత్ర రామం భయం తీవ్రమావివేశ విషాదజమ్ |
రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరమ్ ||

27

నిహత్య పృషతం చాన్యం మాంసమాదాయ రాఘవః |
త్వరమాణో జనస్థానం ససారాభిముఖస్తదా ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుశ్చత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 44 Meaning In Telugu

ఈ విధంగా రాముడు లక్ష్మణునికి ఆ లేడిని చంపాలి అన్న తన నిర్ణయాన్ని, సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు. ధనర్బాణములను తీసుకున్నాడు. వీపుకు రెండు అమ్ములపొదులను కట్టుకున్నాడు.

ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు. ఇంక రాముడు తనను వేటాడటానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు. చెంగు చెంగున గెంతుతూ దూరంగా పారిపోయాడు. అది చూచి రాముడు ఆ మృగము వెంట పరుగెత్తాడు. మారీచుడు రామునికి చిక్కినట్టే చిక్కి మరలా దూరంగా పరుగెత్తుతున్నాడు. రాముడు తన బాణములతో దానిని కొడుతున్నాడు. ఆ బాణములను చిత్రవిచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరుగెడుతున్నాడు మారీచుడు. మెరుపు తీగవలె ఒక క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమౌతూ పారిపోతున్నాడు మారీచుడు.

రామునికి పట్టుదల పెరిగింది. ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ప్రకారంగా మారీచుడు రాముని పర్ణశాలకు దూరంగా తీసుకొని వెళ్లాడు. రామునికి విపరీతంగా కోపం వచ్చింది. ఒక చిన్న జింకపిల్ల తనకు చిక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు.

అప్పటికే రాముడు అలిసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మారీచుడు తనకు తానుగా మరి కొన్ని మృగములను సృష్టించుకొని ఆ లేళ్లగుంపులో తాను మెరిసిపోతూ రాముని ముందు తిరుగాడుతున్నాడు.

రామునికి కోపంపెరిగింది. లేచి మరలా పరుగెత్తాడు. మారీచుడూ అందకుండా పరుగెత్తాడు. రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించాడు. ఆ లేడికి గురిపెట్టి ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రము నిప్పులు కక్కుకుంటూ ఆ లేడిని తరుముతూ దూసుకుపోయింది. ఆ దివ్యాస్త్రము బారి నుండి మారీచుడు తప్పించుకోలేకపోయాడు. ఆ దివ్యాస్త్రము మారీచుని గుండెలు చీల్చింది. ఆ దెబ్బకు మారీచుడు పైకి ఎగిరి దబ్బున కిందపడ్డాడు.

మరణ కాలంలో మారీచునకు తన నిజస్వరూపము వచ్చింది. అప్పుడు మారీచునికి రావణుని మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ “హా సీతా! హా లక్షణా!”

అని బిగ్గరగా అరిచాడు. మారీచుడు తన భయంకరమైన రాక్షస స్వరూపముతో నేలమీద పడిపోయాడు. మారీచుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది.

లేడి రూపంలో తనను అంతదాకా తీసుకొని వచ్చిన రాక్షసుని చూచిన తరువాత రామునికి లక్ష్మణుని మాటలలో ఉన్న అంతరార్థం అవగతమయింది. అప్పుడు సీతకు ఏమయిందో అని కంగారు పడ్డాడు రాముడు. రామునికి సర్వం బోధపడింది.

“వీడు మారీచుడే. సందేహము లేదు. లక్ష్మణుని మాటలు యదార్థములు. అయినా వీడు చస్తూ “సీతా లక్ష్మణా” అని ఎందుకు అరిచాడు. ఆ అరుపులు విని సీత నా గురించి కంగారు పడదు కదా! ఈ అరుపులు విని లక్ష్మణుడు నాకు ఏమైనా ఆపద కలిగిందని అనుకోడు కదా!”

ఈ ఆలోచన రాగానే రాముడి మనసులో కీడు శంకించాడు. రాముని ఒళ్లు జలదరించింది. కొంచెం భయం కూడా కలిగింది. ఇప్పుడు తీసుకుపోడానికి లేడి లేదు. దాని చర్మం లేదు. అందుకని మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసమును, చర్మాన్ని తీసుకొని తన పర్ణశాల వైపు వెళుతున్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచచత్వారింశః సర్గః (45) >>

Leave a Comment