Aranya Kanda Sarga 46 In Telugu – అరణ్యకాండ షట్చత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్చత్వారింశః సర్గం రామాయణంలో కీలక భాగం. ఈ సర్గంలో, రాముడు మరియు లక్ష్మణులు సీతను వెతికే ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. మార్గంలో, వారు కబంధుడనే రాక్షసుడితో ఎదుర్కొంటారు. రాక్షసుడు వారికి దాడి చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ రాముడు మరియు లక్ష్మణులు అతనిని ఓడిస్తారు.

రావణభిక్షుసత్కారః

తథా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః |
స వికాంక్షన్భృశం రామం ప్రతస్థే న చిరాదివ ||

1

తదాసాద్య దశగ్రీవః క్షిప్రమంతరమాస్థితః |
అభిచక్రామ వైదేహీం పరివ్రాజకరూపధృత్ ||

2

శ్లక్ష్ణకాషాయసంవీతః శిఖీ ఛత్రీ ఉపానహీ |
వామే చాంసేఽవసజ్యాథ శుభే యష్టికమండలూ ||

3

పరివ్రాజకరూపేణ వైదేహీం సముపాగమత్ |
తామాససాదాతిబలో భ్రాతృభ్యాం రహితాం వనే ||

4

రహితాం చంద్రసూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమః |
తామపశ్యత్తతో బాలాం రామపత్నీం యశస్వినీమ్ ||

5

రోహిణీం శశినా హీనాం గ్రహవద్భృశదారుణః |
తముగ్రతేజః కర్మాణం జనస్థానరుహా ద్రుమాః ||

6

సమీక్ష్య న ప్రకంపంతే న ప్రవాతి చ మారుతః |
శీఘ్రస్రోతాశ్చ తం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనమ్ ||

7

స్తిమితం గంతుమారేభే భయాద్గోదావరీ నదీ |
రామస్య త్వంతరప్రేప్సుర్దశగ్రీవస్తదంతరే ||

8

ఉపతస్థే చ వైదేహీం భిక్షురూపేణ రావణః |
అభవ్యో భవ్యరూపేణ భర్తారమనుశోచతీమ్ ||

9

అభ్యవర్తత వైదేహీం చిత్రామివ శనైశ్చరః |
స పాపో భవ్యరూపేణ తృణైః కూప ఇవావృతః ||

10

అతిష్ఠత్ప్రేక్ష్య వైదేహీం రామపత్నీం యశస్వినీమ్ |
[* తిష్ఠన్ సంప్రేక్ష్య చ తదా పత్నీం రామస్య రావణ | *]
శుభాం రుచిరదంతోష్ఠీం పూర్ణచంద్రనిభాననామ్ ||

11

ఆసీనాం పర్ణశాలాయాం బాష్పశోకాభిపీడితామ్ |
స తాం పద్మపలాశాక్షీం పీతకౌశేయవాసినీమ్ ||

12

అభ్యగచ్ఛత వైదేహీం దుష్టచేతా నిశాచరః |
స మన్మథశరావిష్టో బ్రహ్మఘోషముదీరయన్ ||

13

అబ్రవీత్ప్రశ్రితం వాక్యం రహితే రాక్షసాధిపః |
తాముత్తమాం స్త్రియం లోకే పద్మహీనామివ శ్రియమ్ ||

14

విభ్రాజమానాం వపుషా రావణః ప్రశశంస హ |
కా త్వం కాంచనవర్ణాభే పీతకౌశేయవాసిని ||

15

కమలానాం శుభాం మాలాం పద్మినీవ హి బిభ్రతీ |
హ్రీః కీర్తిః శ్రీః శుభా లక్ష్మీరప్సరా వా శుభాననే ||

16

భూతిర్వా త్వం వరారోహే రతిర్వా స్వైరచారిణీ |
సమాః శిఖరిణః స్నిగ్ధాః పాండురా దశనాస్తవ ||

17

విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణతారకే |
విశాలం జఘనం పీనమూరూ కరికరోపమౌ ||

18

ఏతావుపచితౌ వృత్తౌ సంహతౌ సంప్రవల్గితౌ |
పీనోన్నతముఖౌ కాంతౌ స్నిగ్ధౌ తాలఫలోపమౌ ||

19

మణిప్రవేకాభరణౌ రుచిరౌ తే పయోధరౌ |
చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని ||

20

మనో హరసి మే కాంతే నదీకూలమివాంభసా |
కరాంతమితమధ్యాసి సుకేశీ సంహతస్తనీ ||

21

నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ కిన్నరీ |
నైవంరూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే ||

22

రూపమగ్ర్యం చ లోకేషు సౌకుమార్యం వయశ్చ తే |
ఇహ వాసశ్చ కాంతారే చిత్తమున్మాదయంతి మే ||

23

సా ప్రతిక్రామ భద్రం తే న త్వం వస్తుమిహార్హసి |
రాక్షసానామయం వాసో ఘోరాణాం కామరూపిణామ్ ||

24

ప్రాసాదాగ్రాణి రమ్యాణి నగరోపవనాని చ |
సంపన్నాని సుగంధీని యుక్తాన్యాచరితుం త్వయా ||

25

వరం మాల్యం వరం భోజ్యం వరం వస్త్రం చ శోభనే |
భర్తారం చ వరం మన్యే త్వద్యుక్తమసితేక్షణే ||

26

కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే |
వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే ||

27

నేహ గచ్ఛంతి గంధర్వా న దేవా న చ కిన్నరాః |
రాక్షసానామయం వాసః కథం ను త్వమిహాగతా ||

28

ఇహ శాఖామృగాః సింహా ద్వీపివ్యాఘ్రమృగాస్తథా |
ఋక్షాస్తరక్షవః కంకాః కథం తేభ్యో న బిభ్యసి ||

29

మదాన్వితానాం ఘోరాణాం కుంజరాణాం తరస్వినామ్ |
కథమేకా మహారణ్యే న బిభేషి వరాననే ||

30

కాసి కస్య కుతశ్చిత్త్వం కిం నిమిత్తం చ దండకాన్ |
ఏకా చరసి కల్యాణి ఘోరాన్రాక్షససేవితాన్ ||

31

ఇతి ప్రశస్తా వైదేహీ రావణేన దురాత్మనా |
ద్విజాతివేషేణ హితం దృష్ట్వా రావణమాగతమ్ ||

32

సర్వైరతిథిసత్కారైః పూజయామాస మైథిలీ |
ఉపానీయాసనం పూర్వం పాద్యేనాభినిమంత్ర్య చ |
అబ్రవీత్సిద్ధమిత్యేవ తదా తం సౌమ్యదర్శనమ్ ||

33

ద్విజాతివేషేణ సమీక్ష్య మైథిలీ
సమాగతం పాత్రకుసుంభధారిణమ్ |
అశక్యముద్ద్వేష్టుముపాయదర్శనం
న్యమంత్రయద్బ్రాహ్మణవత్తదాఽంగనా ||

34

ఇయం బృసీ బ్రాహ్మణ కామమాస్యతాం
ఇదం చ పాద్యం ప్రతిగృహ్యతామితి |
ఇదం చ సిద్ధం వనజాతముత్తమం
త్వదర్థమవ్యగ్రమిహోపభుజ్యతామ్ ||

35

నిమంత్ర్యమాణః ప్రతిపూర్ణభాషిణీం
నరేంద్రపత్నీం ప్రసమీక్ష్య మైథిలీమ్ |
ప్రసహ్య తస్యా హరణే ధృతం మనః
సమర్పయస్త్వాత్మవధాయ రావణః ||

36

తతః సువేషం మృగయాగతం పతిం
ప్రతీక్షమాణా సహలక్ష్మణం తదా |
వివీక్షమాణా హరితం దదర్శ త-
-న్మహద్వనం నైవ తు రామలక్ష్మణౌ ||

37

ఇత్యార్షే శ్రీమద్రామయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్చత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 46 Meaning In Telugu

సీత మాట్లాడిన పరుషమైన వాక్యములకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్లిన వెంటనే ఈ అవకాశము కొరకు వేచి ఉన్న రావణుడు తను దాగి ఉన్న పొదలమాటు నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు. కాషాయ బట్టలు ధరించాడు. చేతిలో దండము, కమండలము పట్టుకున్నాడు. జటాజూటములు కట్టుకున్నాడు. ఒక గొడుగు పట్టుకున్నాడు. కాళ్లకు పాదుకలు ధరించాడు. కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు.

రావణుని రాకతో అక్కడి ప్రకృతి కూడా వణికిపోయింది. గాలి ఆడటం మానేసింది. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది కూడా మెల్లగా శబ్దం చెయ్యకుండా ప్రవహించసాగింది. రావణుడు సీత దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చుని ఉంది. సీతను చూడగానే రావణుడికి మన్మధుని బాధ ఎక్కువ అయింది. సీతను చూచి రావణుడు ఇలా అన్నాడు..

“ఓ తరుణీ! నీవు ఎవరవు? అన్నిశుభలక్షణములు కల నీవు ఎవరు? నీవు ఆ శివుని అర్థాంగి పార్వతివా? లేక కీర్తికి అధిష్టాన దేవతవా! లేక కాంతి దేవతవా! లేక లక్ష్మివా! దేవ కాంతవా! అప్సరసవా! లేక మన్మధుని మనోహారిణి రతీదేవివా!

(ఇక్కడ రావణుడు సీతను అంగాంగము వర్ణించాడు. సీత చనుదోయిని, తొడలను, నడుమును, పిరుదులను వర్ణించాడు. వాల్మీకి అలా వర్ణిస్తాడా! ఎంత సన్యాసి అయినా పరాయిస్త్రీని అలా వర్ణిస్తుంటే ఆ స్త్రీ ఊరుకుంటుందా! కాబట్టి ఇవి వాల్మీకి రాసినవి కావేమో అనిపిస్తుంది. చదవండి.)

ఓ తరుణీ! నీ జఘనము విశాలంగా ఉంది. నీ తొడలు ఏనుగు తొండముల మాదిరి ఉన్నాయి. నీ స్తనములు గుండ్రంగా తాటి పండ్లమాదిరి అందంగా ఉన్నాయి (తాలఫలోపమౌ) ఓ తరుణీ! నీవు నా మనసును హరించావు. నీ నడుము నా పిడికిలి అంత ఉంది. నీ వెంట్రుకలు అందంగా ఉన్నాయి. నీ స్తనములు దగ్గరగా ఉన్నాయి…. ( ఈ వర్ణన బట్టి మీరే నిర్ణయించండి)

ఓ లలనా! నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకూ భూమండలములోనే కాదు ముల్లోకములలో చూడలేదు. నీవు ఈ అరణ్యములలో ఉండతగవు. నిన్ను ఆ అరణ్యములో ఈ పర్ణశాలలో చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ అరణ్యము రాక్షసులు నివాసము. ఎక్కడో రాజభవనములలో, అంతఃపురములలో రాచభోగములు అనుభవించవలసినదానికి ఇక్కడ ఎందుకున్నావు.

నీకు వివాహ మైనదా! నీ భర్త ఎవరు? నీవు మానవ కాంతవు మాత్రము కావు! నీవు దేవతాస్త్రీవి అయి ఉండవలెను. రాక్షసులు సంచరించు ఈ అరణ్య ప్రాంతమునకు దేవతలు, గంధర్వులు, కింనరులు కూడారారు. అటువంటిది నీవు ఎందుకు వచ్చావు? ఈ అరణ్యములో ఉన్న పులులు, సిహములు మొదలగు క్రూరమృగములను చూచి నీకు భయం వెయ్యడం లేదా!

మరలా అడుగుతున్నాను. నీవు ఎవరు? నీ భర్త ఎవరు? నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఈ రాక్షసరాజ్యంలో ఒంటరిగా ఎందుకు ఉ న్నావు?” అని అడిగాడు రావణుడు.

బ్రాహ్మణుడు, సన్యాసి వేషములో ఉన్న రావణునికి సీత అర్ఘ్యము, పాద్యము ఇచ్చి సత్కరించింది. అతిథి పూజలు చేసింది. తినడానికి పండ్లు కూడా ఇచ్చింది. సీత తనకు అతిధి మర్యాదలు చేస్తుంటే, రావణుడు ఆమెను ఎలా బలవంతంగా తీసుకొని పోవాలా అని ఆలోచిస్తున్నాడు. తన చావు తానే కొనితెచ్చుకుంటున్నాడు.

రావణునికి అతిథి సత్కారములు చేసి, గుమ్మము వద్దకు వచ్చి సీత రాముడు, లక్ష్మణుడు వస్తున్నారా అని చూసింది. కాని రామలక్ష్మణులు ఎంతకూ కనపడలేదు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ సప్తచత్వారింశః సర్గః (47) >>

Leave a Comment