Aranya Kanda Sarga 47 In Telugu – అరణ్యకాండ సప్తచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – సప్తచత్వారింశః సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో విహరిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అరణ్యంలోని పశు పక్షాదులు, వనమూలికలు, పుష్పాలను చూసి సీతా రాములు ఆనందిస్తారు. పర్వతాలు, సరస్సులు, నదులను వీక్షిస్తూ మంత్రముగ్ధులవుతారు. ఈ ప్రయాణంలో లక్ష్మణుడు వారిని సురక్షితంగా చూసుకుంటూ, జాగ్రత్త వహిస్తాడు.

రావణాధిక్షేపః

రావణేన తు వైదేహీ తదా పృష్ఠా జిహీర్షతా |
పరివ్రాజకలింగేన శశంసాత్మానమంగనా ||

1

బ్రాహ్మణశ్చాతిథిశ్చాయమనుక్తో హి శపేత మామ్ |
ఇతి ధ్యాత్వా ముహూర్తం తు సీతా వచనమబ్రవీత్ ||

2

దుహితా జనకస్యాహం మైథిలస్య మహాత్మనః |
సీతా నామ్నాఽస్మి భద్రం తే రామభార్యా ద్విజోత్తమ ||

3

ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే |
భుంజానాన్మానుషాన్భోగాన్ సర్వకామసమృద్ధినీ ||

4

తతస్త్రయోదశే వర్షే రాజామంత్రయత ప్రభుః |
అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః ||

5

తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచనే |
కైకేయీ నామ భర్తారమార్యా సా యాచతే వరమ్ ||

6

ప్రతిగృహ్య తు కైకేయీ శ్వశురం సుకృతేన మే |
మమ ప్రవ్రాజనం భర్తుర్భరతస్యాభిషేచనమ్ ||

7

ద్వావయాచత భర్తారం సత్యసంధం నృపోత్తమమ్ |
నాద్య భోక్ష్యే న చ స్వప్స్యే న చ పాస్యే కథంచన ||

8

ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే |
ఇతి బ్రువాణాం కైకేయీం శ్వశురో మే స మానదః ||

9

అయాచతార్థైరన్వర్థైర్న చ యాంచాం చకార సా |
మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః ||

10

అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే |
రామేతి ప్రథితో లోకే గుణవాన్ సత్యవాఞ్శుచిః ||

11

విశాలాక్షో మహాబాహుః సర్వభూతహితే రతః |
కామార్తస్తు మహాతేజాః పితా దశరథః స్వయమ్ ||

12

కైకేయ్యాః ప్రియకామార్థం తం రామం నాభ్యషేచయత్ |
అభిషేకాయ తు పితుః సమీపం రామమాగతమ్ ||

13

కైకేయీ మమ భర్తారమిత్యువాచ ధృతం వచః |
తవ పిత్రా సమాజ్ఞప్తం మమేదం శృణు రాఘవ ||

14

భరతాయ ప్రదాతవ్యమిదం రాజ్యమకంటకమ్ |
త్వయా హి ఖలు వస్తవ్యం నవ వర్షాణి పంచ చ ||

15

వనే ప్రవ్రజ కాకుత్స్థ పితరం మోచయానృతాత్ |
తథేత్యుక్త్వా చ తాం రామః కైకేయీమకుతోభయః ||

16

చకార తద్వచస్తస్యా మమ భర్తా దృఢవ్రతః |
దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్సత్యం బ్రూయాన్న చానృతమ్ ||

17

ఏతద్బ్రాహ్మణ రామస్య ధ్రువం వ్రతమనుత్తమమ్ |
తస్య భ్రాతా తు ద్వైమాత్రో లక్ష్మణో నామ వీర్యవాన్ ||

18

రామస్య పురుషవ్యాఘ్రః సహాయః సమరేఽరిహా |
స భ్రాతా లక్ష్మణో నామ ధర్మచారీ దృఢవ్రతః ||

19

అన్వగచ్ఛద్ధనుష్పాణిః ప్రవ్రజంతం మయా సహ |
జటీ తాపసరూపేణ మయా సహ సహానుజః ||

20

ప్రవిష్టో దండకారణ్యం ధర్మనిత్యో జితేంద్రియః |
తే వయం ప్రచ్యుతా రాజ్యాత్ కైకేయ్యాస్తు కృతే త్రయః ||

21

విచరామ ద్విజశ్రేష్ఠ వనం గంభీరమోజసా |
సమాశ్వస ముహూర్తం తు శక్యం వస్తుమిహ త్వయా ||

22

ఆగమిష్యతి మే భర్తా వన్యమాదాయ పుష్కలమ్ |
రురూన్ గోధాన్ వరాహాంశ్చ హత్వాఽఽదాయామిషాన్ బహూన్ ||

23

స త్వం నామ చ గోత్రం చ కులం చాచక్ష్వ తత్త్వతః |
ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ ||

24

ఏవం బ్రువంత్యాం సీతాయాం రామపత్న్యాం మహాబలః |
ప్రత్యువాచోత్తరం తీవ్రం రావణో రాక్షసాధిపః ||

25

యేన విత్రాసితా లోకాః సదేవాసురపన్నగాః |
అహం స రావణో నామ సీతే రక్షోగణేశ్వరః ||

26

త్వాం తు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌశేయవాసినీమ్ |
రతిం స్వకేషు దారేషు నాధిగచ్ఛామ్యనిందితే ||

27

బహ్వీనాముత్తమస్త్రీణామాహృతానామితస్తతః |
సర్వాసామేవ భద్రం తే మమాగ్రమహిషీ భవ ||

28

లంకా నామ సముద్రస్య మధ్యే మమ మహాపురీ |
సాగరేణ పరిక్షిప్తా నివిష్టా నగమూర్ధని ||

29

తత్ర సీతే మయా సార్ధం వనేషు విహరిష్యసి |
న చాస్యారణ్యవాసస్య స్పృహయిష్యసి భామిని ||

30

పంచ దాస్యః సహస్రాణి సర్వాభరణభూషితాః |
సీతే పరిచరిష్యంతి భార్యా భవసి మే యది ||

31

రావణేనైవముక్తా తు కుపితా జనకాత్మజా |
ప్రత్యువాచానవద్యాంగీ తమనాదృత్య రాక్షసమ్ ||

32

మహాగిరిమివాకంప్యం మహేంద్రసదృశం పతిమ్ |
మహోదధిమివాక్షోభ్యమహం రామమనువ్రతా ||

33

సర్వలక్షణసంపన్నం న్యగ్రోధపరిమండలమ్ |
సత్యసంధం మహాభాగమహం రామమనువ్రతా ||

34

మహాబాహుం మహోరస్కం సింహవిక్రాంతగామినమ్ |
నృసింహం సింహసంకాశమహం రామమనువ్రతా ||

35

పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియమ్ |
పృథుకీర్తిం మహాత్మానమహం రామమనువ్రతా ||

36

త్వం పునర్జంబుకః సింహీం మామిచ్ఛసి సుదుర్లభామ్ |
నాహం శక్యా త్వయా స్ప్రష్టుమాదిత్యస్య ప్రభా యథా ||

37

పాదపాన్ కాంచనాన్నూనం బహూన్ పశ్యసి మందభాక్ |
రాఘవస్య ప్రియాం భార్యాం యస్త్వమిచ్ఛసి రావణ ||

38

క్షుధితస్య హి సింహస్య మృగశత్రోస్తరస్వినః |
ఆశీవిషస్య వదనాద్దంష్ట్రామాదాతుమిచ్ఛసి ||

39

మందరం పర్వతశ్రేష్ఠం పాణినా హర్తుమిచ్ఛసి |
కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్ఛసి ||

40

అక్షి సూచ్యా ప్రమృజసి జిహ్వయా లేక్షి చ క్షురమ్ |
రాఘవస్య ప్రియాం భార్యాం యోఽధిగంతుం త్వమిచ్ఛసి ||

41

అవసజ్య శిలాం కంఠే సముద్రం తర్తుమిచ్ఛసి |
సూర్యాచంద్రమసౌ చోభౌ పాణిభ్యాం హర్తుమిచ్ఛసి ||

42

యో రామస్య ప్రియాం భార్యాం ప్రధర్షయితుమిచ్ఛసి |
అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణాహర్తుమిచ్ఛసి ||

43

కల్యాణవృత్తాం రామస్య యో భార్యాం హర్తుమిచ్ఛసి |
అయోముఖానాం శూలానామగ్రే చరితుమిచ్ఛసి |
రామస్య సదృశీం భార్యాం యోఽధిగంతుం త్వమిచ్ఛసి ||

44

యదంతరం సింహశృగాలయోర్వనే
యదంతరం స్యందినికాసముద్రయోః |
సురాగ్ర్యసౌవీరకయోర్యదంతరమ్ం
తదంతరం వై తవ రాఘవస్య చ ||

45

యదంతరం కాంచనసీసలోహయో-
-ర్యదంతరం చందనవారిపంకయోః |
యదంతరం హస్తిబిడాలయోర్వనే
తదంతరం దాశరథేస్తవైవ చ ||

46

యదంతరం వాయసవైనతేయయో-
-ర్యదంతరం మద్గుమయూరయోరపి |
యదంతరం సారసగృధ్రయోర్వనే
తదంతరం దాశరథేస్తవైవ చ ||

47

తస్మిన్ సహస్రాక్షసమప్రభావే
రామే స్థితే కార్ముకబాణపాణౌ |
హృతాపి తేఽహం న జరాం గమిష్యే
వజ్రం యథా మక్షికయాఽవగీర్ణమ్ ||

48

ఇతీవ తద్వాక్యమదుష్టభావా
సుధృష్టముక్త్వా రజనీచరం తమ్ |
గాత్రప్రకంపవ్యథితా బభూవ
వాతోద్ధతా సా కదలీవ తన్వీ ||

49

తాం వేపమానాముపలక్ష్య సీతాం
స రావణో మృత్యుసమప్రభావః |
కులం బలం నామ చ కర్మ చ స్వం
సమాచచక్షే భయకారణార్థమ్ ||

50

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 47 Meaning In Telugu

సన్యాసివేషములో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే, సీత మనసులో ఇలా అనుకుంది.

“ఇతడు సన్యాసి. బ్రాహ్మణుడు. పైగా అతిథి. ఈయన అడిగిన వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో. ఉన్నవి ఉన్నట్టు చెబితే తప్పేమిటి” అని మనసులో అనుకొంది. అప్పుడురావణుని చూచి ఇలా అంది.

” ఓ బ్రాహ్మణోత్తమా! నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను. అయోధ్యా నగరాధి పతి దశరథుని కోడలను. రాముని భార్యను. నా పేరు సీత. నేను చిన్నతనమునుండి రాజభోగములు అనుభవించాను. నా వివాహము అయిన తరువాత కూడా 12 సంవత్సరములు నా అత్తవారి ఇంట రాజభోగములు అనుభవించాను.

నా భర్త రామునికి పట్టాభిషేక సమయములో మా మామగారి మూడవ భార్య కైక ఆయనను రెండు వరములు కోరింది. ఒకటి రాముని అరణ్యవాసము. రెండవది తన కుమారుడు భరతుని పట్టాభిషేకము. అప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు. నా భర్త పట్టాభిషేకము ఆగిపోయింది. తండ్రి మాట ప్రకారము నా భర్త 14 ఏళ్లు అరణ్యవాసము చేస్తున్నాడు. ఆయన సహధర్మచారిణిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసము చేస్తున్నాను. ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యములకు వచ్చాడు. ఆ ప్రకారంగా మేము ముగ్గురము ఈ అరణ్యములో నివసిస్తున్నాము. నా భర్త రాముడు, నా మరిది లక్ష్మణుడు అడవిలో ఒక జింకను వేటాడటానికి వెళ్లారు. వారు తొందరలోనే వస్తారు. శ్రేష్టమైన జింక మాంసము తెస్తారు.

ఇంతకూ తమరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? తమరి గోత్రనామములు ఏమిటి? ఈ దండకారణ్యములో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు?” అని ఎదురు ప్రశ్నలు వేసింది సీత.

సీత వేసిన ప్రశ్నలకు రావణుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా పేరు రావణుడు. నేను రాక్షస రాజును. నన్ను చూస్తే దేవతలు, అసురులు, పన్నగులు, అందరూ భయపడతారు. నిన్ను చూచిన వెంటనే నాకు నీ మీద మోహము కలిగింది. నిన్ను చూచిన తరువాత, నేను నీ దగ్గర తప్ప నా ఇతర భార్యల దగ్గర కామభోగములు అనుభవింపలేను అని అనుకుంటున్నాను.

నేను ఎంతో మంది స్త్రీలను పట్టి తెచ్చి నా భార్యలుగా చేసుకున్నాను. నీవు నాతో వస్తే నిన్ను వారందరికీ పట్టమహిషిని చేస్తాను. నేనుపాలించే నగరము పేరు లంకానగరము. సముద్రమధ్యలో ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది. నా నగరములో అనేక సుందర ఉద్యానవనములు ఉన్నాయి. నీకు ఈ అరణ్యవాసము ఎందుకు, నాతో వస్తే ఆ ఉద్యానవనములలో హాయిగా విహరించవచ్చును. సీతా! నీవు నాకు భార్యవు అయితే నీకు అయిదు వేలమంది దాసీలు సేవలు చేస్తారు. నన్ను వరించు. నాతో రా!” అని అన్నాడు రావణుడు.

ఆ మాటలు విన్న సీతకు కోపము ముంచుకొచ్చింది.

“రావణా! నేను నా భర్త రాముని తప్ప మరొకరిని కలలో కూడా తలంచను. నా రాముడు మహాపర్వతము వంటి వాడు. అజేయుడు. సర్వలక్షణ సంపన్నుడు., వటవృక్షము వంటి వాడు. సత్యవాక్పరిపాలకుడు. అట్టి రాముడు నాకు భర్త. నేను నా భర్తను తప్ప మరొకరిని కన్నెత్తికూడా చూడను. ఇంకా నా రాముడు మహా బాహుడు. ఉన్నతవక్షస్థలము కలవాడు. నరులలో ఉత్తముడు. సింహము వంటి వాడు. నా రాముడు జితేంద్రియుడు. కీర్తిమంతుడు.

సింహము వంటి భర్తకు భార్యనైన నన్ను ఒక నక్క మాదిరి కోరుతున్నావు. నీకు కనీసము నన్ను తాకే అర్హత కూడా లేదు. నన్నుకోరుతున్నావు అంటే నీకు మరణము ఆసన్నమయినది అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే సింహము వంటి రాముని జూలు పట్టుకొని లాగుతున్నావు. మంధర పర్వతమును పైకిఎత్తాలని, కాలకూట విషాన్ని తాగాలని ఉత్సాహపడుతున్నావు. సూదితో కంటిలో నలుసును తీసుకుంటూ నీ కళ్లు నీవే పొడుచుకుంటున్నావు. అలాగే వాడియైన కత్తిని నాలుకతో నాకుతున్నావు. పెద్ద రాయి కట్టుకొని సముద్రమును ఈదాలని అనుకుంటున్నావు. సూర్యచంద్రులను మింగాలని చూస్తున్నావు. అగ్నిని కొంగున ముడి వెయ్యాలని ప్రయత్నిస్తున్నావు. రాముడి భార్యను పొందాలి అని అనుకోడం వాడి అయిన శూలాల మీద నడవడమే. నాశనమైపోతావు. జాగ్రత్త!

ఓ రావణా! నీవు రాముని కాలి గోటికి కూడా చాలవు. అది తెలుసుకో! రాముడు సింహం అయితే నువ్వు నక్క, రాముడు సముద్రము అయితే నువ్వు మురికినీరు ప్రవహించే పిల్లకాలువ. రాముడు ఏనుగు అయితే నువ్వు దోమ. రాముడు గరుడుడు అయితే నువ్వు కాకి. రాముడు నెమలి అయితే నువ్వు నీటి కొంగ. రాముడు హంస అయితే నువ్వు గ్రద్ద. నీకూ రామునికి అంత తేడా ఉంది. నీచేయి నామీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు. జాగ్రత్త!” అని అన్నది సీత.

కానీ సీతకు లోలోపల భయంగానే ఉంది. ఆ భయం తట్టుకోలేక నేలమీద పడిపోయింది. రావణుడు సీతను మరింత భయపెట్టడానికి తన గురించి ఇంకా చెప్పనారంభించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టచత్వారింశః సర్గః (48) >>

Leave a Comment