Aranya Kanda Sarga 48 In Telugu – అరణ్యకాండ అష్టచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టచత్వారింశః సర్గః (48వ సర్గ): వాల్మీకి రామాయణం యొక్క అరణ్యకాండలో, 48వ సర్గలో, సీతను రాక్షస రాజు రావణుడు అపహరిస్తాడు. రాముడు సీతను వెతుకుతూ ఉండగా, గృధ్రరాజు జటాయువు రాముని ఎదుర్కొంటాడు. జటాయువు రావణుడి దుర్నీతిని వివరించి, సీతను రక్షించేందుకు తన ప్రయత్నాన్ని వివరించును. అలాగే, రావణునితో యుద్ధించిన విషయాన్ని చెబుతాడు.

రావణవికత్థనమ్

ఏవం బ్రువంత్యాం సీతాయాం సంరబ్ధః పరుషం వచః |
లలాటే భ్రుకుటీం కృత్వా రావణః ప్రత్యువాచ హ ||

1

భ్రాతా వైశ్రవణస్యాహం సాపత్న్యో వరవర్ణిని |
రావణో నామ భద్రం తే దశగ్రీవః ప్రతాపవాన్ ||

2

యస్య దేవాః స గంధర్వాః పిశాచపతగోరగాః |
విద్రవంతి భయాద్భీతా మృత్యోరివ సదా ప్రజాః ||

3

యేన వైశ్రవణో రాజా ద్వైమాత్రః కారణాంతరే |
ద్వంద్వమాసాదితః క్రోధాద్రణే విక్రమ్య నిర్జితః ||

4

యద్భయార్తః పరిత్యజ్య స్వమధిష్ఠానమృద్ధిమత్ |
కైలాసం పర్వతశ్రేష్ఠమధ్యాస్తే నరవాహనః ||

5

యస్య తత్పుష్పకం నామ విమానం కామగం శుభమ్ |
వీర్యాదేవార్జితం భద్రే యేన యామి విహాయసమ్ ||

6

మమ సంజాతరోషస్య ముఖం దృష్ట్వైవ మైథిలి |
విద్రవంతి పరిత్రస్తాః సురాః శక్రపురోగమాః ||

7

యత్ర తిష్ఠామ్యహం తత్ర మారుతో వాతి శంకితః |
తీవ్రాంశుః శిశిరాంశుశ్చ భయాత్సంపద్యతే రవిః ||

8

నిష్కంపపత్రాస్తరవో నద్యశ్చ స్తిమితోదకాః |
భవంతి యత్ర యత్రాహం తిష్ఠామి విచరామి చ ||

9

మమ పారే సముద్రస్య లంకా నామ పురీ శుభా |
సంపూర్ణా రాక్షసైర్ఘోరైర్యథేంద్రస్యామరావతీ ||

10

ప్రాకారేణ పరిక్షిప్తా పాండురేణ విరాజతా |
హేమకక్ష్యా పురీ రమ్యా వైడూర్యమయతోరణా ||

11

హస్త్యశ్వరథసంబాధా తూర్యనాదవినాదితా |
సర్వకాలఫలైర్వృక్షైః సంకులోద్యానశోభితా ||

12

తత్ర త్వం వసతీ సీతే రాజపుత్రి మయా సహ |
న స్మరిష్యసి నారీణాం మానుషీణాం మనస్వినీ ||

13

భుంజానా మానుషాన్ భోగాన్ దివ్యాంశ్చ వరవర్ణిని |
న స్మరిష్యసి రామస్య మానుషస్య గతాయుషః ||

14

స్థాపయిత్వా ప్రియం పుత్రం రాజ్యే దశరథేన యః |
మందవీర్యః సుతో జ్యేష్ఠస్తతః ప్రస్థాపితో హ్యయమ్ ||

15

తేన కిం భ్రష్టరాజ్యేన రామేణ గతచేతసా |
కరిష్యసి విశాలాక్షి తాపసేన తపస్వినా ||

16

సర్వరాక్షసభర్తారం కామాత్స్వయమిహాగతమ్ |
న మన్మథశరావిష్టం ప్రత్యాఖ్యాతుం త్వమర్హసి ||

17

ప్రత్యాఖ్యాయ హి మాం భీరు పరితాపం గమిష్యసి |
చరణేనాభిహత్యేవ పురూరవసముర్వశీ ||

18

అంగుల్యా న సమో రామో మమ యుద్ధే స మానుషః |
తవ భాగ్యేన సంప్రాప్తం భజస్వ వరవర్ణిని ||

19

ఏవముక్తా తు వైదేహీ క్రుద్ధా సంరక్తలోచనా |
అబ్రవీత్పరుషం వాక్యం రహితే రాక్షసాధిపమ్ ||

20

కథం వైశ్రవణం దేవం సర్వభూతనమస్కృతమ్ |
భ్రాతరం వ్యపదిశ్య త్వమశుభం కర్తుమిచ్ఛసి ||

21

అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః |
యేషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియః ||

22

అపహృత్య శచీం భార్యాం శక్యమింద్రస్య జీవితుమ్ |
న చ రామస్య భార్యాం మామపనీయాస్తి జీవితమ్ ||

23

జీవేచ్చిరం వజ్రధరస్య హస్తా-
-చ్ఛచీం ప్రధృష్యాప్రతిరూపరూపామ్ |
న మాదృశీం రాక్షస దూషయిత్వా
పీతామృతస్యాపి తవాస్తి మోక్షః ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 48 Meaning In Telugu PDF

“ఓ సీతా! నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను దశకంఠుడను. నేను కుబేరునికి తమ్ముడిని. నా పేరు రావణుడు. మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలాగా నన్ను చూచి దేవతలు, గంధర్వులు, దానవులు భయంతో పారిపోతారు. నేను నా సోదరుడు కుబేరునితో యుద్ధమే చేసి జయించాను. నాకు భయపడి కుబేరుడు సకల భోగములతో తులతూగుతున్న తన నగరమును విడిచి కైలాసంలో తలదాచు కొన్నాడు. నేను కుబేరుని జయించి అతని పుష్పక విమానమును అపహరించాను. దాని మీద నేను ఆకాశంలో విహరిస్తుంటాను.

నాకు కోపం వచ్చింది అని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు. నేను ఉన్నచోట వాయువు నెమ్మదిగా వీస్తాడు. సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకుంటాడు. నేను ఉన్నచోట చెట్టుకూడా తమ ఆకులను కదల్చలేవు. నదులు ప్రవహించ లేవు. నేను ఈ ప్రకృతినంతా శాసిస్తాను.

సముద్రము మధ్యలో ఉన్న నా లంకానగరము సకల భోగములలో దేవేంద్రుని అమరావతిని తలదన్నుతుంది. లంకా నగరం బంగారు ప్రాకారాలు, బంగారు మేడలు మణితోరణాలతో నిండి ఉంటుంది. నా లంకా నగరము ప్రశస్తమైన ఏనుగులు, గుర్రములతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ మంగళ వాద్యములు మ్రోగుతూ ఉంటాయి. నువ్వు నాతో కలిసి లంకా నగరంలో అడుగుపెడితే నీ రాముని, నీ వాళ్లను అందరినీ మరిచి పోతావు. భోగాలలో మునిగితేలుతావు. ఆ రాచ భోగాలలో మునిగిన నీకు సామాన్యమానవుడైన రాముడు ఎన్నటికీ గుర్తుకురాడు.

నీకు తెలుసో లేదో. అసలు దశరథుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా అడవులకు ఎందుకు పంపాడంటావు. రాముడంటే అతని తండ్రి దశరథునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియపుత్రుడు భరతునికి రాజ్యం ఇచ్చాడు. నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు. తెలివితక్కువవాడు. పైగా తాపస వృత్తిలో ఉన్నాడు. అటువంటి మొగుడి పక్కన ఉన్నంత కాలమూ నీవు ఈ జన్మలో అయోధ్యకు రాణివి కాలేవు. నువ్వు ఊ అంటే లంకా రాజ్యానికి రాణివి అవుతావు.

ఇంక నేనంటావా ఈ లోకంలో ఉన్న రాక్షసులందరికీ రాజును. పైగా నువ్వు అంటే కామంతో పడిచస్తున్నాను. నేనే నిన్నుకోరి లంకనుండి నీ వద్దకు వచ్చాను. కాబట్టి నన్ను కాదనకు. నన్ను కాదంటే ఇంతటి అదృష్టాన్ని కాలదన్నుకున్నానే అని జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. యుద్ధంలో రాముడు నా కాలి గోరు కూడా కదపలేడు. నీ అదృష్టం కొద్దీ నీవు నా కంటపడ్డావు. నాతోరా! నిన్ను సుఖాలలో ముంచెత్తుతాను. “అని సీతను ప్రలోభపెట్టాడు రావణుడు.

రావణుని మాటలు విన్న సీత కోపంతో ఊగిపోతున్న నాగ కన్య మాదిరి బుసలు కొట్టింది.

“ఓరి రాక్షసా! దుర్బుద్ధివి. ఇంద్రియ లోలుడివి. రావణా! నీవు నీ వాళ్లతో సహా సర్వనాశనం అయిపోతావు. నీ లంకా రాజ్యము సముద్రంలో కలిసిపోతుంది. ఇంద్రుని వద్దనుండి శచీదేవిని బలాత్కారంగా తీసుకొని పోయి జీవిస్తావేమోగానీ, రాముని వద్దనుండి నన్ను అపహరించి క్షణకాలము కూడా నీవు జీవించలేవు. నువ్వు అమృతము తాగినా నీకు రాముని చేతిలో చావు తప్పదు.” అని పరుషంగా పలికింది సీత.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనపంచాశః సర్గః (49) >>

Leave a Comment