Aranya Kanda Sarga 49 In Telugu – అరణ్యకాండ ఏకోనపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో, 49వ సర్గలో, రాముడు సీతను వెతుకుతూ జటాయువుతో మాట్లాడిన తరువాత సబరి ఆశ్రమానికి చేరుకుంటాడు. సబరి రాముడికి ఆతిథ్యాన్ని అందించి, విధేయతతో స్వాగతం పలుకుతుంది. సబరి తన గురువుల ఆదేశాలను అనుసరించి రాముని సేవ చేసే భాగ్యం పొందినందుకు సంతోషిస్తుంది.

సీతాపహరణమ్

సీతాయా వచనం శ్రుత్వా దశగ్రీవః ప్రతాపవాన్ |
హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపుః ||

1

స మైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృశమ్ |
నోన్మత్తయా శ్రుతౌ మన్యే మమ వీర్యపరాక్రమౌ ||

2

ఉద్వహేయం భుజాభ్యాం తు మేదినీమంబరే స్థితః |
ఆపిబేయం సముద్రం చ హన్యాం మృత్యుం రణే స్థితః ||

3

అర్కం రుంధ్యాం శరైస్తీక్ష్ణైర్నిర్భింద్యాం హి మహీతలమ్ |
కామరూపిణమున్మత్తే పశ్య మాం కామదం పతిమ్ ||

4

ఏవముక్తవతస్తస్య సూర్యకల్పే శిఖిప్రభే |
క్రుద్ధస్య హరిపర్యంతే రక్తే నేత్రే బభూవతుః ||

5

సద్యః సౌమ్యం పరిత్యజ్య భిక్షురూపం స రావణః |
స్వం రూపం కాలరూపాభం భేజే వైశ్రవణానుజః ||

6

సంరక్తనయనః శ్రీమాంస్తప్తకాంచనకుండలః |
క్రోధేన మహతావిష్టో నీలజీమూతసన్నిభః ||

7

దశాస్యః కార్ముకీ బాణీ బభూవ క్షణదాచరః |
స పరివ్రాజకచ్ఛద్మ మహాకాయో విహాయ తత్ ||

8

ప్రతిపద్య స్వకం రూపం రావణో రాక్షసాధిపః |
సంరక్తనయనః క్రోధాజ్జీమూతనిచయప్రభః ||

9

రక్తాంబరధరస్తస్థౌ స్త్రీరత్నం ప్రేక్ష్య మైథిలీమ్ |
స తామసితకేశాంతాం భాస్కరస్య ప్రభామివ ||

10

వసనాభరణోపేతాం మైథిలీం రావణోఽబ్రవీత్ |
త్రిషు లోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్ఛసి ||

11

మామాశ్రయ వరారోహే తవాహం సదృశః పతిః |
మాం భజస్వ చిరాయ త్వమహం శ్లాఘ్యః ప్రియస్తవ ||

12

నైవ చాహం క్వచిద్భద్రే కరిష్యే తవ విప్రియమ్ |
త్యజ్యతాం మానుషో భావో మయి భావః ప్రణీయతామ్ ||

13

రాజ్యాచ్చ్యుతమసిద్ధార్థం రామం పరిమితాయుషమ్ |
కైర్గుణైరనురక్తాసి మూఢే పండితమానిని ||

14

యః స్త్రియా వచనాద్రాజ్యం విహాయ ససుహృజ్జనమ్ |
అస్మిన్ వ్యాలానుచరితే వనే వసతి దుర్మతిః ||

15

ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీమ్ |
అభిగమ్య సుదుష్టాత్మా రాక్షసః కామమోహితః ||

16

జగ్రాహ రావణః సీతాం బుధః ఖే రోహిణీమివ |
వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సః ||

17

ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా |
తం దృష్ట్వా మృత్యుసంకాశం తీక్ష్ణదంష్ట్రం మహాభుజమ్ ||

18

ప్రాద్రవన్ గిరిసంకాశం భయార్తా వనదేవతాః |
స చ మాయామయో దివ్యః ఖరయుక్తః ఖరస్వనః ||

19

ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథః |
తతస్తాం పరుషైర్వాక్యైర్భర్త్సయన్ స మహాస్వనః ||

20

అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా |
సా గృహీతా విచుక్రోశ రావణేన యశస్వినీ ||

21

రామేతి సీతా దుఃఖార్తా రామం దూరగతం వనే |
తామకామాం స కామార్తః పన్నగేంద్రవధూమివ ||

22

వివేష్టమానామాదాయ ఉత్పపాతాథ రావణః |
తతః సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయసా ||

23

భృశం చుక్రోశ మత్తేవ భ్రాంతచిత్తా యథాఽఽతురా |
హా లక్ష్మణ మహాబాహో గురుచిత్తప్రసాదక ||

24

హ్రియమాణాం న జానీషే రక్షసా మామమర్షిణా |
జీవితం సుఖమర్థాంశ్చ ధర్మహేతోః పరిత్యజన్ ||

25

హ్రియమాణామధర్మేణ మాం రాఘవ న పశ్యసి |
నను నామావినీతానాం వినేతాసి పరంతప ||

26

కథమేవంవిధం పాపం న త్వం శాస్సి హి రావణమ్ |
నను సద్యోఽవినీతస్య దృశ్యతే కర్మణః ఫలమ్ ||

27

కాలోఽప్యంగీ భవత్యత్ర సస్యానామివ పక్తయే |
స కర్మ కృతవానేతత్ కాలోపహతచేతనః ||

28

జీవితాంతకరం ఘోరం రామాద్వ్యసనమాప్నుహి |
హంతేదానీం సకామాస్తు కైకేయీ సహ బాంధవైః ||

29

హ్రియే యద్ధర్మకామస్య ధర్మపత్నీ యశస్వినః |
ఆమంత్రయే జనస్థానే కర్ణికారాన్ సుపుష్పితాన్ ||

30

క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణః |
మాల్యవంతం శిఖరిణం వందే ప్రస్రవణం గిరమ్ ||

31

క్షిప్రం రామాయ శంస త్వం సీతాం హరతి రావణః |
హంసకారండవాకీర్ణాం వందే గోదావరీం నదీమ్ ||

32

క్షిప్రం రామాయ శంస త్వం సీతాం హరతి రావణః |
దైవతాని చ యాన్యస్మిన్ వనే వివిధపాదపే ||

33

నమస్కరోమ్యహం తేభ్యో భర్తుః శంసత మాం హృతామ్ |
యాని కాని చిదప్యత్ర సత్త్వాని నివసంత్యుత ||

34

సర్వాణి శరణం యామి మృగపక్షిగణానపి |
హ్రియమాణాం ప్రియాం భర్తుః ప్రాణేభ్యోఽపి గరీయసీమ్ ||

35

వివశాఽపహృతా సీతా రావణేనేతి శంసత |
విదిత్వా మాం మహాబాహురముత్రాపి మహాబలః ||

36

ఆనేష్యతి పరాక్రమ్య వైవస్వతహృతామపి |
సా తదా కరుణా వాచో విలపంతీ సుదుఃఖితా ||

37

వనస్పతిగతం గృధ్రం దదర్శాయతలోచనా |
సా తముద్వీక్ష్య సుశ్రోణీ రావణస్య వశం గతా ||

38

సమాక్రందద్భయపరా దుఃఖోపహతయా గిరా |
జటాయో పశ్య మామార్య హ్రియమాణామనాథవత్ ||

39

అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణా |
నైష వారయితుం శక్యస్తవ క్రూరో నిశాచరః ||

40

సత్త్వవాన్ జితకాశీ చ సాయుధశ్చైవ దుర్మతిః |
రామాయ తు యథాతత్త్వం జటాయో హరణం మమ |
లక్ష్మణాయ చ తత్సర్వమాఖ్యాతవ్యమశేషతః ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 49 Meaning In Telugu

సీత మాట్లాడే మాటలు వింటుంటే రావణుకి కోపం నసాళానికి అంటింది. అసహనంతో, కోపంతో గంతులేసాడు. రెండు చేతులు గట్టిగా చరిచాడు. పెద్దగా గాండ్రించాడు.

“ఓ సీతా! నీకేమైనా పిచ్చా! నా మాటలు అర్థం కావడం లేదా! నా గురించి, నా ఐశ్వర్యము గురించి, నా పరాక్రమము గురించి, నా వైభవము గురించి ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. నా గురించి నీకు బాగా తెలియదు. నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని బంతిలా పైకి ఎత్తి ఆడుకుంటాను. సముద్రాలన్నీ కలిపి తాగేస్తాను. నా ఎదుట నిలిస్తే మృత్యువును కూడా చంపేస్తాను. సూర్యగమనాన్ని అడ్డుకుంటాను. భూమిని బద్దలు కొడతాను. నా ఇష్టం వచ్చి రూపం ధరించగలను. ఇప్పుడు నేను ఉన్నది సన్యాసి రూపంలో. నా అసలు రూపం చూడు.” అంటూ రావణుడు తన సన్యాసి రూపం వదిలి పెట్టి తన అసలు రూపం సీత ముందు ప్రదర్శించాడు.

పదితలలతో, ఎర్రటి కళ్లతో, ఒంటినిండా బంగారు ఆభరణములతో, నల్లని మేని ఛాయతో, ధనుర్బాణములను ధరించిన రావణుడు సీత ముందు నిలిచాడు.

“ఓ సీతా! చూచావా నా నిజస్వరూపము. ముల్లోకములను శాసించే భర్త కావాలనుకుంటే నన్ను వరించు. నీ లాంటి అతిలోక సౌందర్యవతికి నేను తగిన భర్తను. నేను నీ మాట ఎన్నడూ జవదాటను. నీకు దాసుడిగా ఉంటాను. ఆ వనచరుడైనా రాముని మీదినుండి నీ మనసు మరల్చుకో. నా మీద మనసు లగ్నం చెయ్యి. నీకు శుభం జరుగుతుంది.

నేను ఇంకా నువ్వు చాలా తెలివిగలదానవు మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకున్నాను. కాని నీవు ఇంత తెలివి తక్కువదానికి అని అనుకోలేదు. ఒక ఆడుదాని మాటలు విని అడవులకు వచ్చిన బుద్ధిహీనుడిని, రాజ్యభ్రష్టుడిని, అల్పాయుష్కుడిని, మానవమాత్రుడిని నువ్వు ఏం చూసి వరించావో నాకు అర్థం కావడం లేదు. రా! నాతో రా!” అంటూ రావణుడు ముందుకు దూకాడు.

సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేతితో సీత జుట్టు పట్టుకున్నాడు. మెడ కింద చెయ్యి వేసాడు. మరొక చెయ్యి నడుము కింద వేసాడు. సీతను ఎత్తుకొని పోయాడు. రావణుని రథము అతని ముందు సాక్షాత్కరించింది. సీతను రథంలో కూర్చోపెట్టాడు. పెద్ద పెద్ద గా అరుస్తూ సీతను భయపెడుతున్నాడు. తాను కూడా రథం ఎక్కి సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు.

సీతకు ఏం జరుగుతుందో తెలీడం లేదు. “రామా రామా” అంటూ అరుస్తూ ఉంది. పాములా మెలికలు తిరిగిపోతూ ఉంది. రావణుడి కబంధ హస్తాలనుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కాని రావణుడు తన పట్టు వీడలేదు. తన రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. సీత “రామా రామా” అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు ఆమెను గట్టి పట్టుకున్నాడు. రథం ఆకాశమార్గాన వేగంగా పోతూ ఉంది.

“రామా! నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకొని పోతున్నట్టు నీకు ఎలా తెలుస్తుంది. ఇంక నీవు నన్ను చూడలేవు కదా! నేను ఎక్కడ ఉన్నదీ నీకు ఎలా తెలుస్తుంది! రామా! నీవు దుష్టులను శిక్షిస్తావు కదా! దుర్మార్గుడైనా ఈ రాక్షసుని శిక్షించి నన్ను రక్షించవా! ఈ రాక్షసుని చెరనుండి నన్ను విడిపించవా! ఒరేయి రావణా! తప్పు చేస్తున్నావు. పాపం చేస్తున్నావు, ఈ పాపానికి ఫలితం అనుభవిస్తావు. రాముడి చేతిలో చస్తావు! అయ్యో! రామా! నా బాధ ఎవరికి చెప్పుకోను. ఆహా! ఆ కైక కోరిక ఈ నాటికి తీరినట్టుంది. నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి.

ఓ వనదేవతలారా! ఓ వృక్షములారా! ఓ పర్వత పంక్తులారా! ఈ దుర్మార్గుడు రావణుడు నన్ను అపహరించుకొని పోతున్న సంగతి నా రామునికి చెప్పండి. గలా గలా పారే ఓ గోదావరీ నదీ మాతా! నన్ను ఈ రాక్షసుడు అపహరించుకుపోతున్న సంగతి నా రామునికి తెలియజేయి! ఓ వన్య మృగములారా! ఓ పక్షులారా! నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఈ దుర్మార్గుడు తీసుకుపోతున్న సంగతి నా రామునికి చెప్పండి.

నాకు తెలుసు. నేను యమలోకంలో ఉన్నా నా రాముడు నన్ను తన బలపరాక్రమాలతో మరలా వెనక్కు తీసుకురాగలడు. మీరు నా రామునికి నా గురించి తెలియజెయ్యండి చాలు.” అని పరి పరి విధాలా ప్రకృతితో మొరబెట్టుకుంటూ ఉంది సీత,

ఇంతలో సీతకు ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న జటాయువు కనిపించాడు. “ఓ జటాయువూ! ఇటు చూడు. నేను! సీతను! ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని తీసుకొని పోతున్నాడు. ఈ విషయం రామునికి చెప్పు. వీడు రాక్షసుడు. క్రూరుడు. చేతిలో ఆయుధం ఉంది. వీడిని నువ్వు ఏమీ చేయలేవు. నన్ను కాపాడలేవు. కనీసం నా గురించి రామునికి తెలియజెయ్యి. నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకు పోతున్న సంగతి రామునికి లక్ష్మణునికి తెలియజెయ్యి.” అని బిగ్గరగా అరుస్తూ ఉంది సీత.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము. నలుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ పంచాశః సర్గః (50) >>

Leave a Comment