Aranya Kanda Sarga 6 In Telugu – అరణ్యకాండ షష్ఠః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్ఠః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివసిస్తారు. అక్కడ సుర్పణఖ తన సోదరులైన ఖర, దూషణలను రాముని మీద దాడి చేయమని ప్రేరేపిస్తుంది. ఖర, దూషణలు తమ దళాలతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా యుద్ధం చేసి, ఖర, దూషణలను వధిస్తాడు.

|| రక్షోవధప్రతిజ్ఞానమ్ ||

శరభంగే దివం యాతే మునిసంఘాః సమాగతాః |
అభ్యగచ్ఛంత కాకుత్స్థం రామం జ్వలితతేజసమ్ ||

1

వైఖానసా వాలఖిల్యాః సంప్రక్షాలా మరీచిపాః |
అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః ||

2

దంతోలూఖలినశ్చైవ తథైవోన్మజ్జకాః పరే |
గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః ||

3

మునయః సలిలాహారా వాయుభక్షాస్తథాపరే |
ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలశాయినః ||

4

వ్రతోపవాసినో దాంతాస్తథార్ద్రపటవాససః |
సజపాశ్చ తపోనిత్యాస్తథా పంచతపోఽన్వితాః ||

5

సర్వే బ్రాహ్మ్యా శ్రియా జుష్టా దృఢయోగాః సమాహితాః |
శరభంగాశ్రమే రామమభిజగ్ముశ్చ తాపసాః ||

6

అభిగమ్య చ ధర్మజ్ఞా రామం ధర్మభృతాం వరమ్ |
ఊచుః పరమధర్మజ్ఞమృషిసంఘాః సమాహితాః ||

7

త్వమిక్ష్వాకుకులస్యాస్య పృథివ్యాశ్చ మహారథ |
ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ ||

8

విశ్రుతస్త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ |
పితృభక్తిశ్చ సత్యం చ త్వయి ధర్మశ్చ పుష్కలః ||

9

త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలమ్ |
అర్థిత్వాన్నాథ వక్ష్యామస్తచ్చ నః క్షంతుమర్హసి ||

10

అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతేః |
యో హరేద్బలిషడ్భాగం న చ రక్షతి పుత్రవత్ ||

11

యుంజానః స్వానివ ప్రాణాన్ప్రాణైరిష్టాన్సుతానివ |
నిత్యయుక్తః సదా రక్షన్సర్వాన్విషయవాసినః ||

12

ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీమ్ |
బ్రహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే ||

13

యత్కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశనః |
తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజా ధర్మేణ రక్షతః ||

14

సోఽయం బ్రాహ్మణభూయిష్ఠో వానప్రస్థగణో మహాన్ |
త్వన్నాథోఽనాథవద్రామ రాక్షసైర్బాధ్యతే భృశమ్ ||

15

ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనామ్ |
హతానాం రాక్షసైర్ఘోరైర్బహూనాం బహుధా వనే ||

16

పంపానదీనివాసానామనుమందాకినీమపి |
చిత్రకూటాలయానాం చ క్రియతే కదనం మహత్ ||

17

ఏవం వయం న మృష్యామో విప్రకారం తపస్వినామ్ |
క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమకర్మభిః ||

18

తతస్త్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థితాః |
పరిపాలయ నో రామ వధ్యమానాన్నిశాచరైః ||

19

పరా త్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే |
పరిపాలయ నః సర్వాన్రాక్షసేభ్యో నృపాత్మజ ||

20

ఏతచ్ఛ్రుత్వా తు కాకుత్స్థస్తాపసానాం తపస్వినామ్ |
ఇదం ప్రోవాచ ధర్మాత్మా సర్వానేవ తపస్వినః ||

21

నైవమర్హథ మాం వక్తుమాజ్ఞప్తోఽహం తపస్వినామ్ |
కేవలేనాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనమ్ ||

22

విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామిమమ్ |
పితుస్తు నిర్దేశకరః ప్రవిష్టోఽహమిదం వనమ్ ||

23

భవతామర్థసిద్ధ్యర్థమాగతోఽహం యదృచ్ఛయా |
తస్య మేఽయం వనే వాసో భవిష్యతి మహాఫలః ||

24

తపస్వినాం రణే శత్రూన్హంతుమిచ్ఛామి రాక్షసాన్ |
పశ్యంతు వీర్యమృషయః సభ్రాతుర్మే తపోధనాః ||

25

దత్త్వాఽభయం చాపి తపోధనానాం
ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన |
తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః
సుతీక్ష్ణమేవాభిజగామ వీరః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠః సర్గః ||

Aranya Kanda Sarga 6 Meaning In Telugu

ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు, మొదలగు మహాఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గ లోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమ వంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధానధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకో దలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు.

రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని, దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇదీ రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము. తాపసులము. మేము రాజుకు పన్నురూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది.

ప్రస్తుతము మేము నివసించుచున్న ఈముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము | అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా! మాతో రా! ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము.

ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వతప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆ యా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంక ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా! ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు.” అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు.

రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు.

“ఓ మహామునులారా! మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం. బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్ణయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను.” అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు.

తరువాత రాముడు, సీతతో, లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తమః సర్గః (7) >>

Leave a Comment