Ayodhya Kanda Sarga 116 In Telugu – అయోధ్యాకాండ షోడశోత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండలోని 116వ సర్గలో, శూర్పణఖా తనతో జరిగిన అవమానాన్ని తన సోదరులైన ఖరుడు, దూషణుడు, త్రిశిరులకు తెలియజేస్తుంది. కోపంతో, వారు రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఖరుడు, దూషణుడు, త్రిశిరులు తమ సైన్యంతో కలిసి రాముడు, లక్ష్మణులపై దాడి చేస్తారు. రాముడు, లక్ష్మణుడు ధైర్యంగా పోరాడి, రాక్షస సైన్యాన్ని ఓడిస్తారు. ఈ యుద్ధంలో రాముడి ధైర్యం, శౌర్యం మరియు లక్ష్మణుడి పరాక్రమం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సీత రాముడి విజయం చూసి ఆనందిస్తుంది. ఈ సంఘటన రాముని పరాక్రమాన్ని, రాక్షసులపై అతని విజయాన్ని ప్రతిబింబిస్తుంది, తద్వారా రామాయణ కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

ఖరవిప్రకరణకథనమ్

ప్రతిప్రయాతే భరతే వసన్ రామస్తపోవనే |
లక్షయామాస సోద్వేగమథౌత్సుక్యం తపస్వినామ్ || ౧ ||

యే తత్ర చిత్రకూటస్య పురస్తాత్తాపసాశ్రమే |
రామమాశ్రిత్య నిరతాస్తానలక్షయదుత్సుకాన్ || ౨ ||

నయనైర్భుకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః |
అన్యోన్యముపజల్పంతః శనైశ్చక్రుర్మిథః కథాః || ౩ ||

తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్త్వాత్మని శంకితః |
కృతాంజలిరువాచేదమృషిం కులపతిం తతః || ౪ ||

న కచ్చిద్భగవన్ కించిత్పూర్వవృత్తమిదం మయి |
దృశ్యతే వికృతం యేన విక్రియంతే తపస్వినః || ౫ ||

ప్రమాదాచ్చరితం కచ్చిత్కించిన్నావరజస్య మే |
లక్ష్మణస్యర్షిభిర్దృష్టం నానురూపమివాత్మనః || ౬ ||

కచ్చిచ్ఛుశ్రూషమాణా వః శుశ్రూషణపరా మయి |
ప్రమదాభ్యుచితాం వృత్తిం సీతా యుక్తం న వర్తతే || ౭ ||

అథర్షిర్జరయా వృద్ధస్తపసా చ జరాం గతః |
వేపమాన ఇవోవాచ రామం భూతదయాపరమ్ || ౮ ||

కుతః కళ్యాణసత్త్వాయాః కళ్యాణాభిరతేస్తథా |
చలనం తాత వైదేహ్యాస్తపస్విషు విశేషతః || ౯ ||

త్వన్నిమిత్తమిదం తావత్తాపసాన్ ప్రతి వర్తతే |
రక్షోభ్యస్తేన సంవిగ్నాః కథయంతి మిథః కథాః || ౧౦ ||

రావణావరజః కశ్చిత్ ఖరో నామేహ రాక్షసః |
ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాననికేతనాన్ || ౧౧ ||

ధృష్టశ్చ జితకాశీ చ నృశంసః పురుషాదకః |
అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాత న మృష్యతే || ౧౨ ||

త్వం యదాప్రభృతి హ్యస్మిన్నాశ్రమే తాత వర్తసే |
తదాప్రభృతి రక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్ || ౧౩ ||

దర్శయంతి హి బీభత్సైః క్రూరైర్భీషణకైరపి |
నానారూపైర్విరూపైశ్చ రూపైర్వికృతదర్శనైః || ౧౪ ||

అప్రశస్తైరశుచిభిః సంప్రయోజ్య చ తాపసాన్ |
ప్రతిఘ్నంత్యపరాన్ క్షిప్రమనార్యాః పురతః స్థితాః || ౧౫ ||

తేషు తేష్వాశ్రమస్థానేష్వబుద్ధమవలీయ చ |
రమంతే తాపసాంస్తత్ర నాశయంతోఽల్పచేతసః || ౧౬ ||

అపక్షిపంతి స్రుగ్భాండానగ్నీన్ సించంతి వారిణా |
కలశాంశ్చ ప్రమృద్నంతి హవనే సముపస్థితే || ౧౭ ||

తైర్దురాత్మభిరామృష్టానాశ్రమాన్ ప్రజిహాసవః |
గమనాయాన్యదేశస్య చోదయంత్యృషయోఽద్యమామ్ || ౧౮ ||

తత్పురా రామ శారీరీముపహింసాం తపస్విషు |
దర్శయంతి హి దుష్టాస్తే త్యక్ష్యామ ఇమమాశ్రమమ్ || ౧౯ ||

బహుమూలఫలం చిత్రమవిదూరాదితో వనమ్ |
పురాణాశ్రమమేవాహం శ్రయిష్యే సగణః పునః || ౨౦ ||

ఖరస్త్వయ్యపి చాయుక్తం పురా తాత ప్రవర్తతే |
సహాస్మాభిరితో గచ్ఛ యది బుద్ధిః ప్రవర్తతే || ౨౧ ||

సకలత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ |
సమర్థస్యాపి వసతో వాసో దుఃఖమిహాద్య తే || ౨౨ ||

ఇత్యుక్తవంతం రామస్తం రాజపుత్రస్తపస్వినమ్ |
న శశాకోత్తరైర్వాక్యైరవరోద్ధుం సముత్సుకః || ౨౩ ||

అభినంద్య సమాపృచ్ఛ్య సమాధాయ చ రాఘవమ్ |
స జగామాశ్రమం త్యక్త్వా కులైః కులపతిః సహ || ౨౪ ||

రామః సంసాధ్య త్వృషిగణమనుగమనాత్
దేశాత్తస్మాత్ కులపతిమభివాద్య ఋషిమ్ |
సమ్యక్ప్రీతైస్తైరనుమత ఉపదిష్టార్థః
పుణ్యం వాసాయ స్వనిలయముపసంపేదే || ౨౫ ||

ఆశ్రమం త్వృషివిరహితం ప్రభుః
క్షణమపి న విజహౌ స రాఘవః |
రాఘవం హి సతతమనుగతాః
తాపసాశ్చార్షచరితధృతగుణాః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశోత్తరశతతమః సర్గః || ౧౧౬ ||

Ayodhya Kanda Sarga 116 Meaning In Telugu

భరతుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు, సీత, వనవాసము చేస్తున్నారు. రాముడు అక్కడున్న ఋషుల మొహాల్లో ఏదోభయాన్ని చూచాడు. వారు ఆందోళనగా ఉన్నట్టు గమనించాడు. వారు ఆ ప్రదేశమును వదిలి వెళ్లబోతున్నట్టు తెలుసుకున్నాడు. రాముని చూచి వారు ఏదో గుసగుసగా రహస్యంగా మాట్లాడుకోవడం చూచాడు రాముడు.

రామునికి ఏమీ కావడం లేదు. తాము అక్కడ ఉండటం వలన ఆ ఋషులకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో అని అనుమాన పడ్డాడు. ఏమైనా సరే అనుమానము నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ఋషుల కందరిలోకీ పెద్దవాడి దగ్గరకు వెళ్లాడు. ఆయనకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు.

“మహాత్మా! గత కొద్దిరోజులుగా ఇక్కడ ఉన్న ఋషుల ప్రవర్తనలో ఏదో మార్పుకనపడుతూ ఉంది. కారణం తెలియడం లేదు. మా వల్ల ఏదైనా అపరాధము జరిగిందా? నా తమ్ముడు తమరి పట్ల ప్రమాదవశాత్తు అనుచితంగా ప్రవర్తించాడా! నా భార్య సీత తమరికి కూడా సేవలు చేస్తూ ఉంది కదా. ఆమెసేవలలో ఏమైనా లోపం కనిపించిందా! మా వల్ల ఏమైనా అపరాధము జరిగితే చెప్పండి సరిదిద్దుకుంటాము.” అని అన్నాడు రాముడు. దానికి ఆ వృద్ధుడైన ఋషి ఇలాఅన్నాడు. “రామా! నీ భార్య సీత కల్యాణి. కల్యాణ స్వభావము కలది. ఆమె వల్ల లోపం ఎందుకుంటుంది. కాని ఒకవిషయం నీకు చెప్పాలి. మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా. మీమీద రాక్షసులకు వైరము ఉంది. మీకూ రాక్షసులకు ఉన్న వైరము కారణంగా మా తాపసులకు ఏమైనా అపకారము కలుగుతుందేమో అని ఈ ఋషులు భయపడుతున్నారు. దాని గురించి వారు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. నీ ఎదుట పడి చెప్పడానికి భయపడుతున్నారు.

రామా! ఇక్కడ రావణుని తమ్ముడు ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు సామాన్యుడు కాడు. అతి క్రూరుడు. నరమాంస భక్షకుడు. మహావీరుడు. వాడు జనస్థానములో తపస్సు చేసుకుంటున్న ఋషులను అందరినీ చంపాడు. వాడికి నీ మీద కోపముగ ఉందని తెలిసింది. నీవు ఇక్కడకు వచ్చి పర్ణశాల నిర్మించుకొన్నది మొదలు ఆ రాక్షసుల బాధ ఎక్కువ అయింది.

రాక్షసులు మమ్ములను నానాబాధలకు గురి చేస్తున్నారు. వారు చూడటానికే భయంకరంగా ఉండే ఆకారాలతో వచ్చి మమ్ములను బాధిస్తున్నారు. మేము చేసు కొనే హోమములలో తినకూడని పదార్థములను వేస్తున్నారు. మా ఎదుటనే ఋషులను చంపుతూ మమ్ములను భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్లు ఎక్కడుంటారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. హటాత్తుగా వస్తారు.

అందినవాడిని అందినట్టు చంపుతారు. ఆనందంతో కేరింతలు కొడతారు. హెూమగుండంలో నీళ్లు పోసి ఆర్పుతారు. మేము వాడుకొనే పాత్రలు పగుల కొడతారు. తరువాత అందకుండా పారిపోతారు.

వారి బాధలు భరించలేకుండా ఉన్నాము. ఈ చోటు విడిచి వేరేచోటికి పోదామని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు మమ్ములను శారీరకంగా హింసిస్తున్నారు. వారి బాధలు పడలేకుండా ఉన్నాము. ఇక్కడికి సమీపములోనే మరొక అరణ్యము ఉంది. అక్కడ ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. మేము తపస్సు చేసుకోడానికి అక్కడ అనువుగా ఉంటుంది. అందుచేత అక్కడకు పోదామని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంతలో నువ్వే అడిగావు. అందుకని వివరంగా చెప్పాను.

ఆ ఖరుడు మమ్ములనే కాదు నిన్ను కూడా బాధించగలడు. నీకు కూడా ప్రాణాపాయము కలుగుతుంది. అందుకని నీకు ఇష్టం అయితే నువ్వు కూడా ఈ ప్రదేశము విడిచి మా వెంట వచ్చెయ్యి. ఎందుకంటే మీ తోపాటు నీ భార్యకూడా ఉంది. ఆమెను ఎల్లప్పుడూ రక్షించుకోడం కష్టం కదా! ఎప్పుడో ఒకప్పుడు ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న సీతకు రాక్షసుల వలన ఏదో ఒక ఆపద కలుగుతుంది. అందువలన మీరు ఇక్కడ ఉండటం అంతక్షేమంకాదు. ” అన్ని గబా గబా చెప్పాడు.

తరువాత ఆ మునులందరూ ఆ ప్రదేశమును విడిచి వెళ్లడానికి ఉద్యుక్తులవు తున్నారు. రాముడు మాత్రము అక్కడ నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకని ఆ మునులందరూ రాముని అక్కడే విడిచి వెళ్లిపోయారు. రాముడు కొంతదూరము వారితో వెళ్లి వారికి వీడ్కోలు చెప్పాడు. తిరిగి తన పర్ణశాల వద్దకు వచ్చాడు. ఆరోజుదాకా ఋషులతో వారి వేదఘోషలతో మార్మోగిన ఆ ప్రదేశములో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తదశోత్తరశతతమః సర్గః (117) >>

Leave a Comment