అయోధ్యాకాండలోని 117వ సర్గలో, శూర్పణఖా తన పరాభవం గురించి రావణుని చెబుతుంది. రాముడు, లక్ష్మణుడు ఖరుడు, దూషణుడు, త్రిశిరులను హతమార్చిన విషయాన్ని వివరిస్తుంది. రావణుడు ఆ వార్తలు విని తీవ్రంగా కోపంతో రగిలిపోతాడు. అతను సీత యొక్క సౌందర్యం గురించి విన్నప్పటి నుండి, ఆమెను తన భార్యగా చేసుకోవాలని సంకల్పిస్తాడు. రావణుడు మారీచుని సహాయంతో తన కూటి తంత్రాల ప్రణాళికను సిద్ధం చేస్తాడు. మారీచుడు స్వర్ణమృగ రూపంలో సీతను మోహింపజేయడానికి ముందుకు వస్తాడు. ఈ సర్గ రామాయణంలో కీలక మలుపు, ఎందుకంటే ఇది సీతాపహరణానికి దారితీస్తుంది, తద్వారా రాముని మరియు రావణుని మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతుంది.
సీతాపాతివ్రత్యప్రశంసా
రాఘవస్త్వథ యాతేషు తపస్విషు విచింతయన్ |
న తత్రారోచయద్వాసం కారణైర్బహుభిస్తదా || ౧ ||
ఇహ మే భరతో దృష్టో మాతరశ్చ సనాగరాః |
సా చ మే స్మృతిరన్వేతి తాన్నిత్యమనుశోచతః || ౨ ||
స్కంధావారనివేశేన తేన తస్య మహాత్మనః |
హయహస్తికరీషైశ్చోపమర్దః కృతో భృశమ్ || ౩ ||
తస్మాదన్యత్ర గచ్ఛామ ఇతి సంచింత్య రాఘవః |
ప్రాతిష్ఠత స వైదేహ్యా లక్ష్మణేన చ సంగతః || ౪ ||
సోఽత్రేరాశ్రమమాసాద్య తం వవందే మహాయశాః |
తం చాపి భగవానత్రిః పుత్రవత్ ప్రత్యపద్యత || ౫ ||
స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతమ్ |
సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాంత్వయత్ || ౬ ||
పత్నీం చ సమనుప్రాప్తాం వృద్ధామామంత్ర్య సత్కృతామ్ |
సాంత్వయామాస ధర్మజ్ఞః సర్వభూతహితే రతః || ౭ ||
అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీమ్ |
ప్రతిగృహ్ణీష్వ వైదేహీమబ్రవీదృషిసత్తమః || ౮ ||
రామాయ చాచచక్షే తాం తాపసీం ధర్మచారిణీమ్ |
దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరమ్ || ౯ ||
యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తితా |
ఉగ్రేణ తపసా యుక్తా నియమైశ్చాప్యలంకృతా || ౧౦ ||
దశవర్షసహస్రాణి యయా తప్తం మహత్తపః |
అనసూయా వ్రతైః స్నాతా ప్రత్యూహాశ్చ నివర్తితాః || ౧౧ ||
దేవకార్యనిమిత్తం చ యయా సంత్వరమాణయా |
దశరాత్రం కృతా రాత్రిః సేయం మాతేవ తేఽనఘ || ౧౨ ||
తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీమ్ |
అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా || ౧౩ ||
అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగతా |
ఏవం బ్రువాణం తమృషిం తథేత్యుక్త్వా స రాఘవః || ౧౪ ||
సీతామువాచ ధర్మజ్ఞామిదం వచనముత్తమమ్ |
రాజపుత్రి శ్రుతం త్వేతన్మునేరస్య సమీరితమ్ || ౧౫ ||
శ్రేయోఽర్థమాత్మనః శ్రీఘ్రమభిగచ్ఛ తపస్వినీమ్ |
సీతా త్వేతద్వచః శ్రుత్వా రాఘవస్య హితైషిణః || ౧౬ ||
తామత్రిపత్నీం ధర్మజ్ఞామభిచక్రామ మైథిలీ |
శిథిలాం వలితాం వృద్ధాం జరాపాండరమూర్ధజామ్ || ౧౭ ||
సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీ యథా |
తాం తు సీతా మహాభాగామనసూయాం పతివ్రతామ్ || ౧౮ ||
అభ్యవాదయదవ్యగ్రా స్వనామ సముదాహరత్ |
అభివాద్య చ వైదేహీ తాపసీం తామనిందితామ్ || ౧౯ ||
బద్ధాంజలిపుటా హృష్టా పర్యపృచ్ఛదనామయమ్ |
తతః సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీమ్ || ౨౦ ||
సాంత్వయంత్యబ్రవీద్ధృష్టా దిష్ట్యా ధర్మమవేక్షసే |
త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానమృద్ధిం చ భామిని || ౨౧ ||
అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్ఛసి |
నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః || ౨౨ ||
యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః |
దుఃశీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః || ౨౩ ||
స్త్రీణామార్యస్వభావానాం పరమం దైవతం పతిః |
నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహమ్ || ౨౪ ||
సర్వత్రయోగ్యం వైదేహి తపఃకృతమివావ్యయమ్ |
న త్వేనమవగచ్ఛంతి గుణదోషమసత్ స్త్రియః || ౨౫ ||
కామవక్తవ్యహృదయా భర్తృనాథాశ్చరంతి యాః |
ప్రాప్నువంత్యయశశ్చైవ ధర్మభ్రంశం చ మైథిలి || ౨౬ ||
అకార్యవశమాపన్నాః స్త్రియో యాః ఖలు తద్విధాః |
త్వద్విధాస్తు గుణైర్యుక్తాః దృష్టలోకపరావరాః |
స్త్రియః స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా || ౨౭ ||
తదేవమేనం త్వమనువ్రతా సతీ
పతివ్రతానాం సమయానువర్తినీ |
భవస్వ భర్తుః సహధర్మచారిణీ
యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి || ౨౮ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తరశతతమః సర్గః || ౧౧౭ ||
Ayodhya Kanda Sarga 117 Meaning In Telugu
మునులందరూ వెళ్లిపోయిన తరువాత రాముడు ఆలోచనలో పడ్డాడు. మునులు చెప్పినది నిజమే అనిపించింది. ఆ ప్రదేశంలో ఉండటం క్షేమం కాదనుకున్నాడు. దానికి తోడు రామునికి పాతజ్ఞాపకాలు వెంటాడ సాగాయి. ఆ పర్ణశాలలోనే రాముడు భరతుని, శత్రుఘ్నుని, తనతల్లులను కలుసుకున్నాడు. ఇప్పుడు వారు లేకపోవడంతో మాటి మాటికీ వారే మనసులో మెదులు తున్నారు. వారి జ్ఞాపకాలతోనే మనసు నిండిపోయింది. స్థలం మారితేనే గానీ ప్రయోజనం లేదు అని అనుకున్నాడు.
దానికి తోడు భరతుడు తన సేనలతో వచ్చిఅక్కడ ఉన్నాడు. వారు అక్కడ ఉన్న కాలంలో వారు వాడేసిన వ్యర్థ పదార్థాలు, గుర్రములు, ఏనుగులు వదిలిన మలమూత్రములతో ఆ ప్రదేశం అంతా దుర్గంధం వ్యాపించింది. ఆ కారణం చేత కూడా ఆ ప్రదేశం తమ నివాసమునకు అనుకూలంగా లేదు అని అనుకున్నాడు రాముడు.
అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో, లక్ష్మణునితోకలిసి అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్లాడు. అత్రి మహాముని రాముని తన కుమారుని వలె ఆదరించాడు. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు. తినడానికి ఫలములు ఇచ్చాడు. తన భార్య వృద్ధురాలు అయిన అనసూయకు రాముని, సీతను పరిచయం చేసాడు.
“రామా! ఈమె నా భార్య అనసూయ. నా సహధర్మచారిణి. ఒకసారి పది సంవత్సరములు కరువు వచ్చి లోకము అంతా దగ్ధము అయిపోతున్న సమయంలో, జనులకు ఫలములను జలములను ఇచ్చి కాపాడింది. ఈమె గొప్ప తపస్వి. ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సార్థక నామధేయురాలు. అసూయ అంటే ఏమిటో తెలియని అనసూయ. పైగా వృద్ధురాలు. సీతకు ఆమె గురించి చెప్పి పరిచయం చెయ్యి.” అని అన్నాడు అత్రి.
రాముడు సీతతో ఇలా అన్నాడు. “సీతా! విన్నావుగా మహాఋషి మాటలు. మహాతపస్వి అనసూయా దేవిని సేవించు. నీకు శుభం కలుగుతుంది.”అనిఅన్నాడు. వెంటనే సీత అనసూయవద్దకు వెళ్లి ఆమెకు ప్రదక్షణ పూర్వకంగా నమస్కారము చేసింది. తన పేరు, తన గురించి చెప్పుకుంది. వృద్ధురాలు అనసూయ కూడా సీతను ఆలింగనము చేసుకొని ఆమెను కుశలప్రశ్నలు వేసింది.
ఇంకా ఇలా అంది. “సీతా! నీవు ధర్మమును పాటిస్తున్నావు. అందుకే ఏ మాత్రంఅహంకారము, అభిజాత్యము, కోపం లేకుండా, నీ రాజభోగములను, ఐశ్వర్యమును వదిలిపెట్టి, పతి వెంట వనవాసము నకు వచ్చావు. నీ వంటి సౌభాగ్యవతి ఎక్కడా లేదు. తన భర్త రాజుగా రాజాంతఃపురములలో ఉన్నా, లేక వనములలో కష్టాలు పడుతూ ఉన్నా, తన భర్త పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా, భర్తను విడిచిపెట్టకుండా సదా అనుసరించి ఉంటుందో ఆ భార్య ఉత్తమలోకములను పొందుతుంది. ఉత్తమ స్త్రీలకు తన భర్త ధనవంతుడైనా, దరిద్రుడైనా, గుణవంతుడైనా, దురభ్యాసాలకు అలవాటు పడినవాడైనా, అతడే దైవము. అటువంటి స్త్రీ తన భర్తమును దైవము వలె పూజిస్తుంది. స్త్రీలకు భర్తను మించిన ఆప్త బంధువు వేరొకరు లేరు అనడంలో అతిశయోక్తిలేదు. కాని కొంత మంది స్త్రీలు కోరికలకు బానిసలై, తన భర్త తాను కోరిన కోరికలు తీర్చలేదని భర్తను నిరాదరిస్తుంటారు. భర్తలమీద అధికారము చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు ధర్మభ్రంశమును పొంది అపకీర్తి పాలవుతారు. (అనసూయ కైకను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్పిందా అనిపిస్తుంది.)
కాని నీ వంటి స్త్రీలు మంచి చెడ్డలను పరిశీలించి భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమలోకములు పొందుతారు. అందుకని నీవు కూడా ఎల్లప్పుడూ నీ భర్తనే అనుసరిస్తూ, భర్త మాట జవదాటకుండా, ఉత్తమ స్త్రీగా వర్ధిల్లు. దాని వలన నీకు కీర్తి, సౌభాగ్యము సంప్రాప్తిస్తాయి.”అని పలికింది అనసూయ.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.