Ayodhya Kanda Sarga 26 In Telugu | అయోధ్యాకాండ షడ్వింశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 26 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో రాజకుటుంబంలో కొనసాగుతున్న భావోద్వేగ వాణిజ్యాలు మరియు పెరుగుతున్న విభేదాలను చూపిస్తుంది. ఈ విభాగంలో, భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి, తన ప్రియతమ అన్నయ్య రాముని వనవాసం గురించి తెలుసుకుంటాడు. తీవ్ర దుఃఖం మరియు అపరాధ భావనతో భరతుడు తన తల్లి కైకేయితో ఎదుర్కొని, ఆమె చర్యలపై తన ఆవేదన మరియు నిరాశను వ్యక్తం చేస్తాడు. ఈ అధ్యాయం కుదుళ్ళ బంధాలను మరియు ఇతిహాసాన్ని లక్షణపరచే బలమైన ధర్మబద్ధతను ఎత్తిచూపుతుంది. రాముడికి భరతుడి విశ్వాసం మరియు అతన్ని తిరిగి అయోధ్యకు తీసుకురావాలనే నిర్ణయం సోదర ప్రేమ, కర్తవ్య మరియు న్యాయం కోసం తపన అంశాలను ప్రదర్శిస్తుంది.

సీతాప్రత్యవస్థాపనమ్

అభివాద్య తు కౌసల్యాం రామః సంప్రస్థితో వనమ్ |
కృతస్వస్త్యయనో మాత్రా ధర్మిష్ఠే వర్త్మని స్థితః ||

1

విరాజయన్రాజసుతో రాజమార్గం నరైర్వృతమ్ |
హృదయాన్యామమంథేవ జనస్య గుణవత్తయా ||

2

వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్వినీ |
తదేవ హృది తస్యాశ్చ యౌవరాజ్యాభిషేచనమ్ ||

3

దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞా హృష్టచేతనా |
అభిజ్ఞా రాజధర్మానాం రాజపుత్రం ప్రతీక్షతే ||

4

ప్రవివేశాథ రామస్తు స్వ వేశ్మ సువిభూషితమ్ |
ప్రహృష్టజనసంపూర్ణం హ్రియా కించిదవాఙ్ముఖః ||

5

అథ సీతా సముత్పత్య వేపమానా చ తం పతిమ్ |
అపశ్యచ్ఛోకసంతప్తం చింతావ్యాకులితేంద్రియమ్ ||

6

తాం దృష్ట్వా స హి ధర్మాత్మా న శశాక మనోగతమ్ |
తం శోకం రాఘవః సోఢుం తతో వివృతతాం గతః ||

7

వివర్ణవదనం దృష్ట్వా తం ప్రస్విన్నమమర్షణమ్ |
ఆహ దుఃఖాభిసంతప్తా కిమిదానీమిదం ప్రభో ||

8

అద్య బార్హస్పతః శ్రీమానుక్తః పుష్యో ను రాఘవ |
ప్రోచ్యతే బ్రాహ్మణైః ప్రాజ్ఞైః కేన త్వమసి దుర్మనాః ||

9

న తే శతశలాకేన జలఫేననిభేన చ |
ఆవృతం వదనం వల్గు ఛత్రేణాభివిరాజతే ||

10

వ్యజనాభ్యాం చ ముఖ్యాభ్యాం శతపత్రనిభేక్షణమ్ |
చంద్రహంసప్రకాశాభ్యాం వీజ్యతే న తవాననమ్ ||

11

వాగ్మినో వందినశ్చాపి ప్రహృష్టాస్త్వం నరర్షభ |
స్తువంతో నాత్ర దృశ్యంతే మంగలైః సూతమాగధాః ||

12

న తే క్షౌద్రం చ దధి చ బ్రాహ్మణా వేద పారగాః |
మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య దధతి స్మ విధానతః ||

13

న త్వాం ప్రకృతయః సర్వాః శ్రేణీముఖ్యాశ్చ భూషితాః |
అనువ్రజితుమిచ్చంతి పౌరజాపపదాస్తథా ||

14

చతుర్భిర్వేగసంపన్నైర్హయైః కాంచనభూషణైః |
ముఖ్యః పుష్యరథో యుక్తః కిం న గచ్ఛతి తేఽగ్రతః ||

15

న హస్తీ చాగ్రతః శ్రీమాంస్తవ లక్షణపూజితః |
ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణమేఘగిరిప్రభః ||

16

న చ కాంచనచిత్రం తే పశ్యామి ప్రియదర్శన |
భద్రాసనం పురస్కృత్య యాతం వీరపురస్కృతమ్ ||

17

అభిషేకో యదా సజ్జః కిమిదానీమిదం తవ |
అపూర్వో ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే ||

18

ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందనః |
సీతే తత్రభవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనమ్ ||

19

కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి |
శృణు జానకి యేనేదం క్రమేణాభ్యాగతం మమ ||

20

రాజ్ఞా సత్యప్రతిజ్ఞేన పిత్రా దశరథేన మే |
కైకేయ్యై మమ మాత్రే తు పురా దత్తో మహావరౌ ||

21

తయాఽద్య మమ సజ్జేఽస్మిన్నభిషేకే నృపోద్యతే |
ప్రచోదితః ససమయో ధర్మేణ ప్రతినిర్జితః ||

22

చతుర్దశ హి వర్షాణి వస్తవ్యం దండకే మయా |
పిత్రా మే భరతశ్చాపి యౌవరాజ్యే నియోజితః ||

23

సోఽహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనమ్ |
భరతస్య సమీపే తే నాహం కథ్యః కదాచన ||

24

ఋద్ధియుక్తా హి పురుషా న సహంతే పరస్తవమ్ |
తస్మాన్న తే గుణాః కథ్యా భరతస్యాగ్రతో మమ ||

25

నాపి త్వం తేన భర్తవ్యా విశేషేణ కదాచన |
అనుకూలతయా శక్యం సమీపే తస్య వర్తితుమ్ ||

26

తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనమ్ |
స ప్రసాద్యస్త్వయా సీతే నృపతిశ్చ విశేషతః ||

27

అహం చాపి ప్రతిజ్ఞాం తాం గురోః సమనుపాలయన్ |
వనమద్యైవ యాస్యామి స్థిరా భవ మనస్వినీ ||

28

యాతే చ మయి కల్యాణి వనం మునినిషేవితమ్ |
వ్రతోపవాసపరయా భవితవ్యం త్వయానఘే ||

29

కాల్యముత్థాయ దేవానాం కృత్వా పూజాం యథావిధి |
వందితవ్యో దశరథః పితా మమ నరేశ్వరః ||

30

మాతా చ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్శితా |
ధర్మమేవాగ్రతః కృత్వా త్వత్తః సమ్మానమర్హతి ||

31

వందితవ్యాశ్చ తే నిత్యం యాః శేషా మమ మాతరః |
స్నేహప్రణయసంభోగైః సమా హి మమ మాతరః ||

32

భ్రాతృపుత్రసమౌ చాపి ద్రష్టవ్యౌ చ విశేషతః |
త్వయా భరతశత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ ||

33

విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన |
స హి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ ||

34

ఆరాధితా హి శీలేన ప్రయత్నైశ్చోపసేవితాః |
రాజానః సంప్రసీదంతి ప్రకుప్యంతి విపర్యయే ||

35

ఔరసానపి పుత్రాన్హి త్యజంత్యహితకారిణః |
సమర్థాన్సంప్రగృహ్ణంతి పరానపి నరాధిపాః ||

36

సా త్వం వసేహ కల్యాణి రాజ్ఞః సమనువర్తినీ |
భరతస్య రతా ధర్మే సత్యవ్రతపరాయణా ||

37

అహం గమిష్యామి మహావనం ప్రియే
త్వయా హి వస్తవ్యమిహైవ భామిని |
యథా వ్యలీకం కురుషే న కస్యచి-
-త్తథా త్వయా కార్యమిదం వచో మమ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 26 Meaning In Telugu

తల్లి కౌసల్య నుండి ఆశీర్వాదములు పొందిన రాముడు అక్కడనుండి బయలు దేరాడు. ఇంక వనవాసమునకు వెళ్లడానికి మనస్సును సిద్ధం చేసుకుంటున్నాడు. కౌసల్య మందిరమునుండి బయటకు వచ్చాడు.

రాత్రి అంతా ఉపవాసము చేసి జాగరణ చేసిన సీత ఉదయము రాముని రాకకై ఎదురు చూస్తూ ఉంది. “పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది. కాని రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమయి ఉంటుంది” అని తనలో తాను తర్కించుకుంటూ
ఉంది.

ఇంతలో రాముడు సీత ఉన్న మందిరములోకి ప్రవేశించాడు. రాముని ముఖంలో కనపడుతున్న బాధను, వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచి పెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేకపోయాడు.

రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూచి సీత “ప్రభూ! ఏమి జరిగింది. ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు. ఈరోజు పుష్యమీ నక్షత్రము. తమరి పట్టాభిషేకము జరుగురోజు. వసిష్ఠుల వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా! ఆనందము గా ఉండక ఎందుకు మీరు బాధతో విలవిలలాడిపోతున్నారు.

ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమింప బడ్డ వంది మాగధులు కనపడటం లేదు. ఏమి కారణము? ఇంకనూ పట్టాభి షేకము జరగలేదా! తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా!

తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు. తమరు కాలి నడకన వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథము ఏమయినది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవ వలసిన మదగజము కనపడటం లేదు. అసలు తమరి ముఖంలో పట్టాభిషేకము చేసుకొనబోవు రాకుమారుడి సంతోషము ఆనందము కనబడటం లేదు. కారణమేమి?” అని పరి పరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత.

దానికిరాముడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా తండ్రి నన్ను అరణ్యవాసమునకు వెళ్లమన్నాడు. నీకు ధర్మములు అన్నీ తెలుసు కదా! ఈ విపరీత పరిణామము ఎందు వల్ల సంభవించినదో వివరంగా
చెబుతాను విను. నా తండ్రి దశరథమహారాజు నిత్యసత్యవ్రతుడు. ఎన్నడూ ఆడిన మాట తప్పడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము రెండువరములు ఇచ్చాడట.

నా పట్టాభిషేక వార్త విన్న కైక, నా తండ్రిని ఆ రెండు వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. రెండవ వరము–నాకు మారుగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను.

నేను లేని సమయములో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి గానీ, నా గుణగణములు గురించి గానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడటం సహించలేరు. ఇంకొకమాట. నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు.

నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంత కాలమే నీవు ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉనా తండ్రి దశరథుడు వంశపారంపర్యముగా జ్యేష్టునికి చెందవలసిన రాజ్యమును, భరతునికి ఇచ్చాడు. కాబట్టి నీవు నీమామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.

నేను వనవాసము వెళు తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయములో నీవు వ్రతములు, ఉపవాసవ్రతములు చేస్తూ ఉండు. నీవు పొద్దుటే లేచి, పూజాదికములు అయిన తరువాత, నా తండ్రి దశరథునికి నమస్కరించడం మరిచిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు, వృద్ధురాలు అయిన కౌసల్య నేను అడవులకు వెళుతున్నాను. అని కృంగి, కృశించి పోవుచున్నది. ఆమె యోగక్షేమములు చూడటం నీ ధర్మము. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతేకాదు. నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారి నందరినీ గౌరవించు.

నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్రసమానులు. వారిని తగురీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాకుకులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించేవారిని ఆదరిస్తారు. లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుని నువ్వు ఒక రాజుగా ఆదరించు.

నీ ధర్మమును నువ్వు నిర్వర్తించు. ఈ పదునాలుగు సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నాను అని మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్వత్.

అయోధ్యాకాండ సప్తవింశః సర్గః (27) >>

Leave a Comment