అయోధ్యా కాండ సర్గ 25 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్లిష్టతలను ముందుకు తీసుకువస్తుంది. ఈ విభాగంలో, తన కుమారుడి వనవాసాన్ని ఒప్పుకోవడానికి దశరథ మహారాజు అనుభవిస్తున్న కష్టాన్ని మనం చూస్తాము. రాముని విడిపోవడం వల్ల అయోధ్య ప్రజలు అనుభవిస్తున్న గాఢమైన దుఃఖాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ ఇతిహాస భాగం రాముని వనవాసం అతని కుటుంబం మరియు రాజ్యం మీద పడిన ప్రగాఢ ప్రభావాన్ని ఎత్తిచూపుతూ, విశ్వాసం, ప్రేమ మరియు ధర్మం (నైతిక కర్తవ్యము) కోరుకునే బాధాకరమైన త్యాగాల అంశాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. రాముని తిరుగు ప్రయాణానికి ముంగిలి సిద్ధం చేస్తుంది.
మాతృస్వస్త్యయనమ్
సాఽపనీయ తమాయాసముపస్పృశ్య జలం శుచిః |
చకార మాతా రామస్య మంగలాని మనస్వినీ ||
1
న శక్యసే వారయితుం గచ్ఛేదానీం రఘూత్తమ |
శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాంక్రమే ||
2
యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ |
స వై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు ||
3
యేభ్యః ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ |
తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః ||
4
యాని దత్తాని తేఽస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా |
తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా ||
5
పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా |
సత్యేన చ మహాబాహో చిరం జీవాభిరక్షితః ||
6
సమిత్కుశపవిత్రాణి వేద్యశ్చాయతనాని చ |
స్థండిలాని విచిత్రాణి శైలా వృక్షాః క్షుపా హ్రదాః ||
7
పతంగాః పన్నగాః సింహాస్త్వాం రక్షంతు నరోత్తమ |
స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయః ||
8
స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగోఽర్యమా |
లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథా ||
9
ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః |
దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా ||
10
స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః |
స్కందశ్చ భగవాన్దేవః సోమశ్చ సబృహస్పతిః ||
11
సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః |
యే చాపి సర్వతః సిద్ధా దిశశ్చ సదిగీశ్వరాః ||
12
స్తుతా మయా వనే తస్మిన్పాంతు త్వాం పుత్ర నిత్యశః |
శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ ||
13
ద్యౌరంతరిక్షం పృథివీ నద్యః సర్వాస్తథైవ చ |
నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహదేవతాః ||
14
అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితమ్ |
ఋతవశ్చైవ షట్ పుణ్యా మాసాః సంవత్సరాస్తథా ||
15
కలాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే |
మహావనే విచరతో మునివేషస్య ధీమతః ||
16
తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా |
రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణామ్ ||
17
క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్పుత్రక తే భయమ్ |
ప్లవగా వృశ్చికా దంశా మశకాశ్చైవ కాననే ||
18
సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్గహనే తవ |
మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రా ఋక్షాశ్చ దంష్ట్రిణః ||
19
మహిషాః శృంగిణో రౌద్రా న తే ద్రుహ్యంతు పుత్రక |
నృమాంసభోజినో రౌద్రా యే చాన్యే సత్త్వజాతయః ||
20
మా చ త్వాం హింసిషుః పుత్ర మయా సంపూజితాస్త్విహ |
ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః ||
21
సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్గచ్ఛ పుత్రక |
స్వస్తి తేఽస్త్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః ||
22
సర్వేభ్యశ్చైవ దేవేభ్యో యే చ తే పరిపంథినః |
శుక్రః సోమశ్చ సూర్యశ్చ ధనదోఽథ యమస్తథా || [గురుః]
23
పాంతు త్వామర్చితా రామ దండకారణ్యవాసినమ్ |
అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షిముఖాచ్చ్యుతాః ||
24
ఉపస్పర్శనకాలే తు పాంతు త్వాం రఘునందన |
సర్వలోకప్రభుర్బ్రహ్మా భూతభర్తా తథర్షయః ||
25
యే చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినమ్ |
ఇతి మాల్యైః సురగణాన్గంధైశ్చాపి యశస్వినీ ||
26
స్తుతిభిశ్చానురూపాభిరానర్చాయతలోచనా | [అనుకూలాభిః]
జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా ||
27
హావయామాస విధినా రామమంగలకారణాత్ |
ఘృతం శ్వేతాని మాల్యాని సమిధః శ్వేతసర్షపాన్ ||
28
ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా |
ఉపాధ్యాయః స విధినా హుత్వా శాంతిమనామయమ్ ||
29
హుతహవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్ |
మధుదధ్యక్షతఘృతైః స్వస్తివాచ్య ద్విజాంస్తతః ||
30
వాచయామాస రామస్య వనే స్వస్త్యయనక్రియాః |
తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్వినీ ||
31
దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్ |
యన్మంగలం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే ||
32
వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగలమ్ |
యన్మంగలం సుపర్ణస్య వినతాఽకల్పయత్పురా ||
33
అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగలమ్ |
అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ ||
34
అదితిర్మంగలం ప్రాదాత్తత్తే భవతు మంగలమ్ |
త్రీన్విక్రమాన్ప్రక్రమతో విష్ణోరమితతేజసః ||
35
యదాసీన్మంగలం రామ తత్తే భవతు మంగలమ్ |
ఋతవః సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే ||
36
మంగలాని మహాబాహో దిశంతు శుభమంగలాః |
ఇతి పుత్రస్య శేషాంశ్చ కృత్వా శిరసి భామినీ ||
37
గంధైశ్చాపి సమాలభ్య రామమాయతలోచనా |
ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభామ్ ||
38
చకార రక్షాం కౌసల్యా మంత్రైరభిజజాప చ |
ఉవాచాతిప్రహృష్టేవ సా దుఃఖవశవర్తినీ ||
39
వాఙ్మాత్రేణ న భావేన వాచా సంసజ్జమానయా |
ఆనమ్య మూర్ధ్ని చాఘ్రాయ పరిష్వజ్య యశస్వినీ ||
40
అవదత్పుత్ర సిద్ధార్థో గచ్ఛ రామ యథాసుఖమ్ |
అరోగం సర్వసిద్ధార్థమయోధ్యాం పునరాగతమ్ ||
41
పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థితం రాజవర్త్మని |
ప్రనష్టదుఃఖసంకల్పా హర్షవిద్యోతితాననా ||
42
ద్రక్ష్యామి త్వాం వనాత్ప్రాప్తం పూర్ణచంద్రమివోదితమ్ |
భద్రాసనగతం రామ వనవాసాదిహాగతమ్ || [భద్రం]
43
ద్రక్ష్యామి చ పునస్త్వాం తు తీర్ణవంతం పితుర్వచః |
మంగలైరుపసంపన్నో వనవాసాదిహాగతః |
వధ్వా మమ చ నిత్యం త్వం కామాన్ సంవర్ధ యాహి భో ||
44
మయార్చితా దేవగణాః శివాదయో
మహర్షయో భూతమహాసురోరగాః |
అభిప్రయాతస్య వనం చిరాయ తే
హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ ||
45
ఇతీవ చాశ్రుప్రతిపూర్ణలోచనా
సమాప్య చ స్వస్త్యయనం యథావిధి |
ప్రదక్షిణం చైవ చకార రాఘవం
పునః పునశ్చాపి నిపీడ్య సస్వజే ||
46
తథా తు దేవ్యా స కృతప్రదక్షిణో
నిపీడ్య మాతుశ్చరణౌ పునః పునః |
జగామ సీతానిలయం మహాయశాః
స రాఘవః ప్రజ్వలితః స్వయా శ్రియా ||
47
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః ||
Ayodhya Kanda Sarga 25 Meaning In Telugu
మనసు దిటవు పరచుకొన్న కౌసల్య, కళ్లు తుడుచుకొని, ముఖం కడుక్కొని, పాదప్రక్షాళనముచేసుకొని ఆచమనము చేసి, రామునికి మంగళకరమైన పనులు చేయుటకు ఉపక్రమించింది. “రామా! నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపుటకు సర్వవిధాలా ప్రయత్నించాను. కాని నీ పట్టు విడవకున్నావు.
నాయనా రామా! ధర్మం తప్పకుండా, మంచి మార్గములో నడుస్తూ, వనవాసము పూర్తి చేసుకొని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో! నీకు సదా శుభంగుతుంది. రామా! నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యములకు వెళు తున్నావో, ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండును గాక!. రామా! నీవు దేవాలయములకు వెళ్లి సమస్త దేవతలకు ప్రణామం చెయ్యి. ఆ దేవతలే నిన్ను సదా కాపాడుదురు గాక!
నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు, శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక! రామా! నీవు నమ్ముకున్న సత్యము, నీవు ఇప్పటి వరకూ చేసిన మాతృ సేవ, పితృ సేవ నిన్ను రక్షించును గాక! ఓ రామా! మంగళ కరములైన సమిధలు, దర్భలు, అగ్నిహోత్రము, దైవ
సన్నిది నిన్ను అనునిత్యమూ రక్షించు గాక! ఈ ప్రకృతి లోని వృక్షములు, నదులు, పక్షులు, క్రూరమృగములు, సరీసృపములు నీకు ఎలాంటి హానీ చెయ్యకుండా, నిన్ను సదా కాపాడుగాక! ఓ రామా! సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విశ్వేదేవతలు, మరుత్తులు, మహర్షులు, బ్రహ్మదేవుడు, విధి, సూర్యుడు, దేవేంద్రుడు, లోకపాలకులు నీకు సదా మేలు చేయుదురు గాక!
ఓ రామా! నీకు కాలము, ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రింబగళ్లు, సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక! ఓ రామా! స్మృతులు, శ్రుతులు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు, చంద్రుడు, కుమారస్వామి నిన్ను దయతో కాపాడుడుదురు గాక!
నీ అరణ్యవాస కాలములో దిక్కులు నిన్ను సదా కాపాడుగాక! అరణ్యములలో ఉన్న పర్వతములు, కొండలు, గుహలు, భూమి, ఆకాశము, స్వర్గము, నక్షత్రములు, గృహములు, వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింబగళ్లు, రెండు సంధ్యవేళల్లో కాపాడుదురు గాక ! నీవు అరణ్యములలో ఉన్న ప్రతిదినము, మాసము, సంవత్సరము, నీకు సదా సుఖము నిచ్చు గాక! నీ అరణ్య వాస కాలములో సమస్త దేవతలు, దైత్యులు, నిన్ను కాపాడుదురు గాక!
నీ వనవాస కాలములో నీకు రాక్షసుల నుండి, రుద్రులు, పిశాచముల నుండి క్రూరమృగముల నుండి నీకు భయము లేకుండు గాక! అరణ్యములో ఉన్న కోతులు, తేళ్లు, పాములు, ఇతర కీటకములు, అలాగే సింహములు, పులులు, ఏనుగులు ఇతర
మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండు గాక!
ఆకాశంలోనూ, భూమి మీదా ఉందే సమస్త దేవతలు నీకు శుభం కలిగించు గాక! నీకు శత్రుభయం లేకుండు గాక! రామా! అనునిత్యము నేను పూజించే విష్ణువు, మహేశ్వరుడు, పంచ భూతములు, నవగ్రహములు, నా పూజలకు సంతసించి నిన్ను సదా రక్షింతురు గాక!” అని కౌసల్య సమస్త దేవతల రక్షలను రామునికి అందించింది.
సమస్త దేవతలకు పూజలు చేసింది. బ్రాహ్మణుల చేత హెూమములు చేయించింది. మంగళాచరణము చేయించింది. హోమము చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దక్షిణలు ఇచ్చింది. కౌసల్యకు ఇంకా తృప్తి కలగ లేదు. తాను స్వయంగా మంగళా చరణము చేయసాగింది.
“ఓ రామా! వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రునికి కలిగిన మంగళము నీకు కలుగుగాక! పూర్వము అమృతము తీసుకు రావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినత చేసిన మంగళాశాసనము నీకు కలుగుగాక! వామనావతారములో విష్ణువు మూడు అడుగులు కొలిచినప్పుడు విష్ణువునకు కలిగిన మంగళము నీకు కలుగు గాక!”
అని రాముని తలమీద అక్షతలు వేసి ఆశీర్వదించింది కౌసల్య విశల్యకరణి అనే ఓషధిని రామునికి రక్షగా కట్టింది. కౌసల్య ఇవన్నీ చేస్తూ ఉంది కానీ లోపల దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. బలవంతాన అణుచుకుంటూ ఉంది.
“రామా! నీవు వనవాసకాలమును అతి త్వరగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చి రాజ్యాధికారమును చేపట్టు. నన్ను, నీ భార్య సీతను సంతోషపెట్టు. రామా! శుభంగా వెళ్లిరా. నేను నిత్యమూ పూజించే శివుడు, విష్ణువు, మహర్షులు, సమస్త దేవతలు
నిన్ను సదా రక్షించుదురు గాక!
“అని కళ్ల నిండా నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది. రాముడు కూడా తల్లి కౌసల్యకు భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి, ఆమె దగ్గర సెలవు తీసుకొని సీత ఉన్న మందిరమునకు వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్