అయోధ్యాకాండంలోని షట్త్రింశః సర్గంలో, దశరథుడు రాముడిని అరణ్యవాసానికి పంపిన తరువాత తపిస్తున్నాడు. ఆయన దుఃఖముతో ఆవేశపడతాడు మరియు కౌసల్య, సుమిత్రలు అతని బాధను తీర్చడానికి ప్రయత్నిస్తారు. దశరథుడు తన అజ్ఞానంలో చేసిన తప్పిదాలను గుర్తు చేసుకుంటాడు. గతంలో చేసిన ఒక పెద్ద పాపం కారణంగా అతను ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని భావిస్తాడు. చివరికి దశరథుడు, రాముడిని తలచుకుంటూ, మరణం పొందుతాడు. రాజమహలంలో ఉన్న అందరికి ఈ వార్త తెలుసుకుని, వారు శోకసముద్రంలో మునిగిపోతారు. ఈ సర్గ రామాయణంలోని భావోద్వేగభరితమైన భాగాలను చూపిస్తుంది.
సిద్ధార్థప్రతిబోధనమ్
తతః సుమంత్రమైక్ష్వాకః పీడితోఽత్ర ప్రతిజ్ఞయా |
సబాష్పమతినిశ్వస్య జగాదేదం పునః పునః || ౧ ||
సూత రత్నసుసంపూర్ణా చతుర్విధబలా చమూః |
రాఘవస్యానుయాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయతామ్ || ౨ ||
రూపాజీవాశ్చ వాదిన్యో వణిజశ్చ మహాధనాః |
శోభయంతు కుమారస్య వాహినీం సుప్రసారితాః || ౩ ||
యే చైనముపజీవంతి రమతే యైశ్చ వీర్యతః |
తేషాం బహువిధం దత్త్వా తానప్యత్ర నియోజయ || ౪ ||
ఆయుధాని చ ముఖ్యాని నాగరాః శకటాని చ |
అనుగచ్ఛంతు కాకుత్థ్సం వ్యాధాశ్చారణ్యగోచరాః || ౫ ||
నిఘ్నన్మృగాన్కుఞ్జరాంశ్చ పిబంశ్చారణ్యకం మధు |
నదీశ్చ వివిధాః పశ్యన్న రాజ్యస్య స్మరిష్యతి || ౬ ||
ధాన్యకోశశ్చ యః కశ్చిద్ధనకోశశ్చ మామకః |
తౌ రామమనుగచ్ఛేతాం వసంతం నిర్జనే వనే || ౭ ||
యజన్పుణ్యేషు దేశేషు విసృజంశ్చాప్తదక్షిణాః |
ఋషిభిశ్చ సమాగమ్య ప్రవత్స్యతి సుఖం వనే || ౮ ||
భరతశ్చ మహాబాహుః అయోధ్యాం పాలయిష్యతి |
సర్వకామైః పునః శ్రీమాన్రామః సంసాధ్యతామితి || ౯ || [సహ]
ఏవం బ్రువతి కాకుత్స్థే కైకేయ్యా భయమాగతమ్ |
ముఖం చాప్యగమచ్ఛోషం స్వరశ్చాపి న్యరుధ్యత || ౧౦ ||
సా విషణ్ణా చ సంత్రస్తా ముఖేన పరిశుష్యతా |
రాజానమేవాభిముఖీ కైకేయీ వాక్యమబ్రవీత్ || ౧౧ ||
రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ |
నిరాస్వాద్యతమం శూన్యం భరతో నాభిపత్స్యతే || ౧౨ ||
కైకేయ్యాం ముక్తలజ్జాయాం వదంత్యామతిదారుణమ్ |
రాజా దశరథో వాక్యమువాచాయతలోచనామ్ || ౧౩ ||
వహంతం కిం తుదసి మాం నియుజ్య ధురి మాఽహితే |
అనార్యే కృత్యమారబ్ధం కిం న పూర్వముపారుధః || ౧౪ ||
తస్యైతత్క్రోధసంయుక్తంముక్తం శ్రుత్వా వరాంగనా |
కైకేయీ ద్విగుణం క్రుద్ధా రాజానమిదమబ్రవీత్ || ౧౫ ||
తవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధత్ |
అసమంజ ఇతి ఖ్యాతం తథాఽయం గంతుమర్హతి || ౧౬ ||
ఏవముక్తోధిగిత్యేవ రాజా దశరథోఽబ్రవీత్ |
వ్రీడితశ్చ జనః సర్వః సా చ తం నావబుధ్యత || ౧౭ ||
తత్ర వృద్ధో మహామాత్రః సిద్ధార్థో నామ నామతః |
శుచిర్బహుమతో రాజ్ఞః కైకేయీమిదమబ్రవీత్ || ౧౮ ||
అసమంజో గృహీత్వా తు క్రీడితః పథి దారకాన్ |
సరయ్వాః ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతిః || ౧౯ ||
తం దృష్ట్వా నాగరాః సర్వే క్రుద్ధా రాజానమబ్రువన్ |
అసమంజం వృణీష్వైకమస్మాన్వా రాష్ట్రవర్ధన || ౨౦ ||
తానువాచ తతో రాజా కిం నిమిత్తమిదం భయమ్ |
తాశ్చాపి రాజ్ఞా సంపృష్టా వాక్యం ప్రకృతయోఽబ్రువన్ || ౨౧ ||
క్రీడతస్త్వేష నః పుత్రాన్బాలానుద్భ్రాంతచేతనః |
సరయ్వాం ప్రక్షిపన్మౌర్ఖ్యాదతులాం ప్రీతిమశ్నుతే || ౨౨ ||
స తాసాం వచనం శ్రుత్వా ప్రకృతీనాం నరాధిపః |
తం తత్యాజాహితం పుత్రం తేషాం ప్రియచికీర్షయా || ౨౩ || [తాసాం]
తం యానం శీఘ్రమారోప్య సభార్యం సపరిచ్ఛదమ్ |
యావజ్జీవం వివాస్యోఽయమితి స్వానన్వశాత్పితా || ౨౪ ||
స ఫాలపిటకం గృహ్య గిరిదుర్గాణ్యలోలయత్ |
దిశః సర్వాస్త్వనుచరన్స యథా పాపకర్మకృత్ || ౨౫ ||
ఇత్యేవమత్యజద్రాజా సగరో వై సుధార్మికః |
రామః కిమకరోత్పాపం యేనైవముపరుధ్యతే || ౨౬ ||
న హి కంచన పశ్యామో రాఘవస్యాగుణం వయమ్ |
దుర్లభో హ్యస్య నిరయః శశాంకస్యేవ కల్మషమ్ || ౨౭ ||
అథవా దేవి దోషం త్వం కంచిత్పశ్యసి రాఘవే |
తమద్య బ్రూహి తత్వేన తతో రామో వివాస్యతామ్ || ౨౮ ||
అదుష్టస్య హి సంత్యాగః సత్పథే నిరతస్య చ |
నిర్దహేదపి శక్రస్య ద్యుతిం ధర్మనిరోధనాత్ || ౨౯ ||
తదలం దేవి రామస్య శ్రియా విహతయా త్వయా |
లోకతోఽపి హి తే రక్ష్యః పరివాదః శుభాననే || ౩౦ ||
శ్రుత్వా తు సిద్ధార్థవచో రాజా శ్రాంతతరస్వనః |
శోకోపహతయా వాచా కైకేయీమిదమబ్రవీత్ || ౩౧ ||
ఏతద్వచో నేచ్ఛసి పాపవృత్తే
హితం న జానాసి మమాత్మనో వా |
ఆస్థాయ మార్గం కృపణం కుచేష్టా
చేష్టా హి తే సాధుపథాదపేతా || ౩౨ ||
అనువ్రజిష్యామ్యహమద్య రామం
రాజ్యం పరిత్యజ్య ధనం సుఖం చ |
సహైవ రాజ్ఞా భరతేన చ త్వం
యథా సుఖం భుంక్ష్వ చిరాయ రాజ్యమ్ || ౩౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్త్రింశః సర్గః || ౩౬ ||
Ayodhya Kanda Sarga 36 Meaning In Telugu
సుమంత్రుడి మాటలు, కైక మొండి పట్టు చూస్తున్నాడు. దశరథుడు. సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ సుమంత్రా! ఈ మూర్ఖురాలు ఎంత చెప్పినా వినదు. కాబట్టి రాముని అరణ్యవాసమునకు ఏర్పాట్లు చెయ్యి. రామునికి రథము ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వెళ్లుటకు చతురంగ బలములతో సైన్యమును ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వాద్య విశేషములను, నర్తకులను, వేశ్యలను పంపించు. రామునికి ఎవ్వరైతే ఇష్టమో వారిని ఎంత ధనమైనా ఇచ్చి రాముని వెంట అరణ్యములకు పంపు. రాముని వెంట అనేక రకములైన ఆయుధములను, బండ్లమీద పంపు. రామునికి వేటలో సాయం చెయ్యడానికి వ్యాధులను (బోయవారిని) పంపు. రామునికి అవసరమైన ధనమును ధాన్యములను సమృద్ధిగా పంపించు. రాముడు అరణ్యములలో కూడా యాగములు యజ్ఞములు చేస్తూ, ఋషులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తూ, సుఖంగా ఉండాలి. ఇక్కడ భరతుడు రాజ్యము చేస్తూ ఎలాంటి సుఖములు అనుభవిస్తాడో, అన్ని సుఖములను రాముడు అరణ్యములలో అనుభవిస్తాడు. …”అని చెబుతున్నాడు దశరథుడు.
ఇవన్నీ విన్న కైకకు భయం పట్టుకొంది. ఇవన్నీ ఉంటే రాముడు అడవులలో ఉన్నా ఒకటే అయోధ్యలో ఉన్నా ఒకటే అనుకొంది. దశరథుని చూచిఇలా అంది. “ఓ మహారాజా! సైనికులు, బ్రాహ్మణులు, జానపదులు అందరూ వెళ్లిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు తాగుబోతులు, దుండగులు తప్ప. ఇలాంటిరాజ్యము భరతునికి అక్కరలేదు. అంతా తిన్న తరువాత మిగిలిన ఎంగిలి మెతుకుల్లాంటి ఈ రాజ్యము భరతునికి ఎందుకు? ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం?” అనిసూటిగా అడిగింది.
దానికి దశరథుడు కోపంతో ఇలా అన్నాడు. ” ఓ కైకా! నువ్వునాకు భార్యవు కావు. శత్రువు. నన్ను బండికి కట్టి లాగమంటున్నావు. అదీ కాకుండా కర్రతో పొడుస్తావా. రామునికి ఎలాంటి సౌకర్యాలు ఉండకూడదు అని మొదటే చెప్పవచ్చు కదా. నన్ను అన్నీ చెప్పనిచ్చి ఇప్పుడు కాదు అంటావా దుర్మార్గురాలా!” అని కోపంతో అన్నాడు దశరథుడు.
అంతే కోపంతో కైక దశరథునికి బదులు చెప్పింది. ” ఓ రాజా! తమరి వంశంలో సగరుడు తన పెద్దకొడుకు అసమంజుని రాజ్యం ఇవ్వకుండా వెళ్లగొట్టాడు. రాముడు కూడా అలా కట్టుబట్టలతో వెళ్లాలి.”అని ఖచ్చితంగా పలికింది కైక. ఉంది. ఆసమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే దశరథుని మంత్రి ఇలా అన్నాడు.
“కైకకు అసలు విషయం తెలియనట్టు ఉంది. సగరుడి పెద్దకొడుకు అసమంజుడు దుర్మార్గుడు. ఆడుకొనే పిల్లలను పట్టుకొని సరయూ నదిలో విసిరేసేవాడు. వాళ్లు గిలా గిలా కొట్టుకుంటుంటే చూచి ఆనందించేవాడు. అప్పుడు పౌరులందరూ సగరుని చూచి “ఓ రాజా! మీకు దుర్మార్గుడైన కుమారుడు అసమంజుడు కావాలా లేక అయోధ్య కావాలా తేల్చుకోండి” అని అన్నారు. సగరుడకి ఏమీ అర్థం కాలేదు. ” ఎందుకు అలా అడుగుతున్నారు?” అని అడిగాడు. అప్పుడు ప్రజలు ఇలా చెప్పారు. ” ఓ రాజా! నీ కుమారుడు అసమంజుడు బుద్ధిలేనివాడు, మూర్ఖుడు. క్రూరుడైన మీ కుమారుడు మా పిల్లలను సరయూనదిలోకి విసిరేసి ఆనందిస్తున్నాడు. అందుకని అలా అన్నాము అని అన్నారు పౌరులు. వెంటనే సగరుడు తనపెద్దకుమారుడు అసమంజుని, అతని భార్యను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు.
కాబట్టి, దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడు అయిన అసమంజునికి రామునికి పోలికా. రాముడు ఏం తప్పు చేసాడని ఆయనను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్లగొడు తున్నారు. చంద్రునిలో ఏ దోషమూ లేనట్టు రామునిలో మాకు గానీ, అయోధ్యా పౌరులకు కానీ ఏదోషమూ కనపడటం లేదు. ధర్మాత్ముడైన రామునిలో ఏ దోషమూ ఉండటానికి అవకాశము లేదు. పోనీ మీ కళ్లకు రామునిలో ఏ దోషమైనా కనబడితే అది అందరి ముందూ స్పష్టంగా చెప్పండి. రామునిలో దోషము ఉన్నట్టు మీరు నిరూపించ గలిగితే రాముని అడవులకు పంపవచ్చును. అలా కాకుండా, ఏ దోషమూ లేని, ధర్మాన్ని పాటించే రాముని అకారణంగా అడవులకు పంపడం అధర్మం. అక్రమం. అది ఈ అయోధ్యనే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఓ కైకా! మీరు అయోధ్యను కాపాడండి. మీకూ చెడ్డపేరు తెచ్చుకోకండీ. మామాట మన్నించండి.” అని అన్నాడు సిద్ధార్థుడు అనే మంత్రి.
ఆ మాటలకు కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉన్న కైకను చూచి దశరథుడు ఇలా అన్నాడు. “ఓ కైకా! నీకు నిజంగానే బుద్ధిలేదు. లేకపోతే అంత విపులంగా నీ మేలుగోరి సిద్ధార్థుడు చెప్పిన మాటలను కూడా లెక్క చెయ్యడం లేదు. ఇంక నీతో వాదించి లాభం లేదు. నేను కూడా నా రామునితో పాటు అరణ్యములకు పోతాను. నీవు నీ కుమారుడు సుఖంగా రాజ్యం ఏలుకోండి. ” అని అక్కసుగా అన్నాడు దశరథుడు.
శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము ముప్పదిఆరవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.