Balakanda Sarga 50 In Telugu – బాలకాండ పంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ పంచాశః సర్గ అంటే 50వ సర్గ. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళతాడు. మార్గమధ్యలో, వారు గంగానదిని దాటుతారు. సారథి సుమంతుడు గంగానది మహిమలను వివరించగా, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రునితో కలిసి గంగానదిని గౌరవంగా దర్శిస్తారు. తరువాత, గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు.

జనకసమాగమః

తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ |
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

1

రామస్తు మునిశార్దూలమువాచ సహలక్ష్మణః |
సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి జనకస్య మహాత్మనః ||

2

బహూనీహ సహస్రాణి నానాదేశనివాసినామ్ |
బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్ ||

3

ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీశతసంకులాః |
దేశో విధీయతాం బ్రహ్మన్యత్ర వత్స్యామహే వయమ్ ||

4

రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే ||

5

విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా |
శతానందం పురస్కృత్య పురోహితమనిందితమ్ ||

6

ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః |
ఋత్విజోఽపి మహాత్మానస్త్వర్ఘ్యమాదాయ సత్వరమ్ ||

7

విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్రపురస్కృతమ్ |
ప్రతిగృహ్య తు తాం పూజాం జనకస్య మహాత్మనః ||

8

పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయమ్ |
స తాంశ్చాపి మునీన్పృష్ట్వా సోపాధ్యాయపురోధసః ||

9

యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ప్రహృష్టవత్ |
అథ రాజా మునిశ్రేష్ఠం కృతాంజలిరభాషత ||

10

ఆసనే భగవానాస్తాం సహైభిర్మునిపుంగవైః | [సత్తమైః]
జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః ||

11

పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః |
ఆసనేషు యథాన్యాయముపవిష్టాన్సమంతతః ||

12

దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రమథాబ్రవీత్ |
అద్య యజ్ఞసమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా ||

13

అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా |
ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవ ||

14

యజ్ఞోపసదనం బ్రహ్మన్ప్రాప్తోఽసి మునిభిః సహ |
ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః ||

15

తతో భాగార్థినో దేవాన్ద్రష్టుమర్హసి కౌశిక |
ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా ||

16

పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలిః ప్రణతో నృపః |
ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ ||

17

గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ |
పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ ||

18

అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ |
యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ ||

19

కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే |
పుండరీకవిశాలాక్షౌ వరాయుధధరావుభౌ ||

20

బద్ధగోధాంగులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ |
కాకపక్షధరో వీరౌ కుమారావివ పావకీ ||

21

రూపైదార్యర్గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణౌ |
ప్రకాశ్య కులమస్మాకం మాముద్ధర్తుమిహాగతౌ ||

22

[* వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే | *]
భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరమ్ |
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః ||

23

[కాకపక్షధరౌ వీరౌ]
కస్య పుత్రౌ మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః |
తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః ||

24

న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ |
సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా ||

25

తచ్చాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనమ్ |
అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్ |
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా ||

26

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే |
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహామునిః ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచాశః సర్గః ||

Balakanda Sarga 50 Meaning In Telugu

యాభయ్యవ సర్గ

రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మునులు అందరూ మిథిలా నగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహూతులతో మిథిలా నగరము క్రిక్కిరిసి పోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది.

అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు.” అని అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దములేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథిగృహమును ఏర్పాటు చేసాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది.

జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంట బెట్టుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు.

“ఓ జనక మహారాజా! నీకు క్షేమమేనా! నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా! యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా!” అని అడిగాడు.

తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, ఉపా ధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిని కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వా

మిత్రుడు ఆసనము మీద కూర్చున్నాడు. తరువాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ మహర్షీ! మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేసారు. తమరి దర్శనభాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. ఓ విశ్వామిత్ర మహర్షీ! యజ్ఞము సమాప్తమగుటకు ఇంక పన్నెండు దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అందరూ వస్తారు.” అని అన్నాడు…

తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు.

“ఓ మహర్షి! ఈ రాకుమారులు ఎవరు? వీరు మహా పరాక్రమ వంతుల మాదిరి కనపడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు. వీరు ఇరువురూ ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వీరు ధనుర్బాణములను, ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్య చంద్రులు ఒకే సారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశము రాకుమారులు? మీ వెంట కాలి నడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పనిమీద వచ్చారు? సెలవియ్యండి.” అని వినయంగా అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు.

“ఓ జనకమహారాజా! వీరు క్షత్రియ కుమారులు. అయోధ్యా నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజునకు పుత్రులు. నేను సిద్ధాశ్రమములో ఒక యజ్ఞము తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను. వీరు ఇరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు. తరువాత అహల్యా దర్శనము చేసుకొని, గౌతమ మహామునిని కలుసుకొని, అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడటానికి కుతూహలపడుతున్నారు.” అని విశ్వామిత్రుడు జనకునితో రామ లక్ష్మణులకు గురించి వివరంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Leave a Comment