Ayodhya Kanda Sarga 37 In Telugu – అయోధ్యాకాండ సప్తత్రింశః సర్గః

అయోధ్యాకాండంలోని సప్తత్రింశః సర్గంలో, రాముడు, సీత, లక్ష్మణులు గంగానదిని చేరి వల్మీకాశ్రమాన్ని సందర్శిస్తారు. వల్మీకి మహర్షి వారిని ఆత్మీయంగా స్వాగతించి, వారికి ఆశ్రమంలో నివాసం ఉండేందుకు అనుమతిస్తాడు. వల్మీకి వారికి భవిష్యత్తులో జరిగే విషయాల గురించి సూచనలు ఇస్తాడు. రాముడు వల్మీకికి తన పరిస్థితిని వివరించి, ధర్మం పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. వల్మీకి ఆశీస్సులు తీసుకుని, రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశిస్తారు. ఈ సర్గ రాముడి దైర్యం, సీతా సత్యసంధత, లక్ష్మణుని విశ్వాసం, వల్మీకి మహర్షి అనుగ్రహం గురించి వివరిస్తుంది.

చీరపరిగ్రహనిమిత్తవసిష్ఠక్రోధః

మహామాత్రవచః శ్రుత్వా రామో దశరథం తదా |
అభ్యభాషత వాక్యం తు వినయజ్ఞో వినీతవత్ || ౧ ||

త్యక్తభోగస్య మే రాజన్వనే వన్యేన జీవతః |
కిం కార్యమనుయాత్రేణ త్యక్తసంగస్య సర్వతః || ౨ ||

యో హి దత్త్వా గజశ్రేష్ఠం కక్ష్యాయాం కురుతే మనః |
రజ్జుస్నేహేన కిం తస్య త్యజతః కుంజరోత్తమమ్ || ౩ ||

తథా మమ సతాం శ్రేష్ఠ కిం ధ్వజిన్యా జగత్పతే |
సర్వాణ్యేవానుజానామి చీరాణ్యేవాఽనయంతు మే || ౪ ||

ఖనిత్రపిటకే చోభే సమానయత గచ్ఛతః |
చతుర్దశ వనే వాసం వర్షాణి వసతో మమ || ౫ ||

అథ చీరాణి కైకేయీ స్వయమాహృత్య రాఘవమ్ |
ఉవాచ పరిధత్స్వేతి జనౌఘే నిరపత్రపా || ౬ ||

స చీరే పురుషవ్యాఘ్రః కైకేయ్యాః ప్రతిగృహ్య తే |
సూక్ష్మవస్త్రమవక్షిప్య మునివస్త్రాణ్యవస్త హ || ౭ ||

లక్ష్మణశ్చాపి తత్రైవ విహాయ వసనే శుభే |
తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రతః || ౮ ||

అథాఽత్మపరిధానార్థం సీతా కౌశేయవాసినీ |
సమీక్ష్య చీరం సంత్రస్తా పృషతీ వాగురామివ || ౯ ||

సా వ్యపత్రపమాణేవ ప్రగృహ్య చ సుదుర్మనాః |
కైకేయీకుశచీరే తే జానకీ శుభలక్షణా || ౧౦ ||

అశ్రుసంపూర్ణనేత్రా చ ధర్మజ్ఞా ధర్మదర్శినీ |
గంధర్వరాజప్రతిమం భర్తారమిదమబ్రవీత్ || ౧౧ ||

కథం ను చీరం బధ్నంతి మునయో వనవాసినః |
ఇతి హ్యకుశలా సీతా సా ముమోహ ముహుర్ముహుః || ౧౨ ||

కృత్వా కంఠే చ సా చీరమేకమాదాయ పాణినా |
తస్థౌ హ్యకుశలా తత్ర వ్రీడితా జనకాత్మజా || ౧౩ ||

తస్యాస్తత్క్షిప్రమాగమ్య రామో ధర్మభృతాం వరః |
చీరం బబంధ సీతాయాః కౌశేయస్యోపరి స్వయమ్ || ౧౪ ||

రామం ప్రేక్ష్య తు సీతాయాః బధ్నంతం చీరముత్తమమ్ |
అంతఃపురగతా నార్యో ముముచుర్వారి నేత్రజమ్ || ౧౫ ||

ఉచుశ్చ పరమాయస్తా రామం జ్వలితతేజసమ్ |
వత్స నైవం నియుక్తేయం వనవాసే మనస్వినీ || ౧౬ ||

పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనమ్ |
తావద్దర్శనమస్యాం నః సఫలం భవతు ప్రభో || ౧౭ ||

లక్ష్మణేన సహాయేన వనం గచ్ఛస్వ పుత్రక |
నేయమర్హతి కళ్యాణీ వస్తుం తాపసవద్వనే || ౧౮ ||

కురు నో యాచనాం పుత్ర సీతా తిష్ఠతు భామినీ |
ధర్మనిత్యః స్వయం స్థాతుం న హీదానీం త్వమిచ్ఛసి || ౧౯ ||

తాసామేవంవిధా వాచః శృణ్వన్దశరథాత్మజః |
బబంధైవ తదా చీరం సీతయా తుల్యశీలయా || ౨౦ ||

చీరే గృహీతే తు తయా సమీక్ష్య నృపతేర్గురుః |
నివార్య సీతాం కైకేయీం వసిష్ఠో వాక్యమబ్రవీత్ || ౨౧ ||

అతిప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని |
వంచయిత్వా చ రాజానం న ప్రమాణేఽవతిష్ఠసే || ౨౨ ||

న గంతవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే |
అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనమ్ || ౨౩ ||

ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినామ్ |
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీమ్ || ౨౪ ||

అథ యాస్యతి వైదేహీ వనం రామేణ సంగతా |
వయమప్యనుయాస్యామః పురం చేదం గమిష్యతి || ౨౫ ||

అంతపాలాశ్చ యాస్యంతి సదారో యత్ర రాఘవః |
సహోపజీవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదమ్ || ౨౬ ||

భరతశ్చ సశత్రుఘ్నశ్చీరవాసా వనేచరః |
వనే వసంతం కాకుత్థ్సమనువత్స్యతి పూర్వజమ్ || ౨౭ ||

తతః శూన్యాం గతజనాం వసుధాం పాదపైః సహ |
త్వమేకా శాధి దుర్వృత్తా ప్రజానామహితే స్థితా || ౨౮ ||

న హి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతిః |
తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి || ౨౯ ||

న హ్యదత్తాం మహీం పిత్రా భరతః శాస్తుమర్హతి |
త్వయి వా పుత్రవద్వస్తుం యది జాతో మహీపతేః || ౩౦ ||

యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి |
పితృర్వంశచరిత్రజ్ఞః సోఽన్యథా న కరిష్యతి || ౩౧ ||

తత్త్వయా పుత్రగర్ధిన్యా పుత్రస్య కృతమప్రియమ్ |
లోకే హి స న విద్యేత యో న రామమనువ్రతః || ౩౨ ||

ద్రక్ష్యస్యద్యైవ కైకేయి పశువ్యాలమృగద్విజాన్ |
గచ్ఛతః సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్ || ౩౩ ||

అథోత్తమాన్యాభరణాని దేవి
దేహి స్నుషాయై వ్యపనీయ చీరమ్ |
న చీరమస్యాః ప్రవిధీయతేతి
న్యవారయత్తద్వసనం వసిష్ఠః || ౩౪ ||

ఏకస్య రామస్య వనే నివాస-
-స్త్వయా వృతః కేకయరాజపుత్రీ |
విభూషితేయం ప్రతికర్మనిత్యా
వసత్వరణ్యే సహ రాఘవేణ || ౩౫ ||

యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ
సుసంవృతా గచ్ఛతు రాజపుత్రీ |
వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానై-
-ర్నేయం వృతా తే వరసంప్రదానే || ౩౬ ||

తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే
గురౌ నృపస్యాప్రతిమప్రభావే |
నైవ స్మ సీతా వినివృత్తభావా
ప్రియస్య భర్తుః ప్రతికారకామా || ౩౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తత్రింశః సర్గః || ౩౭ ||

Ayodhya Kanda Sarga 37 Meaning In Telugu

సుమంత్రుడు, మంత్రి సిద్ధార్థుడు పలికిన మాటలు అన్నీ విన్నాడు రాముడు. తరువాత వినయంగా దశరథునితో ఇలా అన్నాడు. “తండ్రిగారూ! తమరు ఏల శ్రమ తీసుకుంటారు. వనములో ఉంటూ కందమూలములు భుజిస్తూ భూమి మీద పడుకొనేవాళ్లము మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు. ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగును ఇచ్చిన తరువాత, దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టు ఉంది. రాజ్యమే పోయిన తరువాత పరివారము రాజలాంఛనాలు ఎందుకు చెప్పండి. మాకు ఏమీ అవసరము లేదు. ఆ రాజభోగములు అన్నీ భరతుని అనుభవించ మని చెప్పండి. మాకు కట్టుకోడానికి నారచీరలు తెప్పించండి. మేము రేపటి నుండి వనవాసము చేయబోతున్నాము. మాకు కావలసినవి నేల చదును చేసుకోడానికి ఒక గునపము, గంప. అంతే. అవి తీసుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.” అని అన్నాడురాముడు.

ఇంతలో కైక కలుగచేసుకొని “నారచీరలు సిద్ధంగా ఉ న్నాయి. మీరు కట్టుకోవడమే తరువాయి” అని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారచీరలు అక్కడకు తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా నార చీరలు ధరించాడు.

కాని సీత మాత్రం ఆ నారచీరలు కట్టుకోడానికి చాలాఅవస్థ పడింది. ముందు ఆ నారచీరలను చూచి భయపడింది. పుట్టినప్పటి నుండి పట్టు వస్త్రములు తప్ప వేరు వస్త్రములు ధరించి ఎరుగదు. అసలు అప్పటిదాకా సీత నారచీరలను చూడనే లేదు. అందుకని కైక ఇచ్చిన నారచీరలు చూచి భయపడింది సీత. కళ్లనిండా నీళ్లు తిరిగాయి. రాముని వంక చూచింది. “వనములలో నివసించే మునికాంతలు ఈ నారచీరలు ఎలా ధరిస్తాతో నాకు తెలియదు. నేను ఏమి చెయ్యాలి. ఎలా కట్టుకోవాలి” అని రాముని అడిగింది.

రాముడు కూడా అయోమయంగా చూస్తున్నాడు. సీత ఆ నారచీరలను చేతిలో పట్టుకొని సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉంది. ఇంక చేసేది లేక రాముడు స్వయంగా తానే సీతకు ఆమె కట్టుకున్న బట్టల మీదనే ఆనారచీరలు చుట్టబెట్టాడు. ఆ దృశ్యం చూచి అంతఃపుర కాంతలు కన్నీరుమున్నీరుగా ఏడిచారు.

ఇంక తట్టుకోలేక వారందరూ రాముని వద్దకు వచ్చి “రామా! నిన్ను అడవులకు వెళ్లమన్నారు కానీ సీతను కాదు కదా! నీవునీ తండ్రి మాటను కాదనలేక అడవులకుపోతున్నావు. నీతో కూడా సీత ఎందుకు. నీవు లక్ష్మణుడు అడవులకు వెళ్లండి. సీత సుకుమారి. ఈమె అడవులలో నివసించలేదు. కాబట్టి, మా ప్రార్థనను మన్నించి సీతను ఇక్కడనే వదిలిపెట్టు. మేము ఆమెను కంటికి రెప్పలాగా చూచుకుంటాము. నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్లు.” అని ముక్త కంఠంతో అన్నారు.

రాముడు వారి మాటలు వినీ విననట్టు సీతకు చీర కడుతున్నాడు. ఆ సమయంలో వసిష్ఠుడు కైకనుచూచి ఇలా అన్నాడు. నీ ‘ ఓ కైకా! నీవు మరీ మితిమీరుతున్నావు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ చర్యల వలన ఇక్ష్వాకు వంశమును అపవిత్రము చేస్తున్నావు. నీవు నీ భర్తను మోసం చేసావు. అంతటితో తృప్తి పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. రాజపురోహితు నిగా ఆదేశిస్తున్నాను. సీత అడవులకు వెళ్ల వలసిన అవసరం లేదు. రాముని బదులు సీత సింహాసనము మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది. భర్తకు భార్య ఆత్మ వంటిది. కాబట్టి రాముని శరీరం అడవులకు వెళ్లినా రాముని ఆత్మఅయిన సీత రాజ్యపాలన చేస్తుంది. అలా కాకుండా సీత కూడా అరణ్యములకు వెళితే మేముకూడా అరణ్యములకు వెళతాము. అయోధ్య సాంతం మమ్ములను అనుసరిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య.

జనం అంతా అక్కడేఉంటారు. మంత్రులు సేనానులు రాజోద్యోగులు జానపదులు అంతా రాముడి వెంట ఉంటారు. ఇంతమంది రాముని వెంట ఉంటే రాముడు అంటే ప్రాణంపెట్టే భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉంటారా వారు కూడా నార చీరలు ధరించి రాముని వెంట అరణ్యములలో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి! నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు. అది నీకు ఇష్టమా! రాముడు లేని అయోధ్య రాజధాని కాదు. రాముడు లేని రాజ్యము రాజ్యము కాదు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. ఆ సంగతి తెలుసుకో!
మరొక విషయం గుర్తు పెట్టుకో. భరతుడు దశరథుని కుమారుడు. అందువలన తండ్రి ఇష్టపడి రాజ్యము ఇవ్వనిదే తాను రాజ్యము స్వీకరించడు.

నీ మాట విని భరతుడు రాజ్యము స్వీకరిస్తే అతడు దశరథుని కుమారుడు కాజాలడు. నీవు భరతునికి రాజ్యాభి షేకము చేసి రాజమాతగా రాజభోగములు అనుభవించాలని ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావు. కానీ రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు. రాముడు త్యజించిన రాజ్యమును స్వీకరిం ఓ కైకా! వల్లమాలిన పుత్ర ప్రేమతో నీవు నీ కుమారునికి తీరని అపకారము చేస్తున్నావు. ఒక్క భరతుడే కాదు, రాముని మాట జవదాటే వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. రాముడు వనవాసము నకు వెళుతుంటే అయోధ్యలో ఉన్న ఏనుగులు గుర్రములు, ఇతర జంతువులు, తుదకు పక్షులు, చెట్లు చేమలు కూడా రాముడు వెళ్లినవైపు చూస్తూ నిలుచుంటాయి. ఆ దృశ్యము ఇప్పుడే నీవు కనులారా చూడగలవు.

కాబట్టినా మాటవిను. సీతకు ఇచ్చిన నారచీరను వెనక్కు తీసుకో. ఆమెకు పట్టు బట్టలు ఇవ్వు. ఆభరణాలు ఇవ్వు. ఎందుకంటే నీవు రాముని నారచీరలు కట్టుకొని అరణ్యవాసము చెయ్యమని కోరావు కానీ సీతను లక్ష్మణుని నారచీరలు కట్టుకొనమని కోరలేదుగా.” అని వసిష్ఠుడు సీతను చూచి “సీతా! నీవు నారచీరలు కట్టుకో నవసరములేదు. నీవు మామూలుగానే నీవు రోజూ ధరించే వస్త్రములు,ఆభరణుము ధరించు. సీత వెంట ఆమె పరివారము, ఆమెకు రోజూ కావలసిన వస్త్రములు, ఆభరణములు, వస్తువులు అశేషంగా పంపబడతాయి. ఓ కైకా! దీనికి నీవు అడ్డుపెట్టలేవు. ఎందుకంటే నీవు కోరిన కోరికలలో సీత కూడా అరణ్యవాసము చెయ్యాలి అని నీవు కోరలేదు. అది గుర్తుంచుకో!” అని వసిష్ఠుడు కైకతో కోపంగా పలికాడు. ఆయన మాటలు విన్న తరువాత కూడా సీత, తననిర్ణయం మార్చుకోలేదు. రాముని వెంట వనములకు వెళ్లడానికి సిద్ధం అయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టాత్రింశః సర్గః (38) >>

Leave a Comment