Ayodhya Kanda Sarga 53 In Telugu | అయోధ్యాకాండ త్రిపంచాశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 30 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తిచేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! మన వనవాసములో ఒంటరిగా మొదటి రాత్రి గడప బోతున్నాము. సీత నిద్ర పోతుంటే నువ్వు, నేను, రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము.” అని అన్నాడు రాముడు…

రామసంక్షోభః 

స తం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య పశ్చిమామ్ |
రామః రమయతాం శ్రేష్ఠైతి హోవాచ లక్ష్మణమ్ ||

1

అద్యేయం ప్రథమా రాత్రిర్యాతా జనపదాద్బహిః |
యా సుమంత్రేణ రహితా తాం నోత్కంఠితుమర్హసి ||

2

జాగర్తవ్యమతంద్రిభ్యామద్య ప్రభృతి రాత్రిషు |
యోగక్షేమం హి సీతాయాః వర్తతే లక్ష్మణావయోః ||

3

రాత్రిం కథంచిదేవేమాం సౌమిత్రే వర్తయామహే |
ఉపావర్తామహే భూమౌ ఆస్తీర్య స్వయమార్జితైః ||

4

స తు సంవిశ్య మేదిన్యాం మహార్హశయనోచితః |
ఇమాః సౌమిత్రయే రామః వ్యాజహార కథాః శుభాః ||

5

ధ్రువమద్య మహారాజో దుఃఖం స్వపితి లక్ష్మణ |
కృతకామా తు కైకేయీ తుష్టా భవితుమర్హతి ||

6

సా హి దేవీ మహారాజం కైకేయీ రాజ్య కారణాత్ |
అపి న చ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతమాగతమ్ ||

7

అనాథశ్చ హి వృద్ధశ్చ మయా చైవ వినాకృతః |
కిం కరిష్యతి కామాత్మా కైకేయీ వశమాగతః ||

8

ఇదం వ్యసనమాలోక్య రాజ్ఞశ్చ మతివిభ్రమమ్ |
కామ ఏవార్ధధర్మాభ్యాం గరీయానితి మే మతిః ||

9

కో హ్యవిద్వానపి పుమాన్ ప్రమదాయా కృతే త్యజేత్ |
ఛందానువర్తినం పుత్రం తాతః మామివ లక్ష్మణ ||

10

సుఖీ బత సభార్యశ్చ భరతః కేకయీసుతః |
ముదితాన్ కోసలానేకః యో భోక్ష్యత్యధిరాజవత్ ||

11

స హి సర్వస్య రాజ్యస్య ముఖమేకం భవిష్యతి |
తాతే చ వయసాఽతీతే మయి చారణ్యమాస్థితే ||

12

అర్థ ధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే |
ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా ||

13

మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ చ |
కైకేయీ సౌమ్య సంప్రాప్తా రాజ్యాయ భరతస్య చ ||

14

అపీదానీం న కైకేయీ సౌభాగ్య మదమోహితా |
కౌసల్యాం చ సుమిత్రాం చ సంప్రబాధేత మత్కృతే ||

15

మా స్మ మత్కారణాద్దేవీ సుమిత్రా దుఃఖమావసేత్ |
అయోధ్యామిత ఏవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ ||

16

అహమేకో గమిష్యామి సీతయా సహ దండకాన్ |
అనాథాయా హి నాథస్త్వం కౌసల్యాయా భవిష్యసి ||

17

క్షుద్రకర్మా హి కైకేయీ ద్వేష్యమాన్యాయ్యమాచరేత్ |
పరిదద్యా హి ధర్మజ్ఞే భరతే మమ మాతరమ్ ||

18

నూనం జాత్యంతరే కస్మిన్ స్త్రియః పుత్రైః వియోజితాః |
జనన్యా మమ సౌమిత్రే తస్మాదేతదుపస్థితమ్ ||

19

మయా హి చిర పుష్టేన దుఃఖసంవర్ధితేన చ |
విప్రాయుజ్యత కౌసల్యా ఫలకాలే ధిగస్తుమామ్ ||

20

మా స్మ సీమంతినీ కాచిజ్జనయేత్ పుత్రమీదృశమ్ |
సౌమిత్రే యోఽహమంబాయాః దద్మి శోకమనంతకమ్ ||

21

మన్యే ప్రీతి విశిష్టా సా మత్తః లక్ష్మణ సారికా |
యస్యాస్తచ్ఛ్రూయతే వాక్యం శుక పాదమరేర్దశ ||

22

శోచంత్యాశ్చల్పభాగ్యాయాః న కించిదుపకుర్వతా |
పుత్రేణ కిమపుత్రాయాః మయా కార్యమరిందమ ||

23

అల్పభాగ్యా హి మే మాతా కౌసల్యా రహితా మయా |
శేతే పరమదుఃఖార్తా పతితా శోకసాగరే ||

24

ఏకో హ్యహమయోధ్యాం చ పృథివీం చాపి లక్ష్మణ |
తరేయమిషుభిః క్రుద్ధో నను వీర్యమకారణమ్ ||

25

అధర్మభయభీతశ్చ పరలోకస్య చానఘ |
తేన లక్ష్మణ నాద్యాహమాత్మానమభిషేచయే ||

26

ఏతదన్యచ్చ కరుణం విలప్య విజనే వనే |
అశ్రుపూర్ణముఖో రామర్నిశి తూష్ణీముపావిశత్ ||

27

విలప్యోపరతం రామం గతార్చిషమివానలమ్ |
సముద్రమివ నిర్వేగమాశ్వాసయత లక్ష్మణః ||

28

ధ్రువమద్య పురీ రాజన్ అయోధ్యాఽఽయుధినాం వర |
నిష్ప్రభా త్వయి నిష్క్రాంతే గతచంద్రేవ శర్వరీ ||

29

నైతదౌపయికం రామ యదిదం పరితప్యసే |
విషాదయసి సీతాం చ మాం చైవ పురుషర్షభ ||

30

న చ సీతా త్వయా హీనా న చాహమపి రాఘవ |
ముహూర్తమపి జీవావో జలాన్మత్స్యావివోద్ధృతౌ ||

31

న హి తాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప |
ద్రష్టుమిచ్ఛేయమద్యాహం స్వర్గం వాఽపి త్వయా వినా ||

32

తతస్తత్ర సుఖాసీనౌ నాతిదూరే నిరీక్ష్యతామ్ |
న్యగ్రోధే సుకృతాం శయ్యాం భేజాతే ధర్మవత్సలౌ ||

33

స లక్ష్మణస్యోత్తమపుష్కలం వచో
నిశమ్య చైవం వనవాసమాదరాత్ |
సమాః సమస్తా విదధే పరంతపః |
ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవః ||

34

తతస్తు తస్మిన్ విజనే వనే తదా |
మహాబలౌ రాఘవవంశవర్ధనౌ |
న తౌ భయం సంభ్రమమభ్యుపేయతు
ర్యథైవ సింహౌ గిరిసానుగోచరౌ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 53 Meaning In Telugu

రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తిచేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! మన వనవాసములో ఒంటరిగా మొదటి | రాత్రి గడప బోతున్నాము. సీత నిద్ర పోతుంటే నువ్వు, నేను, రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము.” అని అన్నాడు.

లక్ష్మణుడు అదే ప్రకారము చెట్లఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేసాడు. వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణులు. సీత పోయింది. రామ లక్ష్మణులకు నిద్రపట్టలేదు. లక్ష్మణునితో రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! మన తండ్రి దశరథునికి రాత్రిళ్లు నిద్రపడుతుందంటావా! భరతుడు రాగానే, రాజ్యము కోసరము కైక మహారాజును చంపివేయదు కదా! ఏం చేస్తాం.

మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు. అందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కు లేదు. మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్థ కామములలో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతూ ఉంది. అర్థమును వదిలి కామమునకే ప్రాధాన్యము ఇచ్చువాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి
మన మహారాజే ఉదాహరణ.

అయినా కానీ అక్ష్మణా, లోకం లో ఎంత తెలివి తక్కువాడైనా, భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా! కాని మన మహారాజు అలా చేసుకున్నాడు. పోనీలే, భరతుడు తన భార్యా సమేతంగా అయోధ్యారాజ్యమును ఏలగలడు. రాజ్యసుఖాలు అనుభవించగలడు. ఎందుకంటే మహారాజు వృద్ధాప్యముతో మరణిస్తాడు. అగ్రజుడనైన నేను అడవులలో ఉన్నాను. ఇంక భరతునికి అడ్డేముంది. హాయిగా రాజ్యము చేసుకుంటాడు.

లక్ష్మణా! నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. కేవలము మన మహారాజును చంపడానికి, నన్ను అడవులకు పంపడానికి, భరతుని అయోధ్యకు రాజును చెయ్యడానికీ, కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి! అవి మహారాజు ఇస్తాను అనడం ఏమిటి! నేను అడవుల పాలు కావడం ఏమిటి అంతా వింతగా ఉంది కదూ.

లక్ష్మణా! ఇప్పుడు మన మహారాజు కైకమాటకు అడ్డు చెప్పడం లేదు కదా! అది సాకుగా తీసుకొని కైక మన తల్లులను బాధలు పెట్టదుకదా! లక్ష్మణా! నా వలన నువ్వు, నీతల్లి సుమిత్ర, బాధలు పడటం ఎందుకు. రేపు ఉదయమే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు. నీతల్లిని కైక నుండి రక్షించుకో. నేను, నా వెంట సీత, అరణ్యవాసము చేస్తాము.

నువ్వు వెళ్లి నా తల్లి కౌసల్యను భరతునికి అప్పగించు. భరతుడు ధర్మము తెలిసినవాడు. నా తల్లికి ఏ అపకారమూ చెయ్యడు. ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైక బారినుండి రక్షించు. లక్ష్మణా! నా తల్లి కౌసల్య, పూర్వజన్మలో, ఎప్పుడో, తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది. అందుకని ఈజన్మలో తనబిడ్డలకు దూరం అయింది. కొడుకులు పెరిగి పెద్దవారయి తల్లులను సుఖపెడతారని ప్రతీతి.

నేను పెరిగి, పెద్దవాడనయి, నా తల్లిని సుఖపెట్టవలసిన సమయమున, ఆమెకు దూరం అయి అమెను దుఃఖపెట్టుచున్నాను. నేను నా తల్లికి ఒకే కొడుకును. నా తల్లి దుఃఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఎంత పాపాత్ముడను. ఏ తల్లికీ నా మాదిరి తల్లికి కష్టములను కలిగించే పుత్రుడు కలగకూడదు.

లక్ష్మణా! నేను తల్చుకుంటే, ఒకే ఒక బాణంతో శత్రుసంహారము చేసి అయోధ్యను తిరిగి పొందగలను. కాని ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మణా! నేను అధర్మానికి భయపడుతున్నాను. నాకు అధర్మంగా రాజ్యమును పొందడం ఇష్టంలేదు. పైగా రాజ్యం కోసరం అధర్మంగా ప్రవర్తిస్తే, ఉత్తమలోకాలు కలుగవు కదా!” ఈ విధంగా రాముడు పరి పరి విధములుగా చింతిస్తున్నాడు.

రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు. రాముని ఓదారుస్తున్నాడు. “రామా! నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలే కాంతి విహీనంగా ఉంది. అయినా ధీరుడవైన నీవు భీరువు వలె ఈ ప్రకారం దుఃఖపడటం మంచిది కాదు. నీవు దుఃఖపడి, నన్ను సీతను కూడా దు:ఖపడేట్టు చేస్తున్నావు. రామా! నిన్ను చూసి నేను, సీత ఈ వనవాస కష్టములను తృణప్రాయంగా అనుభవిస్తున్నాము. నీవు లేకపోతే మేము నీటి లోనుండి బయటకు తీసిన చేపల మాదిరి గిలా గిలా కొట్టుకుంటాము.

ఓ రామా! నాకు నీవే సర్వస్వము. నీ తరువాతనే నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు. తుదకు నిన్నువిడిచి స్వర్గమునకు వెళ్లమన్నా వెళ్లను. ఇది నానిశ్చయము. కాబట్టి ఇంక నిశ్చింతగా నిద్రించు.” అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలతో కొంచెం ఊరట చెందాడు రాముడు. ఈ పదునాలుగేళ్లు వనవాసము లక్ష్మణుని సాయంతో సంపూర్ణం చేయాలి అని అనుకున్నాడు. ఆ ఊహలతోనే నిద్రలోకి జారుకున్నాడు రాముడు.

అయోధ్యాకాండ చతుఃపంచాశః సర్గః (౫౪) >>

Leave a Comment