మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండం 76వ సర్గలో, విష్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణులను సీతా స్వయంవరానికి తీసుకెళతారు. మార్గమధ్యంలో గంగానదిని దాటి గౌతమ ముని ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వారు ఆహల్య శాప విమోచన కథను వింటారు. ఇంద్రుడు ధర్మానికి విరుద్ధంగా ఆహల్యతో ఉండి, గౌతముని కోపానికి గురవుతాడు.
|| జామదగ్న్యప్రతిష్టంభః ||
శ్రుత్వా తజ్జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా |
గౌరవాద్యంత్రితకథః పితూ రామమథాబ్రవీత్ ||
1
శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ |
అనురుధ్యామహే బ్రహ్మన్పితురానృణ్యమాస్థితః ||
2
వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ |
అవజానాసి మే తేజః పశ్య మేఽద్య పరాక్రమమ్ ||
3
ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్ |
శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమః ||
4
ఆరోప్య స ధనూ రామః శరం సజ్యం చకార హ |
జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధోఽబ్రవీద్వచః ||
5
బ్రాహ్మణోఽసీతి మే పూజ్యో విశ్వామిత్రకృతేన చ |
తస్మాచ్ఛక్తో న తే రామ మోక్తుం ప్రాణహరం శరమ్ ||
6
ఇమాం పాదగతిం రామ తపోబలసమార్జితాన్ | [వా త్వద్గతిం]
లోకానప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి ||
7
న హ్యయం వైష్ణవో దివ్యః శరః పరపురంజయః |
మోఘః పతతి వీర్యేణ బలదర్పవినాశనః ||
8
వరాయుధధరం రామం ద్రష్టుం సర్షిగణాః సురాః |
పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సర్వశః ||
9
గంధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణకిన్నరాః |
యక్షరాక్షసనాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్ ||
10
జడీకృతే తదా లోకే రామే వరధనుర్ధరే |
నిర్వీర్యో జామదగ్న్యోఽథ రామో రామముదైక్షత ||
11
తేజోఽభిహతవీర్యత్వాజ్జామదగ్న్యో జడీకృతః |
రామం కమలపత్రాక్షం మందం మందమువాచ హ ||
12
కాశ్యపాయ మయా దత్తా యదా పూర్వం వసుంధరా |
విషయే మే న వస్తవ్యమితి మాం కాశ్యపోఽబ్రవీత్ ||
13
సోఽహం గురువచః కుర్వన్పృథివ్యాం న వసే నిశామ్ |
తదా ప్రతిజ్ఞా కాకుత్స్థ కృతా భూః కాశ్యపస్య హి ||
14
తదిమాం త్వం గతిం వీర హంతుం నార్హసి రాఘవ |
మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమమ్ ||
15
లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా |
జహి తాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః ||
16
అక్షయం మధుహంతారం జానామి త్వాం సురోత్తమమ్ |
ధనుషోఽస్య పరామర్శాత్స్వస్తి తేఽస్తు పరంతప ||
17
ఏతే సురగణాః సర్వే నిరీక్షంతే సమాగతాః |
త్వామప్రతిమకర్మాణమప్రతిద్వంద్వమాహవే ||
18
న చేయం మమ కాకుత్స్థ వ్రీడా భవితుమర్హతి |
త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః ||
19
శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత |
శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమమ్ ||
20
తథా బ్రువతి రామే తు జామదగ్న్యే ప్రతాపవాన్ |
రామో దాశరథిః శ్రీమాంశ్చిక్షేప శరముత్తమమ్ ||
21
స హతాన్దృశ్య రామేణ స్వాఁల్లోకాంస్తపసార్జితాన్ |
జామదగ్న్యో జగామాశు మహేంద్రం పర్వతోత్తమమ్ ||
22
తతో వితిమిరాః సర్వా దిశశ్చోపదిశస్తథా |
సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధమ్ ||
23
రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ |
తతః ప్రదక్షిణం కృత్వా జగామాత్మగతిం ప్రభుః ||
24
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్సప్తతితమః సర్గః ||
Balakanda Sarga 76 Meaning In Telugu
అప్పటి వరకూ శ్రీ రాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంక ఊరుకోలేక పోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు.
“పరశురామా! మీ గురించి విన్నాను. నీవు తండ్రి ఋణమును తీర్చుకోడానికి యావత్తు క్షత్రియ లోకమును మట్టు బెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు.” అని పలికి పరశు రాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ పరశురామా! మీరు బ్రాహ్మణులు. నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధాకారాదు. కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింప వలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆశక్తి మీద ప్రయోగింపనా. లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమలోకముల మీద సంధించనా! ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణుబాణము వృధాకావడానికి వీలు లేదు. నీవు పట్టు బట్టి నా చేత ఈ బాణమును సంధింపజేసావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి.” అని అడిగాడు రాముడు.
ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమములు నశించి పోయాయి. శరీరం నిర్వీర్యము అయింది. అలానే చూస్తూ ఉండి పోయాడు. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు.
“ఓ రామా! నీవు సామాన్యుడవు కావు. విష్ణు ధనుస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరమూ కాదు. నీ చేతిలో నేను ఓడి పోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారము చేసి ఈ భూమి నంతా కశ్యపునకు ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశములో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్రపర్వతము మీద తపస్సుచేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమన శక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను.” అని అన్నాడు పరశు రాముడు.
పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణము ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములు అన్నీ ధ్వసం అయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి, తన దివ్యమైన గమన శక్తితో మహేంద్రపర్వతమునకు వెళ్లిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూచాడు దశరథుడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
బాలకాండ సప్తసప్తతితమః సర్గః (77) >>