Ayodhya Kanda Sarga 54 In Telugu | అయోధ్యాకాండ చతుఃపంచాశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 54 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం.  సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము… అని రాముడు అన్నా సందర్భం లోనిది…

భరద్వాజాశ్రమాభిగమనమ్

తే తు తస్మిన్ మహావృక్షౌషిత్వా రజనీం శివామ్ |
విమలేఽభ్యుదితే సూర్యే తస్మాద్దేశాత్ ప్రతస్థిరే ||

1

యత్ర భాగీరథీం గంగాం యమునాఽభిప్రవర్తతే |
జగ్ముస్తం దేశముద్దిశ్య విగాహ్య సుమహద్వనమ్ ||

2

తే భూమిభాగాన్ వివిధాన్ దేశాంశ్చాపి మనోరమాన్ |
అదృష్టపూర్వాన్ పశ్యన్తస్తత్ర తత్ర యశస్వినః ||

3

యథాక్షేమేణ గచ్ఛన్ సః పశ్యంశ్చ వివిధాన్ ద్రుమాన్ |
నివృత్తమాత్రే దివసే రామః సౌమిత్రిమబ్రవీత్ ||

4

ప్రయాగమభితః పశ్య సౌమిత్రే ధూమమున్నతమ్ |
అగ్నేర్భగవతః కేతుం మన్యే సన్నిహితః మునిః ||

5

నూనం ప్రాప్తాస్మ సమ్భేదం గంగా యమునయోర్వయమ్ |
తథా హి శ్రూయతే శబ్దః వారిణో వారిఘట్టితః ||

6

దారూణి పరిభిన్నాని వనజైః ఉపజీవిభిః |
భరద్వాజాశ్రమే చైతే దృశ్యంతే వివిధా ద్రుమాః ||

7

ధన్వినౌ తౌ సుఖం గత్వా లంబమానే దివాకరే |
గంగాయమునయోః సంధౌ ప్రాపతుర్నిలయం మునేః ||

8

రామస్త్వాశ్రమమాసాద్య త్రాసయన్ మృగపక్షిణః |
గత్వా ముహూర్తమధ్వానం భరద్వాజముపాగమత్ ||

9

తతస్త్వాశ్రమమాసాద్య మునేర్దర్శనకాంక్షిణౌ |
సీతయాఽనుగతౌ వీరౌ దూరాదేవావతస్థతుః ||

10

స ప్రవిశ్య మహాత్మానమృషిం శిష్యగణైర్వృతమ్ |
సంశితవ్రతమేకాగ్రం తపసా లబ్ధచక్షుషమ్ ||

11

హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ మహాభాగం కృతాంజలిః |
రామః సౌమిత్రిణా సార్ధం సీతయా చాభ్యవాదయత్ ||

12

న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణపూర్వజః |
పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ ||

13

భార్యా మమేయం వైదెహీ కల్యాణీ జనకాత్మజా |
మాం చానుయాతా విజనం తపోవనమనిందితా ||

14

పిత్రా ప్రవ్రాజ్యమానం మాం సౌమిత్రిరనుజః ప్రియః |
అయమన్వగమద్భ్రాతా వనమేవ దృఢ వ్రతః ||

15

పిత్రా నియుక్తా భగవన్ ప్రవేక్ష్యామస్తపోవనమ్ |
ధర్మమేవ చరిష్యామస్తత్ర మూలఫలాశనాః ||

16

తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః |
ఉపానయత ధర్మాత్మా గామర్ఘ్యముదకం తతః ||

17

నానావిధానన్నరసాన్ వన్యమూలఫలాశ్రయాన్ |
తేభ్యో దదౌ తప్తతపాః వాసం చైవాభ్యకల్పయత్ ||

18

మృగ పక్షిభిరాసీనః మునిభిశ్చ సమంతతః |
రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహ తం మునిః ||

19

ప్రతిగృహ్య చ తామర్చాముపవిష్టం స రాఘవమ్ |
భరద్వాజోఽబ్రవీద్వాక్యం ధర్మయుక్తమిదం తదా ||

20

చిరస్య ఖలు కాకుత్స్థ పశ్యామి త్వామిహాగతమ్ |
శ్రుతం తవ మయా చేదం వివాసనమకారణమ్ ||

21

అవకాశో వివిక్తోఽయం మహానద్యోః సమాగమే |
పుణ్యశ్చ రమణీయశ్చ వసత్విహ భగాన్ సుఖమ్ ||

22

ఎవముక్తస్తు వచనం భరద్వాజేన రాఘవః |
ప్రత్యువాచ శుభం వాక్యం రామః సర్వహితేరతః ||

23

భగవన్నితాసన్నః పౌరజానపదో జనః |
సుదర్శమిహ మాం ప్రేక్ష్య మన్యేఽహమిమమాశ్రమమ్ ||

24

ఆగమిష్యతి వైదెహీం మాం చాపి ప్రేక్షకో జనః |
అనేన కారణేనాహమిహ వాసం న రోచయే ||

25

ఎకాన్తే పశ్య భగవన్నాశ్రమస్థానముత్తమమ్ |
రమేత యత్ర వైదేహీ సుఖార్హా జనకాత్మజా ||

26

ఎతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరద్వాజో మహామునిః |
రాఘవస్య తతః వాక్యమర్థ గ్రాహకమబ్రవీత్ ||

27

దశక్రోశైతస్తాత గిరిర్యస్మిన్నివత్స్యసి |
మహర్షిసేవితః పుణ్యః సర్వతః సుఖదర్శనః ||

28

గోలాంగూలానుచరితః వానరర్క్షనిషేవితః |
చిత్ర కూటైతి ఖ్యాతః గంధమాదనసన్నిభః ||

29

యావతా చిత్రకూటస్య నరః శృంగాణ్యవేక్షతే |
కళ్యాణాని సమాధత్తే న పాపే కురుతే మనః ||

30

ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతమ్ |
తపసా దివమారూడాః కపాలశిరసా సహ ||

31

ప్రవివిక్తమహం మన్యే తం వాసం భవతః సుఖమ్ |
ఇహ వా వనవాసాయ వస రామ మయా సహ ||

32

స రామం సర్వ కామైస్తం భరద్వాజః ప్రియాతిథిమ్ |
సభార్యం సహ చ భ్రాత్రా ప్రతిజగ్రాహ ధర్మవిత్ ||

33

తస్య ప్రయాగే రామస్య తం మహర్షిముపేయుషః |
ప్రపన్నా రజనీ పుణ్యా చిత్రాః కథయతః కథాః ||

34

సీతాతృతీయః కాకుత్స్థః పరిశ్రాన్తః సుఖోచితః |
భరద్వాజాశ్రమే రమ్యే తాం రాత్రిమవసత్సుఖమ్ ||

35

ప్రభాతాయాం రజన్యాం తు భరద్వాజముపాగమత్ |
ఉవాచ నరశార్దూలో మునిం జ్వలితతేజసమ్ ||

36

శర్వరీం భవనన్న్ అద్య సత్య శీల తవాశ్రమె |
ఉషితాః స్మేహ వసతిమనుజానాతు నో భవాన్ ||

37

రాత్ర్యాం తు తస్యాం వ్యుష్టాయాం భరద్వాజోఽబ్రవీదిదమ్ |
మధుమూలఫఽలోపేతం చిత్ర కూటం వ్రజేతి హ ||

38

వాసమౌపయికం మన్యే తవ రామ మహాబల |
నానానగగణోపేతః కిన్నరోరగసేవితః ||

39

మయూరనాదాభిరుతో గజరాజనిషేవితః |
గమ్యతాం భవతా శైలశ్చిత్రకూటః స విశ్రుతః ||

40

పుణ్యశ్చ రమణీయశ్చ బహుమూలఫలాయుతః |
తత్ర కుంజరయూథాని మృగయూథాని చాభితః ||

41

విచరన్తి వనాంతేఽస్మిన్ తాని ద్రక్ష్యసి రాఘవ |
సరిత్ప్రస్రవణప్రస్థాన్ దరీకందరనిర్దరాన్ |
చరతః సీతయా సార్ధం నందిష్యతి మనస్తవ ||

42

ప్రహృష్టకోయష్టికకోకిల స్వనైః
వినాదితం తం వసుధాధరం శివమ్ |
మృగైశ్చ మత్తైః బహుభిశ్చ కుంజరైః
సురమ్యమాసాద్య సమావసాశ్రమమ్ ||

43

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 54 Meaning In Telugu

సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము.

ఒక నదీజలాలతో మరొక నదీజలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందు కంటే ఇక్కడ వంట చేసుకోడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టున్నట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు.

రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు. భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు, సీత నిలబడ్డారు. ఎవరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరములోకి వెళ్లాడు. కుటీరము లోపల అగ్నిహోత్రము ముందు, శిష్యుల మధ్య అగ్ని మాదిరివెలుగుతున్న భరద్వాజమహర్షిని చూచాడు రాముడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ముతాము పరిచయం చేసుకున్నాడు.

“ ఓ భగవాన్ భరద్వాజ మహర్షీ! ప్రణామాలు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులకు. రామలక్ష్మణులకు. ఈమె నా అర్ధాంగి సీత. జనక మహారాజు కుమార్తె. నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము, నేను వనవాసమునకు వచ్చాను. నా తమ్ముడు, నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు.

సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది. మా తండ్రి మాట ప్రకారము వనవాసము చేస్తూ అడవులలో దొరికే పండ్లు ఫలములు దుంపలు తింటూ, నేల మీద పడుకుంటూ వనవాసము పూర్చిచేయాలని అనుకుంటున్నాము.”అని వినయంగా అన్నాడు రాముడు.

రాముని మాటలువిన్న భరద్వాజుడు వారికి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చాడు. మధుపర్కమును ఇచ్చాడు. అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా భరద్వాజుడు రామునికి స్వాగత సత్కారాలు చేసాడు.
“ఓ రామా! చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను.

ఈ గంగా యమున సంగమము వద్ద జనములు ఎక్కువగా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది. ఫలములు, పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి, నీవు ఇక్కడ ఆశ్రమము నిర్మించుకొని సుఖముగా ఉండవచ్చును.” అని అన్నాడు భరద్వాజుడు. ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! ఈ ప్రదేశమునకు సమీపములో జనపదాలు ఉన్నాయి. నేను, సీతా

లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి, ఆ జనపదాలలో ఉన్న ప్రజలు నన్ను చూడ్డానికి ఇక్కడకు వస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ నివసించలేను. కాబట్టి నాకు ఏకాంతముగా ఉన్న ప్రదేశము ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడ ఉంటాము.” అని అన్నాడు రాముడు.

ఆమాటలు విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ రామా! ఇక్కడి నుండి పది క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము గంధమాధన పర్వతముతో సమానమైన ఖ్యాతి చెందినది. అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి.

ఆ పర్వతము మీద ఎందరో మహాఋషులు తపస్సుచేసుకుంటున్నారు. అదిమీరు ఉండటానికి తగిన ప్రదేశము. అక్కడ క్రూరమృగములకు, వికృతమైన ఆలోచనలకు తావు లేదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నీవు నివాసము ఏర్పాటు చేసుకొని నీ వనవాసము పూర్తిచేయుము. లేని ఎడల, ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపుము.” అని అన్నాడు భరద్వాజుడు.

ఇంతలో రాత్రి అయింది. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమములోనే గడిపారు. మరునాడు ఉదయము రాముడు భరద్వాజుని వద్దకుపోయి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! నిన్న రాత్రి మాకు ఆశ్రయము ఇచ్చినందుకు కృతజ్ఞులము. మేము ఇక్కడి నుండి వెళ్లుటకు అనుమతి ఇవ్వండి.” అని ప్రార్థించాడు రాముడు.

“రామా! నీవు చిత్రకూటమునకు పొమ్ము. అక్కడ మీకు ఫలములు, తేనె, దుంపలు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడి సెలయేళ్లలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి. నీవు, సీత, విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మీరు సుఖంగా వనవాసము చేయవచ్చును. మీరు ఉండటానికి అదియే యుక్తమైన ప్రదేశము.” అని అన్నాడు భరద్వాజుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచపంచాశః సర్గః (౫౫) >>

Leave a Comment