అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గ రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు సీతా దేవితో కలిసి వనవాసానికి బయలుదేరుతాడు. రథంలో ప్రయాణిస్తూ రాముడు గంగా నదిని చేరుకుంటాడు. అప్పుడు గుహుడు అనే నిశాద రాజు రాముడు, సీత, లక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వడమే కాక, వారికి సహాయం చేస్తాడు. వారు గంగా నదిని దాటడానికి పడవను అందిస్తాడు. రాముడు తన పట్టాభిషేకం రద్దయినప్పటికీ, ధైర్యంగా వనవాసం అంగీకరించి ధర్మాన్ని పాటిస్తాడు. ఈ సర్గ రాముని నిశ్చలత, ధర్మానుస్థానం, మరియు ఆపదలో ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
తైలద్రోణ్యధిశయనమ్
తమగ్నిమివ సంశాంతమంబు హీనమివార్ణవమ్ |
హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివమ్ || ౧ ||
కౌసల్యా బాష్పపూర్ణాక్షీ వివిధం శోకకర్శితా |
ఉపగృహ్య శిరః రాజ్ఞః కైకేయీం ప్రత్యభాషత || ౨ ||
సకామా భవ కైకేయి భుంక్ష్వ రాజ్యమకణ్టకమ్ |
త్యక్త్వా రాజానమేకాగ్రా నృశంసే దుష్టచారిణి || ౩ ||
విహాయ మాం గతః రామః భర్తా చ స్వర్గతః మమ |
విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే || ౪ ||
భర్తారం తం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః |
ఇచ్చేజ్జీవితుమన్యత్ర కైకేయ్యాస్త్యక్తధర్మణః || ౫ ||
న లుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ |
కుబ్జానిమిత్తం కైకేయ్యా రాఘవాణాం కులం హతమ్ || ౬ ||
అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితమ్ |
సభార్యం జనకః శ్రుత్వా పరితప్స్యత్యహం యథా || ౭ ||
స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః |
రామః కమలపత్రాక్షో జీవనాశమితః గతః || ౮ ||
విదేహరాజస్య సుతా తథా సీతా తపస్వినీ |
దుఃఖస్యానుచితా దుఃఖం వనే పర్యుద్విజిష్యతి || ౯ ||
నదతాం భీమఘోషాణాం నిశాసు మృగపక్షిణామ్ |
నిశమ్య నూనం సంత్రస్తా రాఘవం సంశ్రయిష్యతి || ౧౦ ||
వృద్ధశ్చైవాల్ప పుత్రశ్చ వైదేహీమనిచింతయన్ |
సోఽపి శోకసమావిష్టర్నను త్యక్ష్యతి జీవితమ్ || ౧౧ ||
సాఽహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రతా |
ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనమ్ || ౧౨ ||
తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్వినీమ్ |
వ్యపనిన్యుః సుదుహ్ఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః || ౧౩ || [వ్యపనీయ]
తైలద్రోణ్యామథామాత్యాః సంవేశ్య జగతీపతిమ్ |
రాజ్ఞః సర్వాణ్యథాదిష్టాశ్చక్రుః కర్మాణ్యనంతరమ్ || ౧౪ ||
న తు సఙ్కలనం రాజ్ఞో వినా పుత్రేణ మంత్రిణః |
సర్వజ్ఞాః కర్తుమీషుస్తే తతః రక్షంతి భూమిపమ్ || ౧౫ ||
తైలద్రోణ్యాం తు సచివైః శాయితం తం నరాధిపమ్ |
హా మృతోఽయమితి జ్ఞాత్వా స్త్రియస్తాః పర్యదేవయన్ || ౧౬ ||
బాహూనుద్యమ్య కృపణా నేత్రప్రస్రవణైః ముఖైః |
రుదంత్యః శోకసంతప్తాః కృపణం పర్యదేవయన్ || ౧౭ ||
హా మహారాజ రామేణ సతతం ప్రియవాదినా |
విహీనాః సత్యసంధేన కిమర్థం విజహాసి నః || ౧౮ ||
కైకేయ్యా దుష్టభావాయాః రాఘవేణ వియోజితాః |
కథం పతిఘ్న్యా వత్స్యామః సమీపే విధవా వయమ్ || ౧౯ ||
స హి నాథః సదాఽస్మాకం తవ చ ప్రభురాత్మవాన్ |
వనం రామో గతః శ్రీమాన్ విహాయ నృపతిశ్రియమ్ || ౨౦ ||
త్వయా తేన చ వీరేణ వినా వ్యసనమోహితాః |
కథం వయం నివత్స్యామః కైకేయ్యా చ విదూషితాః || ౨౧ ||
యయా తు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబలః |
సీతయా సహ సంత్యక్తాః సా కమన్యం న హాస్యతి || ౨౨ ||
తా బాష్పేణ చ సంవీతాః శోకేన విపులేన చ |
వ్యవేష్టంత నిరానందా రాఘవస్య వరస్త్రియః || ౨౩ ||
నిశా చంద్రవిహీనేవ స్త్రీవ భర్తృవివర్జితా |
పురీ నారాజతాయోధ్యా హీనా రాజ్ఞా మహాత్మనా || ౨౪ ||
బాష్ప పర్యాకులజనా హాహాభూతకులాంగనా |
శూన్యచత్వరవేశ్మాంతా న బభ్రాజ యథాపురమ్ || ౨౫ ||
గతే తు శోకాత్ త్రిదివం నరాధిపే
మహీతలస్థాసు నృపాంగనాసు చ |
నివృత్తచారః సహసా గతో రవిః
ప్రవృత్తచారా రాజనీ హ్యుపస్థితా || ౨౬ ||
ఋతే తు పుత్రాద్దహనం మహీపతేః
నరోచయంతే సుహృదః సమాగతాః |
ఇతీవ తస్మిన్ శయనే న్యవేశయన్
విచింత్య రాజానమచింత్య దర్శనమ్ || ౨౭ ||
గతప్రభా ద్యౌరివ భాస్కరం వినా
వ్యపేతనక్షత్రగణేవ శర్వరీ |
పురీ బభాసే రహితా మహాత్మనా
న చాస్ర కంఠాకుల మార్గచత్వరా || ౨౮ ||
నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘః
విగర్హమాణా భరతస్య మాతరమ్ |
తదా నగర్యాం నరదేవసంక్షయే
బభూవురార్తా న చ శర్మ లేభిరే || ౨౯ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్షష్ఠితమః సర్గః || ౬౬ ||
Ayodhya Kanda Sarga 66 Meaning In Telugu
కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దు:ఖిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది. “ఏమ్మా! కైకా! నీ కోరిక తీరిందా! నీ మనస్సు శాంతించిందా! ఇంక నువ్వు, నీ కొడుకు, ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్లిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు. ఎవరి కోసం బతకాలి. నీ లాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా.
ఓ కైకా! నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేసావా! లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేసావు. ఓ కైకా! నీవు మాకే కాదు. జనక మహారాజును కూడా దు:ఖములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంతదు:ఖిస్తున్నాడో కదా! ఇంతకూ రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది. తన తల్లి అనాధ అయింది అని ఎవరు చెబుతారు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు! నా భర్త రాముని గూర్చి, సీతను గూర్చి, తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళతాను. నా భర్తతో పాటు చితి మీదకూర్చుని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్పనాకు వేరుమార్గము లేదు.” అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకొని భోరు భోరున ఏడుస్తూ ఉంది.
ఇంతలో కులగురువు వసిష్టులు, అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వసిష్ఠుని ఆదేశము మేరకు అంత:పురపరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవులలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహనక్రియలు నిర్వర్తించడానికి వీలులేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు.
(తైలద్రోణి అంటే పలు విధములైన నూనెలు(preservatives) కలిగిన తొట్టె అని అర్థము. ఈ రోజుల్లో కూడా శవాలను చెడిపోకుండా భద్రపరచడానికి యాసిడ్లు పూసి భద్రపరుస్తారు. మమ్మీలు అన్నీ అలా భద్రపరచబడినవే. ఇదే ప్రక్రియ త్రేతాయుగములో కూడా ఉంది అని తెలుస్తూ ఉంది.)
అప్పటి దాకా దూర దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోదిస్తున్నారు.
“ఓ మహారాజా! మాకు రాముడిని దూరం చేసావు. ఇప్పుడు నువ్వుకూడా దూరంగా వెళ్లిపోయావా! చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము. రాముడూ లేకుండా, నీవూ లేకుండా, ఈ కైక పెట్టే బాధలనుసహిస్తూ మేము ఎలా జీవించగలము. ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసరం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచి పెడుతుందా?” అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలచుకుంటూ నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే, అటు రాముని, ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురు కున్నాయి. అందరూ శోమసముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజులేని అయోధ్య శోభావిహీన అయింది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణమును చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకున్నాయి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.