Ayodhya Kanda Sarga 67 In Telugu – అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గః

అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీత, లక్ష్మణులతో కలిసి గంగానదిని దాటి దక్షిణ దిశగా పయనిస్తాడు. వారు చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు, అక్కడ సురమ్యమైన ప్రకృతిని చూస్తారు. చిత్రకూటంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, వారు నివసించేందుకు సిద్ధపడతారు. అయోధ్యలో, రాముని వనవాసం కారణంగా దశరథుడు మరణిస్తాడు. భరతుడు తన తండ్రి మరణవార్త విని కైకేయి మీద కోపంతో ఉన్నా, రాముని తీసుకురావాలనే సంకల్పంతో చిత్రకూటానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఈ సర్గ రాముని త్యాగం, భరతుని భక్తి, మరియు దశరథుని దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది.

అరాజకదురవస్థావర్ణనమ్

ఆక్రందితనిరానందా సాస్రకంఠజనాకులా |
ఆయోధ్యాయామవతతా సా వ్యతీయాయ శర్వరీ || ౧ ||

వ్యతీతాయాం తు శర్వర్యామాదిత్యస్యోదయే తతః |
సమేత్య రాజకర్తారః సభామీయుర్ద్విజాతయః || ౨ ||

మార్కండేయోఽథ మౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః |
కాత్యయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః || ౩ ||

ఏతే ద్విజాః సహామాత్యైః పృథగ్వాచముదీరయన్ |
వసిష్ఠమేవాభిముఖాః శ్రేష్ఠం రాజపురోహితమ్ || ౪ ||

అతీతా శర్వరీ దుఃఖం యా నో వర్షశతోపమా |
అస్మిన్ పంచత్వమాపన్నే పుత్ర శోకేన పార్థివే || ౫ ||

స్వర్గతశ్చ మహారాజో రామశ్చారణ్యమాశ్రితః |
లక్ష్మణశ్చాపి తేజస్వీ రామేణైవ గతః సహ || ౬ ||

ఉభౌ భరత శత్రుఘ్నౌ కేకయేషు పరంతపౌ |
పురే రాజగృహే రమ్యే మాతామహనివేశనే || ౭ ||

ఇక్ష్వాకూణామిహాద్యైవ కశ్చిద్రాజా విధీయతామ్ |
అరాజకం హి నో రాష్ట్రం న వినాశమవాప్నుయాత్ || ౮ ||

నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః |
అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణా || ౯ ||

నారాజకే జనపదే బీజముష్టిః ప్రకీర్యతే |
నారాజకే పితుః పుత్రః భార్యా వా వర్తతే వశే || ౧౦ ||

అరాజకే ధనం నాస్తి నాస్తి భార్యాఽప్యరాజకే |
ఇదమత్యాహితం చాన్యత్ కుతః సత్యమరాజకే || ౧౧ ||

నారాజకే జనపదే కారయంతి సభాం నరాః |
ఉద్యానాని చ రమ్యాణి హృష్టాః పుణ్యగృహాణి చ || ౧౨ ||

నారాజకే జనపదే యజ్ఞశీలా ద్విజాతయః |
సత్రాణ్యన్వాసతే దాంతా బ్రాహ్మణాః సంశితవ్రతాః || ౧౩ ||

నారాజకే జనపదే మహాయజ్ఞేషు యజ్వనః |
బ్రాహ్మణా వసుసంపన్నా విసృజంత్యాప్తదక్షిణాః || ౧౪ ||

నారాజకే జనపదే ప్రభూతనటనర్తకాః |
ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనాః || ౧౫ ||

నారజకే జనపదే సిద్ధార్థా వ్యవహారిణః |
కథాభిరనురజ్యంతే కథాశీలాః కథాప్రియైః || ౧౬ ||

నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః |
సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః || ౧౭ ||

నారాజకే జనపదే వాహనైః శీఘ్రగామిభిః |
నరా నిర్యాంత్యరణ్యాని నారీభిః సహ కామినః || ౧౮ ||

నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః |
శేరతే వివృత ద్వారాః కృషిగోరక్షజీవినః || ౧౯ ||

నారాజకే జనపదే బద్దఘంటావిషాణినః |
ఆటంతి రాజమార్గేషు కుంజరా షష్టిహాయనాః || ౨౦ ||

నారాజకే జనపదే శరాన్ సతతమస్యతామ్ |
శ్రూయతే తలనిర్ఘోష ఇష్వస్త్రాణాముపాసనే || ౨౧ ||

నారాజకే జనపదే వణిజో దూరగామినః |
గచ్ఛంతి క్షేమమధ్వానం బహుపణ్యసమాచితాః || ౨౨ ||

నారాజకే జనపదే చరత్యేకచరః వశీ |
భావయన్నాత్మనాఽఽత్మానం యత్ర సాయంగృహో మునిః || ౨౩ ||

నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే |
నచాప్యరాజకే సేనా శత్రూన్ విషహతే యుధి || ౨౪ ||

నారాజకే జనపదే హృష్టైః పరమవాజిభిః |
నరాః సంయాంతి సహసా రథైశ్చ పరిమండితాః || ౨౫ ||

నారాజకే జనపదే నరాః శాస్త్రవిశారదాః |
సంవదంతోఽవతిష్ఠంతే వనేషూపవనేషు చ || ౨౬ ||

నారాజకే జనపదే మాల్యమోదకదక్షిణాః |
దేవతాభ్యర్చనార్థయ కల్ప్యంతే నియతైర్జనైః || ౨౭ ||

నారాజకే జనపదే చందనాగురురూషితాః |
రాజపుత్రా విరాజంతే వసంత ఇవ శాఖినః || ౨౮ ||

యథా హ్యనుదకా నద్యో యథా వాఽప్యతృణం వనమ్ |
అగోపాలా యథా గావస్తథా రాష్ట్రమరాజకమ్ || ౨౯ ||

ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసోః |
తేషాం యో నో ధ్వజో రాజ స దేవత్వమితో గతః || ౩౦ ||

నారాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్ |
మత్స్యా ఇవనరా నిత్యం భక్షయంతి పరస్పరమ్ || ౩౧ ||

యే హి సంభిన్నమర్యాదా నాస్తికాశ్చిన్న సంశయాః |
తేఽపి భావాయ కల్పంతే రాజదండనిపీడితాః || ౩౨ ||

యథా దృష్టిః శరీరస్య నిత్యమేవప్రవర్తతే |
తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవః సత్యధర్మయోః || ౩౩ ||

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౩౪ ||

యమో వైశ్రవణః శక్రో వరుణశ్చ మహాబలః |
విశేష్యంతే నరేంద్రేణ వృత్తేన మహతా తతః || ౩౫ ||

అహో తమైవేదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన |
రాజా చేన్న భవేల్లోకే విభజన్ సాధ్వసాధునీ || ౩౬ ||

జీవత్యపి మహారాజే తవైవ వచనం వయమ్ |
నాతిక్రమామహే సర్వే వేలాం ప్రాప్యేవ సాగరః || ౩౭ ||

స నః సమీక్ష్య ద్విజవర్య వృత్తమ్
నృపం వినా రాజ్యమరణ్యభూతమ్ |
కుమారమిక్ష్వాకు సుతం వదాన్యమ్
త్వమేవ రాజానమిహాభిషించ || ౩౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్ఠితమః సర్గః || ౬౭ ||

Ayodhya Kanda Sarga 67 Meaning In Telugu

మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు బ్రాహ్మణులు పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజ పురోహితుడైన వసిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు.

“నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్దకుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో (తాతగారి ఇంటిలో) ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది.

రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పుచేసిన వారిని శిక్షించే వారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్యీర్యము అవుతంఉది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలునిర్భయంగా తిరగడానికి భయపడతారు.

శత్రు రాజులు మన దేశము మీదికి దండెత్తే అవకాశము ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు, ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు.రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేదిరాజు. అందుకనే రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము అవుతుంది. కాబట్టి ఓ వసిష్ట మహర్షీ! మేము చెప్పిన విషయములను పరిశీలించి, ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం.” అని పలికారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము, అరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గః (68) >>

Leave a Comment