Ayodhya Kanda Sarga 70 In Telugu – అయోధ్యాకాండ సప్తతితమః సర్గః

అయోధ్యాకాండ సప్తతితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయి మీద ఆగ్రహంతో తన బాధను వ్యక్తం చేస్తాడు. భరతుడు రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పాలించే అర్హత కలిగినవారు కాదని కైకేయికి చెప్పుతాడు. భరతుడు రాముని అన్వేషణ కోసం, ఆయనను తిరిగి తీసుకురావడానికి నిర్ణయించుకుంటాడు. దశరథ మహారాజు మరణం, రాముని వనవాసం కారణంగా అయోధ్య నగరం విషాదంలో మునిగిపోతుంది. భరతుడు రాముని తిరిగి తీసుకురావడానికి పండితులతో, మంత్రులతో కలిసి వనానికి బయలుదేరుతాడు. ఈ సర్గ భరతుని ధర్మపాలన, రాముని పట్ల అతని భక్తి, కుటుంబ బాంధవ్యాలను ప్రధానంగా ప్రతిబింబిస్తుంది.

భరతప్రస్థానమ్

భరతే బ్రువతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహనాః |
ప్రవిశ్యాసహ్య పరిఖం రమ్యం రాజ గృహం పురమ్ || ౧ ||

సమాగమ్య తు రాజ్ఞా చ రాజపుత్రేణ చార్చితాః |
రాజ్ఞః పాదౌ గృహీత్వా తు తమూచుర్భరతం వచః || ౨ ||

పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః |
త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా || ౩ ||

ఇమాని చ మహార్హాణి వస్త్రాణ్యాభరణాని చ |
ప్రతిగృహ్య విశాలాక్ష మాతులస్య చ దాపయ || ౪ ||

అత్ర వింశతికోట్యస్తు నృపతేర్మాతులస్య తే |
దశకోట్యస్తు సంపూర్ణాస్తథైవ చ నృపాత్మజ || ౫ ||

ప్రతిగృహ్య చ తత్సర్వం స్వనురక్తః సుహృజ్జనే |
దూతానువాచ భరతః కామైః సంప్రతిపూజ్య తాన్ || ౬ ||

కచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ |
కచ్చిచ్చారోగతా రామే లక్ష్మణే చ మహాత్మని || ౭ ||

ఆర్యా చ ధర్మనిరతా ధర్మజ్ఞా ధర్మదర్శినీ |
అరోగా చాపి కౌసల్యా మాతా రామస్య ధీమతః || ౮ ||

కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞా జననీ లక్ష్మణస్య యా |
శత్రుఘ్నస్య చ వీరస్య సాఽరోగా చాపి మధ్యమా || ౯ ||

ఆత్మకామా సదా చండీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చాపి మే మాతా కైకేయీ కిమువాచ హ || ౧౦ ||

ఏవముక్తాస్తు తే దూతాః భరతేన మహాత్మనా |
ఊచుః సంప్రశ్రయం వాక్యమిదం తం భరతం తదా || ౧౧ ||

కుశలాస్తే నరవ్యాఘ్ర యేషాం కుశలమిచ్ఛసి |
శ్రీశ్చ త్వాం వృణుతే పద్మా యుజ్యతాం చాపి తే రథః || ౧౨ ||

భరతశ్చాపి తాన్ దూతాన్ ఏవముక్తోఽభ్యభాషత |
ఆపృచ్చేఽహం మహారాజం దూతాః సంత్వరయంతి మామ్ || ౧౩ ||

ఏవముక్త్వా తు తాన్ దూతాన్ భరతః పార్థివాత్మజః |
దూతైః సంచోదితః వాక్యం మాతామహమువాచ హ || ౧౪ ||

రాజన్ పితుర్గమిష్యామి సకాశం దూతచోదితః |
పునరప్యహమేష్యామి యదా మే త్వం స్మరిష్యసి || ౧౫ ||

భరతేనైవముక్తస్తు నృపో మాతామహస్తదా |
తమువాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవమ్ || ౧౬ ||

గచ్ఛ తాతానుజానే త్వాం కైకేయీసుప్రజాస్త్వయా |
మాతరం కుశలం బ్రూయాః పితరం చ పరంతప || ౧౭ ||

పురోహితం చ కుశలం యే చాన్యే ద్విజ సత్తమాః |
తౌ చ తాత మహేష్వాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౮ ||

తస్మై హస్త్యుత్తమాంశ్చిత్రాన్ కంబలానజినాని చ |
అభిసత్కృత్య కైకేయో భరతాయ ధనం దదౌ || ౧౯ ||

రుక్మనిష్కసహస్రే ద్వే షోడశాశ్వశతాని చ |
సత్కృత్య కైకేయీపుత్రం కేకయో ధనమాదిశత్ || ౨౦ ||

తథాఽమాత్యానభిప్రేతాన్ విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్ |
దదావశ్వపతిః క్షిప్రం భరతాయానుయాయినః || ౨౧ ||

ఐరావతానైంద్రశిరాన్ నాగాన్వై ప్రియదర్శనాన్ |
ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్తాన్ మాతులోఽస్మై ధనం దదౌ || ౨౨ ||

అంతఃపురేఽతి సంవృద్ధాన్ వ్యాఘ్రవీర్యబలాన్వితాన్ |
దంష్ట్రాఽఽయుధాన్ మహాకాయాన్ శునశ్చోపాయనం దదౌ || ౨౩ ||

స దతం కేకయేంద్రేణ ధనం తన్నాభ్యనందత |
భరతః కైకయీపుత్రః గమనత్వరయా తదా || ౨౪ ||

బభూవ హ్యస్య హృదతే చింతా సుమహతీ తదా |
త్వరయా చాపి దూతానాం స్వప్నస్యాపి చ దర్శనాత్ || ౨౫ ||

స స్వవేశ్మాభ్యతిక్రమ్య నరనాగశ్వసంవృతమ్ |
ప్రపేదే సుమహచ్ఛ్రీమాన్ రాజమార్గమనుత్తమమ్ || ౨౬ ||

అభ్యతీత్య తతోఽపశ్యదంతః పురముదారధీః |
తతస్తద్భరతః శ్రీమానావివేశానివారితః || ౨౭ ||

స మాతా మహమాపృచ్ఛ్య మాతులం చ యుధాజితమ్ |
రథమారుహ్య భరతః శత్రుఘ్నసహితో యయౌ || ౨౮ ||

రథాన్ మండల చక్రాంశ్చ యోజయిత్వా పరః శతమ్ |
ఉష్ట్ర గోఽశ్వఖరైః భృత్యా భరతం యాంతమన్వయుః || ౨౯ ||

బలేన గుప్తః భరతః మహాత్మా
సహార్యకస్యాఽత్మ సమైరమాత్యైః |
ఆదాయ శత్రుఘ్నమపేతశత్రుః
గృహాత్ యయౌ సిద్ధైవేంద్రలోకాత్ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తతితమః సర్గః || ౭౦ ||

Ayodhya Kanda Sarga 70 Meaning In Telugu

భరతుడు తనకు వచ్చిన కల గురించి తనస్నేహితునికి చెబుతున్న సమయంలో అయోధ్యనుండి వచ్చిన దూతలు భరతుని వద్దకు వచ్చారు. కేకయ రాజును కలుసుకున్నారు. కేకయ రాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్యనుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకయ రాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు.

“రాజకుమారా! తమ కులగురువు వసిష్ఠుడు, తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వసిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరము ఉన్నదట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మని చెప్పారు. అ దూతలు వసిష్ఠుడు చెప్పినట్టు చెప్పారు.

భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. “దూతలారా! నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా. నా అన్న రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా! రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉన్నదా! లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నదా! స్వాతిశయము కలదీ, ఎల్లప్పుడూ తన సుఖము మాత్రమే చూచుకొనేదీ, కోపస్వభావము కలదీ, గర్విష్టీ అయిన మా తల్లి కైక క్షేమంగా ఉన్నదా! మా అమ్మ నాతో చెప్పమని ఏమైనా సమాచారము పంపినదా! ” అని ఆతురతగా అడిగాడు భరతుడు.

ఆ మాటలకు దూతలు ఇలా బదులు చెప్పారు. “రాకుమారా! నీవు ఎవరెవరినీ అయితే అడిగావో వారందరూ క్షేమంగా ఉన్నారు. నిన్ను లక్ష్మీదేవి వరించినది. (నిన్ను రాజ్యలక్ష్మి వరించినది. అయోధ్యకు రాజు కాబోతున్నావు అని నర్మగర్భంగా చెప్పారు). తమరు మాత్రం వెంటనే అయోధ్యకు బయలుదేరండి.” అని అన్నారు. దూతలు తొందర పెట్టడం చూచిన భరతుడు తన మేనమామ, తాతగారికి నమస్కరించి వారితో ఇలా అన్నాడు.

“మహారాజా! అయోధ్యనుండి నన్నుతీసుకొని పోవుటకు దూతలు వచ్చారు. మా కులగురువు వసిష్టులవారు నన్ను వెంటనే రమ్మన్నారట. అందుకని నాకు అనుమతి ఇస్తే నేను, శత్రుఘ్నుడు అయోధ్యకు వెళతాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము.” అనికేకయ రాజు అనుమతి కోరాడు భరతుడు. కేకయ రాజు సంతోషంగా అనుమతించాడు. “నాయనా! భరతా! నీ తండ్రి దశరథుని, నీ తల్లి కైక క్షేమము అడిగినట్టు చెప్పు. పురోహితులు వసిష్ఠునికి, బ్రాహ్మణులకు నా నమస్కారములు తెలియచెయ్యి. నీసోదరులు రామ లక్ష్మణులకు నా ఆశీర్వచనములు తెలియచెయ్యి.” అని పలికాడు.

తరువాత కేకయ రాజు అనేక విలువైన వస్తువులను కానుకలను అయోధ్యకు పంపాడు. భరత శత్రుఘ్నులకు కూడా విలువైన కానుకలు ఇచ్చాడు. మార్గములో సహాయానికి విశ్వాసము గల సైనికులను పంపాడు. భరతునికి తనకు వచ్చిన స్వప్నము, ఇప్పుడు దూతలు తొందర పెట్టడం చూచి ఏదో కీడు శంకిస్తున్నాడు. అందుకని తాతగారు, మేనమామ ఇచ్చిన కానుకలు అతనికి సంతోషము కలిగించడం లేదు. భరత శత్రుఘ్నులు రథంఎక్కారు. వారు ఎక్కిన రథము అయోధ్యకు బయలుదేరింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Leave a Comment