అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు మరియు వారి సహచరులు అరణ్యానికి చేరుకుని రాముడిని కలుసుకుంటారు. భరతుడు రాముని పాదాలకు నమస్కరిస్తూ అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, తండ్రి ఆజ్ఞను అవహేళన చేయలేమని స్పష్టం చేస్తాడు. భరతుడు రాముడికి పాదుకలను తీసుకువచ్చి, తన స్థానంలో రాజ్యం పాలించాలని కోరుతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుడిని అంగీకరిస్తాడు. ఈ సర్గలో రాముడు తన వ్రతాన్ని కొనసాగిస్తూ, భరతుడు తన తమ్ముడి కర్తవ్యాన్ని గౌరవిస్తూ, పాదుకలను తీసుకుని తిరిగి వెళతాడు.
కైకేయీవిగర్హణమ్
శ్రుత్వా తు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ |
భరతో దుఃఖ సంతప్తైదం వచనమబ్రవీత్ || ౧ ||
కిం ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః |
విహీనస్యాథ పిత్రా చ భ్రాత్రా పితృసమేన చ || ౨ ||
దుఃఖే మే దుఃఖమకరోర్వృణే క్షారమివాదధాః |
రాజానం ప్రేతభావస్థం కృత్వా రామం చ తాపసమ్ || ౩ ||
కులస్య త్వమభావాయ కాల రాత్రిరివాగతా |
అఙ్గారముపగూహ్య స్మ పితా మే నావబుద్ధవాన్ || ౪ ||
మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని |
సుఖం పరిహృతం మోహాత్కులేఽస్మిన్ కులపాంసిని || ౫ ||
త్వాం ప్రాప్య హి పితా మేఽద్య సత్యసంధో మహాయశాః |
తీవ్రదుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపః || ౬ ||
వినాశితో మహారాజః పితా మే ధర్మవత్సలః |
కస్మాత్ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనం గతః || ౭ ||
కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకాభిపీడితే |
దుష్కరం యది జీవేతాం ప్రాప్య త్వాం జననీం మమ || ౮ ||
నను త్వార్యోఽపి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమామ్ |
వర్తతే గురువృత్తిజ్ఞో యథా మాతరి వర్తతే || ౯ ||
తథా జ్యేష్ఠా హి మే మాతా కౌసల్యా దీర్ఘదర్శినీ |
త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే || ౧౦ ||
తస్యాః పుత్రం కృతాత్మానం చీరవల్కలవాససమ్ |
ప్రస్థాప్య వనవాసాయ కథం పాపే న శోచసి || ౧౧ ||
అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినమ్ |
ప్రవ్రాజ్య చీరవసనం కిం ను పశ్యసి కారణమ్ || ౧౨ ||
లుబ్ధాయా విదితః మన్యే న తేఽహం రాఘవం ప్రతి |
తథా హ్యనర్థో రాజ్యార్థం త్వయాఽఽనీతః మహానయమ్ || ౧౩ ||
అహం హి పురుషవ్యాఘ్రౌ అపశ్యన్ రామలక్ష్మణౌ |
కేన శక్తిప్రభావేన రాజ్యం రక్షితుముత్సహే || ౧౪ ||
తం హి నిత్యం మహారాజో బలవంతం మహాబలః |
అపాశ్రితోఽభూద్ధర్మాత్మా మేరుర్మేరువనం యథా || ౧౫ ||
సోఽహం కథమిమం భారం మహాధుర్యసముద్ధృతమ్ |
దమ్యో ధురమివాసాద్య సహేయం కేన చౌజసా || ౧౬ ||
అథవా మే భవేచ్ఛక్తిర్యోగైః బుద్ధి బలేన వా |
సకామాం న కరిష్యామి త్వామహం పుత్ర గర్ధినీమ్ || ౧౭ ||
న మే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయామ్ |
యది రామస్య నావేక్షా త్వయి స్యాన్మాతృవత్సదా || ౧౮ ||
ఉత్పన్నా తు కథం బుద్ధిస్తవేయం పాపదర్శినీ |
సాధుచారిత్రవిభ్రష్టే పూర్వేషాం నో విగర్హితా || ౧౯ ||
అస్మిన్కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః || ౨౦ ||
న హి మన్యే నృశంసే త్వం రాజధర్మమవేక్షసే |
గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీమ్ || ౨౧ ||
సతతం రాజవృత్తే హి జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
రాజ్ఞామేతత్సమం తత్స్యాదిక్ష్వాకూణాం విశేషతః || ౨౨ ||
తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్రశోభినామ్ |
అద్య చారిత్రశౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తతమ్ || ౨౩ ||
తవాపి సుమహాభాగాః జనేంద్రాః కులపూర్వగాః |
బుద్ధేర్మోహః కథమయం సంభూతస్త్వయి గర్హితః || ౨౪ ||
న తు కామం కరిష్యామి తవాఽహం పాపనిశ్చయే |
త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ || ౨౫ ||
ఏష త్విదానీమేవాహమప్రియార్థం తవనఘమ్ |
నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజనప్రియమ్ || ౨౬ ||
నివర్తయిత్వా రామం చ తస్యాహం దీప్తతేజసః |
దాసభూతో భవిష్యామి సుస్థిరేణాంతరాత్మనా || ౨౭ ||
ఇత్యేవముక్త్వా భరతః మహాత్మా
ప్రియేతరైః వాక్య గణైస్తుదంస్తామ్ |
శోకాతురశ్చాపి ననాద భూయః
సింహో యథా పర్వతగహ్వరస్థః || ౨౮ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమః సర్గః || ౭౩ ||
Ayodhya Kanda Sarga 73 Meaning In Telugu
తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు.
“అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా! అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు. కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేసావు? ఎవరి కోసం చేసావు ఇదంతా? ఇంత చేసికూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా!
అమ్మా! నేను, నీ కుమారుడు భరతుని, అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకురాజ్యము కట్టబెట్టడానికేనా! నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేసావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా! నీకు తెలుసో లేదో! నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలిం చాడు. అటువంటిది, రాముడు లేకుండా, నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒక వేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గానీ, నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేసావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమూ తీరదు.
అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈక్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ, రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కవ ప్రేమతో చూచుకొనే వాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను.
అమ్మా! నాకు తెలియక అడుగుతాను! నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా! దీని వలననీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా! అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది. నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేసావా!
మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకీ పెద్దవాడు రాజ్యభారము వహిస్తే, మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజ ధర్మము మీద గౌరవము లేదా! అమ్మా! ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో, అందరిలోకీ పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుం టారు. ఈ నాడు నీవు మా రాజధర్మానికి చేటుతెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకురాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఇదే నా నిశ్చయము.”అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దు:ఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.