Ayodhya Kanda Sarga 99 In Telugu – అయోధ్యాకాండ ఏకోనశతతమః సర్గః

అయోధ్యాకాండం ఏకోనశతతమ (99వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, సింహాసనంపై ఉంచి అయోధ్యను పాలించే క్రమంలో ఉన్నాడు. భరతుడు, ప్రజలకు రాముడు తిరిగి వచ్చే వరకు తాను రాముని ప్రతినిధిగా ఉంటానని ప్రకటిస్తాడు. అతను ధర్మబద్ధంగా, న్యాయంగా పాలన కొనసాగిస్తాడు. ప్రజలు భరతుని నిస్వార్థతను మెచ్చుకుంటారు. ఈ సర్గలో, భరతుడు నందిగ్రామానికి వెళ్ళి, అక్కడ నివసిస్తూ పాలనను పర్యవేక్షించడానికి సిద్ధమవుతాడు. అతను వలమాలిన వాస్రాలు ధరించి, నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. భరతుడు, రాముడు తిరిగి వస్తాడని ఆశతో, తన విధిని నిర్వర్తిస్తాడు.

రామసమాగమః

నివిష్టాయాం తు సేనాయాముత్సుకో భరతస్తదా |
జగామ భ్రాతరం ద్రష్టుం శత్రుఘ్నమనుదర్శయన్ || ౧ ||

ఋషిం వసిష్ఠం సందిశ్య మాతౄర్మే శీఘ్రమానయ |
ఇతి త్వరితమగ్రే సః జగామ గురువత్సలః || ౨ ||

సుమంత్రస్త్వపి శత్రుఘ్నమదూరాదన్వపద్యత |
రామదర్శనజస్తర్షో భరతస్యేవ తస్య చ || ౩ ||

గచ్ఛన్నేవాథ భరతస్తాపసాలయసంస్థితామ్ |
భ్రాతుః పర్ణకుటీం శ్రీమానుటజం చ దదర్శ హ || ౪ ||

శాలాయాస్త్వగ్రతస్తస్యాః దదర్శ భరతస్తదా |
కాష్ఠాని చావభగ్నాని పుష్పాణ్యుపచితాని చ || ౫ ||

స లక్ష్మణస్య రామస్య దదర్శాశ్రమమీయుషః |
కృతం వృక్షేష్వభిజ్ఞానం కుశచీరైః క్వచిత్ క్వచిత్ || ౬ ||

దదర్శ చ వనే తస్మిన్మహతః సంచయాన్ కృతాన్ |
మృగాణాం మహిషాణాం చ కరీషైః శీతకారణాత్ || ౭ ||

గచ్ఛన్నేవ మహాబాహుర్ద్యుతిమాన్ భరతస్తదా |
శత్రుఘ్నం చాబ్రవీద్ధృష్టస్తానమాత్యాంశ్చ సర్వశః || ౮ ||

మన్యే ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజో యమబ్రవీత్ |
నాతిదూరే హి మన్యేఽహం నదీం మందాకినీమితః || ౯ ||

ఉచ్చైర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయమ్ |
అభిజ్ఞానకృతః పంథా వికాలే గంతుమిచ్ఛతా || ౧౦ ||

ఇదం చోదాత్తదంతానాం కుంజరాణాం తరస్వినామ్ |
శైలపార్శ్వే పరిక్రాంతమన్యోన్యమభిగర్జతామ్ || ౧౧ ||

యమేవాధాతుమిచ్ఛంతి తాపసాః సతతం వనే |
తస్యాసౌ దృశ్యతే ధూమః సంకులః కృష్ణవర్త్మనః || ౧౨ ||

అత్రాహం పురుషవ్యాఘ్రం గురుసంస్కారకారిణమ్ |[సత్కారకారిణమ్]
ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షిమివ రాఘవమ్ || ౧౩ ||

అథ గత్వా ముహూర్తం తు చిత్రకూటం స రాఘవః |
మందాకినీమనుప్రాప్తస్తం జనం చేదమబ్రవీత్ || ౧౪ ||

జగత్యాం పురుషవ్యాఘ్రాస్తే వీరాసనే రతః |
జనేంద్రో నిర్జనం ప్రాప్య ధిజ్ఞ్మే జన్మ సజీవితమ్ || ౧౫ ||

మత్కృతే వ్యసనం ప్రాప్తో లోకనాథో మహాద్యుతిః |
సర్వాన్కామాన్పరిత్యజ్య వనే వసతి రాఘవః || ౧౬ ||

ఇతి లోకసమాక్రుష్టః పాదేష్వద్య ప్రసాదయన్ |
రామస్య నిపతిష్యామి సీతాయా లక్ష్మణస్య చ || ౧౭ ||

ఏవం స విలపంస్తస్మిన్ వనే దశరథాత్మజః |
దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాలాం మనోరమామ్ || ౧౮ ||

సాలతాలాశ్వకర్ణానాం పర్ణైర్బహుభిరావృతామ్ |
విశాలాం మృదుభిస్తీర్ణాం కుశైర్వేదిమివాధ్వరే || ౧౯ ||

శక్రాయుధనికాశైశ్చ కార్ముకైర్భారసాధనైః |
రుక్మపృష్ఠైర్మహాసారైః శోభితాం శత్రుబాధకైః || ౨౦ ||

అర్కరశ్మిప్రతీకాశైర్ఘోరైస్తూణీగతైః శరైః |
శోభితాం దీప్తవదనైః సర్పైర్భోగవతీమివ || ౨౧ ||

మహారజతవాసోభ్యామసిభ్యాం చ విరాజితామ్ |
రుక్మబిందువిచిత్రాభ్యాం చర్మభ్యాం చాపి శోభితామ్ || ౨౨ ||

గోధాంగుళిత్రైరాసక్తైశ్చిత్రైః కాంచనభూషితైః |
అరిసంఘైరనాధృష్యాం మృగైః సింహగుహామివ || ౨౩ ||

ప్రాగుదక్ప్రవణాం వేదిం విశాలాం దీప్తపావకామ్ |
దదర్శ భరతస్తత్ర పుణ్యాం రామనివేశనే || ౨౪ ||

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ |
ఉటజే రామమాసీనం జటామండలధారిణమ్ || ౨౫ ||

తం తు కృష్ణాజినధరం చీరవల్కలవాససమ్ |
దదర్శ రామమాసీనమభితః పావకోపమమ్ || ౨౬ ||

సింహస్కంధం మహాబాహుం పుండరీకనిభేక్షణమ్ |
పృథివ్యాః సాగరాంతాయా భర్తారం ధర్మచారిణమ్ || ౨౭ ||

ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతమ్ |
స్థండిలే దర్భసంస్తీర్ణే సీతయా లక్ష్మణేన చ || ౨౮ ||

తం దృష్ట్వా భరతః శ్రీమాన్ దుఃఖశోకపరిప్లుతః |
అభ్యధావత ధర్మాత్మా భరతః కైకయీసుతః || ౨౯ ||

దృష్ట్వైవ విలలాపార్తో బాష్పసందిగ్ధయా గిరా |
అశక్నువన్ ధారయితుం ధైర్యాద్వచనమబ్రవీత్ || ౩౦ ||

యః సంసది ప్రకృతిభిర్భవేద్యుక్తోపాసితుమ్ |
వన్యైర్మృగైరుపాసీనః సోఽయమాస్తే మమాగ్రజః || ౩౧ ||

వాసోభిర్బహుసాహస్రైర్యో మహాత్మా పురోచితః |
మృగాజినే సోఽయమిహ ప్రవస్తే ధర్మమాచరన్ || ౩౨ ||

అధారయద్యో వివిధాశ్చిత్రాః సుమనసస్తదా |
సోఽయం జటాభారమిమం వహతే రాఘవః కథమ్ || ౩౩ ||

యస్య యజ్ఞైర్యథోద్దిష్టైర్యుక్తో ధర్మస్య సంచయః |
శరీరక్లేశసంభూతం స ధర్మం పరిమార్గతే || ౩౪ ||

చందనేన మహార్హేణ యస్యాంగముపసేవితమ్ |
మలేన తస్యాంగమిదం కథమార్యస్య సేవ్యతే || ౩౫ ||

మన్నిమిత్తమిదం దుఃఖం ప్రాప్తో రామః సుఖోచితః |
ధిగ్జీవితం నృశంసస్య మమ లోకవిగర్హితమ్ || ౩౬ ||

ఇత్యేవం విలపన్దీనః ప్రస్విన్నముఖపంకజః |
పాదావప్రాప్య రామస్య పపాత భరతో రుదన్ || ౩౭ ||

దుఃఖాభితప్తో భరతో రాజపుత్రో మహాబలః |
ఉక్త్వార్యేతి సకృద్దీనం పునర్నోవాచ కించన || ౩౮ ||

బాష్పాపిహితకంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినమ్ |
ఆర్యేత్యేవాథ సంక్రుశ్య వ్యాహర్తుం నాశకత్తదా || ౩౯ ||

శత్రుఘ్నశ్చాపి రామస్య వవందే చరణౌ రుదన్ |
తావుభౌ స సమాలింగ్య రామశ్చాశ్రూణ్యవర్తయత్ || ౪౦ ||

తతః సుమంత్రేణ గుహేన చైవ
సమీయతూ రాజసుతావరణ్యే |
దివాకరశ్చైవ నిశాకరశ్చ
యథాంబరే శుక్రబృహస్పతిభ్యామ్ || ౪౧ ||

తాన్పార్థివాన్వారణయూథపాభాన్
సమాగతాంస్తత్ర మహత్యరణ్యే |
వనౌకసస్తేఽపి సమీక్ష్య సర్వే-
-ప్యశ్రూణ్యముంచన్ ప్రవిహాయ హర్షమ్ || ౪౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనశతతమః సర్గః || ౯౯ ||

Ayodhya Kanda Sarga 99 Meaning In Telugu

శత్రుఘ్నుడు తన వెంటరాగా భరతుడు వడి వడి గా రాముని వద్దకు వెళుతున్నాడు. భరతుని వెనక వసిష్ఠుడు, దశరథుని ముగ్గురు భార్యలను తీసుకొని వెళుతున్నాడు. సుమంత్రుడు కూడా భరతుని వెనుకనే వెళుతున్నాడు.

భరతునికి దూరంగా ఒక పర్ణశాల కనపడింది. ఆ పర్ణశాల ముందు కొన్ని కట్టెలు,పుష్పములు కనపడ్డాయి. అక్కడ ఉన్న చెట్లకు కొన్ని నారచీరలు వేలాడుతున్నాయి. రాముడు అక్కడే ఉన్నాడు అని రూఢి అయింది భరతునికి. ఉద్వేగంతో వెళుతున్నాడు భరతుడు.

“శత్రుఘ్నా! చూచావా! ఇదే భరద్వాజుడు చెప్పిన ప్రదేశము. ఇక్కడే మందాకినీ నదిప్రవహించుచున్నది. ఇక్కడి చెట్లకు నారచీరలు వేలాడుతూ ఉన్నాయి. అదుగో ఆపర్ణశాల దగ్గర ఉన్న అగ్నినుండిపుట్టిన పొగ పైకి లేస్తూ ఉంది. రాముడు ఇక్కడే ఉన్నాడు అని నా అనుమానము. మనము ఇక్కడే రాముని చూస్తాము.

సుమంతా! అయోధ్యా సింహాసనముమీద కూర్చోవలసిన రాముడు ఇక్కడ కటిక నేల మీద పద్మాసనము వేసుకొని కూర్చొని ఉన్నాడు. దీని కంతటికీ నేనేకారణము. నా మూలముననే రామునికి ఇన్ని కష్టములు వచ్చినవి. నేను, రాముడు సీత పాదముల మీద పడి క్షమాపణ కోరిన కాని నా మనసు శాంతించదు.” అని అంటూ భరతుడు దూరంగా ఉన్న ఆ పర్ణశాల వైపు నడుస్తున్నాడు.

భరతుడు ఆ పర్ణశాలను సమీపించాడు. భరతుని మనస్సంతా ఉద్వేగపూరితంగా ఉంది. ఆ పర్ణశాల లోపలికి తొంగి చూచాడు. జటలు కట్టిన వెంట్రుకలతో, నేల మీద జింక చర్మము పరచుకొని దాని మీద కూర్చుని ఉన్న రాముని చూచాడు భరతుడు. రామునికి అటు ఇటు సీత లక్ష్మణులు కూర్చొని ఉన్నారు.

భరతునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. రాముడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాడు. భరతుని కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కళ్లు సరిగా కనిపించడం లేదు. దు:ఖముతో గొంతు బొంగురుపోయింది. ఆ బొంగురుగొంతుతో భరతుడు ఇలా అన్నాడు.

“రామా! నీవా ఈ నేలమీద కూర్చొని ఉన్నది. అమాత్యులు సేవిస్తూ ఉంటే, రాజ సింహాసనము మీద కూర్చోవలసిన నీవు జింక చర్మమీద కూర్చొని ఉన్నావా! పట్టు పీతాంబరములు ధరించవలసిన నీవు నారచీరలు కట్టుకొని ఉన్నావా! చిత్ర విచిత్రములైన పుష్పములు ధరించవలసిన నీ శిరసు మీద ఆ జటలు ఎలా ధరించావు? ఒక రాజుగా యజ్ఞయాగములు చేయవలసిన నీవు, ఇక్కడ అడవులలో కష్టములు పడుతున్నావా? అగరు, చందనముతో అలరార వలసిన నీ శరీరము మట్టికొట్టుకొని పోయినదా! సుఖపడవలసిన నీవు ఇలా కష్టములు పడుతుంటే ఆ కష్టములకు కారణమైన నాకు ఈ సుఖములు ఎందుకు?” అని ఏడుస్తూ రాముని పాదముల మీద పడ్డాడు భరతుడు. రాముని పాదములను తన కన్నీటితో తడుపుతున్నాడు.

ఒక సారి తల ఎత్తి రామా! అని పిలిచి మరలా రాముని పాదముల మీదపడిపోయాడు భరతుడు. తరువాత భరతునికి మాటలు రాలేదు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. శత్రుఘ్నుడు కూడాదు:ఖము ఆపుకోలేక రాముని పాదముల మీద పడ్డాడు.

రాముడు తమ్ములను చూచిన సంభ్రమంతో భరత శత్రుఘ్నులను తన రెండు చేతులతో పొదివి పట్టుకొని లేవనెత్తాడు. రాముడు భరత శత్రుఘ్నులను గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు, రామునికి కూడా దుఃఖము ఆగలేదు. భోరున విలపిస్తున్నాడు. ఇంతలో వెనుకగా వస్తున్న సుమంత్రుడు, వసిష్ఠుడు కూడా పర్ణశాల లోపలికి వచ్చారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ శతతమః సర్గః (100) >>

Leave a Comment