Aranya Kanda Sarga 27 In Telugu – అరణ్యకాండ సప్తవింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తవింశః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఇందులో రాముడు, సీత, లక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి చేరుకొని కబంధుడిని ఎదుర్కొంటారు. కబంధుడు రాక్షసుడు, శాపం కారణంగా అతని శరీరం విచిత్రంగా ఉంటుంది. రామ, లక్ష్మణులు అతన్ని సంహరిస్తారు.

త్రిశిరోవధః

ఖరం తు రామాభిముఖం ప్రయాంతం వాహినీపతిః |
రాక్షసస్త్రిశిరా నామ సన్నిపత్యేదమబ్రవీత్ ||

1

మాం నియోజయ విక్రాంత సన్నివర్తస్వ సాహసాత్ |
పశ్య రామం మహాబాహుం సంయుగే వినిపాతితమ్ ||

2

ప్రతిజానామి తే సత్యమాయుధం చాహమాలభే |
యథా రామం వధిష్యామి వధార్హం సర్వరక్షసామ్ ||

3

అహం వాఽస్య రణే మృత్యురేష వా సమరే మమ |
వినివృత్య రణోత్సాహాన్ ముహూర్తం ప్రాశ్నికో భవ ||

4

ప్రహృష్టే వా హతే రామే జనస్థానం ప్రయాస్యసి |
మయి వా నిహతే రామం సంయుగాయోపయాస్యసి ||

5

ఖరస్త్రిశిరసా తేన మృత్యులోభాత్ప్రసాదితః |
గచ్ఛ యుధ్యేత్యనుజ్ఞాతో రాఘవాభిముఖో యయౌ ||

6

త్రిశిరాశ్చ రథేనైవ వాజియుక్తేన భాస్వతా |
అభ్యద్రవద్రణే రామం త్రిశృంగ ఇవ పర్వతః ||

7

శరధారాసమూహాన్ స మహామేఘ ఇవోత్సృజమ్ |
వ్యసృజత్సదృశం నాదం జలార్ద్రస్య తు దుందుభేః ||

8

ఆగచ్ఛంత త్రిశిరసం రాక్షసం ప్రేక్ష్య రాఘవః |
ధనుషా ప్రతిజగ్రాహ విధూన్వన్ సాయకాన్ శితాన్ ||

9

స సంప్రహారస్తుములో రామత్రిశిరసోర్మహాన్ |
బభూవాతీవ బలినోః సింహకుంజరయోరివ ||

10

తతస్త్రిశిరసా బాణైర్లలాటే తాడితాస్త్రిభిః |
అమర్షీ కుపితో రామః సంరబ్ధమిదమబ్రవీత్ ||

11

అహో విక్రమశూరస్య రాక్షసస్యేదృశం బలమ్ |
పుష్పైరివ శరైర్యస్య లలాటేఽస్మి పరిక్షతః ||

12

మమాపి ప్రతిగృహ్ణీష్వ శరాంశ్చాపగుణచ్యుతాన్ |
ఏవముక్త్వా తు సంరబ్ధః శరానాశీవిషోపమాన్ ||

13

త్రిశిరోవక్షసి క్రుద్ధో నిజఘాన చతుర్దశ |
చతుర్భిస్తురగానస్య శరైః సన్నతపర్వభిః ||

14

న్యపాతయత తేజస్వీ చతురస్తస్య వాజినః |
అష్టభిః సాయకైః సూతం రథోపస్థాన్ న్యపాతయత్ ||

15

రామశ్చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్ఛ్రితమ్ |
తతో హతరథాత్తస్మాదుత్పతంతం నిశాచరమ్ ||

16

విభేద రామస్తం బాణైర్హృదయే సోభవజ్జడః |
సాయకైశ్చాప్రమేయాత్మా సామర్షస్తస్య రక్షసః ||

17

శిరాంస్యపాతయద్రామో వేగవద్భిస్త్రిభిః శితైః |
స భూమౌ రుధిరోద్గారీ రామబాణాభిపీడితః ||

18

న్యపతత్పతితైః పూర్వం స్వశిరోభిర్నిశాచరః |
హతశేషాస్తతో భగ్నా రాక్షసాః ఖరసంశ్రయాః ||

19

ద్రవంతి స్మ న తిష్ఠంతి వ్యాఘ్రత్రస్తా మృగా ఇవ |
తాన్ ఖరో ద్రవతో దృష్ట్వా నివర్త్య రుషితః స్వయమ్ |
రామమేవాభిదుద్రావ రాహుశ్చంద్రమసం యథా ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తవింశః సర్గః ||

Aranya Kanda Sarga 27 Meaning In Telugu

త్రిశిరస్సుడు అనే సైన్యాధిపతి ఖరుడు రాముని వైపు దూసుకువెళ్లడం చూచాడు. వెంటనే త్రిశిరస్సుడు ఖరుడి వద్దకు వచ్చాడు.

“ఓ వీరుడా! ఒక సాధారణ మానవుని సంహరించడానికి నీవు వెళ్లవలెనా! మేము లేమా! నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్లి రాముని సంహరిస్తాను. ఈ రాముడి చావు నా చేతిలో ఉంది. నేను చంపుతాను. లేకపోతే రాముని చేతిలో నేను చస్తాను. నువ్వు మాత్రం చూస్తూ ఉండు. ఒక వేళ నేను రాముణ్ణి చంపితే మనం అందరం ఆనందంతో జనస్థానమునకు వెళ్ళాము. లేక రాముడు నన్ను చంపితే, అప్పుడు నువ్వే వెళ్లి రాముని చంపవచ్చును.” అని అన్నాడు త్రిశిరుడు.

ఆమాటలు విన్న ఖరుడు ఆనందంతో త్రిశిరునికి రామునితో యుద్ధము చేయమని అనుమతి ఇచ్చాడు. త్రిశిరుడు తన రథము ఎక్కి రాముని మీదికి యుద్ధమునకు వెళ్లాడు. రాముని మీద బాణములను వర్షము వలె కురిపించాడు. ఆ బాణములనన్నింటికీ రాముడు మధ్యలోనే తుంచాడు.

రాముడు త్రిశిరస్సుల మధ్య పోరు భయంకరంగా జరిగింది. త్రిశిరుడు రాముని నుదుటిపై తగిలేటట్టు మూడు బాణములను వదిలాడు. రాముడు కోపించి సర్పములవలె దూసుకు వెళ్లే నాలుగు బాణములను త్రిశిరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. మరొక నాలుగు బాణములతో త్రిశిరుడు ఎక్కిన రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. త్రిశిరుడు తేరుకొనే లోపల రాముడు అతని రథము నడుపుతున్న సారథిని చంపాడు. మరొక బాణంతో త్రిశిరుని పతాకమును విరిచాడు.

త్రిశిరుడు రథమునుండి పైకి ఎగరబోయాడు. ఎగిరే ఆ త్రిశిరుని గుండెలకు గురిపెట్టి రాముడు నాలుగు బాణములను ప్రయోగించాడు. మరొక మూడు బాణములను సంధించి త్రిశిరుని మూడు తలలను ఖండించాడు. త్రిశిరుని తలలు తాటికాయల మాదిరి నేలమీద పడ్డాయి. ఆ వెంటనే త్రిశిరుని శరీరము నేలమీద పడింది.

ఎప్పుడైతే త్రిశిరుడు చచ్చాడో, అతని సేనలు చెల్లాచెదురుగా పారిపోయాయి. రాక్షస సేనలు వెనుతిరిగి పారిపోవడం చూచాడు ఖరుడు. త్రిశిరుడు చచ్చాడు అని తెలుసుకున్నాడు ఖరుడు. పారిపోతున్న సేనలను కూడగట్టుకొని రాముని మీదికి యుద్ధానికి వెళ్లాడు ఖరుడు.

శ్రీమద్రామాయణము,
అరణ్యకాండము ఇరువదిఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టావింశః సర్గః (28) >>

Leave a Comment