Balakanda Sarga 13 In Telugu – బాలకాండ త్రయోదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో త్రయోదశః సర్గలో రాజు దశరథుడు వైదిక కర్మకు సంబంధించిన పనులను ప్రారంభించమని రాజ పురోహితుడైన వశిష్ట ఋషిని అభ్యర్థించాడు. వశిష్ఠ మహర్షి కార్యాలను అమలు చేయడంలో పాటించాల్సిన క్రమశిక్షణ గురించి సంబంధిత వారందరికీ సూచించాడు. వశిష్ఠ మహర్షి మంత్రివర్యుడైన సుమంత్రుడికి ఇతర దేశాలలోని వివిధ రాజులను ఆహ్వానించమని ఆదేశిస్తాడు, మరియు ఆ రాజులను గొప్ప ఆతిథ్యంతో స్వాగతిస్తారు. దశరథ రాజు తన భార్యలతో కలిసి కర్మ ప్రతిజ్ఞ చేసి కర్మ మందిరంలోకి ప్రవేశిస్తాడు.

యజ్ఞశాలాప్రవేశః

పునః ప్రాప్తే వసంతే తు పూర్ణః సంవత్సరోఽభవత్ |
ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్ ||

1

అభివాద్య వసిష్ఠం చ న్యాయతః ప్రతిపూజ్య చ |
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమమ్ ||

2

యజ్ఞో మే ప్రీయతాం బ్రహ్మన్యథోక్తం మునిపుంగవ | [క్రియతాం]
యథా న విఘ్నః క్రియతే యజ్ఞాంగేషు విధీయతామ్ ||

3

భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ |
వోఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః ||

4

తథేతి చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః |
కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్ ||

5

తతోఽబ్రవీద్ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్ |
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్పరమధార్మికాన్ ||

6

కర్మాంతికాన్ శిల్పకరాన్వర్ధకీన్ఖనకానపి |
గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ ||

7

తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్సుబహుశ్రుతాన్ |
యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసనాత్ ||

8

ఇష్టకా బహుసాహస్రా శీఘ్రమానీయతామితి |
ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞాం బహుగుణాన్వితాః ||

9

బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః |
భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః ||

10

తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః |
[* అధికపాఠః –
ఆగతానాం సుదూరాచ్చ పార్థివానాం పృథక్ పృథక్ |
వాజివారణశాలాశ్చ తథా శయ్యాగృహాణి చ |
భటానాం మహదావాసా వైదేశికనివాసినామ్ |
*]
ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితాః ||

11

తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్ |
దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా ||

12

సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి ||

13

యజ్ఞకర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా |
తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్ ||

14

తే చ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ |
యథా సర్వం సువిహితం న కించిత్పరిహీయతే ||

15

తథా భవంతః కుర్వంతు ప్రీతిస్నిగ్ధేన చేతసా |
తతః సర్వే సమాగమ్య వసిష్ఠమిదమబ్రువన్ ||

16

యథోక్తం తత్సువిహితం న కించిత్పరిహీయతే |
తతః సుమంత్రమాహూయ వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||

17

నిమంత్రయస్వ నృపతీన్పృథివ్యాం యే చ ధార్మికాః |
బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః ||

18

సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్ |
మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్ ||

19

నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్ |
తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్ ||

20

పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే |
తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్ ||

21

సద్వృత్తం దేవసంకాశం స్వయమేవానయస్వ హ |
తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్ ||

22

శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ |
అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతమ్ ||

23

వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్ |
ప్రాచీనాన్సింధుసౌవీరాన్సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ ||

24

దాక్షిణాత్యాన్నరేంద్రాశ్చ సమస్తానానయస్వ హ |
సంతి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే ||

25

తానానయ తతః క్షిప్రం సానుగాన్సహబాంధవాన్ |
[* ఏతాన్ దూతైః మహాభాగైః ఆనయస్వ నృపాజ్ఞ్యా | *]
వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమంత్రస్త్వరితస్తదా ||

26

వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్ |
స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్ ||

27

సుమంత్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః |
తే చ కర్మాంతికాః సర్వే వసిష్ఠాయ చ ధీమతే ||

28

సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితమ్ |
తతః ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్సర్వానిదమబ్రవీత్ ||

29

అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా |
అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః ||

30

తతః కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షితః |
బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య హ ||

31

తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్ |
ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్ ||

32

మయా చ సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః |
యజ్ఞియం చ కృతం రాజన్పురుషైః సుసమాహితైః ||

33

నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమంతికాత్ |
సర్వకామైరుపహృతైరుపేతం వై సమంతతః ||

34

ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితమ్ |
తథా వసిష్ఠవచనాద్దృశ్యశృంగస్య చోభయోః ||

35

శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః |
తతో వసిష్ఠప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః ||

36

ఋశ్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తదా |
యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి |
శ్రీమాంశ్చ సహపత్నీభీ రాజా దీక్షాముపావిశత్ ||

37

Balakanda Sarga 13 In Telugu Pdf With Meaning

యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్టులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. “మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి.” అని వారిని ప్రార్థించాడు.

“మహారాజా! మీరు కోరినట్లే జరుగుతుంది” అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు.

తరువాత పురోహితుడైన వశిష్టుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, శిల్పులను, కొయ్యపనిచేసే వారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, “దశరథమహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఏలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధపెట్టకండి. ఈయజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకరర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు.” అని ఆదేశించాడు వశిష్టుడు.

పిమ్మట వశిష్టుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. “సుమంతా! నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపది జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొని రా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధి పతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పుదేశపు రాజులను, దక్షిణదేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ, సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు.” అని పలికాడు వశిష్టుడు.

వశిష్టుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు. ఆయాకార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయాపనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు. వసిష్టుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేసాడు. ఆవిషయము దశరథునికి చెప్పాడు.

వశిష్టుడు, ఋష్యశృంగుడు దశరథమహారాజు వద్దకు పోయి ” ఓ దశరథమహారాజా! మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞ శాలకు రావాలి.” అనిపలికారు.

ఒక శుభముహూర్తమున దశరథమహారాజు, తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వసిష్టుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదమూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ చతుర్దశః సర్గః (14) >>

Leave a Comment