Balakanda Sarga 16 In Telugu – బాలకాండ షోడశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 16వ సర్గ. ఈ సర్గలో, విష్వామిత్రుడు రామ-లక్ష్మణులను తనతో తీసుకువెళ్లి తాటకావనానికి చేరుకుంటాడు. తాటకావనం ఒక దివ్యమైన ప్రదేశం, కానీ తాటక అనే రాక్షసి వలన అది శూన్యంగా మారింది. విష్వామిత్రుడు రాముడిని తాటకను సంహరించమని ఆజ్ఞాపిస్తాడు.

పాయసోత్పత్తిః

తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః |
జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

1

ఉపాయః కో వధే తస్య రాక్షసాధిపతేః సురాః |
యమహం తం సమాస్థాయ నిహన్యామృషికంటకమ్ ||

2

ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్ |
మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే ||

3

స హి తేపే తపస్తీవ్రం దీర్ఘకాలమరిందమ |
యేన తుష్టోఽభవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజః ||

4

సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః |
నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ ||

5

అవజ్ఞాతాః పురా తేన వరదానేన మానవాః |
ఏవం పితామహాత్తస్మాద్వరం ప్రాప్య స దర్పితః ||

6 [గర్వితః]

ఉత్సాదయతి లోకాంస్త్రీంస్త్రయశ్చాప్యపకర్షతి |
తస్మాత్తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతప ||

7

ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ |
పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ ||

8

స చాప్యపుత్రో నృపతిస్తస్మిన్కాలే మహాద్యుతిః |
అయజత్పుత్రియామిష్టిం పుత్రేప్సురరిసూదనః ||

9

స కృత్వా నిశ్చయం విష్ణురామంత్ర్య చ పితామహమ్ |
అంతర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః ||

10

తతో వై యజమానస్య పావకాదతులప్రభమ్ |
ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్ ||

11

కృష్ణం రక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనమ్ |
స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవరమూర్ధజమ్ ||

12

శుభలక్షణసంపన్నం దివ్యాభరణభూషితమ్ |
శైలశృంగసముత్సేధం దృప్తశార్దూలవిక్రమమ్ ||

13

దివాకరసమాకారం దీప్తానలశిఖోపమమ్ |
తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదామ్ ||

14

దివ్యపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్ |
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ ||

15

సమవేక్ష్యాబ్రవీద్వాక్యమిదం దశరథం నృపమ్ |
ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప ||

16

తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలిః |
భగవన్ స్వాగతం తేఽస్తు కిమహం కరవాణి తే ||

17

అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోఽబ్రవీత్ |
రాజన్నర్చయతా దేవానద్య ప్రాప్తమిదం త్వయా ||

18

ఇదం తు నరశార్దూల పాయసం దేవనిర్మితమ్ |
ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారోగ్యవర్ధనమ్ ||

19

భార్యాణామనురూపాణామశ్నీతేతి ప్రయచ్ఛ వై |
తాసు త్వం లప్స్యసే పుత్రాన్యదర్థం యజసే నృప ||

20

తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్య తామ్ |
పాత్రీం దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్ ||

21

అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనమ్ |
ముదా పరమయా యుక్తశ్చకారాభిప్రదక్షిణమ్ ||

22

తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితమ్ |
బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః ||

23

తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్ |
సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత ||

24

హర్షరశ్మిభిరుద్ద్యోతం తస్యాంతఃపురమాబభౌ |
శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః ||

25

సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ |
పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రీయం త్విదమాత్మనః ||

26

కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా |
అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః ||

27

కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్ |
ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్ ||

28

అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః |
ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ ||

29

తాస్త్వేతత్పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమాః స్త్రియః |
సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః ||

30

తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో
మహీపతేరుత్తమపాయసం పృథక్ |
హుతాశనాదిత్య సమానతేజస-
-శ్చిరేణ గర్భాన్ప్రతిపేదిరే తదా ||

31

తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః
ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః |
బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః
సురేంద్రసిద్ధర్షిగణాభిపూజితః ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షోడశః సర్గః ||

Balakanda Sarga 16 Meaning In Telugu

విష్ణు మూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు.

“ ఓ దేవతలారా! నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి. దానికి ఉ పాయము ఏమి?” అని అడిగాడు. దానికి దేవతలు ఇలాఅన్నారు.
” ఓ మహావిష్ణూ! నీవు మనుష్య శరీరమును ధరించి, రావణుని తో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే…… రావణాసురుడు చాలాకాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. ‘మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండు గాక!’ అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి.” అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని, విష్ణుమూర్తి అంతర్థానము అయ్యాడు.

అయోధ్యలో దశరధుడు పుత్రులకొరకు యాగము చేస్తున్నాడు. ఆ హెూమ గుండము నుండి తేజోవంతుడైన, మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించిన వాడు, రక్త వర్ణముకల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించిన వాడు, పర్వతశిఖరము మాదిరి ధృఢమైన వాడు, పెద్దపులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సుకలవాడు, భగభగమండే అగ్ని శిఖల మాదిరి వెలుగు చున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో, ఒక భూతా కారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరధుడు చేతులు జోడించి నమస్కరించాడు.

“ఓమహానుభావా! తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను.” అని ప్రార్థించాడు.

ఆ భూతము దశరధుని చూచి ఇలా పలికింది.

“ఓ దశరధమహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారుచేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్షును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరధుడికి ఇచ్చాడు.

దశరధుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయింది.

దశరధుడు సంతోషముతో ఆ పాయన అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగ భాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం (అనగా నాల్గవ భాగము) సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం (అనగా ఎనిమిదవ భాగము) కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం (అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగము) ఏంచెయ్యాలా అని ఆలోచించి, దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు.

ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. కాని దశరధుని భార్యలు తమకు పాయన పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏ మాత్రం చింతింపక, పాయసము దొరికి తమకు పుత్రసంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు.

కాల క్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదహారవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ సప్తదశః సర్గః (17) >>

Leave a Comment