మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తదశః సర్గలో, రావణుని సంహరించడంలో రాముడికి సహాయం చేయమని బ్రహ్మ ఆదేశం మేరకు దేవతలు పూర్వీకులు వానర వీరులుగా మారారు. కోతి లాంటి వానర జాతి అనేక మంది ఖగోళ జీవులచే సంతానోత్పత్తి చేయబడింది, దీనికి విచిత్రమైన శక్తివంతమైన శరీరాకృతి మరియు రాముడికి సహాయం చేయడానికి ప్రత్యేక శక్తి ఉంది.
ఋక్షవానరోత్పత్తిః
పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః |
ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూర్భగవానిదమ్ ||
1
సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః |
విష్ణోః సహాయాన్బలినః సృజధ్వం కామరూపిణః ||
2
మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాఞ్జవే |
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్ ||
3
అసంహార్యానుపాయజ్ఞాన్ సింహసంహననాన్వితాన్ |
సర్వాస్త్రగుణసంపన్నానమృతప్రాశనానివ ||
4
అప్సరఃసు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ |
కింనరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ ||
5
యక్షపన్నగకన్యాసు ఋక్షివిద్యాధరీషు చ |
సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్ ||
6
పూర్వమేవ మయా సృష్టో జాంబవానృక్షపుంగవః |
జృంభమాణస్య సహసా మమ వక్రాదజాయత ||
7
తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనమ్ |
జనయామాసురేవం తే పుత్రాన్వానరరూపిణః ||
8
ఋషయశ్చ మహాత్మానః సిద్ధవిద్యాధరోరగాః |
చారణాశ్చ సుతాన్వీరాన్ససృజుర్వనచారిణః ||
9
వానరేంద్రం మహేంద్రాభమింద్రో వాలినమూర్జితమ్ |
సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః ||
10
బృహస్పతిస్త్వజనయత్తారం నామ మహాహరిమ్ |
సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతమనుత్తమమ్ ||
11
ధనదస్య సుతః శ్రీమాన్వానరో గంధమాదనః |
విశ్వకర్మా త్వజనయన్నలం నామ మహాహరిమ్ ||
12
పావకస్య సుతః శ్రీమాన్నీలోఽగ్నిసదృశప్రభః |
తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్ ||
13
రూపద్రవిణసంపన్నావశ్వినౌ రూపసంమతౌ |
మైందం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్ ||
14
వరుణో జనయామాస సుషేణం నామ వానరమ్ |
శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్ ||
15
మారుతస్యాత్మజః శ్రీమాన్హనుమాన్నామ వానరః |
వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే ||
16
సర్వవానరముఖ్యేషు బుద్ధిమాన్బలవానపి |
తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః ||
17
అప్రమేయబలా వీరా విక్రాంతాః కామరూపిణః |
తే గజాచలసంకాశా వపుష్మంతో మహాబలాః ||
18
ఋక్షవానరగోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే |
యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః ||
19
అజాయత సమస్తేన తస్య తస్య సుతః పృథక్ |
గోలాంగూలీషు చోత్పన్నాః కేచిత్సంమతవిక్రమాః ||
20
ఋక్షీషు చ తథా జాతా వానరాః కింనరీషు చ |
దేవా మహర్షిగంధర్వాస్తార్క్ష్యా యక్షా యశస్వినః ||
21
నాగాః కింపురుషాశ్చైవ సిద్ధవిద్యాధరోరగాః |
బహవో జనయామాసుర్హృష్టాస్తత్ర సహస్రశః ||
22
[* అధికపాఠః –
చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజుః వన చారిణః |
అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యధరీషు చ |
నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ |
కామరూప బలోపేతా యథా కామవిచారిణః |
*]
వానరాన్సుమహాకాయాన్సర్వాన్వై వనచారిణః |
సింహశార్దూలసదృశా దర్పేణ చ బలేన చ ||
23
శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః |
నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః ||
24
విచాలయేయుః శైలేంద్రాన్భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ |
క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్ ||
25
దారయేయుః క్షితిం పద్భ్యామాప్లవేయుర్మహార్ణవమ్ |
నభస్థలం విశేయుశ్చ గృహ్ణీయురపి తోయదాన్ ||
26
గృహ్ణీయురపి మాతంగాన్మత్తాన్ప్రవ్రజతో వనే |
నర్దమానాశ్చ నాదేన పాతయేయుర్విహంగమాన్ ||
27
ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణామ్ |
శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనామ్ ||
28
తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూథపాః |
బభూవుర్యూథపశ్రేష్ఠా వీరాంశ్చాజనయన్హరీన్ ||
29
అన్యే ఋక్షవతః ప్రస్థానుపతస్థుః సహస్రశః |
అన్యే నానావిధాన్ శైలాన్భేజిరే కాననాని చ ||
30
సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినమ్ |
భ్రాతరావుపతస్థుస్తే సర్వే ఏవ హరీశ్వరాః ||
31
నలం నీలం హనూమంతమన్యాంశ్చ హరియూథపాన్ |
తే తార్క్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధవిశారదాః ||
32
విచరంతోఽర్దయన్దర్పాత్ సింహవ్యాఘ్రమహోరగాన్ |
తాంశ్చ సర్వాన్మహాబాహుర్వాలీ విపులవిక్రమః ||
33
జుగోప భుజవీర్యేణ ఋక్షగోపుచ్ఛవానరాన్ |
తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్ణవా |
కీర్ణా వివిధసంస్థానైర్నానావ్యంజనలక్షణైః ||
34
తైర్మేఘబృందాచలకూటకల్పై-
-ర్మహాబలైర్వానరయూథపాలైః |
బభూవ భూర్భీమశరీరరూపైః
సమావృతా రామసహాయహేతోః ||
35
ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు.
శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులు గానూ, వాయువేగముతో ప్రయాణించగలవారు గానూ అయి ఉండాలి. విష్ణువుతో సరి తూగ గల పరాక్రమ వంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతి మంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గానీ, ఏ ఆయుధము చేత గానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే ఋక్ష శ్రేష్టుడు (ఎలుగుబంటి) నేను ఆవలించి నపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు.” అని పలికాడు.
బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు.
దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు.
సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు.
బ్రహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు.
కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు.
అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిదుడు, వరుణుని అంశతో సుషేణుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వారనులు సృజింపబడ్డారు.
వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్లు, దంతములు. వారందర ఋక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు.
ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహు బలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీ రామునికి సహాయము చేయుటకు సృష్టింప బడ్డారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
బాలకాండ అష్టాదశః సర్గః (18) >>