Balakanda Sarga 6 In Telugu – బాలకాండ షష్ఠః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షష్ఠ సర్గలో, అయోధ్యలో రాముడి జననం, బాల్యం వర్ణించబడతాయి. దశరథ మహారాజుకు నలుగురు కుమారులు జన్మిస్తారు – రాముడు, లక్ష్మణుడు, భారతుడు, శత్రుఘ్నుడు. రాముడు జన్మించినప్పుడు, అయోధ్యలో ఆనందం వ్యాపిస్తుంది. వశిష్ఠ మహర్షి రాముడు సహా ఇతర రాజకుమారులకు విద్యాబ్యాసం అందిస్తారు.

రాజవర్ణనా

తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్సర్వసంగ్రహః |
దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః ||

1

ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మరతో వశీ |
మహర్షికల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశ్రుతః ||

2

బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియః |
ధనైశ్చ సంచయైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః ||

3

యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా |
తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్ ||

4

తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్ఠతా |
పాలితా సా పురీ శ్రేష్ఠా ఇంద్రేణేవామరావతీ ||

5

తస్మిన్పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః |
నరాస్తుష్టా ధనైః స్వైః స్వైరలుబ్ధాః సత్యవాదినః ||

6

నాల్పసంనిచయః కశ్చిదాసీత్తస్మిన్పురోత్తమే |
కుటుంబీ యో హ్యసిద్ధార్థోఽగవాశ్వధనధాన్యవాన్ ||

7

కామీ వా న కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ |
ద్రష్టుం శక్యమయోధ్యాయాం నావిద్వాన్న చ నాస్తికః ||

8

సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః |
ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః ||

9

నాకుండలీ నాముకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్ |
నామృష్టో నానులిప్తాంగో నాసుగంధశ్చ విద్యతే ||

10

నామృష్టభోజీ నాదాతా నాప్యనంగదనిష్కధృక్ |
నాహస్తాభరణో వాఽపి దృశ్యతే నాప్యనాత్మవాన్ ||

11

నానాహితాగ్నిర్నాయజ్వా న క్షుద్రో వా న తస్కరః |
కశ్చిదాసీదయోధ్యాయాం న చ నిర్వృత్తసంకరః ||

12

స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః |
దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే ||

13

న నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః |
నాసూయకో న చాఽశక్తో నావిద్వాన్విద్యతే క్వచిత్ ||

14

నాషడంగవిదత్రాసీన్నావ్రతో నాసహస్రదః |
న దీనః క్షిప్తచిత్తో వా వ్యథితో వాపి కశ్చన ||

15

కశ్చిన్నరో వా నారీ వా నాశ్రీమాన్నాప్యరూపవాన్ |
ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాపి రాజన్యభక్తిమాన్ ||

16

వర్ణేష్వగ్ర్యచతుర్థేషు దేవతాతిథిపూజకాః |
కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమసంయుతాః ||

17

దీర్ఘాయుషో నరాః సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః |
సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే ||

18

క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వైశ్యాః క్షత్రమనువ్రతాః |
శూద్రాః స్వధర్మ నిరతాస్త్రీన్వర్ణానుపచారిణః ||

19

సా తేనేక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా |
యథా పురస్తాన్మనునా మానవేంద్రేణ ధీమతా ||

20

యోధానామగ్నికల్పానాం పేశలానామమర్షిణామ్ |
సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణామివ ||

21

కాంభోజవిషయే జాతైర్బాహ్లీకైశ్చ హయోత్తమైః |
వనాయుజైర్నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః ||

22

వింధ్యపర్వతజైర్మత్తైః పూర్ణా హైమవతైరపి |
మదాన్వితైరతిబలైర్మాతంగైః పర్వతోపమైః ||

23

ఐరావతకులీనైశ్చ మహాపద్మకులైస్తథా |
అంజనాదపి నిష్పన్నైర్వామనాదపి చ ద్విపైః ||

24

భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్థథా |
భద్రమంద్రైర్భద్రమృగైర్మృగమంద్రైశ్చ సా పురీ ||

25

నిత్యమత్తైః సదా పూర్ణా నాగైరచలసన్నిభైః |
సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే ||

26

యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్ |
తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్ |
శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాః ||

27

తాం సత్యనామాం దృఢతోరణార్గలాం
గృహైర్విచిత్రైరుపశోభితాం శివామ్ |
పురీమయోధ్యాం నృసహస్రసంకులాం
శశాస వై శక్రసమో మహీపతిః ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్ఠః సర్గః ||

Balakanda Sarga 6  Meaning In Telugu

అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమ వంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు. దశరథుడు ఎన్నో యజ్ఞము లను యాగములను చేసాడు. రాజర్షి. దశరథుని మంచితనము మూడులోకములలో చెప్పుకొనెడి వారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే నేర్పుకలవాడు. అధిక మైన సంపదలు కలవాడు.

అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించిన వాడు. జితేంద్రియుడు అని పేరు గాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు. అసత్యము అన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు.

ఇంక అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు. నిత్యసంతోషులు. ఉన్నదానితో తృప్తిపడేవారు. ధర్మము తప్పని వారు.

వేదములను చదివినవారు. అత్యాశాపరులు కారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడి వారు. దశరధుని రాజ్యములో పేదవాడు గానీ, విద్యలేని వాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు. మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు. నిర్మలమైన మనస్సుకలవారు.

అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొనని వాడు, ప్రతిరోజూ అభ్యంగనస్నానముచేయని వాడూ. చూద్దామన్నా కానరారు. అలాగే కడుపునిండా భోజనము చేయని వాడు కానీ, అతిధికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దానధర్మములు చేయని వాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు.

అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పనిమాత్రమే చేసేవాడు. యజ్ఞములు, యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యమూ అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిథి పూజ, దానధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు.

దశరధునిపాలనలో నాస్తికులు గానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయా ద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్యనేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికీ ఎటువంటిబాధలు ఉండేవి కావు. అందరు ప్రజలూ సుఖసంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారుకానీ, మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే గానీ పేదవారు లేరు.

అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘా యుష్షులు. పెద్ద వారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకొనే వారు.

అయోధ్యలో యోధులకు కొదవ లేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్యా నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంభోజ, బాహ్లిక, దేశముల నుండి అశ్వములను తెప్పించుకొనెడి వారు. వింధ్య పర్వత ప్రాంతమునుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకొనెడి వారు. అందులో కూడా భద్రగజములు, మంద్ర గజములు, భద్ర మంద్ర గజములు, మదగజములు మొదలగు జాతులు ఏనుగులతో అయోధ్య నిండి ఉండెడిది. అయోధ్య చుట్టు రెండు యోజనముల దూరములో శత్రువు అనే వాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ సప్తమః సర్గః (7) >>

Leave a Comment