మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. ద్వితీయ సర్గలో, శ్రీ రాముడి పట్టాభిషేకం, కైకేయి బూనిన కుట్రలు, రాముడి అరణ్యవాసం మొదలైన అంశాలు చర్చకు వస్తాయి. ఈ సర్గ ప్రారంభంలో, దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు రాముడిని అయోధ్యా రాజ్యానికి యోగ్యుడిగా ప్రకటించి, పట్టాభిషేకానికి సన్నాహాలు చేస్తాడు. అయితే, కైకేయి తన రెండు వరాల కారణంగా, రాముడిని పదినాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపిస్తాడు. ఈ సర్గలో ఉన్న సంఘటనలు రాముని, సీతమ్మ మరియు లక్ష్మణుని ధర్మనిరతిని, విధేయతను, మరియు క్షమను ప్రతిబింబిస్తాయి.
పరిషదనుమోదనమ్
తతః పరిషదం సర్వామామంత్ర్య వసుధాధిపః |
హితముద్ధర్షణం చైవమువాచ ప్రథితం వచః ||
1
దుందుభిస్వనకల్పేన గంభీరేణానునాదినా |
స్వరేణ మహతా రాజా జీమూత ఇవ నాదయన్ ||
2
రాజలక్షణయుక్తేన కాంతేనానుపమేన చ |
ఉవాచ రసయుక్తేన స్వరేణ నృపతిర్నృపాన్ ||
3
విదితం భవతామేతద్యథా మే రాజ్యముత్తమమ్ |
పూర్వకైర్మమ రాజేంద్రైః సుతవత్పరిపాలితమ్ ||
4
[* సోఽహమిక్ష్వాకుభిః సర్వైర్నరేంద్రైః పరిపాలితమ్ | *]
శ్రేయసా యోక్తుకామోఽస్మి సుఖార్హమఖిలం జగత్ |
మయాఽప్యాచరితం పూర్వైః పంథానమనుగచ్ఛతా ||
5
ప్రజా నిత్యమనిద్రేణ యథాశక్త్యభిరక్షితాః |
ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితమ్ ||
6
పాండురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా |
ప్రాప్య వర్షసహస్రాణి బహూన్యాయూంషి జీవతః ||
7
జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే |
రాజప్రభావజుష్టాం హి దుర్వహామజితేంద్రియైః ||
8
పరిశ్రాంతోఽస్మి లోకస్య గుర్వీం ధర్మధురం వహన్ |
సోఽహం విశ్రమమిచ్ఛామి రామం కృత్వా ప్రజాహితే || [పుత్రం]
9
సన్నికృష్టానిమాన్సర్వాననుమాన్య ద్విజర్షభాన్ |
అనుజాతో హి మాం సర్వైర్గుణైర్జ్యేష్ఠో మమాత్మజః ||
10
పురందరసమో వీర్యే రామః పరపురంజయః |
తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాం వరమ్ ||
11
యౌవరాజ్యే నియోక్తాస్మి ప్రీతః పురుషపుంగవమ్ |
అనురూపః స వై నాథో లక్ష్మీవాఁల్లక్ష్మణాగ్రజః ||
12
త్రైలోక్యమపి నాథేన యేన స్యాన్నాథవత్తరమ్ |
అనేన శ్రేయసా సద్యః సంయోక్ష్యే తామిమాం మహీమ్ || [సంయోజ్యైవమిమాం]
13
గతక్లేశో భవిష్యామి సుతే తస్మిన్నివేశ్య వై |
యదీదం మేఽనురూపార్థం మయా సాధు సుమంత్రితమ్ ||
14
భవంతో మేఽనుమన్యంతాం కథం వా కరవాణ్యహమ్ |
యద్యప్యేషా మమ ప్రీతిర్హితమన్యద్విచింత్యతామ్ ||
15
అన్యా మధ్యస్థచింతా హి విమర్దాభ్యధికోదయా |
ఇతి బ్రువంతం ముదితాః ప్రత్యనందన్నృపా నృపమ్ ||
16
వృష్టిమంతం మహామేఘం నర్దంత ఇవ బర్హిణః |
స్నిగ్ధోఽనునాదీ సంజజ్ఞే తత్ర హర్షసమీరితః ||
17
జనౌఘోద్ఘుష్టసన్నాదో విమానం కంపయన్నివ |
తస్య ధర్మార్థవిదుషో భావమాజ్ఞాయ సర్వశః ||
18
బ్రాహ్మణా జనముఖ్యాశ్చ పౌరజానపదైః సహ |
సమేత్య మంత్రయిత్వా తు సమతాగతబుద్ధయః ||
19
ఊచుశ్చ మనసా జ్ఞాత్వా వృద్ధం దశరథం నృపమ్ |
అనేకవర్షసాహస్రో వృద్ధస్త్వమసి పార్థివ ||
20
స రామం యువరాజానమభిషించస్వ పార్థివమ్ |
ఇచ్ఛామో హి మహాబాహుం రఘువీరం మహాబలమ్ ||
21
గజేన మహతాఽఽయాంతం రామం ఛత్రావృతాననమ్ |
ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియమ్ ||
22
అజానన్నివ జిజ్ఞాసురిదం వచనమబ్రవీత్ |
శ్రుత్వైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్ఛథ ||
23
రాజానః సంశయోఽయం మే కిమిదం బ్రూత తత్త్వతః |
కథం ను మయి ధర్మేణ పృథివీమనుశాసతి ||
24
భవంతో ద్రష్టుమిచ్ఛంతి యువరాజం మమాత్మజమ్ |
తే తమూచుర్మహాత్మానం పౌరజానపదైః సహ ||
25
బహవో నృప కళ్యాణా గుణాః పుత్రస్య సంతి తే |
గుణాన్గుణవతో దేవ దేవకల్పస్య ధీమతః ||
26
ప్రియానానందనాన్కృత్స్నాన్ప్రవక్ష్యామోఽద్య తాన్ శృణు |
దివ్యైర్గుణైః శక్రసమో రామః సత్యపరాక్రమః ||
27
ఇక్ష్వాకుభ్యోఽపి సర్వేభ్యో హ్యతిరిక్తో విశాంపతే |
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః ||
28
సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ |
ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయాః క్షమాగుణైః ||
29
బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యే సాక్షాచ్ఛచీపతేః |
ధర్మజ్ఞః సత్యసంధశ్చ శీలవాననసూయకః ||
30
క్షాంతః సాంత్వయితా శ్లక్ష్ణః కృతజ్ఞో విజితేంద్రియః |
మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యోఽనసూయకః ||
31
ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః |
బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాముపాసితా ||
32
తేనాస్యేహాతులా కీర్తిర్యశస్తేజశ్చ వర్ధతే |
దేవాసురమనుష్యాణాం సర్వాస్త్రేషు విశారదః ||
33
సర్వవిద్యావ్రతస్నాతో యథావత్సాంగవేదవిత్ | [సమ్యక్]
గాంధర్వే చ భువి శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః ||
34
కళ్యాణాభిజనః సాధురదీనాత్మా మహామతిః |
ద్విజైరభివినీతశ్చ శ్రేష్ఠైర్ధర్మార్థదర్శిభిః || [నైపుణైః]
35
యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా |
గత్వా సౌమిత్రిసహితో నావిజిత్య నివర్తతే ||
36
సంగ్రామాత్పునరాగమ్య కుంజరేణ రథేన వా |
పౌరాన్స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి ||
37
పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్యశిష్యగణేషు చ |
నిఖిలేనానుపూర్వ్యాచ్చ పితా పుత్రానివౌరసాన్ ||
38
శుశ్రూషంతే చ వః శిష్యాః కచ్చిత్కర్మసు దంశితాః |
ఇతి నః పురుషవ్యాఘ్రః సదా రామోఽభిభాషతే ||
39
వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః |
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి ||
40
సత్యవాదీ మహేష్వాసో వృద్ధసేవీ జితేంద్రియః |
స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనా శ్రితః ||
41
సమ్యగ్యోక్తా శ్రేయసాం చ న విగ్రహకథారుచిః | [విగృహ్య]
ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా ||
42
సుభ్రూరాయతతామ్రాక్షః సాక్షాద్విష్ణురివ స్వయమ్ |
రామో లోకాభిరామోఽయం శౌర్యవీర్యపరాక్రమైః ||
43
ప్రజాపాలనసంయుక్తో న రాగోపహతేంద్రియః | [తత్త్వజ్ఞః]
శక్తస్త్రైలోక్యమప్యేకో భోక్తుం కిం ను మహీమిమామ్ ||
44
నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోఽస్తి కదాచన |
హంత్యేవ నియమాద్వధ్యానవధ్యే న చ కుప్యతి ||
45
యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి |
దాంతైః సర్వప్రజాకాంతైః ప్రీతిసంజననైర్నృణామ్ || [శాంతైః]
46
గుణైర్విరురుచే రామో దీప్తః సూర్య ఇవాంశుభిః |
తమేవంగుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ ||
47
లోకపాలోపమం నాథమకామయత మేదినీ |
వత్సః శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవ ||
48
దిష్ట్యా పుత్రగుణైర్యుక్తో మారీచ ఇవ కాశ్యపః |
బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః ||
49
దేవాసురమనుష్యేషు గంధర్వేషూరగేషు చ |
ఆశంసంతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా ||
50
ఆభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌరజానపదో జనః |
స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః ||
51
సర్వాన్దేవాన్నమస్యంతి రామస్యార్థే యశస్వినః |
తేషామాయాచితం దేవ త్వత్ప్రసాదాత్సమృద్ధ్యతామ్ ||
52
రామమిందీవరశ్యామం సర్వశత్రునిబర్హణమ్ |
పశ్యామో యౌవరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజమ్ ||
53
తం దేవదేవోపమమాత్మజం తే
సర్వస్య లోకస్య హితే నివిష్టమ్ |
హితాయ నః క్షిప్రముదారజుష్టం
ముదాఽభిషేక్తుం వరద త్వమర్హసి ||
54
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గః ||
Ayodhya Kanda Sarga 2 Meaning In Telugu
రాజ సభ ఏర్పాటు అయింది. దశరథ మహారాజు సింహాసనం అలంకరించాడు. సభను అలంకరించిన సామంత రాజులను, మంత్రులను, పుర ప్రముఖులను ఇతర పౌరులను చూచి ఇలాఅన్నాడు.
“సభాసదులారా! మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తర తరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశపురాజుల పాలనలో మీ రందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడనైన నేను కూడా అనేక సంవత్సరములుగా ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గములోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనమునకు ఉన్న శ్వేతఛత్రము నీడలో గడిచి పోయింది. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. రాజ్య భారము వహించడం చాలా కష్టమైన విషయము. జితేంద్రియుడు కాని వాడు ఈ రాజ్య భారము మోయలేడు. అందుకని నేను వసిష్ఠుల వారిని, పురోహితు లను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమ వంతుడు, శత్రువులకు భయంకలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముని అయోధ్యకు యువరాజుగా చేయడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారమును రామునికి అప్పగించి, విశ్రాంతి తీసుకోదలచాను. ఇది నా నిర్ణయము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయము తీసుకున్నాను. నా నిర్ణయము అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనములు కలిగిస్తుందని అనుకుంటున్నాను. నా నిర్ణయాని కన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు తోస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయము గౌరవించాలి. అది పాలకుల విధి. నేను రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.కాని మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు శిరోధార్యము.” అని అన్నాడు దశరథుడు.
దశరథుని మాటలు విన్నపౌరులందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చేసారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించారు. కాని సభలో ఉన్న బ్రాహ్మణులు, పురప్రముఖులు, పురోహితులు, అందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు. ఆలోచించుకున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత దశరథునితో ఇలా అన్నారు.
“ఓ దశరథమహారాజా! మీ నిర్ణయాన్ని మేమందరమూ సమర్ధిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు. అందుకని తమరి పెద్దకుమారుడైన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అది మాకందరకూ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానుబాహుడు. మహావీరుడు. రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఉత్సాహపడుతున్నారు.” అని అన్నారు.
అప్పుడు దశరథుడు పురప్రముఖులతో ఇలా అన్నాడు. “పురప్రముఖులారా! నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమో అని మీరు నా నిర్ణయం ఆమోదించినట్టు ఉంది. మీకు ఆ సందేహము అక్కరలేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను గదా! మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు. రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి.” అని అడిగాడు.
అప్పుడు ఆ పురప్రముఖులు ఇలా చెప్పసాగారు.
“ఓ దశరథమహారాజా! నీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ధర్మపరుడు. పరాక్రమ వంతుడు. దేవేంద్రునితో సమానమైన వాడు. ఇప్పటి వరకూ ఇక్ష్వాకు వంశములో జన్మించిన రాజులందరిలోకీ శ్రేష్టుడు. సత్యము పలకడంలోనూ, ధర్మము ఆచరించడం లోనూ రామునికి ఆసక్తి మెండు. చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు. రాముడు క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మము లేదు. రామునికి ఎవరి మీదా అసూయ, ద్వేషము లేవు. ఓర్పు మెండు. మృదువుగా మాట్లాడుతాడు. బాధలలో ఉన్నవారిని చూస్తే ఆ బాధలు తనవిగా బాధపడతాడు రాముడు. రాముడు ఇంద్రియ నిగ్రహము కలవాడు.
ఓ దశరథ మహారాజా! రాముడు ఎల్లప్పుడూ స్థిర చిత్తముతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము. రాముడు వివిధ శాస్త్రములను అధ్యయనం చేసాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్ర శస్త్రములు ప్రయోగ, ఉపసంహారములతో సహా, రామునికి తెలుసు. రాముడు వేద వేదాంగములను శ్రద్ధతో అధ్యయనం చేసాడు. అంతే కాదు, రామునికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. అనేకములైన ధర్మసూక్ష్మములను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్ర యాత్రకు వెళితే విజయుడైగాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత, రాముడు తల్లి తండ్రులకు నమస్కరించి, అంతఃపురములోని వారినీ, బంధువులను, స్నేహితులను, పౌరులనూ పేరు పేరునా వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు.
ఓ దశరథ మహారాజా! ఎవరికైనా బాధ కలిగితే రాముడు తనకు కలిగినట్టు బాధ పడతాడు. ఎవరికైనా సంతోషము కలిగితే తానుకూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మరక్షణలో రాముని మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలో తత్వమును బాగాతెలిసినవాడు రాముడు. మూర్తీభవించిన శాంతస్వరూపుడు రాముడు. అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు ముల్లోకములను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడుగా జన్మించడం మీ పూర్వజన్మ సుకృతము. అటువంటి రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అయోధ్యా వాసులు, స్త్రీలు, వృద్ధులు, నిరంతరమూ సర్వదేవతలకూ మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి. మేము చూచి ఆనందిస్తాము.” అని పలికారు అయోధ్య పురప్రముఖులు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ద్వితీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.