Balakanda Sarga 7 In Telugu – బాలకాండ సప్తమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండం లోని సప్తమః సర్గఃలో రాముడు మరియు లక్ష్మణుల ధైర్యం మరియు పరాక్రమం వర్ణించబడింది. ఇందులో విష్వామిత్రుడు తన యాగానికి రక్షణగా రాముడు మరియు లక్ష్మణులను తీసుకువెళ్ళడం గురించి చెప్పబడింది. విష్వామిత్రుడు అయోధ్యకు వచ్చి, దశరథుని పుత్రులు రాముడు మరియు లక్ష్మణులను తపస్సు చేస్తూ ఉండగా రాక్షసుల నుండి యాగానికి రక్షణ కోరారు. దశరథుడు మొదట అభ్యంతరం చూపినా, వశిష్ఠ మహర్షి సలహా మేరకు, ఆయన వారు వెళ్లడానికి అంగీకరించారు. రాముడు మరియు లక్ష్మణుడు విష్వామిత్రుడి తోపాటు వెళ్లి యాగాన్ని రక్షించారు.

అమాత్యవర్ణనా

తస్యామాత్యా గుణైరాసన్నిక్ష్వాకోస్తు మహాత్మనః |
మంత్రజ్ఞాశ్చేంగితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః ||

1

అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః |
శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః ||

2

ధృష్టిర్జయంతో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః |
అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోఽభవత్ ||

3

ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తామృషిసత్తమౌ |
వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే ||

4

అధికపాఠః –
సుయజ్ఞోప్యథ జాబాలిః కాశ్యపోఽప్యథ గౌతమః |
మార్కండేయస్తు దీర్ఘాయుస్తథా కాత్యాయనో ద్విజః |
ఏతైర్బ్రహ్మర్షిభిర్నిత్యమృత్విజస్తస్య పూర్వకాః ||

5

విద్యావినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః |
పరస్పరానురక్తాశ్చ నీతిమంతో బహుశ్రుతాః ||

6

శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా ధృఢవిక్రమాః |
కీర్తిమంతః ప్రణిహితా యథావచనకారిణః ||

7

తేజః క్షమా యశః ప్రాప్తాః స్మితపూర్వాభిభాషిణః |
క్రోధాత్కామార్థహేతోర్వా న బ్రూయురనృతం వచః ||

8

తేషామవిదితం కించత్ స్వేషు నాస్తి పరేషు వా |
క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితమ్ ||

9

కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః |
ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి ||

10

కోశసంగ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే |
అహితం వాఽపి పురుషం న విహింస్యురదూషకమ్ ||

11

వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్రమనువ్రతాః |
శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినామ్ ||

12

బ్రహ్మక్షత్రమహింసంతస్తే కోశం సమవర్ధయన్ | [సమపూరయన్]
సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలమ్ ||

13

శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్ |
నాసీత్పురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్ ||

14

కశ్చిన్న దుష్టస్తత్రాసీత్పరదారరతో నరః |
ప్రశాంతం సర్వమేవాసీద్రాష్ట్రం పురవరం చ తత్ ||

15

సువాససః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః |
హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నయచక్షుషా ||

16

గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే |
విదేశేష్వపి విఖ్యాతాః సర్వతో బుద్ధినిశ్చయాత్ ||

17

[* అభితో గుణవంతశ్చ న చాసన్ గుణవర్జితాః | *]
సంధివిగ్రహతత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః |
మంత్రసంవరణే యుక్తాః శ్లక్ష్ణాః సూక్ష్మాసు బుద్ధిషు ||

18

నీతిశాస్త్రవిశేషజ్ఞాః సతతం ప్రియవాదినః |
ఈదృశైస్తైరమాత్యైశ్చ రాజా దశరథోఽనఘః ||

19

ఉపపన్నో గుణోపేతైరన్వశాసద్వసుంధరామ్ |
అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రంజయన్ ||

20

ప్రజానాం పాలనం కుర్వన్నధర్మం పరివర్జయన్ |
విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః ||

21

స తత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథివీమిమామ్ |
నాధ్యగచ్ఛద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః ||

22

మిత్రవాన్నతసామంతః ప్రతాపహతకంటకః |
స శశాస జగద్రాజా దివం దేవపతిర్యథా ||

23

తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తై-
-ర్వృతోఽనురక్తైః కుశలైః సమర్థైః |
స పార్థివో దీప్తిమవాప యుక్త-
-స్తేజోమయైర్గోభిరివోదితోఽర్కః ||

24

Balakanda 7 Sarga In Telugu Meaning

ఆవిధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్ధులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు. మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. ఎల్లప్పుడు రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతి మంతులు. అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు. వారి పేర్లు ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు,సుమంతుడు.

వీరుగాక వసిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండే వారు. వారందరూ అన్ని విద్యలందూ నేర్పరులు. బుద్ధిమంతులు. ఇంద్రియములను నిగ్రహించినవారు. శ్రీమంతులు. గొప్పవారు. శాస్త్రపరిజ్ఞానము కలవారు. పరాక్రమ వంతులు. కీర్తిమంతులు. కార్యశూరులు. చెప్పిన పని చేసేవారు. మంచి తేజస్సు కలవారు. క్షమాగుణము కలవారు. ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు. కోపంలో గానీ, కామ ప్రకోపము వలన గానీ, ధనము కోసం గానీ, అబద్ధము చెప్పరు.

వారు గూఢ చారుల ద్వారా స్వదేశములో గానీ, పరదేశములో గానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు
దశరథుడు.

దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర బేధము లేకుండా స్వంతకుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండెడి వారు. తమకు ఏ విధమైన అపకారము చేయని వాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు.

దశరథుని మంత్రులు వీరులు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు బేధాభిప్రాయములు లేకుండా ఒకే తాటి మీద నిలబడి రాచ కార్యములు నిర్వర్తించేవారు.

అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు గానీ, పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరధుని మంత్రులకు తమ రాజ్యము లోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలుఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రు రాజులతో సంధి చేసుకొనవలెనో, ఏ ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ, తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోడం లోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతి శాస్త్రమును చదివినవారు. ఎదుటి వారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పుకలవారు.

ఇటువంటి సకలసద్గుణ సంపన్నులగు మంత్రుల తో దశరధుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరధుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచూ, రాజ్యపాలన సాగించాడు. దశరధునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంత రాజులు ఉండెడి వారు. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడి వాడు. అందుకే దశరధునకు శత్రువులే లేరు.
సమర్ధులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు.

(ఇక్కడ ఒక గమనిక. మనకు ప్రాచీన గ్రంధములలో, కధతో పాటు ఆ నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చెప్పేవారు పూర్వపు ఋషులు. దాదాపు 5,000 ఏళ్ల కిందట రాయబడిన రామాయణములో ఆనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను ఎలా వివరించారో చదివారు కదా. రాజు (అంటే నేటి ముఖ్యమంత్రి), మంత్రులు (నేటి మంత్రులు) ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, వారికి ఏఏ అర్హతలు ఉండాలో. మంత్రులు ఎంత నీతిగాఉండాలో, ఎలా మాట్లాడాలో, చక్కగా వివరించారు. నేటి పాలకులను వారితో పోల్చుకోగలమా చెప్పండి.)

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఏడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ అష్టమః సర్గః (8) >>

Leave a Comment