మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనషష్ఠితమః సర్గలో, విశ్వామిత్రుడు త్రిశంకు యొక్క వైదిక కర్మను చేపట్టాడు మరియు వేద పండితులందరినీ ఆహ్వానించడానికి శిష్యులను పంపుతాడు. వశిష్ఠుడు మరియు అతని కుమారులు తప్ప చాలా మంది ఋషులు వచ్చారు. ఇంకా, వశిష్ట కుమారులు విశ్వామిత్ర మరియు త్రిశంకు యొక్క ఈ ఆచారాన్ని అపహాస్యం చేసారు. విశ్వామిత్రుడు విసుగు చెంది వశిష్ట కుమారులపై శాపనార్థాలు పెట్టాడు.
వాసిష్ఠశాపః
ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః |
అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచ్చండాలరూపిణమ్ ||
1
ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్ |
శరణం తే భవిష్యామి మా భైషీర్నృపపుంగవ ||
2
అహమామంత్రయే సర్వాన్మహర్షీన్పుణ్యకర్మణః |
యజ్ఞసాహ్యకరాన్రాజంస్తతో యక్ష్యసి నిర్వృతః ||
3
గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే |
అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి ||
4
హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప |
యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః ||
5
ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్పరమధార్మికాన్ |
వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్యజ్ఞసంభారకారణాత్ ||
6
సర్వాన్ శిష్యాన్సమాహూయ వాక్యమేతదువాచ హ |
సర్వానృషిగణాన్ వత్సా ఆనయధ్వం మమాజ్ఞయా ||
7
సశిష్యసుహృదశ్చైవ సర్త్విజః సుబహుశ్రుతాన్ |
యదన్యో వచనం బ్రూయాన్మద్వాక్యబలచోదితః ||
8
తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా ||
9
ఆజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః |
తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలితతేజసమ్ ||
10
ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినామ్ |
శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః ||
11
సర్వదేశేషు చాగచ్ఛన్వర్జయిత్వా మహోదయమ్ |
వాసిష్ఠం తచ్ఛతం సర్వం క్రోధపర్యాకులాక్షరమ్ ||
12
యదాహ వచనం సర్వం శృణు త్వం మునిపుంగవ |
క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః ||
13
కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః |
బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాలభోజనమ్ ||
14
కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః |
ఏతద్వచననైష్ఠుర్యమూచుః సంరక్తలోచనాః ||
15
వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః |
తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః ||
16
క్రోధసంరక్తనయనః సరోషమిదమబ్రవీత్ |
యే దూషయంత్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితమ్ ||
17
భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః |
అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్ ||
18
సప్త జాతిశతాన్యేవ మృతపాః సంతు సర్వశః |
శ్వమాంసనియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః ||
19
వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్ |
మహోదయశ్చ దుర్బుద్ధిర్మామదూష్యం హ్యదూషయత్ ||
20
దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి |
ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః ||
21
దీర్ఘకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి |
ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః |
విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః ||
22
Balakanda Sarga 59 In Telugu Pdf With Meaning
ఛండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలి పడ్డాడు. అతని తో ఇలా అన్నాడు.
“ఓ త్రిశంకూ! బాధ పడకు. నిన్ను, నీ కోరికను, నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయ పడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహా ఋషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ ఛండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయంలేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు.
విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. “మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి.”అని ఆజ్ఞాపించాడు.
విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు అందరూ నలు దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు.
“గురువు గారూ! తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. కాని మహోదయుడు, వసిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్న వారు ఈ విధంగా అన్నారు.
‘ఒక ఛండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం. దానిని ఒక క్షత్రియు డైన విశ్వామిత్రుడు చేయించడం. బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు. క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని ఛండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసినవారు బ్రాహ్మణులైనా, ఋషులైనా వారు స్వర్గానికి ఎలావెళతారు? ఇది సంభవమా!’
అని చాలా దుర్భాషలాడారు గురువు గారూ!” అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు.
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. “ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా! వసిష్టకుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ ఏడు వందల జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలాకాలము నిషాదుడుగా జీవిస్తాడు.” అని శపించాడు విశ్వామిత్రుడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
బాలకాండ షష్టితమః సర్గః (60) >>