మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో నవమ సర్గము ఒక ముఖ్యమైన భాగము. దశరథ రాజు మంత్రిగా ఉన్న సుమంత్రుడు, ఋషిశృంగ మహర్షి యొక్క ముఖ్యతనను వివరించాడు. ఆ మహర్షిని ఆలోచించిన వైదిక కర్మకు అధ్యక్షత వహించడానికి రాజుని ఆహ్వానించాడు. రాజు వేడుకున్నాడు, ఆ మహర్షి ఏ రాజ్యంలో ప్రవేశించడం మరియు ఆ దేశానికి ప్రజలకు శుభదాయకంగా ఉండడం సంబంధించింది.
ఋశ్యశృంగోపాఖ్యానమ్
ఏతచ్ఛ్రుత్వా రహః సూతో రాజానమిదమబ్రవీత్ |
[* శ్రూయతాం తత్ పురా వృత్తం పురాణే చ మయా శ్రుతమ్ | *]
ఋత్విగ్భిరుపదిష్టోఽయం పురావృత్తో మయా శ్రుతః ||
1
సనత్కుమారో భగవాన్పూర్వం కథితవాన్కథామ్ |
ఋషీణాం సన్నిధౌ రాజంస్తవ పుత్రాగమం ప్రతి ||
2
కాశ్యపస్య తు పుత్రోఽస్తి విభండక ఇతి శ్రుతః |
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి ||
3
స వనే నిత్యసంవృద్ధో మునిర్వనచరః సదా |
నాన్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రానువర్తనాత్ ||
4
ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః |
లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా ||
5
తస్యైవం వర్తమానస్య కాలః సమభివర్తతే |
అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినమ్ ||
6
ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్ |
అంగేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః ||
7
తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా |
అనావృష్టిః సుఘోరా వై సర్వభూతభయావహా ||
8
అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖసమన్వితః |
బ్రాహ్మణాఞ్శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి ||
9
భవంతః శ్రుతధర్మాణో లోకచారిత్రవేదినః |
సమాదిశంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ ||
10
[* ఇత్యుక్తాస్తే తతో రాజ్ఞా సర్వే బ్రాహ్మణసత్తమాః | *]
వక్ష్యంతి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగాః |
విభండకసుతం రాజన్సర్వోపాయైరిహానయ ||
11
ఆనీయ చ మహీపాల ఋశ్యశృంగం సుసత్కృతమ్ |
ప్రయచ్ఛ కన్యాం శాంతాం వై విధినా సుసమాహితః ||
12
తేషాం తు వచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపత్స్యతే |
కేనోపాయేన వై శక్యమిహానేతుం స వీర్యవాన్ ||
13
తతో రాజా వినిశ్చిత్య సహ మంత్రిభిరాత్మవాన్ |
పురోహితమమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్ ||
14
తే తు రాజ్ఞో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః |
న గచ్ఛేమ ఋషేర్భీతా అనునేష్యంతి తం నృపమ్ ||
15
వక్ష్యంతి చింతయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్క్షమాన్ |
ఆనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి ||
16
ఏవమంగాధిపేనైవ గణికాభిరృషేః సుతః |
ఆనీతోఽవర్షయద్దేవః శాంతా చాస్మై ప్రదీయతే ||
17
ఋశ్యశృంగస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి |
సనత్కుమారకథితమేతావద్వ్యాహృతం మయా ||
18
అథ హృష్టో దశరథః సుమంత్రం ప్రత్యభాషత |
యథార్శ్యశృంగస్త్వానీతో విస్తరేణ త్వయోచ్యతామ్ ||
19
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు.
“మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే…..
కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు.
ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ వర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తనరాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి.” అని అడిగాడు.
దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజా! నీ పాపము పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం.” అని అన్నారు.
ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉ పాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనేపోయి ఋష్యశృంగుని తీసుకొనిరండి.” అని ఆజ్ఞాపిం చాడు. విభాండకునికి భయపడి వారు “మేము వెళ్లము” అని అన్నారు. కాని వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్పారు. అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీసాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమము రుచి చూపించి, తీసుకొని రావచ్చును అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొన వచ్చును అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేసారు.
రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని, తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేసాడు. ఓ దశరధమహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను.”అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు.
“సుమంతా! రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకు రాగలిగాడు. వివరంగా చెప్పు.” అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో తొమ్మిదవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.