Balakanda Sarga 10 In Telugu – బాలకాండ దశమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ దశమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాలను రక్షించడానికి దశరథ మహారాజును కలిసి, రాముడిని సహాయం చేయమని అడుగుతాడు. తొలుత దశరథుడు ససేమిరా అంటాడు, కానీ వసిష్ఠ మహర్షి సలహా మేరకు, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రతో కలిసి యజ్ఞాలను రక్షించడానికి బయలుదేరుతారు.

ఋశ్యశృంగస్యాంగదేశానయనప్రకారః

సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా |
యథర్శ్యశృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ ||

1

రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః |
ఉపాయో నిరపాయోఽయమస్మాభిరభిమంత్రితః ||

2

ఋశ్యశృంగో వనచరస్తపః స్వాధ్యాయనే రతః |
అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ ||

3

ఇంద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభిః |
పురమానాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతామ్ ||

4

గణికాస్తత్ర గచ్ఛంతు రూపవత్యః స్వలంకృతాః |
ప్రలోభ్య వివిధోపాయైరానేష్యంతీహ సత్కృతాః ||

5

శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్ |
పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా ||

6

వారముఖ్యాస్తు తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్ |
ఆశ్రమస్యావిదూరేఽస్మిన్యత్నం కుర్వంతి దర్శనే ||

7

ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః |
పితుః స నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ ||

8

న తేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా |
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సత్త్వం నగరరాష్ట్రజమ్ ||

9

తతః కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా |
విభండకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాంగనాః ||

10

తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యో మధురస్వరైః |
ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్ ||

11

కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ |
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః ||

12

అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః |
హార్దాత్తస్య మతిర్జాతా హ్యఖ్యాతుం పితరం స్వకమ్ ||

13

పితా విభండకోఽస్మాకం తస్యాహం సుత ఔరసః |
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి ||

14

ఇహాశ్రమపదేఽస్మాకం సమీపే శుభదర్శనాః |
కరిష్యే వోఽత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్ ||

15

ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై |
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముః సర్వాశ్చ తేన తాః ||

16

ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార హ |
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలమిదం ఫలమ్ ||

17

ప్రతిగృహ్య తు తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః |
ఋషేర్భీతాస్తు శీఘ్రం తా గమనాయ మతిం దధుః ||

18

అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ |
గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్ ||

19

తతస్తాస్తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః |
మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ శుభాన్ ||

20

తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే |
అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్ ||

21

ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ |
గచ్ఛంతి స్మాపదేశాత్తాః భీతాస్తస్య పితుః స్త్రియః ||

22

గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః |
అస్వస్థహృదయశ్చాసీద్దుఃఖాత్సంపరివర్తతే ||

23

తతోఽపరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్ |
[* విభండకసుతః శ్రీమాన్మనసా చింతయన్ముహుః | *]
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాః స్వలంకృతాః ||

24

దృష్ట్వైవ చ తదా విప్రమాయాంతం హృష్టమానసాః |
ఉపసృత్య తతః సర్వాస్తాస్తమూచురిదం వచః ||

25

ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్ |
[* చిత్రాణ్యత్ర బహూని స్యుర్మూలాని చ ఫలని చ | *]
తత్రాప్యేష విధిః శ్రీమాన్విశేషేణ భవిష్యతి ||

26

శ్రుత్వా తు వచనం తాసాం మునిస్తద్ధృదయం‍గమమ్ |
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తధా స్త్రియః ||

27

తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా ||

28

వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః |
ప్రత్యుద్గమ్య మునిం ప్రీతః శిరసా చ మహీం గతః ||

29 [ప్రహ్వ]

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై నియతః సుసమాహితః |
వవ్రే ప్రసాదం విప్రేంద్రాన్మా విప్రం మన్యురావిశేత్ ||

30

అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్త్వా యథావిధి |
శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాప సః ||

31

ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః |
ఋశ్యశృంగో మహాతేజాః శాంతయా సహ భార్యయా ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే దశమః సర్గః ||

Balakanda Sarga 10 Meaning In Telugu

దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు.

“మహారాజా! రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు.

“మహారాజా! ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటినుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావవిలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము.” అని అన్నారు. దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిగి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు.

ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగ సాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు.

“ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? ఇక్కడు ఏమి చేస్తున్నారు.” అని అడిగారు.

“నేను విభాండకుని పుత్రుడను. నాపేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు. ఇలా ఎందుకు ఉన్నారు.” అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్లాడు. వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. కాని ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడి వడిగా అక్కడి నుండి వెళ్లాలి అనుకున్నారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురము లైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు.

“ ఓ బ్రాహ్మణోత్తమా! ఇవి మధుర ఫలములు. ఆరగింపుడు.” అని అన్నారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకొన్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకొన్నాడు. కడుపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్లిపోయారు.

వారు వెళ్లి పోయిన తరువాత ఋశ్యశృంగునికి మనసు వికలమయింది. వారినే తలచు కుంటూ, వారి స్పర్శసుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు.

మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువ లేదు. ఆ వేశ్యలను మరలా కలుసు కోడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు ఆక్కడకు వెళ్లారు. అతనితో ఇలా అన్నారు.

“ఓ బ్రాహ్మణోత్తమా! నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిధ్యము స్వీకరించ వలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. వాటిని తమరు తనివిదీరా ఆరగింప వచ్చును” అని అన్నారు.

ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ, అంగదేశమునకు తీసుకొని వెళ్లారు. ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే గా వానలు కురిసాయి. పంటలు పండాయి. కరువుకాటకాలు తీరిపోయాయి.

రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చిసత్కరించాడు. “మహాత్మా! తమరి రాకచే మా అంగరాజ్యము పావనము అయింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నాకుమార్తె శాంతను వివాహమాడండి. ” అని ప్రార్థించాడు.

ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంత కాలం పాటు అంగరాజ్యములోనే ఉన్నాడు.

ఇది
వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ  ఏకాదశః సర్గః  (11>>

Leave a Comment