మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…
Manideepeswari Ashtottara Shata Namavali In Telugu
మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః
- ఓం దివ్యలోకవాసిన్యై నమః
- ఓం సర్వలోకసంరక్షణాయై నమః
- ఓం సర్వమృత్యుసర్వాపద్వినివారణ్యై నమః
- ఓం లలితాబాలా, దుర్గాశ్యామలాకృత్యై నమః
- ఓం గంగా, భవానీగాయత్రీస్వరూపాయై నమః
- ఓం లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ,స్వరూపవిభవాయై నమః
- ఓం రాజరాజేశ్వరీదేవ్యై నమః
- ఓం భక్తాభీష్టదాయిన్యై నమః
- ఓం భక్తిభుక్తిముక్తిప్రదాయిన్యై నమః
- ఓం భక్తసంకల్పసిద్ధిదాయై నమః
- ఓం పృథ్వీశ్వరీదేవ్యై నమః
- ఓం ఆధివ్యాధినివారిణ్యై నమః
- ఓం దౌర్భాగ్యనాశిన్యై నమః
- ఓం సౌభాగ్యదాయిన్యై నమః
- ఓం సృష్టిస్థితిలయాయై నమః
- ఓం అష్టసిద్ధి నవనిధిప్రదాయిన్యై నమః
- ఓం అష్టదికాల్పక వందితాయై నమః
- ఓం త్రికాల వేదిన్యై నమః
- ఓం షడ్గుణ సంసేవితాయై నమః
- ఓం షడ్రుతు పరివేష్టితాయై నమః
- ఓం నవగ్రహవిధివిధానాధిష్టానాయై నమః
- ఓం సత్యధర్మశాంతిప్రేమప్రసాదిన్యై నమః
- ఓం సర్వకాలసర్వావస్థాసమస్థితాయై నమః
- ఓం అనంతసాగర, నదీనదాకృత్యై నమః
- ఓం కాంస్య(కంచు)లోహమయప్రాకారిణ్యై నమః
- ఓం పీత (ఇత్తడి)లోహమయిప్రాకారిణ్యై నమః
- ఓం తామ్ర(రాగి)లోహమయిప్రాకారిణ్యై నమః
- ఓం సీసలోహమయప్రాకారిణ్యై నమః
- ఓం పంచలోహమయప్రాకారిణ్యై నమః
- ఓం రజితసాలప్రాకారిణ్యై నమః
- ఓం సువర్ణసాల ప్రాకారిణ్యై నమః
- ఓం పుష్యరాగమయప్రాకారిణ్యై నమః
- ఓం పద్మరాగమయప్రాకారిణ్యై నమః
- ఓం గోమేధికమణిమయప్రాకారిణ్యై నమః
- ఓం వజ్రనిర్మితప్రాకారిణ్యై నమః
- ఓం వైడూర్యనిర్మితప్రాకారిణ్యై నమః
- ఓం ఇంద్రనీలమణిమయప్రాకారిణ్యై నమః
- ఓం మరకతసాలమయప్రాకారిణ్యై నమః
- ఓం ప్రవాళసాలమయప్రాకారిణ్యై నమః
- ఓం రత్నసాలమయప్రాకారిణ్యై నమః
- ఓం చింతామణిమయప్రాకారిణ్యై నమః
- ఓం శృంగారమండపదేవదేవతాయై నమః
- ఓం జ్ఞానమండపజ్ఞానేశ్వరీదేవ్యై నమః
- ఓం ఏకాంతమండపధ్యానేశ్వరీదేవ్యై నమః
- ఓం ముక్తిమండపముక్తేశ్వరీదేవ్యై నమః
- ఓం కాశ్మీరవనకామాక్షీదేవ్యై నమః
- ఓం మల్లికావనమహారాజ్యై నమః
- ఓం కుందవనకౌమారీదేవ్యై నమః
- ఓం కస్తూరీవనకామేశ్వరీదేవ్యై నమః
- ఓం సాలోక్యముక్తిప్రసాదిన్యై నమః
- ఓం సారూప్యముక్తిప్రదాయిన్యై నమః
- ఓం సామీప్యముక్తిదాయిన్యై నమః
- ఓం సాయుజ్యముక్తిసుప్రసాదిన్యై నమః
- ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః
- ఓం వరాంకుశపాశాభయహస్తాయై నమః
- ఓం సహస్రకోటిసహస్రవదనాయై నమః
- ఓం మకరందఘృతాంబుధయే నమః
- ఓం సహస్రకోటిసహస్రచంద్రసమసుధానేత్రాయై నమః
- ఓం సహస్రకోటి సహస్ర సూర్యసమాభాసాయై నమః
- ఓం జరామరణరహితాయై నమః
- ఓం నారదతుంబురు సకలమునిగణవందితాయై నమః
- ఓం పంచభూతయజమానస్వరూపిణ్యై నమః
- ఓం జన్మజన్మాంతరదుఃఖభంజనాయై నమః
- ఓం లోకరక్షాకృత్యతత్పరాయై నమః
- ఓం బ్రహ్మవిష్ణు మహేశ్వరకోటివందితాయై నమః
- ఓం చతుష్షష్టికళాసంపూర్ణస్వరూపిణ్యై నమః
- ఓం షోడశకళాశక్తిసేనాసమన్వితాయై నమః
- ఓం సప్తకోటిఘనమంత్రవిద్యాలయాయై నమః
- ఓం మదనవిఘ్నేశ్వరకుమారమాతృకాయై నమః
- ఓం కుంకుమశోభితదివ్యవదనాయై నమః
- ఓం అనంతనక్షత్రగణనాయికాయై నమః
- ఓం చతుర్ధశభువనకల్పితాయై నమః
- ఓం సురాధినాథసత్సంగసమాచారకార్యకలాపాయై నమః
- ఓం అనంగరూపపరిచారికాసేవితాయై నమః
- ఓం గంధర్వయక్షకిన్నరకింపురుషవందితాయై నమః
- ఓం సంతాన కల్పవృక్షసముదాయభాసిన్యై నమః
- ఓం అనంతకోటి బ్రహ్మాండసైనికాధ్యక్ష సేవితాయై నమః
- ఓం పారిజాత, కదంబవనవిహారిణ్యై నమః
- ఓం సమస్తదేవీకుటుంబవందితాయై నమః
- ఓం చతుర్వేదకళాచాతుర్యై నమః
- ఓం పాపతాప దారిద్ర్యనాశిన్యై నమః
- ఓం శ్రుతి,స్మృతి,పురాణకావ్యసంరక్షణాయై నమః
- ఓం పంచబ్రహ్మాసన విరాజితాయై నమః
- ఓం వజ్రవైడూర్యమరకతమాణిక్యచంద్రకాంతరత్నసింహాసనశోభితాయై నమః
- ఓం దివ్యాంబరప్రభాదివ్యతేజోవిభాసాయై నమః
- ఓం పంచముఖసర్వేశ్వరహృదయాధిష్టానాయై నమః
- ఓం ఆపాదమస్తక నవరత్నసువర్ణాభరణధారిణ్యై నమః
- ఓం విలాసినీఅఘోరామంగళాసనాపీఠశక్తివందితాయై నమః
- ఓం క్షమా,దయా,జయా,విజయాపీఠశక్తిపరిపాలితాయై నమః
- ఓం అజితా,అపరాజితా,నిత్యపీఠశక్తిపరిపూజితాయై నమః
- ఓం సిద్ధి,బుద్ధి,మేధా,లక్ష్మీ,శృతిపీఠశక్తి సేవితాయై నమః
- ఓం లజ్జాతుష్టిపుష్టి పీఠశక్తి ప్రభాసితాయై నమః
- ఓం నవరాత్రదీక్షాప్రియాయై నమః
- ఓం నామ,గాన,జ్ఞానయజ్ఞప్రియాయై నమః
- ఓం జపతపోయోగత్యాగసంతుష్టాయై నమః
- ఓం పంచదశీమహావిద్యాయై నమః
- ఓం సదాషోడశప్రాయసర్వేశ్వరవల్లభాయై నమః
- ఓం ఓంకారాక్షర స్వరూపిణ్యై నమః
- ఓం సకలయంత్రసకలతంత్రసమర్చితాయై నమః
- ఓం సహస్రయోజనప్రమాణ,చింతామణిగృహవాసిన్యై నమః
- ఓం మహాదేవసహితశ్రీపరమేశ్వరీదేవ్యై నమః
- ఓం మణిద్వీపవిరాజితమహాభువనేశ్వరీదేవ్యై నమః
మరిన్ని అష్టోత్తరములు: