Akshaya Tritiya Adhyatma Darshan In Telugu – అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము గురించి తెలుసుకుందాం.

Akshaya Tritiya Adhyatma Darshan Telugu

అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము (వైశాఖ శుక్ల తృతీయాతిథి)

వైశాఖమాస శుక్లపక్ష తృతీయాతిథిని అక్షయ తృతీయ అనియు, ఆఖాతృతీయ అనియు, ఆఖాతీజ అనియు అందురు.

అక్షయ మనగా ఎన్నిటికి నశించనిది అని, సత్యమైనది. యేది సర్వదా సత్యమైనదో అదియే పరమాత్మ ఈశ్వరుడు, అక్షయ అఖండ సర్వవ్యాపకుడు. ఈ అక్షయ తృతీయాతిథి ఈశ్వరతిథి. ఈ అక్షయతిథి పరశురాముని జన్మదినమైన కారణమున “పరశురామతిథి” అనియు అందురు. పరశురాముడు మహాత్ములైన చిరంజీవుల లెక్కలోనికి వచ్చి వాడుగాన ఈ తిథిని చిరంజీవి తిథి అనియు అందురు. నాలుగు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగ) త్రేతాయుగ ప్రారంభము ఈ తిథి నుండే ప్రారంభమైనది. అందువలన ఈ తిథిని యుగాది తిథి యందురు.

బదరీనారాయణ దర్శన తిథి నాలుగు థామములలో నొకటైన బదరీనారాయణ దర్శనతిథియు నిదియే. భక్తులు ఈ దినమిచట త్యాగ దాన దక్షిణ, జప, తప హోమ హవన గంగాస్నానాది కార్యములు చేయుదురు. భగవానుని ప్రసాదమును భక్తులు భక్తితో గ్రహించెదరు.

అక్షయ తృతీయనాడు భక్తజనులు భగవానుని చరణ దర్శనమునకు బృందావనము వచ్చెదరు. ఇది “సత్యమేవజయతే” అను సందేశమిచ్చును. ఈ తిథియందు వివాహాది శుభకార్యములు చేయుదురు. అక్షయ గ్రంథమైన గీత అమర నిధివంటిది. దీనిని చదివినను వినినను, జీవితము సఫలమగును. అక్షయత్త్వము ప్రాప్తించును.

మరిన్ని పండుగలు:

Leave a Comment