మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండలోని షడ్వింశః సర్గః రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తున్నారు. అప్పుడు శూర్పణఖా అనే రాక్షసి వారి వద్దకు వచ్చి, రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. రాముడు సీతను తన భార్యగా పరిచయం చేసి, శూర్పణఖాను తిరస్కరిస్తాడు.
దూషణాదివధః
దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సః |
సందిదేశ మహాబాహుర్భీమవేగాన్ దురాసదాన్ ||
1
రాక్షసాన్ పంచ సాహస్రాన్ సమరేష్వనివర్తినః |
తే శూలైః పట్టిశైః ఖడ్గైః శిలావర్షైర్ద్రుమైరపి ||
2
శరవర్షైరవిచ్ఛిన్నం వవృషుస్తం సమంతతః |
స ద్రుమాణాం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ ||
3
ప్రతిజగ్రాహ ధర్మాత్మా రాఘవస్తీక్ష్ణసాయకైః |
ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవర్షభః ||
4
రామః క్రోధం పరం భేజే వధార్థం సర్వరక్షసామ్ |
తతః క్రోధసమావిష్టః ప్రదీప్త ఇవ తేజసా ||
5
శరైరవాకిరత్సైన్యం సర్వతః సహదూషణమ్ |
తతః సేనాపతిః క్రుద్ధో దూషణః శత్రుదూషణః ||
6
శరైరశనికల్పైస్తం రాఘవం సమవాకిరత్ |
తతో రామః సుసంక్రుద్ధః క్షురేణాస్య మహద్ధనుః ||
7
చిచ్ఛేద సమరే వీరశ్చతుర్భిశ్చతురో హయాన్ |
హత్వా చాశ్వాన్ శరైస్తీక్ష్ణైరర్ధచంద్రేణ సారథేః ||
8
శిరో జహార తద్రక్షస్త్రిభిర్వివ్యాధ వక్షసి |
స చ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః ||
9
జగ్రాహ గిరిశృంగాభం పరిఘం రోమహర్షణమ్ |
వేష్టితం కాంచనైః పట్టైర్దేవసైన్యప్రమర్దనమ్ ||
10
ఆయసైః శంకుభిస్తీక్ష్ణైః కీర్ణం పరవసోక్షితమ్ |
వజ్రాశనిసమస్పర్శం పరగోపురదారణమ్ ||
11
తం మహోరగసంకాశం ప్రగృహ్య పరిఘం రణే |
దూషణోఽభ్యద్రవద్రామం క్రూరకర్మా నిశాచరః ||
12
తస్యాభిపతమానస్య దూషణస్య స రాఘవః |
ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ ||
13
భ్రష్టస్తస్య మహాకాయః పపాత రణమూర్ధని |
పరిఘశ్ఛిన్నహస్తస్య శక్రధ్వజ ఇవాగ్రతః ||
14
స కరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణః |
విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజః ||
15
తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే |
సాధు సాధ్వితి కాకుత్స్థం సర్వభూతాన్యపూజయన్ ||
16
ఏతస్మిన్నంతరే క్రుద్ధాస్త్రయః సేనాగ్రయాయినః |
సంహత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావపాశితాః ||
17
మహాకపాలః స్థూలాక్షః ప్రమాథీ చ మహాబలః |
మహాకపాలో విపులం శూలముద్యమ్య రాక్షసః ||
18
స్థూలాక్షః పట్టిశం గృహ్య ప్రమాథీ చ పరశ్వధమ్ |
దృష్ట్వైవాపతతస్తూర్ణం రాఘవః సాయకైః శితైః ||
19
తీక్ష్ణాగ్రైః ప్రతిజగ్రాహ సంప్రాప్తానతిథీనివ |
మహాకపాలస్య శిరశ్చిచ్ఛేద పరమేషుభిః ||
20
అసంఖ్యేయైస్తు బాణౌఘైః ప్రమమాథ ప్రమాథినమ్ |
స పపాత హతో భూమౌ విటపీవ మహాద్రుమః ||
21
స్థూలాక్షస్యాక్షిణీ తీక్ష్ణైః పూరయామాస సాయకైః |
దూషణస్యానుగాన్ పంచసహస్రాన్ కుపితః క్షణాత్ ||
22
బాణౌఘైః పంచసహస్రైరనయద్యమసాదనమ్ |
దూషణం నిహతం దృష్ట్వా తస్య చైవ పదానుగాన్ ||
23
వ్యాదిదేశ ఖరః క్రుద్ధః సేనాధ్యక్షాన్మహాబలాన్ |
అయం వినిహతః సంఖ్యే దూషణః సపదానుగః ||
24
మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషమ్ |
శస్త్రైర్నానావిధాకారైర్హనధ్వం సర్వరాక్షసాః ||
25
ఏవముక్త్వా ఖరః క్రుద్ధో రామమేవాభిదుద్రువే |
శ్యేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః ||
26
దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః |
మేఘమాలీ మహామాలీ సర్పాస్యో రుధిరాశనః ||
27
ద్వాదశైతే మహావీర్యా బలాధ్యక్షాః ససైనికాః |
రామమేవాభ్యవర్తంత విసృజంతః శరోత్తమాన్ ||
28
తతః పావకసంకాశైర్హేమవజ్రవిభూషితైః |
జఘాన శేషం తేజస్వీ తస్య సైన్యస్య సాయకైః ||
29
తే రుక్మపుంఖా విశిఖాః సధూమా ఇవ పావకాః |
నిజఘ్నుస్తాని రక్షాంసి వజ్రా ఇవ మహాద్రుమాన్ ||
30
రక్షసాం తు శతం రామః శతేనైకేన కర్ణినా |
సహస్రం చ సహస్రేణ జఘాన రణమూర్ధని ||
31
తైభిన్నవర్మాభరణాశ్ఛిన్నభిన్నశరాసనాః |
నిపేతుః శోణితాదిగ్ధా ధరణ్యాం రజనీచరాః ||
32
తైర్ముక్తకేశైః సమరే పతితైః శోణితోక్షితైః |
ఆస్తీర్ణా వసుధా కృత్స్నా మహావేదిః కుశైరివ ||
33
క్షణేన తు మహాఘోరం వనం నిహతరాక్షసమ్ |
బభూవ నిరయప్రఖ్యం మాంసశోణితకర్దమమ్ ||
34
చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
హతాన్యేకేన రామేణ మానుషేణ పదాతినా ||
35
తస్య సైన్యస్య సర్వస్య ఖరః శేషో మహారథః |
రాక్షసస్త్రిశిరాశ్చైవ రామశ్చ రిపుసూదనః ||
36
శేషా హతా మహాసత్త్వా రాక్షసా రణమూర్ధని |
ఘోరా దుర్విషహాః సర్వే లక్ష్మణస్యాగ్రజేన తే ||
37
తతస్తు తద్భీమబలం మహాహవే
సమీక్ష్య రామేణ హతం బలీయసా |
రథేన రామం మహతా ఖరస్తదా
సమాససాదేంద్ర ఇవోద్యతాశనిః ||
38
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశః సర్గః ||
Aranya Kanda Sarga 26 Meaning In Telugu PDF
తన సైన్యము అంతా రాముని బాణములకు ఆహుతి కావడం చూచాడు దూషణుడు. దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనలను ఐదువేల మందిని తీసుకొని రాముని మీదికి వెళ్లాడు. (అంటే అప్పటి దాకా ఖరుని వెంట వచ్చిన 14,000 మంది రాక్షసులు చచ్చారు.) ఆ ఐదువేల మంది రాక్షస సైన్యము రాముని చుట్టు ముట్టారు. రాముని మీద శూలములు, పట్టిసములు, కత్తులు, రాళ్లు, చెట్లు, బాణములు వర్షంలా కురిపిస్తున్నారు. రాముడు కూడా తన బాణములతో వారు తన మీదికి విసురుతున్న శూలములను, పట్టిసములను, కత్తులను, చెట్లను, సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు.
రాక్షసులు తన మీద ఆయుధములు ప్రయోగించే కొద్దీ రాముని కోపం పెరుగుతూ ఉంది. రాముడు వేలకొలది బాణములతో దూషణుని సైన్యమును కప్పివేసాడు. ఇది చూచిన దూషణుడు రాముని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. రాముడు అర్ధచంద్రాకారములో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచాడు. నాలుగుబాణములతో దూషణుని రథమునకు కట్టిన హయములను చంపాడు. మరొక అర్థచంద్రబాణముతో సారధి తల నరికాడు. మూడుబాణములతో దూషణుని కొట్టాడు.
దూషణుని ధనుస్సు విరిగింది. రథం కూలింది. సారథి చచ్చాడు. దూషణుడు నేలమీదికి దూకాడు. ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు. రాముని మీదికి పరుగెత్తాడు. అది చూచి రాముడు రెండు బాణములతో దూషణుని రెండు చేతులను బుజాల వద్ద నరికాడు. వాడి చేతులు పరిఘతో సహా నేలకూలాయి. చేతులు విరిగిన దూషణుడు నిలువునా కింద పడ్డాడు.
ఇది చూచి దూషణుని సేనాధి పతులు అయిన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధీ అను ముగ్గురు తమ తమ ఆయుధములను తీసుకొని రాముని మీదికి వెళ్లారు. మహాకపాలుడు శూలమును, స్థూలాక్షుడు పట్టిసమును, ప్రమాథి గండ్రగొడ్డలిని ధరించారు. వారిని చూచి రాముడు వారి మీద బాణవర్షము కురిపించాడు. మహాకపాలుని తల నరికాడు. స్థూలాక్షుని కళ్లలో రాముడు వదిలిన బాణములు గుచ్చుకున్నాయి. ప్రమాథి గుండెలను చీల్చాడు రాముడు. ఆ ప్రకారంగా రాముడు దూషణుని, అతని సేనాధి పతులు ముగ్గురను, ఐదువేలమంది సైనికులను మట్టుబెట్టాడు.
తన సోదరుడు దూషణుడు అతని సైన్యము సమూలంగా నాశనం అవడం చూచాడు ఖరుడు. తన సేనాధి పతులను పిలిచాడ.
“సేనానాయకులారా! నా సోదరుడు దూషణుడు అతని సైన్యము రాముని చేతిలో హతం అయ్యారు. మీరు మీ మీ సేనలతో రాముని హతమార్చండి. వెళ్లండి” అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా తన సేనానాయకులను ఆజ్ఞాపించిన ఖరుడు తాను కూడా ఆయుధములు ధరించి రాముని మీదికి పరుగెత్తాడు. ఖరుని సేనానాయకులైన శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాశనుడు అనే పన్నెండు మంది సేనానాయకులు ఖరుని వెంట రాముని మీదికి ఉరికారు.
రాముడు తన వజ్రసమానములైన బాణములతో ఖరుని సేనలను తుత్తునియలు చేసాడు. రాముడు కర్ణి అనే పేరుగల నూరు బాణములతోనూ, మరో వెయ్యిమందిని వాడి అయిన బాణములతోనూ సంహరించాడు. రాముని చేత చంపబడ్డ రాక్షసుల శరీరములతో ఆ ప్రాంతమంతా కప్పబడిపోయింది.
ఏ వాహనమూ లేకుండా, ఇతర సైన్యసాయము లేకుండా రాముడు ఒంటరిగా ధనుర్ధారియై 14,000 మంది రాక్షసులను మట్టుబెట్టాడు. వారిలో ఖరుడు, త్రిశిరుడు మిగిలారు. తన సైన్యము అంతా సర్వనాశనం కావడం చూచి ఖరుడు కోపంతో రగిలిపోయాడు. తన రథం ఎక్కి, ఆయుధములను ధరించి, రాముని మీదికి వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
అరణ్యకాండ సప్తవింశః సర్గః (27) >>