మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రింశః సర్గః (30వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రాముడు సువర్ణమృగాన్ని వెంబడించి, దాన్ని వేటాడిన తర్వాత, మృగం రూపంలో ఉన్న మారీచుడు తన అసలు రూపంలోకి మారి “హా సీత! హా లక్ష్మణ!” అని కేకలు వేస్తాడు. ఆ కేకలు విని సీత భయంతో లక్ష్మణుని రక్షణ కోసం రమ్మని వేడుకుంటుంది.
ఖరసంహారః
భిత్త్వా తు తాం గదాం బాణై రాఘవో ధర్మవత్సలః |
స్మయమానః ఖరం వాక్యం సంరబ్ధమిదమబ్రవీత్ ||
1
ఏతత్తే బలసర్వస్వం దర్శితం రాక్షసాధమ |
శక్తిహీనతరో మత్తో వృథా త్వమవగర్జసి ||
2
ఏషా బాణవినిర్భిన్నా గదా భూమితలం గతా |
అభిధానప్రగల్భస్య తవ ప్రత్యరిఘాతినీ ||
3
యత్త్వయోక్తం వినష్టానామహమశ్రుప్రమార్జనమ్ |
రాక్షసానాం కరోమీతి మిథ్యా తదపి తే వచః ||
4
నీచస్య క్షుద్రశీలస్య మిథ్యావృత్తస్య రక్షసః |
ప్రాణానపహరిష్యామి గరుత్మానమృతం యథా ||
5
అద్య తే ఛిన్నకంఠస్య ఫేనబుద్బుదభూషితమ్ |
విదారితస్య మద్బాణైర్మహీ పాస్యతి శోణితమ్ ||
6
పాంసురూషితసర్వాంగః స్రస్తన్యస్తభుజద్వయః |
స్వప్స్యసే గాం సమాలింగ్య దుర్లభాం ప్రమదామివ ||
7
ప్రవృద్ధనిద్రే శయితే త్వయి రాక్షసపాంసనే |
భవిష్యంత్యశరణ్యానాం శరణ్యా దండకా ఇమే ||
8
జనస్థానే హతస్థానే తవ రాక్షస మచ్ఛరైః |
నిర్భయా విచరిష్యంతి సర్వతో మునయో వనే ||
9
అద్య విప్రసరిష్యంతి రాక్షస్యో హతబాంధవాః |
బాష్పార్ద్రవదనా దీనా భయాదన్యభయావహాః ||
10
అద్య శోకరసజ్ఞాస్తాః భవిష్యంతి నిరర్థకాః |
అనురూపకులాః పత్న్యో యాసాం త్వం పతిరీదృశః ||
11
నృశంస నీచ క్షుద్రాత్మన్ నిత్యం బ్రాహ్మణకంటక |
యత్కృతే శంకితైరగ్నౌ మునిభిః పాత్యతే హవిః ||
12
తమేవమభిసంరబ్ధం బ్రువాణం రాఘవం రణే |
ఖరో నిర్భర్త్సయామాస రోషాత్ఖరతరస్వనః ||
13
దృఢం ఖల్వవలిప్తోసి భయేష్వపి చ నిర్భయః |
వాచ్యావాచ్యం తతో హి త్వం మృత్యువశ్యో న బుధ్యసే ||
14
కాలపాశపరిక్షిప్తా భవంతి పురుషా హి యే |
కార్యాకార్యం న జానంతి తే నిరస్తషడింద్రియాః ||
15
ఏవముక్త్వా తతో రామం సంరుధ్య భృకుటిం తతః |
స దదర్శ మహాసాలమవిదూరే నిశాచరః ||
16
రణే ప్రహరణస్యార్థే సర్వతో హ్యవలోకయన్ |
స తముత్పాటయామాస సందశ్య దశనచ్ఛదమ్ ||
17
తం సముత్క్షిప్య బాహుభ్యాం వినద్య చ మహాబలః |
రామముద్దిశ్య చిక్షేప హతస్త్వమితి చాబ్రవీత్ ||
18
తమాపతంతం బాణౌఘైశ్ఛిత్త్వా రామః ప్రతాపవాన్ |
రోషమాహారయత్తీవ్రం నిహంతుం సమరే ఖరమ్ ||
19
జాతస్వేదస్తతో రామో రోషాద్రక్తాంతలోచనః |
నిర్బిభేద సహస్రేణ బాణానాం సమరే ఖరమ్ ||
20
తస్య బాణాంతరాద్రక్తం బహు సుస్రావ ఫేనిలమ్ |
గిరేః ప్రస్రవణస్యేవ తోయధారాపరిస్రవః ||
21
విహలః స కృతో బాణైః ఖరో రామేణ సంయుగే |
మత్తో రుధిరగంధేన తమేవాభ్యద్రవద్ద్రుతమ్ ||
22
తమాపతంతం సంరబ్ధం కృతాస్త్రో రుధిరాప్లుతమ్ |
అపాసర్పత్ప్రతిపదం కించిత్త్వరితవిక్రమః ||
23
తతః పావకసంకాశం వధాయ సమరే శరమ్ |
ఖరస్య రామో జగ్రాహ బ్రహ్మదండమివాపరమ్ ||
24
స తం దత్తం మఘవతా సురరాజేన ధీమతా |
సందధే చాపి ధర్మాత్మా ముమోచ చ ఖరం ప్రతి ||
25
స విముక్తో మహాబాణో నిర్ఘాతసమనిస్వనః |
రామేణ ధనురాయమ్య ఖరస్యోరసి చాపతత్ ||
26
స పపాత ఖరో భూమౌ దహ్యమానః శరాగ్నినా |
రుద్రేణేవ వినిర్దగ్ధః శ్వేతారణ్యే యథాంతకః ||
27
స వృత్ర ఇవ వజ్రేణ ఫేనేన నముచిర్యథా |
బలో వేంద్రాశనిహతో నిపపాత హతః ఖరః ||
28
తతో రాజర్షయః సర్వే సంగతాః పరమర్షయః |
సభాజ్య ముదితా రామమిదం వచనమబ్రువన్ ||
29
ఏతదర్థం మహాభాగ మహేంద్రః పాకశాసనః | [మహాతేజా]
శరభంగాశ్రమం పుణ్యమాజగామ పురందరః ||
30
ఆనీతస్త్వమిమం దేశముపాయేన మహర్షిభిః |
ఏషాం వధార్థం క్రూరాణాం రక్షసాం పాపకర్మణామ్ ||
31
తదిదం నః కృతం కార్యం త్వయా దశరథాత్మజ |
సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః ||
32
ఏతస్మిన్నంతరే దేవాశ్చారణైః సహ సంగతాః |
దుందుభీంశ్చాభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః ||
33
రామస్యోపరి సంహృష్టా వవృషుర్విస్మితాస్తదా |
అర్ధాధికముహూర్తేన రామేణ నిశితైః శరైః ||
34
చతుర్దశసహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
ఖరదూషణముఖ్యానాం నిహతాని మహాహవే ||
35
అహో బత మహత్కర్మ రామస్య విదితాత్మనః |
అహో వీర్యమహో దాక్ష్యం విష్ణోరివ హి దృశ్యతే ||
36
ఇత్యేవముక్త్వా తే సర్వే యయుర్దేవా యథాగతమ్ |
ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణః సహ సీతయా ||
37
గిరిదుర్గాద్వినిష్క్రమ్య సంవివేశాశ్రమం సుఖీ |
తతో రామస్తు విజయీ పూజ్యమానో మహర్షిభిః ||
38
ప్రవివేశాశ్రమం వీరో లక్ష్మణేనాభిపూజితః |
తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహమ్ ||
39
బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే |
ముదా పరమయా యుక్తా దృష్ట్వా రక్షోగణాన్హతాన్ |
రామం చైవావ్యథం దృష్ట్వా తుతోష జనకాత్మజా ||
40
తతస్తు తం రాక్షససంఘమర్దనం
సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః ||
పునః పరిష్వజ్య శశిప్రభాననా
బభూవ హృష్టా జనకాత్మజా తదా ||
41
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రింశః సర్గః ||
Aranya Kanda Sarga 30 Meaning In Telugu
రాముడు ఖరుని గదను తుత్తునియలు చేయగానే ఖరుడు నివ్వెరపోయాడు. రాముడు ఖరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు.
“ఓ రాక్షసాధమా! నీ బలం ఎంతో తేలిపోయింది కదా! వృధాగా అరుస్తావు ఎందుకు. ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేలమీద పడిపోయింది. మరి ఇప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు. నీ మాటలు వమ్ము అయినట్లే కదా!
దుష్టుడు, దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గవాడవు. అందుకే నిన్ను చంపుతున్నాను. నీ కంఠమును తెగనరుకుతాను. నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమును శత్రుపీడ, రాక్షస పీడ లేకుండా చేస్తాను.
ఇప్పటి దాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను, మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకొనేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు, మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటి దాకా ఋషులను, మునులను భయపెడుతూ, వారి యజ్ఞయాగములను నాశనం చేస్తూ, వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇంక ఈ దండకారణ్యము విడిచిపోకతప్పదు. నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చేరోజు వచ్చింది.” అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముని చూచి ఖరుడు రాముడి బెదిరించడానికి పూనుకున్నాడు.
“ఓ రామా! నీవు అవివేకివే అనుకున్నాను. గర్విష్టివి కూడా. నీకు మహా గర్వము ఉంది. అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్వమే ఉంటుంది. చచ్చేముందు సంధిప్రేలాపన లాగా నీవు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు.” అంటూ ఖరుడు తగిన ఆయుధము కొరకు చుట్టూ చూచాడు. దగ్గరలోనే ఉన్న ఒక సాలవృక్షమును కూకటి వేళ్లతో పెకలించాడు. దానిని ఆయుధంగా ధరించి, “రామా! ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా!” అంటూ ఆ చెట్టును బలంగా రాముని మీదికి విసిరాడు.
రాముడు తన మీదికి అత్యంత వేగంతో దూసుకువస్తున్న సాలవృక్షమును తన వాడి అయిన బాణములతో రెండుగా ఖండించాడు. వెంటనే రాముడు వేయి బాణములను ఒకదాని వెంట ఒకటిగా సంధించి ఖరుని శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. ఖరుని శరీరం నుండి రక్తం జలపాతంలాగా బయటకు ఉరికింది. తన శరీరం అంతా నెత్తురు కారుతుండగా ఖరుడు రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రమును సంధించాడు. ఖరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ అస్త్రము ఖరుని గుండెలను చీల్చింది. ఖరుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడ్డాడు. ఖరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దండకారణ్యమునకు శాశ్వతంగా రాక్షస పీడ విరగడ అయింది.
ఆ దృశ్యమును చూచిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రాముని ఎంతో ప్రశంసించారు. అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు. “దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు ఇందుకే వెళ్లాడట. ఈ ఖరుని దూషణుని సంహరించడానికే ఆ మునులు రాముని ఈ ప్రాంతమునకు తీసుకొని వచ్చారట. ఇంక దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు.” అని అనుకొన్నారు. అంతట దేవతలు దేవ దుందుభులు మ్రోగించారు. రాముని మీద పుష్పవర్షము కురిపించారు.
రాముడికి, ఖరునికి, దూషణునికి, 14,000 మంది రాక్షసులకు జరిగిన యుద్ధము దాదాపు ఒకటిన్నర ముహూర్తకాలము జరిగింది. (ముహూర్తము అనగా 48 నిమిషములు. అనగా ఒక గంటా పన్నెండు నిమిషముల పాటు జరిగింది.) రాముని వీర్యమును పరాక్రమమును యుద్ధకౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్లారు.
రామునికి రాక్షసులకు మధ్యయుద్ధము ముగిసింది అని తెలుసుకొన్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలికి వచ్చాడు. రాముని తో వచ్చిన మునులు ఋషులు రాముని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు.
పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముని అభినందన పూర్వకంగా కౌగలించుకుంది. తరువాత సీతారాములు బయటకు వచ్చారు. యుద్ధములో చనిపోయిన రాక్షసులను చూచింది సీత. రామునికి ఏ అపాయము కలగనందుకు ఎంతో ఆనందపడింది.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.