Aranya Kanda Sarga 69 In Telugu – అరణ్యకాండ ఏకోనసప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనసప్తతితమః సర్గ (69వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాక్షసి శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. ఆమె రాముడిని వివాహం చేసుకోవాలని కోరుతుంది, కానీ రాముడు ఆమెను తిరస్కరిస్తూ సీతకు తన భక్తిని ప్రదర్శిస్తాడు. నిరాశ చెందిన శూర్పణఖ లక్ష్మణుడిని ఆశ్రయిస్తుంది, కానీ అతనూ ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు నరికేస్తాడు.

కబంధగ్రాహః

కృత్వైవముదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ |
అవేక్షంతౌ వనే సీతాం పశ్చిమాం జగ్మతుర్దిశమ్ ||

1

తౌ దిశం దక్షిణాం గత్వా శరచాపాసిధారిణౌ |
అవిప్రహతమైక్ష్వాకౌ పంథానం ప్రతిజగ్మతుః ||

2

గుల్మైర్వృక్షైశ్చ బహుభిర్లతాభిశ్చ ప్రవేష్టితమ్ |
ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోరదర్శనమ్ ||

3

వ్యతిక్రమ్య తు వేగేన వ్యాలసింహనిషేవితమ్ |
సుభీమం తన్మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ ||

4

తతః పరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవౌ |
క్రౌంచారణ్యం వివిశతుర్గహనం తౌ మహౌజసౌ ||

5

నానామేఘఘనప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః |
నానాపక్షిగణైర్జుష్టం నానావ్యాలమృగైర్యుతమ్ ||

6

దిదృక్షమాణౌ వైదేహీం తద్వనం తౌ విచిక్యతుః |
తత్ర తత్రావతిష్ఠంతౌ సీతాహరణకర్శితౌ ||

7

తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా |
క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరే ||

8

దృష్ట్వా తు తద్వనం ఘోరం బహుభీమమృగద్విజమ్ |
నానాసత్త్వసమాకీర్ణం సర్వం గహనపాదపమ్ ||

9

దదృశాతే తు తౌ తత్ర దరీం దశరథాత్మజౌ |
పాతాలసమగంభీరాం తమసా నిత్యసంవృతామ్ ||

10

ఆసాద్య తౌ నరవ్యాఘ్రౌ దర్యాస్తస్యా విదూరతః |
దదృశాతే మహారూపాం రాక్షసీం వికృతాననామ్ ||

11

భయదామల్పసత్త్వానాం బీభత్సాం రౌద్రదర్శనామ్ |
లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాలాం పరుషత్వచమ్ ||

12

భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజామ్ |
ప్రైక్షేతాం తౌ తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

13

సా సమాసాద్య తౌ వీరౌ వ్రజంతం భ్రాతురగ్రతః |
ఏహి రంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణమ్ ||

14

ఉవాచ చైనం వచనం సౌమిత్రిముపగూహ్య సా |
అహం త్వయోముఖీ నామ లాభస్తే త్వమసి ప్రియః ||

15

నాథ పర్వతకూటేషు నదీనాం పులినేషు చ |
ఆయుఃశేషమిమం వీర త్వం మయా సహ రంస్యసే ||

16

ఏవముక్తస్తు కుపితః ఖడ్గముద్ధృత్య లక్ష్మణః |
కర్ణనాసౌ స్తనౌ చాస్యా నిచకర్తారిసూదనః ||

17

కర్ణనాసే నికృత్తే తు విస్వరం సా వినద్య చ |
యథాగతం ప్రదుద్రావ రాక్షసీ భీమదర్శనా ||

18

తస్యాం గతాయాం గహనం విశంతౌ వనమోజసా |
ఆసేదతురమిత్రఘ్నౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

19

లక్ష్మణస్తు మహాతేజాః సత్త్వవాఞ్ఛీలవాఞ్ఛుచిః |
అబ్రవీత్ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్తతేజసమ్ ||

20

స్పందతే మే దృఢం బాహురుద్విగ్నమివ మే మనః |
ప్రాయశశ్చాప్యనిష్టాని నిమిత్తాన్యుపలక్షయే ||

21

తస్మాత్సజ్జీభవార్య త్వం కురుష్వ వచనం హితమ్ |
మమైవ హి నిమిత్తాని సద్యః శంసంతి సంభ్రమమ్ ||

22

ఏష వంచులకో నామ పక్షీ పరమదారుణః |
ఆవయోర్విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి ||

23

తయోరన్వేషతోరేవం సర్వం తద్వనమోజసా |
సంజజ్ఞే విపులః శబ్దః ప్రభంజన్నివ తద్వనమ్ ||

24

సంవేష్టితమివాత్యర్థం గగనం మాతరిశ్వనా |
వనస్య తస్య శబ్దోఽభూద్దివమాపూరయన్నివ ||

25

తం శబ్దం కాంక్షమాణస్తు రామః కక్షే సహానుజః |
దదర్శ సుమహాకాయం రాక్షసం విపులోరసమ్ ||

26

ఆసేదతుస్తతస్తత్ర తావుభౌ ప్రముఖే స్థితమ్ |
వివృద్ధమశిరోగ్రీవం కబంధముదరేముఖమ్ ||

27

రోమభిర్నిచితైస్తీక్ష్ణైర్మహాగిరిమివోచ్ఛ్రితమ్ |
నీలమేఘనిభం రౌద్రం మేఘస్తనితనిఃస్వనమ్ ||

28

అగ్నిజ్వాలానికాశేన లలాటస్థేన దీప్యతా |
మహాపక్ష్మేణ పింగేన విపులేనాయతేన చ ||

29

ఏకేనోరసి ఘోరేణ నయనేనాశుదర్శినా |
మహాదంష్ట్రోపపన్నం తం లేలిహానం మహాముఖమ్ ||

30

భక్షయంతం మహాఘోరానృక్షసింహమృగద్విపాన్ |
ఘోరౌ భుజౌ వికుర్వాణముభౌ యోజనమాయతౌ ||

31

కరాభ్యాం వివిధాన్ గృహ్య ఋక్షాన్ పక్షిగణాన్ మృగాన్ |
ఆకర్షంతం వికర్షంతమనేకాన్ మృగయూథపాన్ ||

32

స్థితమావృత్య పంథానం తయోర్భ్రాత్రోః ప్రపన్నయోః |
అథ తౌ సమభిక్రమ్య క్రోశమాత్రే దదర్శతుః ||

33

మహాంతం దారుణం భీమం కబంధం భుజసంవృతమ్ |
కబంధమివ సంస్థానాదతిఘోరప్రదర్శనమ్ ||

34

స మహాబాహురత్యర్థం ప్రసార్య విపులౌ భూజౌ |
జగ్రాహ సహితావేవ రాఘవౌ పీడయన్ బలాత్ ||

35

ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజోవపుర్ధరౌ |
భ్రాతరౌ వివశం ప్రాప్తౌ కృష్యమాణౌ మహాబలౌ ||

36

తత్ర ధైర్యేణ శూరస్తు రాఘవో నైవ వివ్యథే |
బాల్యాదనాశ్రయత్వాచ్చ లక్ష్మణస్త్వతివివ్యథే ||

37

ఉవాచ చ విషణ్ణః సన్ రాఘవం రాఘవానుజః |
పశ్య మాం వీర వివశం రాక్షసస్య వశం గతమ్ ||

38

మయైకేన వినిర్యుక్తః పరిముంచస్వ రాఘవ |
మాం హి భూతబలిం దత్త్వా పలాయస్వ యథాసుఖమ్ ||

39

అధిగంతాఽసి వైదేహీమచిరేణేతి మే మతిః |
ప్రతిలభ్య చ కాకుత్స్థ పితృపైతామహీం మహీమ్ ||

40

తత్ర మాం రామ రాజ్యస్థః స్మర్తుమర్హిసి సర్వదా |
లక్ష్మణేనైవముక్తస్తు రామః సౌమిత్రిమబ్రవీత్ ||

41

మా స్మ త్రాసం కృథా వీర న హి త్వాదృగ్విషీదతి |
ఏతస్మిన్నంతరే క్రూరో భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

42

పప్రచ్ఛ ఘననిర్ఘోషః కబంధో దానవోత్తమః |
కౌ యువాం వృషభస్కంధౌ మహాఖడ్గధనుర్ధరౌ ||

43

ఘోరం దేశమిమం ప్రాప్తౌ మమ భక్షావుపస్థితౌ |
వదతం కార్యమిహ వాం కిమర్థం చాగతౌ యువామ్ ||

44

ఇమం దేశమనుప్రాప్తౌ క్షుధార్తస్యేహ తిష్ఠతః |
సబాణచాపఖడ్గౌ చ తీక్ష్ణశృంగావివర్షభౌ ||

45

మమాస్యమనుసంప్రాప్తౌ దుర్లభం జీవితం పునః |
తస్య తద్వచనం శ్రుత్వా కబంధస్య దురాత్మనః ||

46

ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యతా |
కృచ్ఛ్రాత్ కృచ్ఛ్రతరం ప్రాప్య దారుణం సత్యవిక్రమ ||

47

వ్యసనం జీవితాంతాయ ప్రాప్తమప్రాప్య తాం ప్రియామ్ |
కాలస్య సుమహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ ||

48

త్వాం చ మాం చ నరవ్యాఘ్ర వ్యసనైః పశ్య మోహితౌ |
నాతిభారోఽస్తి దైవస్య సర్వభూతేషు లక్షణ ||

49

శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే |
కాలాభిపన్నాః సీదంతి యథా వాలుకసేతవః ||

50

ఇతి బ్రువాణో దృఢసత్యవిక్రమో
మహాయశా దాశరథిః ప్రతాపవాన్ |
అవేక్ష్య సౌమిత్రిముదగ్రపౌరుషం
స్థిరాం తదా స్వాం మతిమాత్మనాఽకరోత్ ||

51

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనసప్తతితమః సర్గః ||

Aranya Kanda Sarga 69 Meaning In Telugu

రామలక్ష్మణులు ఆ ప్రకారంగా జటాయువుకు ఉత్తర క్రియలు నిర్వర్తించి, దక్షిణ దిక్కుగా సీతను వెదుకుతూ వెళ్లారు. పొదలతో, పెద్ద పెద్ద వృక్షములతో, సూర్యరశ్మికూడా చొరకుండా ఉన్న కీకారణ్యములో వారు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ జనస్థానము నుండి మూడు కోసుల దూరం వెళ్లారు. అలా వెళుతూ వారు అరణ్యము నంతా సీత కోసం అణువు అణువునా గాలిస్తున్నారు.

సీతను రావణుడు అనే రాక్షసుడు తీసుకువెళ్లాడు అని తెలుసు కానీ ఎక్కడకు తీసుకు వెళ్లాడో రామలక్ష్మణులకు తెలియదు. జటాయువు చెప్పలేదు. అందుకని అడవి అంతా గాలిస్తున్నారు. వారు క్రౌంచారణ్యము దాటారు. మతంగుని ఆశ్రమము వైపుకు వెళుతున్నారు.

వారికి మధ్యలో ఒక పర్వతము కనపడింది. ఆ పర్వతము దగ్గర ఒక పెద్ద గుహను వారుచూచారు. ఆ గుహలో అంతా చీకటి మయంగా ఉంది. రామలక్ష్మణులు ఆ గుహ వద్దకు వెళ్లారు. ఆ గుహ దగ్గర వారు వికృతాకారంతో ఉన్న ఒక రాక్షసి ని చూచారు. ఆ రాక్షసిని చూస్తే మామూలు మనుష్యులయితే భయంతో ప్రాణాలు విడుస్తారు.

అలాంటి రాక్షసికి రాముని వెనక నడుస్తున్న లక్ష్మణుడి మీద మోహం కలిగింది. లక్ష్మణుని పట్టుకొని తన వైపుకు లాక్కుంది. తన కోరిక తీర్చమని అడిగింది.

“ఓ సుందరాంగా! నా పేరు అయోముఖి. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు కావాలి. మనం ఇద్దరం హాయిగా క్రీడిద్దాము.” అని లక్ష్మణుని పట్టుకొని లాగింది.

లక్ష్మణునికి ఒళ్లు మండింది.. అసలే అయాచితంగా వచ్చి పడిన కష్టాలతో సతమతమవుతున్న లక్ష్మణునికి ఆమె మాటలు విని ఒళ్లు మండి పోయింది. వెంటనే కత్తి తీసి అలవాటైన ప్రకారము, ఆ రాక్షసి ముక్కు చెవులు కోసాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు భయభ్రాంతురాలైన ఆ రాక్షసి అక్కడి నుండి పారిపోయింది. రాముడు ఇదేమీ పట్టించుకోలేదు. తన పాటికి తాను ముందుకు పోతున్నాడు. లక్ష్మణుడు వెంట నడుస్తున్నాడు.

కొంచెం దూరం పోగానే లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “అన్నయ్యా! నాకు బుజాలు అదురుతున్నాయి. మనసంతా కల్లోలంగా ఉంది. ఎన్నో అపశకునములు కనపడుతున్నాయి. మనకు ఏదో ఆపద జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. దానికి సిద్ధంగా ఉండు. కాని మరొక పక్క మనకు జయము కలిగే సూచనగా వంచులకము అని పక్షి కూతకూడా వినపడుతూ ఉంది. ” అని అన్నాడు.

రాముడు లక్ష్మణుని మాటలు విని ఏమీ పలకలేదు. మాట్లాడలేదు. ముందుకుపోతున్నాడు. ఇంతలో వారికి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. ఆ శబ్దానికి అడవిలో జంతువులు అన్నీ చెల్లాచెదురుగా పారిపోయాయి. లక్ష్మణుడు ఆ శబ్దము ఎటునుండి వచ్చినదో ఆ వైపుకు వెళ్లాడు.

ఒక పొదలో లక్ష్మణునికి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుని పేరు కబంధుడు. ఆ రాక్షసునికి కేవలము శరీరము ఉంది. శిరస్సు లేదు. అతని పొట్ట వద్ద ముఖం ఉంది. వక్షస్థలములో ఒక కన్ను ఉంది. పొట్ట దగ్గర పెద్ద నోరు, ఆ నోట్లో పెద్దనాలుక ఉంది. ఆ రాక్షసుడు తన ఒంటి కంటితో ఎంతదూరం అయినా చూడగలడు. తన పొడుగాటి నాలుకను చాచి ఎంతటి జంతువునైనా నోట్లోకి లాక్కోగలడు. ఆ రాక్షసుని శరీరం పెద్ద పర్వతములాగా ఉంది. ఆ రాక్షసుని చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఆ చేతులతో ఆ రాక్షసుడు ఎన్నో జంతువులను తన వైపుకు లాక్కుని తింటూఉండేవాడు.

ఇప్పుడు వాడి చేతులకు రామలక్ష్మణులు తగిలారు. ఆ రాక్షసుడు తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకొని తన వైపుకు లాక్కుంటున్నాడు. రామలక్ష్మణులు నిస్సహాయంగా అతని చేతులలో బందీలుగా అయ్యారు.

లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఈ రాక్షసుడు నన్ను తినేస్తాడు. కనీసం నువ్వు అన్నా వీడిని ఎదిరించి బయటపడు. సీతను వెదుకు. నీకు జయం కలుగుతుంది.” అని అన్నాడు.

కాని రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాని ధైర్యంగా ఉ న్నాడు. “లక్ష్మణా! ధైర్యంగా ఉండు. మనకేం భయం లేదు. నేను వీడిని సంహరిస్తాను.” అని అన్నాడు.
తన చేతులలో చిక్కికూడా రాముడు అలా అనడం కబంధునికి ఆశ్చర్యం కలిగించింది.

“ఓ వీరులారా! మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు. ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈరోజు నాకు ఆహారంగా మారారు. నా చేతులకు చిక్కిన వారు బతికి బయటకు పోలేరు.” అని అన్నాడు కబంధుడు.

కబంధుని మాటలు విని రాముడు వ్యధ చెందాడు. “లక్ష్మణా! మరలా ఇదేమి కష్టము. మనకు కష్టము మీద కష్టము వచ్చి పడుతూ ఉంది. మనము వెతుకుతున్న సీత కనిపించలేదు సరికదా ఇప్పుడు మన ప్రాణం మీదికి వచ్చింది. కాల ప్రవాహంలో ఎంతటి వాళ్ళు అయినా కొట్టుకుపోవలసిందే కదా!” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తతితమః సర్గః (70) >>

Leave a Comment