Aranya Kanda Sarga 8 In Telugu – అరణ్యకాండ అష్టమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్య మహర్షిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అగస్త్యుడు రాముడికి దివ్య ఆయుధాలను అందజేస్తాడు, వాటితో రాక్షసులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రాముడు, లక్ష్మణుడు ఆ ఆయుధాలను స్వీకరించి, ధైర్యంగా దండకారణ్యంలో రాక్షసులను ఎదుర్కొంటారు.

సుతీక్ష్ణాభ్యనుజ్ఞా

రామస్తు సహసౌమిత్రిః సుతీక్ష్ణేనాభిపూజితః |
పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత ||

1

ఉత్థాయ తు యథాకాలం రాఘవః సహ సీతయా |
ఉపాస్పృశత్సుశీతేన జలేనోత్పలగంధినా ||

2

అథ తేఽగ్నిం సురాంశ్చైవ వైదేహీ రామలక్ష్మణౌ |
కాల్యం విధివదభ్యర్చ్య తపస్విశరణే వనే ||

3

ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మషాః |
సుతీక్ష్ణమభిగమ్యేదం శ్లక్ష్ణం వచనమబ్రువన్ ||

4

సుఖోషితాః స్మ భగవంస్త్వయా పూజ్యేన పూజితాః |
ఆపృచ్ఛామః ప్రయాస్యామో మునయస్త్వరయంతి నః ||

5

త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమమండలమ్ |
ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినామ్ ||

6

అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్మునిపుంగవైః |
ధర్మనిత్యైస్తపోదాంతైర్విశిఖైరివ పావకైః ||

7

అవిషహ్యాతపో యావత్సూర్యో నాతివిరాజతే |
అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః ||

8

తావదిచ్ఛామహే గంతుమిత్యుక్త్వా చరణౌ మునేః |
వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః ||

9

తౌ సంస్పృశంతౌ చరణావుత్థాప్య మునిపుంగవః |
గాఢమాలింగ్య సస్నేహమిదం వచనమబ్రవీత్ ||

10

అరిష్టం గచ్ఛ పంథానం రామ సౌమిత్రిణా సహ |
సీతయా చానయా సార్ధం ఛాయయేవానువృత్తయా ||

11

పశ్యాశ్రమపదం రమ్యం దండకారణ్యవాసినామ్ |
ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనామ్ ||

12

సుప్రాజ్యఫలమూలాని పుష్పితాని వనాని చ |
ప్రశస్తమృగయూథాని శాంతపక్షిగణాని చ ||

13

ఫుల్లపంకజషండాని ప్రసన్నసలిలాని చ |
కారండవవికీర్ణాని తటాకాని సరాంసి చ ||

14

ద్రక్ష్యసే దృష్టిరమ్యాణి గిరిప్రస్రవణాని చ |
రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ ||

15

గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్ఛతు |
ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ ||

16

ఏవముక్తస్తథేత్యుక్త్వా కాకుత్స్థః సహలక్ష్మణః |
ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే ||

17

తతః శుభతరే తూణీ ధనుషీ చాయతేక్షణా |
దదౌ సీతా తయోర్భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః ||

18

ఆబధ్య చ శుభే తూణీ చాపౌ చాదాయ సస్వనౌ |
నిష్క్రాంతావాశ్రమాద్గంతుముభౌ తౌ రామలక్ష్మణౌ ||

19

శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా |
ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః ||

Aranya Kanda Sarga 8 Meaning In Telugu

సీతా రామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్లాడు.

“మహాత్మా! రాత్రి మీ ఆతిధ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురమూ, మాతో వచ్చిన మునులు కలిసి, ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము.” అని అన్నాడు రాముడు..

“రామా! నీకు శుభమగు గాక! నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కలలా జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేల మీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలాఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి.” అని అన్నాడు.

“మహర్షీ! అలాగే చేస్తాను.” అని ఆ మహర్షికి నమస్కరించి, లక్ష్మణుడు, సీత, మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామ లక్ష్మణులు, సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ నవమః సర్గః (9) >>

Leave a Comment