Aranya Kanda Sarga 15 In Telugu – అరణ్యకాండ పంచదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” పంచదశః సర్గలో, రాముడు గోదావరి నదికి సమీపంలోని పంచవటిలో పర్ణ శాల, గడ్డి కుటీర నిర్మాణ పనిని అప్పగిస్తాడు . లక్ష్మణుడు తన నైపుణ్యంతో హాయిగా ఉండే ఒక కుటీరాన్ని నిర్మించాడు మరియు గృహప్రవేశ కార్యక్రమం తర్వాత వారు దానిలోకి ప్రవేశిస్తారు. రాముడు లక్ష్మణుడిని అతని నిర్మాణ పనిని మెచ్చుకుంటాడు మరియు కృతజ్ఞతాపూర్వకంగా అతను లక్ష్మణుడిని ఆలింగనం చేసుకుంటాడు మరియు రాముడి పట్ల లక్ష్మణునికి ఉన్న శ్రద్ధ గురించి తన హృదయాన్ని వ్యక్తం చేస్తాడు.

పంచవటీపర్ణశాలా

తతః పంచవటీం గత్వా నానావ్యాలమృగాయుతామ్ |
ఉవాచ భ్రాతరం రామః సౌమిత్రిం దీప్తతేజసమ్ ||

1

ఆగతాః స్మ యథోద్దిష్టమముం దేశం మహర్షిణా |
అయం పంచవటీదేశః సౌమ్య పుష్పితపాదపః ||

2

సర్వతశ్చార్యతాం దృష్టిః కాననే నిపుణో హ్యసి |
ఆశ్రమః కతరస్మిన్నో దేశే భవతి సమ్మతః ||

3

రమతే యత్ర వైదేహీ త్వమహం చైవ లక్ష్మణ |
తాదృశో దృశ్యాతాం దేశః సన్నికృష్టజలాశయః ||

4

వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా |
సన్నికృష్టం చ యత్ర స్యాత్ సమిత్పుష్పకుశోదకమ్ ||

5

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సంయతాంజలిః |
సీతాసమక్షం కాకుత్స్థమిదం వచనమబ్రవీత్ ||

6

పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియాతామితి మాం వద ||

7

సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః |
విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితమ్ ||

8

స తం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి |
హస్తౌ గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్ ||

9

అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః |
ఇహాశ్రమపదం సౌమ్య యథావత్కర్తుమర్హసి ||

10

ఇయమాదిత్యసంకాశైః పద్మైః సురభిగంధిభిః |
అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మశోభితా ||

11

యథాఽఽఖ్యాతమగస్త్యేన మునినా భావితాత్మనా |
ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృతా ||

12

హంసకారండవాకీర్ణా చక్రవాకోపశోభితా |
నాతిదూరేణ చాసన్నే మృగయూథనిపీడితాః ||

13

మయూరనాదితా రమ్యాః ప్రాంశవో బహుకందరాః |
దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లైస్తరుభిరావృతాః ||

14

సౌవర్ణై రాజతైస్తామ్రైర్దేశే దేశే చ ధాతుభిః |
గవాక్షితా ఇవాభాంతి గజాః పరమభక్తిభిః ||

15

సాలైస్తాలైస్తమాలైశ్చ ఖర్జూరపనసామ్రకైః |
నివారైస్తిమిశైశ్చైవ పున్నాగైశ్చోపశోభితాః ||

16

చూతైరశోకైస్తిలకైశ్చంపకైః కేతకైరపి |
పుష్పగుల్మలతోపేతైస్తైస్తైస్తరుభిరావృతాః ||

17

చందనైః స్పందనైర్నీపైః పనసైర్లికుచైరపి |
ధవాశ్వకర్ణఖదిరైః శమీకింశుకపాటలైః ||

18

ఇదం పుణ్యమిదం మేధ్యమిదం బహుమృగద్విజమ్ |
ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా ||

19

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరహా |
అచిరేణాశ్రమం భ్రాతుశ్చకార సుమహాబలః ||

20

పర్ణశాలాం సువిపులాం తత్ర సంఘాతమృత్తికామ్ |
సుస్తంభాం మస్కరైర్దీర్ఘైః కృతవంశాం సుశోభనామ్ ||

21

శమీశాఖాభిరాస్తీర్య దృఢపాశావపాశితామ్ |
కుశకాశశరైః పర్ణైః సుపరిచ్ఛాదితాం తథా ||

22

సమీకృతతలాం రమ్యాం చకార లఘువిక్రమః |
నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమమ్ ||

23

స గత్వా లక్ష్మణః శ్రీమాన్నదీం గోదావరీం తదా |
స్నాత్వా పద్మాని చాదాయ సఫలః పునరాగతః ||

24

తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ స యథావిధి |
దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ||

25

స తం దృష్ట్వా కృతం సౌమ్యమాశ్రమం సహ సీతయా |
రాఘవః పర్ణశాలాయాం హర్షమాహారయద్భృశమ్ ||

26

సుసంహృష్టః పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా |
అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్ ||

27

ప్రీతోఽస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో |
ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||

28

భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ |
త్వాయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ ||

29

ఏవం లక్ష్మణముక్త్వా తు రాఘవో లక్ష్మివర్ధనః |
తస్మిన్దేశే బహుఫలే న్యవసత్సుసుఖం వశీ ||

30

కంచిత్కాలం స ధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ |
అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యథామరః ||

31

రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు.

రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుప్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. ” అని పలికాడు.

“రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను.” అని అన్నాడు.

రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు.

“లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమీ, కింశుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులునివసిస్తున్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు.” అని అన్నాడు రాముడు.

రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్షణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దాని మీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదునుచేసాడు. చుట్టు కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు.

తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని “లక్ష్మణా! నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢపరిష్వంగము తప్ప” అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షోడశః సర్గః (16) >>

Leave a Comment