Ayodhya Kanda Sarga 13 In Telugu – అయోధ్యాకాండ త్రయోదశః సర్గః

“రామాయణం” లో అయోధ్యాకాండ త్రయోదశః సర్గం (13వ సర్గ) ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ సర్గలో, రాముడు తన తండ్రి ఆజ్ఞను గౌరవించి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సుమంతుడు, రాముడు, సీత, మరియు లక్ష్మణులను వనానికి చేరవేయడానికి రథాన్ని సిద్ధం చేస్తాడు. అయోధ్య ప్రజలు రాముడి వనవాసానికి తీవ్ర విచారంలో కూరుకుపోతారు. వారు రథం వెంబడి దూరం వరకూ నడుస్తూ, తమ ప్రేమను మరియు ఆందోళనను వ్యక్తం చేస్తారు. సీత మరియు లక్ష్మణులు కూడా రాముడితో వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో రాముడు తన తల్లి కౌసల్య మరియు సుమిత్రలతో, మరియు తన గురువు వశిష్ఠునితో సన్మానంగా నడుచుకుంటాడు. ఈ సర్గలో రాముడు తన ధైర్యం, విధేయత మరియు ధర్మాన్ని పాటించే గుణాలను ప్రదర్శిస్తాడు, ఇది కథలో కీలకమైన మలుపు తెస్తుంది.

దశరథవిలాపః

అతదర్హం మహారాజం శయానమతథోచితమ్ |
యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్పరిచ్యుతమ్ || ౧ ||

అనర్థరూపా సిద్ధార్థా హ్యభీతా భయదర్శినీ |
పునరాకారయామాస తమేవ వరమంగనా || ౨ ||

త్వం కత్థసే మహారాజ సత్యవాదీ దృఢవ్రతః |
మమ చేమం వరం కస్మాద్విధారయితుమిచ్ఛసి || ౩ ||

ఏవముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా |
ప్రత్యువాచ తతః క్రుద్ధో ముహూర్తం విహ్వలన్నివ || ౪ ||

మృతే మయి గతే రామే వనం మనుజపుంగవే |
హంతానార్యే మమామిత్రే సకామా సుఖినీ భవ || ౫ ||

స్వర్గేఽపి ఖలు రామస్య కుశలం దైవతైరహమ్ |
ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం బత || ౬ ||

కైకేయ్యాః ప్రియకామేన రామః ప్రవ్రాజితో మయా |
యది సత్యం బ్రవీమ్యేతత్తదసత్యం భవిష్యతి || ౭ ||

అపుత్రేణ మయా పుత్రః శ్రమేణ మహతా మహాన్ |
రామో లబ్ధో మహాబాహుః స కథం త్యజ్యతే మయా || ౮ ||

శూరశ్చ కృతవిద్యశ్చ జితక్రోధః క్షమాపరః |
కథం కమలపత్రాక్షో మయా రామో వివాస్యతే || ౯ ||

కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలమ్ |
అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్ || ౧౦ ||

సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ |
దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః || ౧౧ ||

యది దుఃఖమకృత్వాఽద్య మమ సంక్రమణం భవేత్ |
అదుఃఖార్హస్య రామస్య తతః సుఖమవాప్నుయామ్ || ౧౨ ||

నృశంసే పాపసంకల్పే రామం సత్యపరాక్రమమ్ |
కిం విప్రియేణ కైకేయి ప్రియం యోజయసే మమ || ౧౩ ||

అకీర్తిరతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే |
తథా విలపతస్తస్య పరిభ్రమితచేతసః || ౧౪ ||

అస్తమభ్యగమత్సూర్యో రజనీ చాభ్యవర్తత |
సా త్రియామా తథాఽఽర్తస్య చంద్రమండలమండితా || ౧౫ ||

రాజ్ఞో విలపమానస్య న వ్యభాసత శర్వరీ |
తథైవోష్ణం వినిశ్వస్య వృద్ధో దశరథో నృపః || ౧౬ ||

విలలాపార్తవద్దుఃఖం గగనాసక్తలోచనః |
న ప్రభాతం తయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే || ౧౭ ||

క్రియతాం మే దయా భద్రే మయాఽయం రచితోఽంజలిః |
అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణామ్ || ౧౮ ||

నృశంసాం కేకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్ |
ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంయతాంజలిః || ౧౯ ||

ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్ |
సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః || ౨౦ ||

ప్రసాదః క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః |
శూన్యే న ఖలు సుశ్రోణి మయేదం సముదాహృతమ్ || ౨౧ ||

కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయా హ్యసి |
ప్రసీద దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయమ్ || ౨౨ ||

లభతామసితాపాంగే యశః పరమవాప్నుహి |
మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ |
ప్రియమేతద్గురుశ్రోణి కురు చారుముఖేక్షణే || ౨౩ ||

విశుద్ధభావస్య హి దుష్టభావా
తామ్రేక్షణస్యాశ్రుకలస్య రాజ్ఞః |
శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం
భర్తుర్నృశంసా న చకార వాక్యమ్ || ౨౪ ||

తతః స రాజా పునరేవ మూర్ఛితః
ప్రియామదుష్టాం ప్రతికూలభాషిణీమ్ |
సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి
క్షితౌ విసంజ్ఞో నిపపాత దుఃఖితః || ౨౫ ||

ఇతీవ రాజ్ఞో వ్యథితస్య సా నిశా
జగామ ఘోరం శ్వసతో మనస్వినః |
విబోధ్యమానః ప్రతిబోధనం తదా
నివారయామాస స రాజసత్తమః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశః సర్గః || ౧౩ ||

Ayodhya Kanda Sarga 13 Meaning In Telugu

దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కానీ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసరం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు. భంగపడ్డాడు. కానీ కైక మనసు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది.

“ఓ దశరథమహారాజా! నీవేదో సత్యవాక్పరిపాలకుడవు అనీ, ఆడినమాట తప్పవనీ, అడిగినవి అన్నీ ఇస్తావనీ, లోకమంతా గొప్పగా చెప్పుకుంటారుకదా! ఇదేనా తమరి సత్యవాక్పరిపాలన! ఇదేనా తమరిసత్యసంధత! నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతావు. కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు? ఏది ఏమైనా, మిన్ను విరిగి మీద పడ్డా, రాముడు వనవాసానికి వెళ్లాలి. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది తప్పదు.” అని ఖరాఖండిగా చెప్పింది కైక. తాను ఇంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపమూ దు:ఖము ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కిందపడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ—

” ఓసి దుర్మార్గురాలా! నువ్వు నాకు భార్యవా! శత్రువువా! నా చావు కోరుకుంటావా! రాముడు అరణ్యాలకు వెళ్లిన తరువాత నేను బతికి ఉండటం కలలోని మాట! నా చావు కోరే నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకొనే నీవు, నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు ‘ఓ దశరథమహారాజా! భూలోకములో రాముడు క్షేమముగా ఉన్నాడా’ అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి. ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్నకొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా! నా వంటి వాడు అలా చేసాడు అంటే ఎవరన్నా నమ్ముతారా! ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను, ఈ నాడు నాకు పుత్రులు కలిగితే. వారిని అడవుల పాలు ఎలా చెయ్యను.
ఓ కైకా! నన్ను చంపెయ్యి. రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపు నన్ను చంపు” అని ఆవేశంతో అంటూ కూలబడిపోయాడు దశరథుడు.

కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. కైకను బతిమాలి లాభం లేదనుకొని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ” ఓ చంద్రా! ఈ రాత్రి కాళరాత్రి కానీకు. రేపు తెల్లవారనీయకు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైక ముఖం చూడటం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు.” అని మనసులోనే అనుకున్నాడు.

కాని దశరథునికి ఆశ చావలేదు. “ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో! మరొక సారి అడిగి చూద్దాం.” అని అనుకున్నాడు దశరథుడు. మరలా కైకను చూచి ఇలా అన్నాడు.

ఓ నా ముద్దుల భార్య కైకా! నువ్వు చాలా మంచిదానివి కదూ! అది తెలియక ఏదేదో అన్నానులే! పట్టించుకోకు. అయినా నా లాంటి వృద్ధునితో పరాచికాలేమిటి చెప్పు. అయినా అయోధ్యకు రాజును కదా! నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా! నీలాంటి మంచి వాళ్లు ఇలా చెయ్యవచ్చా! నా మీద కాస్త కరుణ చూపు. నీ దయ నామీద ప్రసరింపచెయ్యి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చెయ్యడం ఏమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా! నువ్వు ఆ పని చేసావనుకో నేను, అయోధ్య ప్రజలు, సమస్తలోకాలు, గురువులు అంతరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామ పట్టాభిషేకము చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు. కాబట్టి రామ పట్టాభిషేకము నీ చేతులమీదుగా జరిపించు.” అని దీనంగా ప్రార్థించాడు.

కాని కైక మనసు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశకూడా వమ్ము అయి పోయింది. మనసు ఆ దు:ఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్దశః సర్గః (13) >>

Leave a Comment