మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాదశః సర్గః రామాయణంలోని మరో కీలక అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి రాముడు, లక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ, రాక్షసులు మరో యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు వారికి ధైర్యంగా ఎదురించి, యజ్ఞాన్ని కాపాడతాడు. అనంతరం, విశ్వామిత్రుడు రాముడికి మహాబలశాలి వాయుదేవుని కుమారుడు హనుమంతుని కథ చెబుతాడు.
అశ్వమేధసంభారః
తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే |
వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోఽభవత్ ||
1
తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్ |
యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ ||
2
తథేతి చ రాజానమువాచ చ సుసత్కృతః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||
3
[* సరవ్యాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ | *]
తతో రాజాఽబ్రవీద్వాక్యం సుమంత్రం మంత్రిసత్తమమ్ |
సుమంత్రావాహయ క్షిప్రమృత్విజో బ్రహ్మవాదినః ||
4
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః ||
5
తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్స తాన్విప్రాన్సమస్తాన్వేదపారగాన్ ||
6
తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ధర్మార్థసహితం యుక్తం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||
7
మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||
8
తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా |
ఋషిపుత్రప్రభావేణ కామాన్ప్రాప్స్యామి చాప్యహమ్ ||
9
తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్ ||
10
ఋశ్యశృంగపురోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం తదా |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||
11
సర్వథా ప్రాప్స్యసే పుత్రాంశ్చతురోఽమితవిక్రమాన్ |
యస్య తే ధర్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా ||
12
తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వా తు ద్విజభాషితమ్ |
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్ ||
13
సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ |
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ ||
14
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ |
శాంతయశ్చాపి వర్తంతాం యథాకల్పం యథావిధి ||
15
శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా |
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే ||
16
ఛిద్రం హి మృగయంతేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః |
విహతస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి ||
17
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే |
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ ||
18
తథేతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |
పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తమకుర్వత ||
19
తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్పార్థివర్షభమ్ |
అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతమ్ ||
20
గతేష్వథ ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్నరాధిపః |
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ||
21
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వాదశః సర్గః || ౧౨ ||
Balakanda Sarga 12 Meaning In Telugu
వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్టుడైన ఋష్యశృంగుని వద్దకుపోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్ధించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు.
” ఓ దశరథ మహారాజా! అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి, దానిని యజ్ఞాశ్వముగా విడువుము.” అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు.
“సుమంతా! మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వసిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము,” అని ఆదేశించాడు.
సుమంతుడు దశరధుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరధుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు.
“బ్రాహ్మణోత్తములారా! నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి.” అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు.
“రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు”అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి, దశరథుడు అంతఃపురమునకు వెళ్లాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పన్నెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్