Ayodhya Kanda Sarga 14 In Telugu – అయోధ్యాకాండ చతుర్దశః సర్గః

“రామాయణం” లో అయోధ్యాకాండ చతుర్దశః సర్గం (14వ సర్గ) చాలా ముఖ్యమైనది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు వనవాసానికి బయలుదేరడం ప్రారంభమవుతుంది. రాముడు తన తల్లి కౌసల్యతో వీడ్కోలు చెబుతాడు. కౌసల్య తన బాధను వ్యక్తం చేస్తుంది, కానీ రాముడు ఆమెను సాంత్వన చేస్తాడు మరియు ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని వివరిస్తాడు. తదుపరి, రాముడు తన సోదరి శాంతాతో మరియు సుమిత్రతో కూడా వీడ్కోలు చెప్పి ఆశీర్వాదాలను పొందుతాడు. సుమిత్ర తన కుమారుడు లక్ష్మణుని ధైర్యాన్ని ప్రశంసిస్తుంది మరియు రాముని సేవ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు రథంలో బయలుదేరి, అయోధ్య నగరాన్ని విడిచిపోతారు. ప్రజలు తీవ్ర విచారంలో వీరి వెంబడి నడుస్తారు, కానీ రాముడు వారిని సాంత్వన చేస్తాడు. రాముడి ధైర్యం, విధేయత మరియు ధర్మపరమైన కట్టుబాట్లు ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.

కైకేయ్యుపాలంభః

పుత్రశోకార్దితం పాపా విసంజ్ఞం పతితం భువి |
వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్ || ౧ ||

పాపం కృత్వైవ కిమిదం మమ సంశ్రుత్య సంశ్రవమ్ |
శేషే క్షితితలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి || ౨ ||

ఆహుః సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనాః |
సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రచోదితః || ౩ ||

సంశ్రుత్య శైబ్యః శ్యేనాయ స్వాం తనుం జగతీపతిః |
ప్రదాయ పక్షిణో రాజన్ జగామ గతిముత్తమామ్ || ౪ ||

తథా హ్యలర్కస్తేజస్వీ బ్రాహ్మణే వేదపారగే |
యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్యావిమనా దదౌ || ౫ ||

సరితాం తు పతిః స్వల్పాం మర్యాదాం సత్యమన్వితః |
సత్యానురోధాత్సమయే వేలాం స్వాం నాతివర్తతే || ౬ ||

సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః |
సత్యమేవాక్షయా వేదాః సత్యేనైవాప్యతే పరమ్ || ౭ ||

సత్యం సమనువర్తస్వ యది ధర్మే ధృతా మతిః |
స వరః సఫలో మేఽస్తు వరదో హ్యసి సత్తమ || ౮ ||

ధర్మస్యేహాభికామార్థం మమ చైవాభిచోదనాత్ |
ప్రవ్రాజయ సుతం రామం త్రిః ఖలు త్వాం బ్రవీమ్యహమ్ || ౯ ||

సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి |
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్ || ౧౦ ||

ఏవం ప్రచోదితో రాజా కైకేయ్యా నిర్విశంకయా |
నాశకత్పాశమున్మోక్తుం బలిరింద్రకృతం యథా || ౧౧ ||

ఉద్భ్రాంతహృదయశ్చాపి వివర్ణవదనోఽభవత్ |
స ధుర్యో వై పరిస్పందన్యుగచక్రాంతరం యథా || ౧౨ ||

విహ్వలాభ్యాం చ నేత్రాభ్యామపశ్యన్నివ భూపతిః | [భూమిపః]
కృచ్ఛ్రాద్ధైర్యేణ సంస్తభ్య కైకేయీమిదమబ్రవీత్ || ౧౩ ||

యస్తే మంత్రకృతః పాణిరగ్నౌ పాపే మయా ధృతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహ || ౧౪ ||

ప్రయాతా రజనీ దేవి సూర్యస్యోదయనం ప్రతి |
అభిషేకం గురుజనస్త్వరయిష్యతి మాం ధ్రువమ్ || ౧౫ ||

రామాభిషేకసంభారైస్తదర్థముపకల్పితైః |
రామః కారయితవ్యో మే మృతస్య సలిలక్రియామ్ || ౧౬ ||

త్వయా సపుత్రయా నైవ కర్తవ్యా సలిలక్రియా |
వ్యాహంతాఽస్యశుభాచారే యది రామాభిషేచనమ్ || ౧౭ ||

న చ శక్తోఽస్మ్యహం ద్రష్టుం దృష్ట్వా పూర్వం తథా సుఖమ్ | [శక్నోమ్యహం]
హతహర్షం నిరానందం పునర్జనమవాఙ్ముఖమ్ || ౧౮ ||

తాం తథా బ్రువతస్తస్య భూమిపస్య మహాత్మనః |
ప్రభాతా శర్వరీ పుణ్యా చంద్రనక్షత్రశాలినీ || ౧౯ ||

తతః పాపసమాచారా కైకేయీ పార్థివం పునః |
ఉవాచ పరుషం వాక్యం వాక్యజ్ఞా రోషమూర్ఛితా || ౨౦ ||

కిమిదం భాషసే రాజన్వాక్యం గరరుజోపమమ్ |
ఆనాయయితుమక్లిష్టం పుత్రం రామమిహార్హసి || ౨౧ ||

స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరమ్ |
నిఃసపత్నాం చ మాం కృత్వా కృతకృత్యో భవిష్యసి || ౨౨ ||

స నున్న ఇవ తీక్ష్ణేన ప్రతోదేన హయోత్తమః |
రాజా ప్రచోదితోఽభీక్ష్ణం కైకేయీమిదమబ్రవీత్ || ౨౩ ||

ధర్మబంధేన బద్ధోఽస్మి నష్టా చ మమ చేతనా |
జ్యేష్ఠం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్ఛామి ధార్మికమ్ || ౨౪ ||

తతః ప్రభాతాం రజనీముదితే చ దివాకరే |
పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే || ౨౫ ||

వసిష్ఠో గుణసంపన్నః శిష్యైః పరివృతస్తదా |
ఉపసంగృహ్య సంభారాన్ప్రవివేశ పురోత్తమమ్ || ౨౬ || [ఉపగౄహ్యాశు]

సిక్తసమ్మార్జితపథాం పతాకోత్తమభూషితామ్ |
విచిత్రకుసుమాకీర్ణాం నానాస్రగ్భిర్విరాజితామ్ || ౨౭ ||

సంహృష్టమనుజోపేతాం సమృద్ధవిపణాపణామ్ |
మహోత్సవసమాకీర్ణాం రాఘవార్థే సముత్సుకామ్ || ౨౮ ||

చందనాగరుధూపైశ్చ సర్వతః ప్రతిధూపితామ్ |
తాం పురీం సమతిక్రమ్య పురందరపురోపమామ్ || ౨౯ ||

దదర్శాంతఃపురం శ్రేష్ఠం నానాద్విజగణాయుతమ్ |
పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణైరుపశోభితమ్ || ౩౦ ||

యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః |
తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామ తం జనమ్ || ౩౧ ||

వసిష్ఠః పరమప్రీతః పరమర్షిర్వివేశ చ |
సత్వపశ్యద్వినిష్క్రాంతం సుమంత్రం నామ సారథిమ్ || ౩౨ ||

ద్వారే తు రాజసింహస్య సచివం ప్రియదర్శనమ్ |
తమువాచ మహాతేజాః సూతపుత్రం విశారదమ్ || ౩౩ ||

వసిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిహాగతమ్ |
ఇమే గంగోదకఘటాః సాగరేభ్యశ్చ కాంచనాః || ౩౪ ||

ఔదుంబరం భద్రపీఠమభిషేకార్థమాహృతమ్ | [మాగతమ్]
సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ || ౩౫ ||

క్షౌద్రం దధి ఘృతం లాజాః దర్భాః సుమనసః పయః |
అష్టౌ చ కన్యా రుచిరాః మత్తశ్చ వరవారణః || ౩౬ ||

చతురశ్వో రథః శ్రీమాన్నిస్త్రింశో ధనురుత్తమమ్ |
వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశిసన్నిభమ్ || ౩౭ ||

శ్వేతే చ వాలవ్యజనే భృంగారశ్చ హిరణ్మయః |
హేమదామపినద్ధశ్చ కకుద్మాన్పాండరో వృషః || ౩౮ ||

కేసరీ చ చతుర్దంష్ట్రో హరిశ్రేష్ఠో మహాబలః |
సింహాసనం వ్యాఘ్రతనుః సమిద్ధశ్చ హుతాశనః || ౩౯ ||

సర్వవాదిత్రసంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతాః స్త్రియః |
ఆచార్యా బ్రాహ్మణా గావః పుణ్యాశ్చ మృగపక్షిణః || ౪౦ ||

పౌరజానపదశ్రేష్ఠాః నైగమాశ్చ గణైః సహ |
ఏతే చాన్యే చ బహవః ప్రీయమాణాః ప్రియంవదాః || ౪౧ || [నీయమానాః]

అభిషేకాయ రామస్య సహ తిష్ఠంతి పార్థివైః |
త్వరయస్వ మహారాజం యథా సముదితేఽహని || ౪౨ ||

పుణ్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్ | [పుష్యే]
ఇతి తస్య వచః శ్రుత్వా సూతపుత్రో మహాత్మనః || ౪౩ ||

స్తువన్నృపతిశార్దూలం ప్రవివేశ నివేశనమ్ |
తం తు పూర్వోదితం వృద్ధం ద్వారస్థా రాజసమ్మతమ్ || ౪౪ ||

న శేకురభిసంరోద్ధుం రాజ్ఞః ప్రయచికీర్షవః |
స సమీపస్థితో రాజ్ఞస్తామవస్థామజజ్ఞివాన్ || ౪౫ ||

వాగ్భిః పరమతుష్టాభిరభిష్టోతుం ప్రచక్రమే |
తతః సూతో యథాకాలం పార్థివస్య నివేశనే || ౪౬ ||

సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతిమ్ |
యథా నందతి తేజస్వీ సాగరో భాస్కరోదయే || ౪౭ ||

ప్రీతః ప్రీతేన మనసా తథాఽఽనందఘనః స్వతః |
ఇంద్రమస్యాం తు వేలాయామభితుష్టావ మాతలిః || ౪౮ ||

సోఽజయద్దానవాన్సర్వాంస్తథా త్వాం బోధయామ్యహమ్ |
వేదాః సహాంగవిద్యాశ్చ యథాహ్యాత్మభువం విభుమ్ || ౪౯ ||

బ్రహ్మాణం బోధయంత్యద్య తథా త్వాం బోధయామ్యహమ్ |
ఆదిత్యః సహ చంద్రేణ యథా భూతధరాం శుభామ్ || ౫౦ ||

బోధయత్యద్య పృథివీం తథా త్వాం బోధయామ్యహమ్ |
ఉత్తిష్ఠాశు మహారాజ కృతకౌతుకమంగళః || ౫౧ ||

విరాజమానో వపుషా మేరోరివ దివాకరః |
సోమసూర్యౌ చ కాకుత్స్థ శివవైశ్రవణావపి || ౫౨ ||

వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే |
గతా భగవతీ రాత్రిః కృతం కృత్యమిదం తవ || ౫౩ ||

బుద్ధ్యస్వ నృపశార్దూల కురుకార్యమనంతరమ్ |
ఉపతిష్ఠతి రామస్య సమగ్రమభిషేచనమ్ || ౫౪ || [ఉదతిష్ఠత]

పౌరజానపదైశ్చాపి నైగమైశ్చ కృతాంజలిః |
అయం వసిష్ఠో భగవాన్బ్రాహ్మణైః సహ తిష్ఠతి || ౫౫ || [స్వయం]

క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్రాఘవస్యాభిషేచనమ్ |
యథా హ్యపాలాః పశవో యథా సేనా హ్యానాయకా || ౫౬ ||

యథా చంద్రం వినా రాత్రిర్యథా గావో వినా వృషమ్ |
ఏవం హి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే || ౫౭ ||

ఇతి తస్య వచః శృత్వా సాంత్వపూర్వమివార్థవత్ |
అభ్యకీర్యత శోకేన భూయ ఏవ మహీపతిః || ౫౮ ||

తతః స రాజా తం సూతం సన్నహర్షః సుతం ప్రతి |
శోకరక్తేక్షణః శ్రీమానుద్వీక్ష్యోవాచ ధార్మికః || ౫౯ ||

వాక్యైస్తు ఖలు మర్మాణి మమ భూయో నికృంతసి |
సుమంత్రః కరుణం శ్రుత్వా దృష్ట్వా దీనం చ పార్థివమ్ || ౬౦ ||

ప్రగృహీతాంజలిః కించిత్ తస్మాద్దేశాదపాక్రమత్ |
యదా వక్తుం స్వయం దైన్యాత్ న శశాక మహీపతిః || ౬౧ ||

తదా సుమంత్రం మంత్రజ్ఞా కైకేయీ ప్రత్యువాచ హ |
సుమంత్ర రాజా రజనీం రామహర్షసముత్సుకః || ౬౨ ||

ప్రజాగరపరిశ్రాంతో నిద్రాయా వశమేయివాన్ |
తద్గచ్ఛ త్వరితం సూత రాజపుత్రం యశస్వినమ్ || ౬౩ ||

రామమానయ భద్రం తే నాత్ర కార్యా విచారణా |
స మన్యమానః కళ్యాణం హృదయేన ననంద చ || ౬౪ ||

నిర్జగామ చ సంప్రీత్యా త్వరితో రాజశాసనాత్ |
సుమంత్రశ్చింతయామాస త్వరితం చోదితస్తయా || ౬౫ ||

వ్యక్తం రామోఽభిషేకార్థమిహాయాస్యతి ధర్మవిత్ |
ఇతి సూతో మతిం కృత్వా హర్షేణ మహతాఽఽవృతః || ౬౬ ||

నిర్జగామ మహాబాహూ రాఘవస్య దిదృక్షయా |
సాగరహ్రదసంకాశాత్సుమంత్రోంతఃపురాచ్ఛుభాత్ |
నిష్క్రమ్య జనసంబాధం దదర్శ ద్వారమగ్రతః || ౬౭ ||

తతః పురస్తాత్సహసా వినిర్గతో
మహీభృతో ద్వారగతాన్విలోకయన్ | [పతీన్]
దదర్శ పౌరాన్వివిధాన్మహాధనా-
-నుపస్థితాన్ద్వారముపేత్య విష్ఠితాన్ || ౬౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశః సర్గః || ౧౪ ||

Ayodhya Kanda Sarga 14 Meaning In Telugu

కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది.
“ఓ దశరథమహారాజా! నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న వరాలు రెండింటి ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేల మీదపడి దొర్లి దొర్లి ఏడవవలెనా! ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా! ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటం ఏనాటినుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడినమాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు. మీపూర్వులైన శిబిచక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరూ అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం.

“సత్యము పరబ్రహ్మస్వరూపము. ధర్మమునకు సత్యమే మూలము” అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు. తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మనిరతిని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిటబెట్టుకోమంటున్నాను. ధర్మము పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరడం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈ నాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట వద్దు. “రాముని అడవులకు పంపాలి”, “రాముని అడవులకు పంపాలి” “రాముని అడవులకు పంపాలి” అని మూడు మార్లు నొక్కి చెబుతున్నాను.

ఓ దశరథమహారాజా! మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్టయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదలిన భార్యకు మరణమే శరణ్యము అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగము చేసుకుంటాను. ఇది తథ్యము.” అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటి పోయింది. రామునికి వనవాసము తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయము బరువెక్కింది. ముఖము వివర్ణమయింది. కళ్లు కనిపించడం లేదు.

మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ” ఓసీ పాపీ! కైకా! అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేసాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇంక నీకూ నాకూ సంబంధం లేదు. నీవునా భార్యవు కావు. భరతుడు నా కుమారుడూ కాడు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదల నవసరము లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు.

రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేసారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దు:ఖములో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను.” అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెల తెల వారుతూ ఉంది.పక్షులు కిల కిలారావాలు చేస్తున్నాయి. కాని కైకకు ఇవేమీ పట్టలేదు. తనపట్టు నెగ్గించు కోవాలనే కోరిక తప్ప. అందుకే దీనంగా నేలమీద పడి ఉన్న దశరథుని చూచి ఇలా అంది.

” ఓ దశరథమహారాజజా! ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు. జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముని పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముని వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది. త్వరగా కానివ్వండి.” అని తొందరపెట్టింది.

ఆ మాటలకు దశరథుడు చెళ్లున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధిపనిచేయడం మాని వేసింది.
“నేను ధర్మానికి కట్టుబడ్డాను. ధర్మబద్ధుడను. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి.” అని అన్నాడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. వసిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకొని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు.

అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు. తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాలనుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకము చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారు.

వసిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వసిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్యనుండి దారి చేసుకుంటూ రాజభవనము లోకి ప్రవేశించాడు. సుమంత్రుడు వసిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించాడు. “సుమంత్రా! నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగాజలమూ, పుణ్య నదీజలములు, సముద్రజలము సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలూ, పూలు, పాలు, కన్యముత్తయిదువలు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలశములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రములు, పులి చర్మమూ, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్యాప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయము అయింది.

శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్రా! నీవు రాజు గారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి, తొందరగా సిద్ధంకమ్మను.” అని అన్నాడు వసిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించి దశరధుని వద్దకు వెళ్లాడు. అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంత్రునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలెట్టాడు. “మహారాజు దశరథులవారికి జయీభవ. విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషించు గాక! దేవేంద్రుని సారధి మాతలి ఇంద్రుని స్తుతించి నట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు, వేదవేదాంగ ములను సృష్టించిన వాడూ అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నారు. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడూ వచ్చి భూదేవిని మేల్కొలిపి నట్టు నేను తమరిని మేల్కొలుపుతున్నాను.

ఓ మహారాజా! సూర్యోదయము అయింది. రామ పట్టాభి షేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంచేయబడ్డాయి. ఓ దశరథమహారాజా! తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి, రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వసిష్ఠులవారి ఆదేశము. ఓ మహారాజా! తమరికి సూర్య చంద్రులు, శివకేశవులు, అగ్ని వరుణుడు, ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక! ఓ దశరథమహారాజా! వసిష్ఠులవారు బ్రాహ్మణసమూహములతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచిఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుచున్నాను.” అనిపలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దు:ఖము ఇంకా ఎక్కువ అయింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి.

“ఆపు. ఇంక చాలు” అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదికి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడకు వచ్చింది. “సుమంత్రా! రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి చర్చించి రాత్రి అంతా నిద్రలేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడకు తీసుకొని రా.” అని ఆజ్ఞాపించింది కైక.

“అలాగే మహారాణీ! తమ ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడకు వెంటనేరమ్మని మనవిచేస్తాను.” అని పలికి సుమంత్రుడు అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉ న్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంత్రుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచదశః సర్గః (15) >>

Leave a Comment