మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టమః సర్గః రామాయణంలోని కీలకమైన భాగం. ఈ సర్గ రాముడి జననం మరియు బాల్యాన్ని వివరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించి, పుత్రులను పొందుతాడు. కౌసల్య, కైకేయి, సుమిత్రలు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడుగా పుత్రులను ప్రసాదిస్తారు. వసిష్ఠ మహర్షి సలహా మేరకు, ఈ పిల్లలు పెరుగుతారు.
సుమంత్రవాక్యమ్
తస్య త్వేవంప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః |
సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరః సుతః ||
1
చింతయానస్య తస్యేయం బుద్ధిరాసీన్మహాత్మనః |
సుతార్థీ వాజిమేధేన కిమర్థం న యజామ్యహమ్ ||
2
స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్ |
మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః ||
3
తతోఽబ్రవీదిదం తేజాః సుమంత్రం మంత్రిసత్తమమ్ |
శీఘ్రమానయ మే సర్వాన్గురూంస్తాన్సపురోహితాన్ ||
4
తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్స తాన్సర్వాన్గురూంస్తాన్వేదపారగాన్ ||
5
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః ||
6
తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ఇదం ధర్మార్థసహితం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||
7
మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||
8
తదహం యష్టుమిచ్ఛమి శాస్త్రదృష్టేన కర్మణా |
కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతామ్ ||
9
తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖేరితమ్ ||
10
ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||
11
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ |
సర్వథా ప్రాప్స్యసే పుత్రానభిప్రేతాంశ్చ పార్థివ ||
12
యస్య తే ధర్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా |
తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వైతద్ద్విజభాషితమ్ ||
13
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షపర్యాకులేక్షణః |
సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ ||
14
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ |
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ ||
15
శాంతయశ్చాభివర్ధంతాం యథాకల్పం యథావిధి |
శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా ||
16
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే |
ఛిద్రం హి మృగయంతేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః ||
17
విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి | [విహతస్య]
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే ||
18
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ |
తథేతి చాబ్రువన్సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ ||
19
పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్య తే |
తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్థయంతో నృపోత్తమమ్ ||
20
అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతమ్ |
విసర్జయిత్వా తాన్విప్రాన్సచివానిదమబ్రవీత్ ||
21
ఋత్విగ్భిరుపసందిష్టో యథావత్క్రతురాప్యతామ్ |
ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్సముపస్థితాన్ ||
22
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః |
తతః స గత్వా తాః పత్నీర్నరేంద్రో హృదయప్రియాః ||
23
ఉవాచ దీక్షాం విశత యక్ష్యేఽహం సుతకారణాత్ |
తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసామ్ |
ముఖపద్మాన్యశోభంత పద్మానీవ హిమాత్యయే ||
24
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టమః సర్గః ||
Balakanda Sarga 8 Meaning In Telugu
అటువంటి పుణ్యచరితుడైన దశరధమహారాజుకు చాలా కాలం వరకూ పుత్రసంతానము కలగలేదు. వంశాంకురము లేడని దశరధ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్యయించాడు. వెంటనే పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరధుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్టవామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు, ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు.
దశరథుడు వారి నందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉ చితాసనముల మీద కూర్చో పెట్టాడు. “మహాత్ములారా! మీకు తెలుసు కదా! నాకు పుత్రసంతానము లేరు. ఈ విషయము నన్ను నిరంతరమూ బాధించుచున్నది. పుత్రసంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలచుకొన్నాను. ఆ యాగము ఎలా చేయవలెనో మీరు చెప్పండి.” అని అడిగాడు.
దశరధుని నిర్ణయమును వశిష్టవామదేవులు ప్రశంసించారు.
“ఓ దశరథమహారాజా! మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజస మైనదే. మీకు తప్పక పుత్రసంతానము కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి.” అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమనీ, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు. సరమూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతి యాగములను జరిపించమని, ఆదేశించాడు. ఇంకా ఇలా పలికాడు దశరధుడు.
“ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగచేయుటకు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారు. యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును. మీరందరూ విద్వాంసులే కదా. కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధమూ లేకుండా జరిపించండి.” అని పలికాడు దశరథుడు.
“తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించెదము.” అని పలికారు పురోహితులు. తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్లిపోయారు. దశరథుడు తన మంత్రులను చూచి “మీరందరూ పురోహితులకు సహకరించండి. యాగము నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి.” అని ఆజ్ఞాపించాడు.
తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్లాడు. తన భార్యలను చూచి “నేను పుత్రసంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను. నాతో పాటుమీరూ యాగ దీక్ష వహించండి.” అని చెప్పాడు. ఆమాటలు విని దశరధుని భార్యలుసంతోషించారు. తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనంద పడ్డారు. భర్త చెప్పిన ప్రకారము యాగ దీక్ష స్వీకరించారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్