Ayodhya Kanda Sarga 23 In Telugu | అయోధ్యాకాండ త్రయోవింశః సర్గః

అయోధ్యా కాండ, సర్గ 23లో, కథ నాటకీయ మలుపు తిరుగుతుంది, రాజా దశరథుడు ఇచ్చిన రెండు వరాలను కైకేయి ప్రయత్నిం చేయడం వల్ల. ఈ కీలక అధ్యాయం కైకేయి రాముడిని పద్దెనిమిదేళ్లు అడవికి నడి ఇవ్వడం మరియు ఆమె కుమారుడు భరతుడిని అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయడం కోసం… ఈ వార్త రాజా దశరథుడిని దెబ్బతీస్తుంది, ఎందుకంటే అతను రాముడిపై ప్రేమ మరియు తన వాగ్దానాలను నిలబెట్టుకోవాలనే కట్టుబాటు మధ్య కొట్టుమిట్టాడుతాడు. ఈ సర్గలో చూపించిన భావోద్వేగాలు మరియు కలకలం కర్తవ్య, ప్రేమ మరియు విధి యొక్క సంక్లిష్ట ఆటలని హైలైట్ చేస్తుంది, ఈ మహాకావ్యంలో ఉన్న తదుపరి సంఘటనలకు పునాదిని వేస్తుంది.

లక్ష్మణక్రోధః

ఇతి బ్రువతి రామే తు లక్ష్మణోఽధశ్శిరా ముహుః |
శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయోః ||

1

తదా తు బద్ధ్వా భ్రుకుటీం భ్రువోర్మధ్యే నరర్షభః |
నిశశ్వాస మహాసర్పో బిలస్థ ఇవ రోషితః ||

2

తస్య దుష్ప్రతివీక్షం తద్భృకుటీసహితం తదా |
బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖమ్ ||

3

అగ్రహస్తం విధున్వంస్తు హస్తిహస్తమివాత్మనః |
తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరామ్ ||

4

అగ్రాక్ష్ణా వీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్ |
అస్థానే సంభ్రమో యస్య జాతో వై సుమహానయమ్ ||

5

ధర్మదోషప్రసంగేన లోకస్యానతిశంకయా |
కథం హ్యేతదసంభ్రాంతస్త్వద్విధో వక్తుమర్హతి ||

6

యథా దైవమశౌండీరం శౌండీర క్షత్రియర్షభ |
కిం నామ కృపణం దైవమశక్తమభిశంససి ||

7

పాపయోస్తే కథం నామ తయోః శంకా న విద్యతే |
సంతి ధర్మోపధాః శ్లక్ష్ణా ధర్మాత్మన్కిం న బుధ్యసే ||

8

తయోః సుచరితం స్వార్థం శాఠ్యాత్పరిజిహీర్షతోః |
యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ ||

9

తయోః ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సః |
లోకవిద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనమ్ ||

10

నోత్సహే సహితుం వీర తత్ర మే క్షంతుమర్హసి |
యేనేయమాగతా ద్వైధం తవ బుద్ధిర్మహామతే ||

11

స హి ధర్మో మమ ద్వేష్యః ప్రసంగాద్యస్య ముహ్యసి |
కథం త్వం కర్మణా శక్తః కైకేయీవశవర్తినః ||

12

కరిష్యసి పితుర్వాక్యమధర్మిష్ఠం విగర్హితమ్ |
యద్యయం కిల్బిషాద్భేదః కృతోఽప్యేవం న గృహ్యతే ||

13

జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః |
మనసాఽపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః ||

14

తయోస్త్వహితయోర్నిత్యం శత్ర్వోః పిత్రభిధానయోః |
యద్యపి ప్రతిపత్తిస్తే దైవీ చాపి తయోర్మతమ్ ||

15

తథాఽప్యుపేక్షణీయం తే న మే తదపి రోచతే |
విక్లబో వీర్యహీనో యః స దైవమనువర్తతే ||

16

వీరాః సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే |
దైవం పురుషకారేణ యః సమర్థః ప్రబాధితుమ్ ||

17

న దైవేన విపన్నార్థః పురుషః సోఽవసీదతి |
ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ ||

18

దైవమానుషయోరద్య వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి |
అద్య మత్పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనాః ||

19

యద్దైవాదాహతం తేఽద్య దృష్టం రాజ్యాభిషేచనమ్ |
అత్యంకుశమివోద్దామం గజం మదబలోద్ధతమ్ ||

20

ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే |
లోకపాలాః సమస్తాస్తే నాద్య రామాభిషేచనమ్ ||

21

న చ కృత్స్నాస్త్రయో లోకాః విహన్యుః కిం పునః పితా |
యైర్వివాసస్తవారణ్యే మిథో రాజన్సమర్థితః ||

22

అరణ్యే తే వివత్స్యంతి చతుర్దశ సమాస్తథా |
అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాశ్చ యా తవ ||

23

అభిషేకవిఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే |
మద్బలేన విరుద్ధాయ న స్యాద్దైవబలం తథా ||

24

ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ |
ఊర్ధ్వం వర్షసహస్రాంతే ప్రజాపాల్యమనంతరమ్ ||

25

ఆర్యపుత్రాః కరిష్యంతి వనవాసం గతే త్వయి |
పూర్వం రాజర్షివృత్త్యా హి వనవాసో విధీయతే ||

26

ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్పరిపాలనే |
స చేద్రాజన్యనేకాగ్రే రాజ్యవిభ్రమశంకయా ||

27

నైవమిచ్ఛసి ధర్మాత్మన్రాజ్యం రామ త్వమాత్మని |
ప్రతిజానే చ తే వీర మా భూవం వీరలోకభాక్ ||

28

రాజ్యం చ తవ రక్షేయమహం వేలేవ సాగరమ్ |
మంగళైరభిషించస్వ తత్ర త్వం వ్యాపృతో భవ ||

29

అహమేకో మహీపాలానలం వారయితుం బలాత్ |
న శోభార్థావిమౌ బాహూ న ధనుర్భూషణాయ మే ||

30

నాసిరాబంధనార్థాయ న శరాః స్తంభహేతవః |
అమిత్రదమనార్థం మే సర్వమేతచ్చతుష్టయమ్ ||

31

న చాహం కామయేఽత్యర్థం యః స్యాచ్ఛత్రుర్మతో మమ |
అసినా తీక్ష్ణధారేణ విద్యుచ్చలితవర్చసా ||

32

ప్రగృహీతేన వై శత్రుం వజ్రిణం వా న కల్పయే |
ఖడ్గనిష్పేషనిష్పిష్టైర్గహనా దుశ్చరా చ మే ||

33

హస్త్యశ్వనరహస్తోరుశిరోభిర్భవితా మహీ |
ఖడ్గధారాహతా మేఽద్య దీప్యమానా ఇవాద్రయః ||

34

పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుతః |
బద్ధగోధాంగులిత్రాణే ప్రగృహీతశరాసనే ||

35

కథం పురుషమానీ స్యాత్పురుషాణాం మయి స్థితే |
బహుభిశ్చైకమత్యస్యన్నైకేన చ బహూన్ జనాన్ ||

36

వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాజిగజమర్మసు |
అద్య మేఽస్త్రప్రభావస్య ప్రభావః ప్రభవిష్యతి ||

37

రాజ్ఞశ్చాప్రభుతాం కర్తుం ప్రభుత్వం చ తవ ప్రభో |
అద్య చందనసారస్య కేయురామోక్షణస్య చ ||

38

వసూనాం చ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ |
అనురూపావిమౌ బాహూ రామ కర్మ కరిష్యతః |
అభిషేచనవిఘ్నస్య కర్తౄణాం తే నివారణే ||

39

బ్రవీహి కోఽద్యైవ మయా వియుజ్యతాం
తవాసుహృత్ప్రాణయశః సుహృజ్జనైః |
యథా తవేయం వసుధా వశే భవే-
-త్తథైవ మాం శాధి తవాస్మి కింకరః ||

40

విమృజ్య బాష్పం పరిసాంత్వ్య చాసకృ-
-త్స లక్ష్మణం రాఘవవంశవర్ధనః |
ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం
నిబోధ మామేవ హి సౌమ్య సత్పథే ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 23 Meaning In Telugu

రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు. కాని లక్ష్మణుని మనసులో కోపం అగ్ని వలె మండుతూ ఉంది. నుదురు ముడుతలు పడింది. దీర్ఘంగా శ్వాస తీస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుని మొహం కోపంతో ఉన్న సింహంలా ఉంది. రాముని మొహంలోకి సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ ఇలా అన్నాడు.

“అన్నయ్యా! ! కేవలము తండ్రిమాటను పాటించడం కోసం ఏమైనా చెయ్యాలనో, తండ్రి మాటను ధిక్కరిస్తే లోకము ఏమను కుంటుందో అనే భయంతోనూ నీవు అరణ్యములకుపోవడం అంత బాగాలేదు. పైగా దైవనిర్ణయము అంటున్నావు. దైవము ఇలా చేస్తుందా. దైవానికి ఒకరి మీద కోపము మరొకరి మీద ద్వేషము ఎందుకుం టుంది. కాబట్టి దీనిని దైవనిర్ణయము అనడానికి వీలులేదు. ఇదంతా కుయుక్తితో కైక, ఆమె మాటలకు తలూపిన దశరథుడు, చేసిన కుతంత్రము. ముందు వారిద్దరినీ అనుమానించాలి.

కైక దశరథుడు పైకి ధర్మములు బోధిస్తూ, లోలోపల నీకు అపకారము చేస్తున్నారు. ‘ఆడిన మాట తప్పకూడదు’ అనే ధర్మాన్ని అడ్డుపెట్టుకొని నీ రాజ్యము అపహరిస్తున్నారు. ఇది అధర్మము. ఇది నీకు అర్ధం కావడం లేదు.

నా ఉద్దేశంలో కైక, దశరథుడు కలిసి ఆడిన నాటకము. లేకపోతే ఎన్నడో ఇస్తాను అన్న వరములు ఇప్పుడు కోరడం ఏమిటి? అసలు దశరథుడు వరాలు ఇస్తాను అని కైకకు మాట ఇచ్చాడు అని ఎవరికి తెలుసు. ఒకవేళ వరాలు ఇచ్చిఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఊరుకుంటాడు. ఎప్పుడో తీర్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక ఈ వరాలు కోరడం, వాటిని ఈ సమయంలో అడగడం, రాజు ఇవ్వడం, అంతా బూటకం. నిన్ను అడ్డు తొలగించుకోడానికి దశరథుడు, కైక కలిసి ఆడుతున్న నాటకము.

నీవు జ్యేష్టుడవు. రాజ్యము జ్యేష్టునికే చెందుతుంది. అది లోక ధర్మము. కాబట్టి నీవు అరణ్యములకు వెళ్లడం నేను సహించను. నన్ను మన్నించు. నీ బుద్ధిని పెడతోవ పట్టిస్తున్న ఈ ధర్మాచరణమును నేను ఖండిస్తున్నాను. నీకు శక్తి యుక్తులు ఉండి కూడా, నీ తండ్రి దశరథుడు, నీ తల్లికైక మాటలకు ఎందుకు తలూపుతున్నావో అర్థం కావడం లేదు. కైక చేస్తున్నది కపటోపాయము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాని దానిని నీవు కపటము అని గ్రహించలేకపోవడం దురదృష్టము.

ధర్మంగా నడిచే వారిపట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి. కాని కైక, దశరథుడు లాంటి అధర్మ వర్తనులపట్ల ధర్మాచరణము యోగ్యము కాదు. పైగా అది నిందింపతగినది. రామా! నీ తండ్రి దశరథుడు, నీ తల్లి కైక నీ క్షేమమును కోరేవారు కాదు. వారు నీకు శత్రువులు. అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహాపాపము.

నీవు అన్నట్టే వారి చేయు పనులు దైవనిర్ణయములు అని అనుకొందాము. దైవనిర్ణయమైనా, అది అధర్మము అయినపుడు దానిని పాటించకపోవడమే ధర్మము.

చేతకాని వాళ్లు, పిరికివాళ్లు, దైవము మీద ఆధారపడతారు. మన లాంటి వీరులు, దైర్యవంతులు దైవము మీద ఆధారపడరు. దైవనిర్ణయములను లెక్క చెయ్యరు. నీ స్వశక్తితో, వీరత్వముతో నీవు దైవనిర్ణయమును ఎదిరించినా, దైవము నిన్ను ఏమీ చెయ్యదు, చెయ్యలేదు. ఎందుకంటే నీవు ధర్మము ప్రకారము నడుచుకుంటు నావు కాబట్టి.

అయినా చూద్దాము. మానవునికి ఉండే శక్తి ఎంతో, దైవమునకు ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డు కుంటూ ఉంటే, ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను. నీ పట్టాభిషేకమును నేను జరిపిస్తాను. ఏ దైవము అడ్డుకుంటుందో చూస్తాను.

రామా! ఆ దైవమే కాదు, దిక్పాలకులు, ముల్లోకములు ఒకటై వచ్చినా సరే నీ పట్టాభిషేకమును ఆపలేరు. ఇంక ఆ దశరథుడు ఒక లెక్కా! ఎవరైతే రహస్యంగా నీకు పదునాలుగేళ్లు వనవాసము విధించారో, వారినే అరణ్యాలకు పంపుతాను. కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను. నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవము కూడా రక్షించలేదు.

రామా! నేను అంటున్నాను. నీవు అయోధ్యను వెయ్యి సంవత్స రాలు పాలిస్తావు. తరువాత నీ కుమారులు పాలిస్తారు. భరతుడు కలలో కూడా రాజు కాడు, కాలేడు. నీ తండ్రి రాజ్యము నీకు సంక్రమించినట్టే, నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది. అదే ధర్మము.

రామా! దశరధుడు కామాతురుడై ఉన్నాడు, ఆయన మనసు సరిగా పనిచెయ్యడంలేదు. అందుకని రాజు మాటలు పాటించ నవసరము లేదు. నీవు పట్టాభిషేకము చేసుకోడానికి సిద్ధంగా ఉండు. నీకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తేలుస్తాను.

రామా! నా చేతులు, నా చేతుల్లో ఉన్న ఈ ధనుర్బాణములు కేవలం అలంకారము కొరకే కాదు. శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి. నాతో శత్రుత్వము వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బతకనివ్వను. ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదుట నిలిచినా సరే వాడి తలతెగి కిందపడటం తథ్యం.

ఓ శ్రీరామచంద్ర మహారాజా! నన్ను ఆజ్ఞాపించండి. ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుని మహారాజ పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఎవరడ్డు వస్తారో చూస్తాను. ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసరము ఎదురుచూస్తున్నాడు.” అని ఆవేశంతో అంటున్న లక్ష్మణుని తన సౌమ్యమైన మాటలతో ఓదార్చి

“లక్ష్మణా! నన్ను ఆజ్ఞాపించమన్నావు. అందుకని ఆజ్ఞాపిస్తున్నాను.

నీకూ నాకూ తండ్రిమాటను పాటించడమే ధర్మము. ఇదే నా నిర్ణయము.” అని స్థిరంగా పలికాడు రాముడు.

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము ఇరువదిమూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ చతుర్వింశః సర్గః (24) >>

Leave a Comment