Ayodhya Kanda Sarga 28 In Telugu | అయోధ్యాకాండ అష్టావింశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 28 రామాయణంలోని ఆసక్తికరమైన భాగం. సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనా ఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. ‘ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లోగానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము. సీతా దేవి తో రాముడు అరణ్యమునకు వద్దని అరణ్యము గూర్చి వివరించే ప్రస్తావనను కళ్ళకు కట్టినట్టు చెప్పిన సందర్భము…

వనదుఃఖప్రతిబోధనమ్

స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సలః |
న నేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ ||

1

సాంత్వయిత్వా పునస్తాం తు బాష్పపర్యాకులేక్షణామ్ |
నివర్తనార్థే ధర్మాత్మా వాక్యమేతదువాచ హ ||

2

సీతే మహాకులీనాఽసి ధర్మే చ నిరతా సదా |
ఇహాచర స్వధర్మం త్వం మా యథా మనసః సుఖమ్ ||

3

సీతే యథా త్వాం వక్ష్యామి తథా కార్యం త్వయాఽబలే |
వనే దోషా హి బహవో వదతస్తాన్నిబోధ మే ||

4

సీతే విముచ్యతామేషా వనవాసకృతా మతిః |
బహుదోషం హి కాంతారం వనమిత్యభిధీయతే ||

5

హితబుద్ధ్యా ఖలు వచో మయైతదభిధీయతే |
సదా సుఖం న జానామి దుఃఖమేవ సదా వనమ్ ||

6

గిరినిర్ఝరసంభూతా గిరికందరవాసినామ్ |
సింహానాం నినదా దుఃఖాః శ్రోతుం దుఃఖమతో వనమ్ ||

7

క్రీడమానాశ్చ విస్రబ్ధా మత్తాః శూన్యే మహామృగాః |
దృష్ట్వా సమభివర్తంతే సీతే దుఃఖమతో వనమ్ ||

8

సగ్రాహాః సరితశ్చైవ పంకవత్యశ్చ దుస్తరాః |
మత్తైరపి గజైర్నిత్యమతో దుఃఖతరం వనమ్ ||

9

లతాకంటకసంకీర్ణాః కృకవాకూపనాదితాః |
నిరపాశ్చ సుదుర్గాశ్చ మార్గా దుఃఖమతో వనమ్ ||

10

సుప్యతే పర్ణశయ్యాసు స్వయం భగ్నాసు భూతలే |
రాత్రిషు శ్రమఖిన్నేన తస్మాద్దుఃఖతరం వనమ్ ||

11

అహోరాత్రం చ సంతోషః కర్తవ్యో నియతాత్మనా |
ఫలైర్వృక్షావపతితైః సీతే దుఃఖమతో వనమ్ ||

12

ఉపవాసశ్చ కర్తవ్యో యథాప్రాణేన మైథిలి |
జటాభారశ్చ కర్తవ్యో వల్కలాంబరధారిణా ||

13

దేవతానాం పితృణాం చ కర్తవ్యం విధిపూర్వకమ్ |
ప్రాప్తానామతిథీనాం చ నిత్యశః ప్రతిపూజనమ్ ||

14

కార్యస్త్రిరభిషేకశ్చ కాలే కాలే చ నిత్యశః |
చరతా నియమేనైవ తస్మాద్దుఃఖతరం వనమ్ ||

15

ఉపహారశ్చ కర్తవ్యః కుసుమైః స్వయమాహృతైః |
ఆర్షేణ విధినా వేద్యాం బాలే దుఃఖమతో వనమ్ ||

16

యథాలబ్ధేన సంతోషః కర్తవ్యస్తేన మైథిలి |
యతాహారైర్వనచరైర్నిత్యం దుఃఖమతో వనమ్ ||

17

అతీవ వాతాస్తిమిరం బుభుక్షా చాత్ర నిత్యశః |
భయాని చ మహాంత్యత్ర తతో దుఃఖతరం వనమ్ ||

18

సరీసృపాశ్చ బహవో బహురూపాశ్చ భామిని |
చరంతి పృథివీం దర్పాత్తతో దుఃఖతరం వనమ్ ||

19

నదీనిలయనాః సర్పా నదీకుటిలగామినః |
తిష్ఠంత్యావృత్య పంథానం తతో దుఃఖతరం వనమ్ ||

20

పతంగా వృశ్చికాః కీటా దంశాశ్చ మశకైః సహ |
బాధంతే నిత్యమబలే తస్మాద్దుఃఖతరం వనమ్ ||

21

ద్రుమాః కంటకినశ్చైవ కుశకాశాశ్చ భామిని |
వనే వ్యాకులశాఖాగ్రాస్తేన దుఃఖతరం వనమ్ ||

22

కాయక్లేశాశ్చ బహవో భయాని వివిధాని చ |
అరణ్యవాసే వసతో దుఃఖమేవ తతో వనమ్ ||

23

క్రోధలోభౌ విమోక్తవ్యౌ కర్తవ్యా తపసే మతిః |
న భేతవ్యం చ భేతవ్యే నిత్యం దుఃఖమతో వనమ్ ||

24

తదలం తే వనం గత్వా క్షమం న హి వనం తవ |
విమృశన్నిహ పశ్యామి బహుదోషతరం వనమ్ ||

25

వనం తు నేతుం న కృతా మతిస్తదా
బభూవ రామేణ యదా మహాత్మనా |
న తస్య సీతా వచనం చకార త-
-త్తతోఽబ్రవీద్రామమిదం సుదుఃఖితా ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టావింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 28 Meaning In Telugu

సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనాఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. ‘ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లోగానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము.

అరణ్యములలో ఉండే బాధలు నీకు తెలియవు. నీమేలు కోరి చెబుతున్నాను. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఏలోటూ రాదు. చిన్నప్పటి నుండి సుఖములలో పెరిగిన దానవు. ఆ అడవులలో కలిగే కష్టములను తట్టుకోలేవు. అడవులలో సుఖము అనే మాట వినపడదు. అన్నీ కష్టాలే. ఎత్తైన కొండల మీది నుండి దుమికే సెల ఏళ్ల ధ్వనులు, పులుల గాండ్రింపులు, సింహగర్జనలు, అడవి ఏనుగుల ఘీంకారములు, భయంకరంగా ఉంటాయి. అడవులలో సంచరించు క్రూరమృగములు మానవులను చూడగానే మీద పడతాయి. వాటి బారి నుండి తప్పించుకోడం చాలా కష్టం.

పైగా నగరములలో ఉన్నట్టు అడవులలో రాచ మార్గములు ఉండవు. అన్నీ ముళ్లు రాళ్లతో నిండిన కాలి మార్గములే. పైగా తాగడానికి మంచి నీరు కూడా దొరకదు. తినడానికి తిండి దొరకదు. రాలి పడిన పండ్లు తినాలి. లేకపోతే దొరికినవాటితో కడుపు నింపు కోవాలి. ఒక్కోసారి అవీ దొరక్కపోతే ఉపవాసములుచెయ్యాల్సి ఉంటుంది. పగలంతా నడక. రాత్రి నేలమీద పడక. నిద్రపట్టదు. జీవితం దుర్భరంగా ఉంటుంది. కట్టుకోడానికి బట్టలు ఉండవు. నారచీరలు, ఆకులు కట్టుకోవాలి.

వనవాసవ్రతములో ఉన్నవారు నిత్యమూ దేవతలను, పితరులను, అతిధులను పూజించాలి. మూడుపూట్లాస్నానం చెయ్యాలి. స్వయంగా పూలు పండ్లు కోసుకొని రావాలి. ఋషులకు, మునులకు పెట్టాలి. మిగిలింది మనం తినాలి. అదీ మితంగా తినాలి. దొరికింది తినాలి. అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు. అందుకే వనవాసము అత్యంత దుర్భరము. నీవు చేయలేవు.

ఇంకా సీతా! వనవాస సమయములో మనము ప్రకృతి వైపరీత్యములను తట్టుకోవాల్సి ఉంటుంది. పెనుగాలులు, వర్షాలు, గాడాంధకారమైన చీకటి, ఆ చీకట్లో సంచరించే వివిధ రకాలైన విషము చిమ్మే పాములు, దీనికి తోడు భయంకరమైన ఆకలి దప్పులు, సకాలమునకు దొరకని ఆహారము, ఇవన్నీ అంతులేని బాధలు….. వనవాసములో కలుగుతాయి.

వాటిని నీవు తట్టుకోలేవు. వీటికి తోడు వ్యాధులు కలిగించు కీటకములు, దోమలు, భయంకరమైన విషపూరితములైన తేళ్లు, స్వేచ్ఛగా సంచరించు అరణ్యములలో నీవు ఒక్క క్షణమైనా ఉండలేవు. అరణ్యములలో నివసించు వారు కామ, క్రోధములను విడిచి పెట్టి మనసును తపస్సుమీదనే లగ్నం చేయాలి. భయము అనే మాటను మనసులోకి రానీయకూడదు. అది నీ బోటి దానికి సాధ్యం కాదు.

కాబట్టి నీ వంటి సుకుమారికి అరణ్యవాసము యోగ్యము కాదు. నీవు ఇచ్చటనే వ్రతములు, ఉపవాసములు చేస్తూ నా క్షేమమును కోరుతూ ఉండు. నేను క్షణములో వనవాసమును పూర్తి చేసుకొని నీ చెంత వాలుతాను.” అని వనవాసములోని కష్టనష్టముల గురించి వివరంగా చెప్పాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Leave a Comment