Ayodhya Kanda Sarga 29 In Telugu | అయోధ్యాకాండ ఏకోనత్రింశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 29 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది. ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి. అని కుతూహలంతో రాములవారిని వేడుకున్నా సందర్భం లోనిది…

వనానుగమనయంచానిర్బంధః

ఏతత్తు వచనం శ్రుత్వా సీతా రామస్య దుఃఖితా |
ప్రసక్తాశ్రుముఖీ మందమిదం వచనమబ్రవీత్ ||

1

యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణానిత్యేవ తాన్విద్ధి తవ స్నేహపురస్కృతాన్ ||

2

మృగాః సింహా గజాశ్చైవ శార్దూలాః శరభాస్తథా |
పక్షిణః సృమరాశ్చైవ యే చాన్యే వనచారిణః ||

3

అదృష్టపూర్వరూపత్వాత్సర్వే తే తవ రాఘవః |
రూపం దృష్ట్వాఽపసర్పేయుర్భయే సర్వే హి బిభ్యతి ||

4

త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా |
త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితమ్ ||

5

న చ మాం త్వత్సమీపస్థామపి శక్నోతి రాఘవ |
సురాణామీశ్వరః శక్రః ప్రధర్షయితుమోజసా ||

6

పతిహీనా తు యా నారీ న సా శక్ష్యతి జీవితుమ్ |
కామమేవంవిధం రామ త్వయా మమ విదర్శితమ్ ||

7

అథ వాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతమ్ |
పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిల మే వనే ||

8

లక్షణిభ్యో ద్విజాతిభ్యః శ్రుత్వాఽహం వచనం పురా |
వనవాసకృతోత్సాహా నిత్యమేవ మహాబల ||

9

ఆదేశో వనవాసస్య ప్రాప్తవ్యః స మయా కిల |
సా త్వయా సహ తత్రాహం యాస్యామి ప్రియ నాన్యథా ||

10

కృతాదేశా భవిష్యామి గమిష్యామి సహ త్వయా |
కాలశ్చాయం సముత్పన్నః సత్యవాగ్భవతు ద్విజః ||

11

వనవాసే హి జానామి దుఃఖాని బహుధా కిల |
ప్రాప్యంతే నియతం వీర పురుషైరకృతాత్మభిః ||

12

కన్యయా చ పితుర్గేహే వనవాసః శ్రుతో మయా |
భిక్షిణ్యాః సాధువృత్తాయా మమ మాతురిహాగ్రతః ||

13

ప్రసాదితశ్చ వై పూర్వం త్వం వై బహువిధం ప్రభో |
గమనం వనవాసస్య కాంక్షితం హి సహ త్వయా ||

14

కృతక్షణాఽహం భద్రం తే గమనం ప్రతి రాఘవ |
వనవాసస్య శూరస్య చర్యా హి మమ రోచతే ||

15

శుద్ధాత్మన్ప్రేమభావాద్ధి భవిష్యామి వికల్మషా |
భర్తారమనుగచ్ఛంతీ భర్తా హి మమ దైవతమ్ ||

16

ప్రేత్యభావేఽపి కల్యాణః సంగమో మే సహ త్వయా |
శ్రుతిర్హి శ్రూయతే పుణ్యా బ్రాహ్మణానాం తపస్వినామ్ ||

17

ఇహ లోకే చ పితృభిర్యా స్త్రీ యస్య మహామతే |
అద్భిర్దత్తా స్వధర్మేణ ప్రేత్యభావేఽపి తస్య సా ||

18

ఏవమస్మాత్స్వకాం నారీం సువృత్తాం హి పతివ్రతామ్ |
నాభిరోచయసే నేతుం త్వం మాం కేనేహ హేతునా ||

19

భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖదుఃఖయోః |
నేతుమర్హసి కాకుత్స్థ సమానసుఖదుఃఖినీమ్ ||

20

యది మాం దుఃఖితామేవం వనం నేతుం న చేచ్ఛసి |
విషమగ్నిం జలం వాహమాస్థాస్యే మృత్యుకారణాత్ ||

21

ఏవం బహువిధం తం సా యాచతే గమనం ప్రతి |
నానుమేనే మహాబాహుస్తాం నేతుం విజనం వనమ్ ||

22

ఏవముక్తా తు సా చింతాం మైథిలీ సముపాగతా |
స్నాపయంతీవ గాముష్ణైరశ్రుభిర్నయనచ్యుతైః ||

23

చింతయంతీం తథా తాం తు నివర్తయితుమాత్మవాన్ |
క్రోధావిష్టాం చ తామ్రోష్ఠీం కాకుత్స్థో బహ్వసాంత్వయత్ ||

24

ఇతి శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనత్రింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 29 Meaning In Telugu

అదీ కాకుండా, భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది.

ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి.

నాధా! మీరు చెప్పినట్టు అరణ్యవాసములో ఎన్నో దు:ఖములు ఉంటాయి. కాని అవి అన్నీ అధైర్యపరులకు కానీ తమరి వంటి ధీరోదాత్తులకు కాదు కదా! అవునండోయ్! మరిచి పోయాను. నేను మిథిలలో ఉండగా ఒక రోజు ఒక బిక్షుకి కూడా నా జాతకములో వనవాసము రాసి పెట్టి ఉన్నదని జోస్యము చెప్పినది.

అవి అన్నీ ఇప్పుడు నిజము అవుతున్నాయి. నాడు జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుండి, భిక్షుకి చెప్పినప్పటినుండి ఎప్పుడెప్పుడు వనవాసమునకు వెళదామా అని ఉత్సాహంతో ఉన్నాను. కాబట్టి తమరి వెంట నన్నుకూడా వనములకు తీసుకొని వెళ్లండి.

ఏమండీ! ఏమండీ! అక్కడ నేను మిమ్ములను ఎంతో ప్రేమగా చూచుకుంటానండీ. మీరు ఎక్కడికి పోతే అక్కడకు వస్తాను. ఎందుకంటే నా భర్తయే నాకు దైవము. మీరు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే కదా!

ఒక్క వనవాసమే కాదు, మరణంలో కూడా నేను మిమ్ములను అనుసరించి వస్తాను. ఏనాడైతే తల్లి తండ్రులు తమ కుమార్తెను ఎవరికైతే మంత్రపూర్వకముగా ధారపోసారో ఆ నాటి నుండి ఆమె అతనికి సహధర్మచారిణి అవుతుంది. మరణానంతరము కూడా ఆమె అతనినే అనుసరిస్తుంది అని వేదములు ఘోషిస్తున్నాయి కదా!

ఆ వేదవాక్కును అనుసరించి మీరు ఎక్కడకు పోతే అక్కడకు నేను మిమ్ములను ఒక భార్యగా అనుసరిస్తాను. చివరకు మరణంలో కూడా. అది సరే. అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు. నేను మంచి దాననుగానా?నేను పతివ్రతనండీ. పైగా మీ భక్తురాలను.

సుఖదుఃఖములను సమంగా చూడగలిగిన నేర్పు కల దానను. మీసుఖమే నా సుఖమనీ, మీ కష్టమే నా కష్టమనీ భావించే మనసు కలదానను. ఇవన్నీ మీకు తెలుసు కదా! అటువంటప్పుడు నన్ను వెంట తీసుకొని పోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు. కాబట్టి నేను మీ వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడు ఇక్కడే ప్రాణములు వదులుతాను.” అని నయానా భయానా బతిమాలింది సీత.

సీత ఎన్ని చెప్పినను అటువంటి సుకుమారిని వనములకు తీసుకొని పోయి ఆమెను కష్టముల పాలు చేయడం ఇష్టం లేని రాముడు, ఆమె తన వెంట రావడానికి సుతరామూ ఒప్పుకోలేదు. సీతకూడా తన పట్టు విడవ లేదు. ఏడుపు మానలేదు. సీత ఏడుపు మానడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను తనతో రాకుండా నివారించడానికి రాముడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రింశః సర్గః (౩౦) >>

Leave a Comment