Ayodhya Kanda Sarga 34 In Telugu – అయోధ్యాకాండ చతుస్త్రింశః సర్గః

అయోధ్యాకాండము చతుస్త్రింశః సర్గము (34వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, కౌసల్య, సుమిత్ర, సీతలతో కలిసి అరణ్యానికి వెళ్ళడానికి రాముడు సిద్ధమవుతాడు. అటువంటి సమయంలో, కౌసల్య రాముని నిరోధిస్తుంది, తల్లి భర్తవ్రతాన్ని గురించి మాట్లాడుతుంది. రాముడు ధర్మం, పితృవాక్యపాలనం గురించి సమాధానమిస్తాడు. సీత, లక్ష్మణులు రాముని వెనుక నడుస్తారు. చివరికి, రాముడు తన తల్లి కౌసల్యకు, తనను అనుమతించమని అభ్యర్థిస్తూ దీవెనలు కోరుతాడు. ఈ సర్గ రాముని ధర్మ నిష్ఠ, పితృవాక్య పాలనం, సీత, లక్ష్మణుల భక్తిని, కౌసల్యాదేవి ప్రేమను ప్రదర్శిస్తుంది.

దశరథసమాశ్వాసనమ్

తతః కమలపత్రాక్షః శ్యామో నిరుదరో మహాన్ |
ఉవాచ రామస్తం సూతం పితురాఖ్యాహి మామితి || ౧ ||

స రామప్రేషితః క్షిప్రం సంతాపకలుషేంద్రియః |
ప్రవిశ్య నృపతిం సూతో నిఃశ్వసంతం దదర్శ హ || ౨ ||

ఉపరక్తమివాదిత్యం భస్మచ్ఛన్నమివానలమ్ |
తటాకమివ నిస్తోయమపశ్యజ్జగతీపతిమ్ || ౩ ||

ఆలోక్య తు మహాప్రాజ్ఞః పరమాకులచేతసమ్ |
రామమేవానుశోచంతం సూతః ప్రాంజలిరాసదత్ || ౪ ||

తం వర్ధయిత్వా రాజానం సూతః పూర్వం జయాశిషా |
భయవిక్లబయా వాచా మందయా శ్లక్ష్ణమబ్రవీత్ || ౫ ||

అయం స పురుషవ్యాఘ్రో ద్వారి తిష్ఠతి తే సుతః |
బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా సర్వం చైవోపజీవినామ్ || ౬ ||

స త్వా పశ్యతు భద్రం తే రామః సత్యపరాక్రమః |
సర్వాన్సుహృద ఆపృచ్ఛ్య త్వామిదానీం దిదృక్షతే || ౭ ||

గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే |
వృతం రాజగుణైః సర్వైరాదిత్యమివ రశ్మిభిః || ౮ ||

స సత్యవాదీ ధర్మాత్మా గాంభీర్యాత్సాగరోపమః |
ఆకాశ ఇవ నిష్పంకో నరేంద్రః ప్రత్యువాచ తమ్ || ౯ ||

సుమంత్రానయ మే దారాన్యే కేచిదిహ మామకాః |
దారైః పరివృతః సర్వైర్ద్రష్టుమిచ్ఛామి రాఘవమ్ || ౧౦ || [ధార్మికమ్]

సోఽంతఃపురమతీత్యైవ స్త్రియస్తా వాక్యమబ్రవీత్ |
ఆర్యాహ్వయతి వో రాజాఽగమ్యతాం తత్ర మా చిరమ్ || ౧౧ ||

ఏవముక్తాః స్త్రియః సర్వాః సుమంత్రేణ నృపాజ్ఞయా |
ప్రచక్రముస్తద్భవనం భర్తురాజ్ఞాయ శాసనమ్ || ౧౨ ||

అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాస్తామ్రలోచనాః |
కౌసల్యాం పరివార్యాథ శనైర్జగ్ముర్ధృతవ్రతాః || ౧౩ ||

ఆగతేషు చ దారేషు సమవేక్ష్య మహీపతిః |
ఉవాచ రాజా తం సూతం సుమంత్రానయ మే సుతమ్ || ౧౪ ||

స సూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తదా |
జగామాభిముఖస్తూర్ణం సకాశం జగతీపతేః || ౧౫ ||

స రాజా పుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్కృతాంజలిమ్ |
ఉత్పపాతాసనాత్తూర్ణమార్తః స్త్రీజనసంవృతః || ౧౬ ||

సోఽభిదుద్రావ వేగేన రామం దృష్ట్వా విశాంపతిః |
తమసంప్రాప్య దుఃఖార్తః పపాత భువి మూర్ఛితః || ౧౭ ||

తం రామోఽభ్యపతత్క్షిప్రం లక్ష్మణశ్చ మహారథః |
విసంజ్ఞమివ దుఃఖేన సశోకం నృపతిం తదా || ౧౮ ||

స్త్రీసహస్రనినాదశ్చ సంజజ్ఞే రాజవేశ్మని |
హా హా రామేతి సహసా భూషణధ్వనిమూర్ఛితః || ౧౯ ||

తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ |
పర్యంకే సీతయా సార్ధం రుదంతః సమవేశయన్ || ౨౦ ||

అథ రామో ముహూర్తేన లబ్ధసంజ్ఞం మహీపతిమ్ |
ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవపరిప్లుతమ్ || ౨౧ ||

ఆపృచ్ఛే త్వాం మహారాజ సర్వేషామీశ్వరోఽసి నః |
ప్రస్థితం దండకారణ్యం పశ్య త్వం కుశలేన మామ్ || ౨౨ ||

లక్ష్మణం చానుజానీహి సీతా చాన్వేతి మాం వనమ్ |
కారణైర్బహుభిస్తథ్యైర్వార్యమాణౌ న చేచ్ఛతః || ౨౩ ||

అనుజానీహి సర్వాన్నః శోకముత్సృజ్య మానద |
లక్ష్మణం మాం చ సీతాం చ ప్రజాపతిరివ ప్రజాః || ౨౪ ||

ప్రతీక్షమాణమవ్యగ్రమనుజ్ఞాం జగతీపతేః |
ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవమ్ || ౨౫ ||

అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః |
అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్య మామ్ || ౨౬ ||

ఏవముక్తో నృపతినా రామో ధర్మభృతాం వరః |
ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః || ౨౭ ||

భవాన్వర్షసహస్రాయ పృథివ్యా నృపతే పతిః |
అహం త్వరణ్యే వత్స్యామి న మే కార్యం త్వయాఽనృతమ్ || ౨౮ ||

నవ పంచ చ వర్షాణి వనవాసే విహృత్య తే |
పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప || ౨౯ ||

రుదన్నార్తః ప్రియం పుత్రం సత్యపాశేన సంయతః |
కైకేయ్యా చోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్ || ౩౦ ||

శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ |
గచ్ఛస్వారిష్టమవ్యగ్రః పంథానమకుతోభయమ్ || ౩౧ ||

న హి సత్యాత్మనస్తాత ధర్మాభిమనసస్తవ |
వినివర్తయితుం బుద్ధిః శక్యతే రఘునందన || ౩౨ ||

అద్య త్విదానీం రజనీం పుత్ర మా గచ్ఛ సర్వథా |
ఏకాహదర్శనేనాపి సాధు తావచ్చరామ్యహమ్ || ౩౩ ||

మాతరం మాం చ సంపశ్యన్వసేమామద్య శర్వరీమ్ |
తర్పితః సర్వకామైస్త్వం శ్వః కాలే సాధయిష్యసి || ౩౪ ||

దుష్కరం క్రియతే పుత్ర సర్వథా రాఘవ త్వయా |
మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా యద్యాసి విజనం వనమ్ || ౩౫ ||

న చైతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవ |
ఛన్నయా చలితస్త్వస్మి స్త్రియా ఛన్నాగ్నికల్పయా || ౩౬ ||

వంచనా యా తు లబ్ధా మే తాం త్వం నిస్తర్తుమిచ్ఛసి |
అనయా వృత్తసాదిన్యా కైకేయ్యాఽభిప్రచోదితః || ౩౭ ||

న చైతదాశ్చర్యతమం యత్త్వం జ్యేష్ఠః సుతో మమ |
అపానృతకథం పుత్ర పితరం కర్తుమిచ్ఛసి || ౩౮ ||

అథ రామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితమ్ |
లక్ష్మణేన సహ భ్రాత్రా దీనో వచనమబ్రవీత్ || ౩౯ ||

ప్రాప్స్యామి యానద్య గుణాన్కో మే శ్వస్తాన్ప్రదాస్యతి |
ఉపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే || ౪౦ ||

ఇయం సరాష్ట్రా సజనా ధనధాన్యసమాకులా |
మయా విసృష్టా వసుధా భరతాయ ప్రదీయతామ్ || ౪౧ ||

వనవాసకృతా బుద్ధిర్న చ మేఽద్య చలిష్యతి |
యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరద త్వయా || ౪౨ ||

దీయతాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివ |
అహం నిదేశం భవతో యథోక్తమనుపాలయన్ || ౪౩ ||

చతుర్దశ సమా వత్స్యే వనే వనచరైః సహ |
మా విమర్శో వసుమతీ భరతాయ ప్రదీయతామ్ || ౪౪ ||

న హి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా ప్రియమ్ |
యథానిదేశం కర్తుం వై తవైవ రఘునందన || ౪౫ ||

అపగచ్ఛతు తే దుఃఖం మా భూర్బాష్పపరిప్లుతః |
న హి క్షుభ్యతి దుర్ధర్షః సముద్రః సరితాం పతిః || ౪౬ ||

నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీమ్ |
నైవ సర్వానిమాన్కామాన్న స్వర్గం నైవ జీవితమ్ || ౪౭ ||

త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభ |
ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే || ౪౮ ||

న చ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో |
స శోకం ధారయస్వేమం న హి మేఽస్తి విపర్యయః || ౪౯ ||

అర్థితో హ్యస్మి కైకేయ్యా వనం గచ్ఛేతి రాఘవ |
మయా చోక్తం వ్రజామీతి తత్సత్యమనుపాలయే || ౫౦ ||

మా చోత్కంఠాం కృథా దేవ వనే రంస్యామహే వయమ్ |
ప్రశాంతహరిణాకీర్ణే నానాశకునినాదితే || ౫౧ ||

పితా హి దైవతం తాత దేవతానామపి స్మృతమ్ |
తస్మాద్దైవతమిత్యేవ కరిష్యామి పితుర్వచః || ౫౨ ||

చతుర్దశసు వర్షేషు గతేషు నరసత్తమ |
పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపోఽయం విముచ్యతామ్ || ౫౩ ||

యేన సంస్తంభనీయోఽయం సర్వో బాష్పగళో జనః |
స త్వం పురుషశార్దూల కిమర్థం విక్రియాం గతః || ౫౪ ||

పురం చ రాష్ట్రం చ మహీ చ కేవలా
మయా నిసృష్టా భరతాయ దీయతామ్ |
అహం నిదేశం భవతోఽనుపాలయ-
-న్వనం గమిష్యామి చిరాయ సేవితుమ్ || ౫౫ ||

మయా నిసృష్టాం భరతో మహీమిమాం
సశైలషండాం సపురాం సకాననామ్ |
శివాం సుసీమామనుశాస్తు కేవలం
త్వయా యదుక్తం నృపతే తథాఽస్తు తత్ || ౫౬ ||

న మే తథా పార్థివ ధీయతే మనో
మహత్సు కామేషు న చాత్మనః ప్రియే |
యథా నిదేశే తవ శిష్టసమ్మతే
వ్యపైతు దుఃఖం తవ మత్కృతేఽనఘ || ౫౭ ||

తదద్య నైవానఘ రాజ్యమవ్యయం
న సర్వకామాన్న సుఖం న మైథిలీమ్ |
న జీవితం త్వామనృతేన యోజయ-
-న్వృణీయ సత్యం వ్రతమస్తు తే తథా || ౫౮ ||

ఫలాని మూలాని చ భక్షయన్వనే
గిరీంశ్చ పశ్యన్సరితః సరాంసి చ |
వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం
సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః || ౫౯ ||

ఏవం స రాజా వ్యసనాభిపన్నః
శోకేన దుఃఖేన చ తామ్యమానః |
ఆలింగ్య పుత్రం సువినష్టసంజ్ఞో
మోహం గతో నైవ చిచేష్ట కించిత్ || ౬౦ ||

దేవ్యస్తతః సంరురుదుః సమేతా-
-స్తాం వర్జయిత్వా నరదేవపత్నీమ్ |
రుదన్సుమంత్రోఽపి జగామ మూర్ఛాం
హాహాకృతం తత్ర బభూవ సర్వమ్ || ౬౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః || ౩౪ ||

Ayodhya Kanda Sarga 34 Meaning In Telugu

రాముడు ఆదేశానుసారము సుమంత్రుడు రామ, లక్ష్మణ, సీతల రాకను దశరథునికి ఎరింగించుటకు అంతఃపురములోకి వెళ్లాడు. అంత:పురములో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడి మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు. సుమంత్రుడు దశరథుని వద్దకుపోయి “మహారాజులకు జయము. తమరి కుమారుడు రామలక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్ధము వచ్చి ఉన్నారు.” అని అన్నాడు.

ఆ మాటలువిన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సుమంత్రుని వంక బేలగా చూచాడు. మరలా సుమంత్రుడు ఇలా అన్నాడు. “మహారాజా! వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యము కలిగించండి. అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముని ఒక సారి కనులారా చూడండి. తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో.” అని అన్నాడు సుమంత్రుడు.

అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! అంత:పురములో ఉన్న నా భార్యలను అందరినీ తీసుకొని రమ్ము. వారితో కలిసి నేను రాముని చూడదలచాను.” అని అన్నాడు.

వెంటనే సుమంత్రుడు అంత:పురములోనికి వెళ్లి దశరథుని భార్యలనందరినీ పిలుచుకొని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు. వారి అందరిలోకి పెద్దభార్య కౌసల్య కౌసల్య ముందురాగా, 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరి చూసుకొని తృప్తిపడిన తరువాత దశరధుడు సుమంత్రుని చూచి “సుమంత్రా! ఇప్పుడు రాముని లోపలకు తీసుకొని రా!” అని ఆదేశించాడు.

సుమంత్రుడు బయటకు వెళ్లి రాముడు, లక్ష్మణుడు, సీతను లోపలకు తీసుకొని వెళ్లాడు. లోపల దశరథుడు తన 350మంది భార్యలు చుట్టు ఉండగా ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చూడగానే దశరథునకు దు:ఖము ఆగలేదు. వెంటనే ఆసనము మీదినుండి లేచాడు. రాముని వద్దకు గబా గబా నడుచుకుంటూ వెళ్లాడు. కాని మధ్యలోనే దుఃఖము ఆపుకోలేక కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు.

తండ్రి గారు కిందపడటం చూచిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు. రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దుఃఖము ఆపుకోలేక హా హా కారాలు చేసారు. వారి దు:ఖమును చూచి రామలక్ష్మణులకు కూడా దు:ఖము ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చాడు. దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు.

“మహారాజా! మీరు మాకందరికీ అధిపతులు. తమరి వద్దనుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను. వీరిద్దరూ నా మాట వినలేదు. నాతోపాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆకారణంగా వీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికీ అనుమతి ప్రసాదించండి.” అని పలికి రాముడు చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. తండ్రిమాటలు విని రాముడు ఇలా అన్నాడు. “మహారాజా! తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు. అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఆడినమాట తప్పకండి. తమరు విధించిన పదునాలుగు సంవత్సరముల వనవాసము తృటిలో పూర్తిచేసుకొని మీ పాదముల చెంత వాలుతాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని పలికాడు రాముడు.

దశరథుని పక్కనే ఉన్న కైక “ఏమిటా మంతనాలు. తొందరగా అడవులకు వెళ్లమనండి. మరలా భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు” అని రహస్యంగా దశరథునితో చెప్పింది. రామునితో తనివితీరా మాట్లాడుకోడానికి కూడా అనుమతించని కైకను చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలాఅన్నాడు. “రామా! నీకు, నీ భార్యకు, తమ్ముడికి మంగళమగు గాక! నీవు అన్నట్టు ఈ వనవాసము తృటిలో ముగించుకొని రమ్ము. నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామా! నీవు ధర్మము పాటిస్తావు. అందుకని నిన్ను వెళవద్దు అన్నా వెళ్లడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేతకాదు. కాని ఒక కోరిక. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్లు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి ఉండు. రేపు ఉదయమే వెళ్లు.

ఓరామా! నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు. ఇంతవరకూ ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు. రామా! నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదుగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకొని తరువాత ఈ వనవాస విషయం విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ట పుత్రుడవు కాబట్టి, తండ్రిమాట నిలబెట్టడానికి, ఆ వంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు. నీరాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నీవు వినడం లేదు. ఏం చేసేది.”అని దుఃఖిస్తున్నాడు దశరథుడు.

ఆమాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. “తండ్రీ! ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా! ఈనాడు ఉంటాయి రేపుపోతాయి. శాశ్వతముగా నిలిచిపోయేది, సత్యము పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండటం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్యమీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకొంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము.

మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో తమరు కూడా తల్లి కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీమాట ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకము చేయండి. నాకు ఈ రాజ్యము మీద గానీ, రాజభోగముల మీద గానీ ఎలాంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశము నెరవేర్చడమే నా కర్తవ్యము. నా గురించి మీరు దు:ఖపడ వద్దు. మీరు అన్న మాటను నిలబెట్టుకోండి.

నేనుకూడా సత్యము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నానిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేను. ఈ ఒక్కరాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆమాట నిలబెట్టుకుంటాను.” అని అన్నాడు రాముడు.

రాముడు ఎన్ని విధముల అనునయించిననూ దశరథుడు దు:ఖము మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. “రాజా! తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవులు. దైవసమానులైన మీ మాట నాకు శిరోధార్యము. ఓ రాజా! మరలా చెప్పుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు నిమేషమాత్రములో గడిపి మరలా మీపాదముల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.

తండ్రిగారూ! అటు చూడండి. అయోధ్యా వాసులు ఎంతో దు:ఖపడుతున్నారు. మీరు మహారాజులు. వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరూ ఓదారుస్తారు. కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవుటకు అనుమతి ఇవ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకము చేయించండి. అన్నమాట నిలబెట్టుకోండి.”అనిపలికాడు రాముడు.

రాముని మాటలకు దశరథునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కిందపడిపోయాడు. ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచత్రింశః సర్గః (35) >>

Leave a Comment