Balakanda Sarga 36 In Telugu – బాలకాండ షట్త్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో షట్త్రింశః సర్గః కీలకమైన భాగం. ఈ సర్గలో, రాముడు విశ్వామిత్రుని ఆధ్వర్యంలో యజ్ఞాలను రక్షించడానికి సిద్ధమవుతాడు. తన భుజబలం, ధైర్యంతో తాటకను సంహరిస్తాడు. తాటక వధతో రాముడు తన వీరత్వాన్ని ప్రదర్శించి, ఋషులు, మునులు ఆనందంతో ఉప్పొంగుతారు. ఈ సర్గలో విశ్వామిత్రుడు రాముడికి అస్త్రశాస్త్రాలను నేర్పుతాడు, దీని వలన రాముడు మరింత శక్తివంతుడవుతాడు.

ఉమామాహాత్మ్యమ్

ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణౌ |
అభినంద్య కథాం వీరావూచతుర్మునిపుంగవమ్ ||

1

ధర్మయుక్తమిదం బ్రహ్మన్కథితం పరమం త్వయా |
దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి ||

2

విస్తరం విస్తరజ్ఞోఽసి దివ్యమానుషసంభవమ్ |
త్రీన్పథో హేతునా కేన ప్లావయేల్లోకపావనీ ||

3

కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా |
త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితా ||

4

తథా బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రస్తపోధనః |
నిఖిలేన కథాం సర్వామృషిమధ్యే న్యవేదయత్ ||

5

పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః | [శితికంఠో]
దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే ||

6

శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్ |
తస్య సంక్రీడమానస్య మహాదేవస్య ధీమతః ||

7

న చాపి తనయో రామ తస్యామాసీత్పరంతప |
తతో దేవాః సముద్విగ్నాః పితామహపురోగమాః ||

8

యదిహోత్పద్యతే భూతం కస్తత్ప్రతిసహిష్యతే |
అభిగమ్య సురాః సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ ||

9

దేవ దేవ మహాదేవ లోకస్యాస్య హితే రత |
సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి ||

10

న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమ |
బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర ||

11

త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ |
రక్ష సర్వానిమాఁల్లోకాన్నాలోకం కర్తుమర్హసి ||

12

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః |
బాఢమిత్యబ్రవీత్సర్వాన్పునశ్చేదమువాచ హ ||

13

ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా |
త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్ఛతు ||

14

యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్ |
ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః ||

15

ఏవముక్తాస్తతో దేవాః ప్రత్యూచుర్వృషభధ్వజమ్ |
యత్తేజః క్షుభితం హ్యేతత్తద్ధరా ధారయిష్యతి ||

16

ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే |
తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా ||

17

తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశనమ్ |
ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః ||

18

తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః |
దివ్యం శరవణం చైవ పావకాదిత్యసన్నిభమ్ ||

19

యత్ర జాతో మహాతేజాః కార్తికేయోఽగ్నిసంభవః |
అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా ||

20

పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః |
అథ శైలసుతా రామ త్రిదశానిదమబ్రవీత్ ||

21

అప్రియస్య కృతస్యాద్య ఫలం ప్రాప్స్యథ మే సురాః |
ఇత్యుక్త్వా సలిలం గృహ్య పార్వతీ భాస్కరప్రభా ||

22

సమన్యురశపత్సర్వాన్క్రోధసంరక్తలోచనా |
యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా ||

23

అపత్యం స్వేషు దారేషు నోత్పాదయితుమర్హథ |
అద్యప్రభృతి యుష్మాకమప్రజాః సంతు పత్నయః ||

24

ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి |
అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి ||

25

న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ ||

26

తాన్సర్వాన్వ్రీడితాన్దృష్ట్వా సురాన్సురపతిస్తదా |
గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్ ||

27

స గత్వా తప ఆతిష్ఠత్పార్శ్వే తస్యోత్తరే గిరేః |
హిమవత్ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః ||

28

ఏష తే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదితః |
గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహలక్ష్మణః ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్త్రింశః సర్గః ||

Balakanda Sarga 36 Meaning In Telugu

అంత వరకువిన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

ఓ మహర్షీ! హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గములలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకని గంగానదీ ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది. వివరించండి.” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

“మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమా దేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగ లేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరు బ్రహ్మదేవుని తీసుకొని మహా శివుని వద్దకు వెళ్లారు.

బ్రహ్మ దేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ” ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడయిన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి.” అని ప్రార్థించారు.

వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. “దేవతలారా! మీరు చెప్పినట్టే చేసిదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి.” అని అన్నాడు.

దేవతలందరూ ముక్త కంఠంతో “మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది” అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేసాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది.

అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి ” ఓ అగ్నిదేవా ! నీవు వాయు దేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో” అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకొన్నాడు.

మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవుని లో నుండి మహా వీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహా శివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉ మాదేవికి పట్టరాని కోపం వచ్చింది.

” ఓ దేవతలారా! నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేసారు. కాబట్టి మీరందరికీ మీ భార్యలవలన సంతానము కలుగకుండు గాక!” అని తీవ్రంగా శపించింది.

తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది.

“ఓ భూదేవీ! నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలెనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగ కుండు గాక!” అని శపించింది.

తరువాత మహా శివుడు ఉమా దేవితో సహా పశ్చిమదిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాస గిరి మీద తపస్సు చేసాడు.

ఓరామా! ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను. అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తత్రింశః సర్గః (37) >>

Leave a Comment