మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తవింశః సర్గలో, పెద్దల ఆదేశాలను పాటించి, తనకు అప్పగించిన పనిని చేయడంలో రాముడి ప్రవర్తనతో విశ్వామిత్ర మహర్షి సంతృప్తి చెందాడు, రాముడికి శాస్త్రం, అస్త్రాలు అని అనేక ఆయుధాలను ఇచ్చాడు . ఆయుధాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి శాస్త్రం – కత్తి, లాన్స్ లేదా గద్ద వంటి చేతితో పట్టుకునే ఆయుధం.
అస్త్రగ్రామప్రదానమ్
అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః |
ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరమ్ ||
1
పరితుష్టోఽస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః |
ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః ||
2
దేవాసురగణాన్వాపి సగంధర్వోరగానపి |
యైరమిత్రాన్ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి ||
3
తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః |
దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ ||
4
ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ |
విష్ణుచక్రం తథాఽత్యుగ్రమైంద్రమస్త్రం తథైవ చ ||
5
వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా |
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఏషీకమపి రాఘవ ||
6
దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమమ్ |
గదే ద్వే చైవ కాకుత్స్థ మోదకీ శిఖరీ ఉభే ||
7
ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ |
ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ ||
8
పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమమ్ |
అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన ||
9
దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా |
ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః ||
10
వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ |
అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ ||
11
శక్తిద్వయం చ కాకుత్స్థ దదామి తవ రాఘవ |
కంకాలం ముసలం ఘోరం కాపాలమథ కంకణమ్ ||
12
ధారయంత్యసురా యాని దదామ్యేతాని సర్వశః |
వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామ నామతః ||
13
అసిరత్నం మహాబాహో దదామి నృవరాత్మజ |
గాంధర్వమస్త్రం దయితే మానవం నామ నామతః ||
14 [మోహనం]
ప్రస్వాపనప్రశమనం దద్మి సౌరం చ రాఘవ |
దర్పణం శోషణం చైవ సంతాపనవిలాపనే ||
15
మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా |
[* గాంధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః | *]
పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః ||
16
ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః |
తామసం నరశార్దూల సౌమనం చ మహాబల ||
17
సంవర్తం చైవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ |
సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరమ్ ||
18
ఘోరం తేజఃప్రభం నామ పరతేజోఽపకర్షణమ్ |
సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వాష్ట్రమస్త్రం సుదామనమ్ ||
19
దారుణం చ భగస్యాపి శితేషుమథ మానవమ్ |
ఏతాన్రామ మహాబాహో కామరూపాన్మహాబలాన్ ||
20
గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ |
స్థితస్తు ప్రాఙ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా ||
21
దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామమనుత్తమమ్ |
సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభమ్ ||
22
తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్ |
జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ||
23
ఉపతస్తుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్ |
ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాంజలయస్తదా ||
24
ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ |
[* అధికపాఠః –
యద్యదిచ్ఛసి భద్రం తే తత్సర్వం కరవామ వై |
తతో రామః ప్రసన్నాత్మా తైరిత్యుక్తో మహాబలైః |
*]
ప్రతిగృహ్య చ కాకుత్స్థః సమాలభ్య చ పాణినా |
మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్ ||
25
తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిమ్ |
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే ||
26
Balakanda Sarga 27 In Telugu Pdf With Meaning
మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలము లో ఆచ రించ వలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు.
విశ్వామిత్రుడు రామునితో “రామా! నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు.
రామా! నీకు దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటి కంటే ఉత్తమము, శ్రేష్ఠము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను.
రామా! నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటులను అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగాఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను.
రామా! నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.
ఓ రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటు వంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను.
ఓ రామా! నీకు విద్యాధరముఅనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగ చేస్తాయి. నిద్రావస్థనుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావము ఉంది.
ఓ రామా! నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను.
ఓ రామా! ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తి వంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము, మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను.
ఓ రామా! ఈ అస్త్రములు అన్నీ కామ రూపులు. తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు. అత్యంత బలము కలవి. వీటిని నానుండి వెంటనే గ్రహించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లబము. అటువంటిది రాముడు ఆ అస్త్రసముదాయమును అవలీలగా అధ్యయనం చేసాడు.
విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్ఛరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధి దేవతలు వచ్చిరాముని ముందు నిలబడి “రామా! ఇకనుండి మేమందరమూ నీకు దాసులము” అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి “మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించి నపుడు నా వద్దకు రండి” అనిపలికాడు.
తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.