అయోధ్యాకాండము పంచత్రింశః సర్గము (35వ సర్గ) రామాయణంలో భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు చీరలను ధరించి, గంగా నదిని చేరుకుంటారు. అక్కడ నదిని దాటేందుకు గుహ అనే గిరిజన రాజును కలుస్తారు. గుహ, రామునికి తన భక్తిని, ప్రేమను ప్రదర్శిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులకు సేవ చేస్తాడు. వారు అరణ్యవాసం ప్రారంభం చేసేందుకు నదిని దాటుతారు. ఈ సర్గ రాముని వినయాన్ని, సీతా, లక్ష్మణుల సహనాన్ని, గుహ భక్తిని మరియు దాతృత్వాన్ని చూపిస్తుంది. రాముడు ధర్మాన్ని పాటిస్తూ ప్రజల కోసం త్యాగం చేసే వ్యక్తిగా ఇక్కడ ప్రదర్శించబడతాడు.
సుమంత్రగర్హణమ్
తతో నిర్ధూయ సహసా శిరో నిఃశ్వస్య చాసకృత్ |
పాణిం పాణౌ వినిష్పిష్య దంతాన్కటకటాప్య చ || ౧ ||
లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ |
కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః || ౨ ||
మనః సమీక్షమాణశ్చ సూతో దశరథస్య సః |
కంపయన్నివ కైకేయ్యా హృదయం వాక్ఛరైః శితైః || ౩ ||
వాక్యవజ్రైరనుపమైర్నిర్భిందన్నివ చాశుగైః |
కైకేయ్యాః సర్వమర్మాణి సుమంత్రః ప్రత్యభాషత || ౪ ||
యస్యాస్తవ పతిస్త్యక్తో రాజా దశరథః స్వయమ్ |
భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ || ౫ ||
న హ్యకార్యతమం కించిత్తవ దేవీహ విద్యతే |
పతిఘ్నీం త్వామహం మన్యే కులఘ్నీమపి చాంతతః || ౬ ||
యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యమివాచలమ్ |
మహోదధిమివాక్షోభ్యం సంతాపయసి కర్మభిః || ౭ ||
మాఽవమంస్థా దశరథం భర్తారం వరదం పతిమ్ |
భర్తురిచ్ఛా హి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే || ౮ ||
యథావయో హి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే |
ఇక్ష్వాకుకులనాథేఽస్మింస్తల్లోపయితుమిచ్ఛసి || ౯ ||
రాజా భవతు తే పుత్రో భరతః శాస్తు మేదినీమ్ |
వయం తత్ర గమిష్యామో యత్ర రామో గమిష్యతి || ౧౦ ||
న హి తే విషయే కశ్చిద్బ్రాహ్మణో వస్తుమర్హతి |
తాదృశం త్వమమర్యాదమద్య కర్మ చికీర్షసి || ౧౧ ||
ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశమ్ |
ఆచరంత్యా న వివృతా సద్యో భవతి మేదినీ || ౧౨ ||
మహాబ్రహ్మర్షిసృష్టా హి జ్వలంతో భీమదర్శనాః |
ధిగ్వాగ్దండా న హింసంతి రామప్రవ్రాజనే స్థితామ్ || ౧౩ ||
ఆమ్రం ఛిత్వా కుఠారేన నింబం పరిచరేత్తు యః |
యశ్చైనం పయసా సించేన్నైవాస్య మధురో భవేత్ || ౧౪ ||
అభిజాతం హి తే మన్యే యథా మాతుస్తథైవ చ |
న హి నింబాత్స్రవేత్క్షౌద్రం లోకే నిగదితం వచః || ౧౫ ||
తవ మాతురసద్గ్రాహం విద్మః పూర్వం యథా శ్రుతమ్ |
పితుస్తే వరదః కశ్చిద్దదౌ వరమనుత్తమమ్ || ౧౬ ||
సర్వభూతరుతం తస్మాత్సంజజ్ఞే వసుధాధిపః |
తేన తిర్యగ్గతానాం చ భూతానాం విదితం వచః || ౧౭ ||
తతో జృంభస్య శయనే విరుతాద్భూరివర్చసః |
పితుస్తే విదితో భావః స తత్ర బహుధాహసత్ || ౧౮ ||
తత్ర తే జననీ క్రుద్ధా మృత్యుపాశమభీప్సతీ |
హాసం తే నృపతే సౌమ్య జిజ్ఞాసామీతి చాబ్రవీత్ || ౧౯ ||
నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే యది |
తతో మే మరణం సద్యో భవిష్యతి న సంశయః || ౨౦ ||
మాతా తే పితరం దేవి తతః కేకయమబ్రవీత్ |
శంస మే జీవ వా మా వా న మామపహసిష్యసి || ౨౧ ||
ప్రియయా చ తథోక్తః సన్కేకయః పృథివీపతిః |
తస్మై తం వరదాయార్థం కథయామాస తత్త్వతః || ౨౨ ||
తతః స వరదః సాధూ రాజానం ప్రత్యభాషత |
మ్రియతాం ధ్వంసతాం వేయం మా కృథాస్త్వం మహీపతే || ౨౩ ||
స తచ్ఛ్రుత్వా వచస్తస్య ప్రసన్నమనసో నృపః |
మాతరం తే నిరస్యాశు విజహార కుబేరవత్ || ౨౪ ||
తథా త్వమపి రాజానం దుర్జనాచరితే పథి |
అసద్గ్రాహమిమం మోహాత్కురుషే పాపదర్శిని || ౨౫ ||
సత్యశ్చాద్య ప్రవాదోఽయం లౌకికః ప్రతిభాతి మా |
పితౄన్సమనుజాయంతే నరా మాతరమంగనాః || ౨౬ ||
నైవం భవ గృహాణేదం యదాహ వసుధాధిపః |
భర్తురిచ్ఛాముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ || ౨౭ ||
మా త్వం ప్రోత్సాహితా పాపైర్దేవరాజసమప్రభమ్ |
భర్తారం లోకభర్తారమసద్ధర్మముపాదధాః || ౨౮ ||
న హి మిథ్యా ప్రతిజ్ఞాతం కరిష్యతి తవానఘః |
శ్రీమాన్దశరథో రాజా దేవి రాజీవలోచనః || ౨౯ ||
జ్యేష్ఠో వదాన్యః కర్మణ్యః స్వధర్మస్యాభిరక్షితా |
రక్షితా జీవలోకస్య బ్రూహి రామోఽభిషిచ్యతామ్ || ౩౦ ||
పరివాదో హి తే దేవి మహాఁల్లోకే చరిష్యతి |
యది రామో వనం యాతి విహాయ పితరం నృపమ్ || ౩౧ ||
స రాజ్యం రాఘవః పాతు భవ త్వం విగతజ్వరా |
న హి తే రాఘవాదన్యః క్షమః పురవరే వసేత్ || ౩౨ ||
రామే హి యౌవరాజ్యస్థే రాజా దశరథో వనమ్ |
ప్రవేక్ష్యతి మహేష్వాసః పూర్వవృత్తమనుస్మరన్ || ౩౩ ||
ఇతి సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీం రాజసంసది |
సుమంత్రః క్షోభయామాస భూయ ఏవ కృతాంజలిః || ౩౪ ||
నైవ సా క్షుభ్యతే దేవీ న చ స్మ పరిదూయతే |
న చాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా || ౩౫ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశః సర్గః || ౩౫ ||
Ayodhya Kanda Sarga 35 Meaning In Telugu
అప్పటి దాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు. అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది. చేతులు నులుముకుంటున్నాడు. మాటి మాటికీ తల కొట్టుకుం టున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంక తట్టుకోలేక పోయాడు. కైకను చూచి ఇలా అన్నాడు.
“ఓ కైకా దేవీ! మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకూ గౌరవించాము. మీరు మా మహారాజునే వదిలి పెట్టాము అన్నారు. మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు. మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు. నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు. మహారాజుగారు నీవుకోరిన వరాలు ఇస్తానన్నాడు కదా. ఇలాంటి వరాలు కోరాలా! స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా! రాజుగారు మరణించినపుడు జ్యేష్టుడు రాజ్యాధి కారము వహిస్తాడు. ఈ ధర్మము నీకు తెలియదా! నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరమూ రామునితో పాటు అడవులకు వెళుతాము. నీవు చేస్తున్న దుర్మార్గాలనూ ధర్మవిరుద్ధమైన పనులనూ చూస్తూ బ్రాహ్మణుడు ఎవరూ అయోధ్యలో ఉండడు. అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలా అంతా రాముని అనుసరించి వెళ్లాక, నీవు, నీకొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి. ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేనూ చూస్తాను.
నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలయి నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను ఛీ కొట్టుచున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వేపచెట్టుకు పాలుపోసి పెంచినా దాని చేదు పోనట్టు మా మహారాజుగారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చినదా అని సందేహాము గా ఉంది. ఎందుకంటే నీ తల్లి నీ కన్నా క్రూరురాలు అని మేము విన్నాము.
నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలూ అర్ధం అయ్యేవి. ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేల మీద పాకుచున్న చీమ మాటలు విని, పక్కున నవ్వాడు. ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడు అని అనుకొంది. “నన్నుచూచి ఎందుకు నవ్వుతున్నావు,కారణమేమి” అని నీ తండ్రిని నిలదీసింది. “దేవీ! నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుకని దాని గురించి నన్ను అడగవద్దు.” అని అన్నాడు. అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా! “నీవు బతికితే బతుకు, లేకపోతే చావు. కాని నన్ను పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి” అనిపట్టుబట్టింది. అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా! “నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను. నువ్వు ఉంటే ఉండు పోతే పో. నేను మాత్రము చెప్పను.” అని అన్నాడు.
ఓ కైకా! నీకూ నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయి అని నీవల్ల ఋజువు అయింది. కనీసం ఇప్పటి కన్నా నీ బుద్ధి మార్చుకొని, నీ పట్టుదల మాని, నీ వరములు ఉపసంహరించుకో. ఈ అయోధ్యను, ప్రజలను కాపాడు.
మరి ఇది నీవు పుట్టిన బుద్ధి లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కానీ నీచేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చేయకు. మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు. కానీ నీవే నీ మాట మార్చుకో. వేరే ఏవైనా కోరుకో. జ్యేష్టుడైన రామునికి పట్టాభిషేకము జరిపించు. అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది. ఇంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటావు. నా మాట విను. రామ పట్టాభి షేకము జరిపించు. తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సుచేసుకోడానికి అడవులకు వెళతాడు.” అని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కాని కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు. తన పట్టు వీడలేదు. రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.